TG News

Wednesday, July 1, 2015 - 21:37

హైదరాబాద్: కెనేడియన్ ఓపెన్ డబుల్స్ విజయంతో... భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్ట్ గుత్తా జ్వాల పొంగిపోతోంది. కెనడాలోని కాల్గారీలో ముగిసిన ఫైనల్లో హాలెండ్ కు చెందిన టాప్ సీడింగ్ జోడీ మస్కీన్, సెలెనాలపై 21-19, 21-16 తో విజయం సాధించిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చింది. తండ్రి క్రాంతి, భారత బ్యాడ్మింటన్ మాజీ చీఫ్ కోచ్ మహ్మద్ ఆరీఫ్ లతో కలసి..హైదరాబాద్ లో...

Wednesday, July 1, 2015 - 21:18

హైదరాబాద్:ఆయన కోసం అన్నీ చేశాం. ఓడినా... నెత్తిన పెట్టుకున్నాం. పదవులిచ్చాం. అందరి కంటే ఎక్కువ గౌరవించాం. ఇంతకన్నా ఏం చేయాలి. అన్ని పదవులు అనుభవించి.. కష్టకాలంలో పార్టీని వదిలేసి వెళ్తారా..? కన్నతల్లిలాంటి పార్టీకి ఆయన ఇచ్చే గౌరవమిదేనా..? డీఎస్ టీఆర్‌ఎస్‌లో చేరతారని తెలియగానే కాంగ్రెస్ నేతల స్పందన ఇది. డీఎస్ జంపింగ్‌పై టీకాంగ్‌ నేతలు గుస్సా అవుతున్నారు....

Wednesday, July 1, 2015 - 21:15

హైదరాబాద్:ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటి..? ఏకంగా పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారే పార్టీని వీడుతుండటం దేనికి సంకేతం..? తెలుగు రాష్ట్రాల్లో ఇక పార్టీ కోలుకోవడం కష్టమని నేతలు గుర్తించారా..? పీసీసీలుగా పనిచేసిన అనుభవంతో ముందే సర్ధుకుంటున్నారా..? అంటే సమాధానం అవును అనే వస్తోంది..
సార్వత్రిక ఎన్నికల్లో కోలుకోలేని షాక్‌.......

Wednesday, July 1, 2015 - 21:13

హైదరాబాద్:అనారోగ్యమంటూ ఏసీబీకి మొహం చాటేసిన ఎమ్మెల్యే సండ్ర తాను రెడీ అంటున్నారు.. ఎప్పుడైనా విచారించుకోవచ్చంటూ ఏసీబీకి లేఖ రాశారు.. ఇంతకీ సడెన్‌గా సండ్రకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది..? ఏసీబీ అధికారులు ఇక అరెస్టులకు దిగరనే నమ్మకం కలిగిందా..? సండ్ర కాన్ఫిడెన్స్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌గా మారే ప్రమాదం ఉందా..?
ఓటుకు నోటు కేసులో ఇక అరెస్టులు...

Wednesday, July 1, 2015 - 21:10

హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డి ఎట్టకేలకు చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చారు.. షరతులతో కూడిన బెయిల్‌ నిబంధనలు అన్నీ పూర్తిచేసి బయటకు రప్పించారు అతని తరపు లాయర్లు.. రేవంత్‌ అభిమానులు చర్లపల్లి జైలు దగ్గర హంగామా చేశారు..
ఘనస్వాగతానికి తమ్ముళ్ల ఏర్పాట్లు....
రేవంత్‌రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌...

Wednesday, July 1, 2015 - 20:20

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో 30 రోజుల పాటు చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవించినా రేవంత్ రెడ్డిలో మార్పు రాలేదని టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఆయన బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజలు సిగ్గు పడే విధంగా రేవంత్ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన భాష చూసి చంద్ర బాబు తప్ప ఎవరూ మెచ్చుకోరని తెలిపారు.

Wednesday, July 1, 2015 - 20:13

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో బుధవారం సాయంత్రం చర్లపల్లి జైలు నుండి బెయిల్ పై విడుదలయ్యారు. రేవంత్ విడుదలవుతుండటంతో టీడీపీ కార్యకర్తలు పెద్దయెత్తున చర్లపల్లి జైలు వద్దకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి రేవంత్ మాట్లాడారు. 'నన్ను కావాలని ఈ కేసులో ఇరికించారు. నాకు బెయిల్ వచ్చింది. కేసీఆర్ కు జ్వరం వచ్చింది....

Wednesday, July 1, 2015 - 18:26

వరంగల్ : జిల్లాలో అవినీతి చేప ఏసిబి వలకు చిక్కింది. సంగ్యం మండలం పల్లారు గ్రామంలో అలావత్‌ రాజేందర్‌ అనే యువకుడు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ అమరవీరుడి కుటుంబానికి తెలంగాణ సర్కార్‌ ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. ఈచెక్కును తీసుకునేందుకు అమరవీరుని కుటుంబం కలెక్టరేట్‌కు వచ్చింది. దీంతో కలెక్టరేట్లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునీల్ 10వేలు...

Wednesday, July 1, 2015 - 17:39

హైదరాబాద్:ఓటుకు నోటు కేసులో 30 రోజుల పాటు జైలు జీవితం గడిపిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పణ, అక్కడి నుంచి రిలీజ్ ఆర్డర్స్‌తో చర్లపల్లి జైలుకు చేరుకున్న రేవంత్ తరఫు న్యాయవాది, వాటిని జైలు అధికారులకు అందజేయడంతో ఆయన విడుదలయ్యారు. ఆయనతో సహ నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలు...

Wednesday, July 1, 2015 - 17:00

హైదరాబాద్: ఏ కాలమొచ్చినా హైదరాబాదీ వాసులకు నీటి కష్టాలు పరిష్కారం కావడం లేదు. వర్షాకాలం వచ్చినా.. తాగునీటి సమస్య తీరడం లేదు. ఫలితంగా రోజు రోజుకు నీటి వ్యాపారం పెరిగిపోతోంది. పట్టణాలు, నగరాల్లోనే కాదు.. మారుమూల గ్రామాల్లోనూ నీటి వ్యాపారం పుంజుకుంది. హైదరాబాద్‌లో ప్రతిరోజూ 340 మిలియన్‌ గ్యాలన్ల నీటిని అందిస్తున్నట్లు జలమండలి లెక్కలు...

Wednesday, July 1, 2015 - 16:51

హైదరాబాద్: తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులు సమ్మె బాట పట్టారు. సమస్యలు పరిష్కరించని టీఆర్ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సమ్మె చేపట్టినట్టు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... గ్రామస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తూ పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడటం...

Wednesday, July 1, 2015 - 16:48

హైదరాబాద్ :సిపిఎం సీనియర్‌ నేత, పార్టీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యులు కొరటాల సత్యనారాయణ వర్ధంతి ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఆపార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, ఇతర నేతలు హాజరయ్యారు. కొరటాల చిత్రపటానికి పూలమాల వేసిన నేతలు.. అనంతరం ఆయనకు నివాళులర్పించారు. పార్టీ అభ్యున్నతికి కొరటాల ఎంతో కృషి...

Wednesday, July 1, 2015 - 16:46

హైదరాబాద్:వరంగల్‌ ఎంపీ ఉపఎన్నికకు ముందే కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు మరోసారి భారీస్థాయిలో తెరతీసినట్లు కనిపిస్తోంది.. గ్రేటర్ హైదరాబాద్‌ ఎలక్షన్‌కు ముందు కాంగ్రెస్‌లో కీలక నేతలను కారెక్కించుకుంటున్నారు... కాంగ్రెస్‌తో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉండి.. కీలక పదవులు చేపట్టిన నేతలు సైతం గులాబీ గూటికి చేరుతున్నారు..
బీసీ నేతగా జాతీయస్థాయిలో గుర్తింపు......

Wednesday, July 1, 2015 - 15:32

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదుపేస్తోంది. ఈ ఇష్యూ బయటకు వచ్చాక ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 వివాదాలు తెరపైకి వచ్చాయి. ఐతే ఈ మొత్తం వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం ప్రధానంగా ఆరోపిస్తోంది. తమ దగ్గర బలమైన ఆధారాలున్నాయని, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది.
నలుగురు అధికారుల...

Wednesday, July 1, 2015 - 15:28

హైదరాబాద్‌: వనస్ధలిపురంలో మరో అవినీతి అధికారిని ఏసిబి అధికారి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. 20వేలు లంచం తీసుకునేందుకు ప్రయత్నించిన ట్రాన్స్‌కో ఏఈ అశోక్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 

Wednesday, July 1, 2015 - 15:21

హైదరాబాద్:సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ మరో లేఖ రాశారు.తాను విచారణకు సిద్ధమని తెలియచేశారు. పది రోజులపాటు రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు లేఖలో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పుడే ఏసీబీ విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని ఏసీబీకి రాసిన లేఖలో తెలిపారు.

Wednesday, July 1, 2015 - 14:40

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. బెయిల్ ఆర్డర్‌లోనున్న ఏసీబీ పీఎస్‌ను ఏసీబీ కోర్టుగా హైకోర్టు సవరించింది. మరికాసేపట్లో వ్యక్తిగత పూచీకత్తుకు సంబంధించిన బాండ్లను రేవంత్‌ తరపు లాయర్లు ఏసీబీ కోర్టులో సమర్పించనున్నారు.

Wednesday, July 1, 2015 - 13:25

హైదరాబాద్ : అన్ని త్వరలో చెబుతానని కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆయన సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. డీఎస్ గులాబీ గూటిలో చేరుతారన్న ప్రచారానికి ఈ భేటీ బలం చేకూర్చినట్లైంది. కేసీఆర్ తో భేటీ అనంతరం విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. కానీ అన్ని వివరాలు త్వరలోనే చెబుతానంటూ డీఎస్ కారులో వెళ్లిపోయారు...

Wednesday, July 1, 2015 - 13:09

హైదరాబాద్ : 'ఓటుకు నోటు' వ్యవహారంలో అరెస్టయిన టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. సాయంత్రం లోపున రేవంత్ విడుదల అయ్యే అవకాశం ఉంది. రేవంత్ విడుదలలో ఉత్కంఠ తొలగిపోవడంతో నేతలు, ఆయన అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ ఆర్డర్ లో సాంకేతిక లోపాలున్నాయని..న్యాయమూర్తి తీర్పులో రూ.5లక్షల చొప్పున పూచికత్తును పోలీస్ స్టేషన్ లో...

Wednesday, July 1, 2015 - 12:47

రంగారెడ్డి : హయత్ నగర్ దొంగలు బీభత్సం సృష్టించారు. అబ్దుల్లాపూర్ మెట్ లోని రెండు ఇళ్లల్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఆరు తులాల బంగారం..50తులాల వెండిని అపహరించారు. మరో ఇంట్లో పది వేల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం వచ్చిన కుటుంబసభ్యులు దొంగతనం అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

Wednesday, July 1, 2015 - 12:43

కరీంనగర్ : జగిత్యాలలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరని హత్య చేసి మురుగునీటి కాలువలో పడేశారు. జగిత్యాలలో భాగ్యనగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు బండరాయితో మోది హత్య చేసిన అనంతరం మురికినీటి కాలువలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు...

Wednesday, July 1, 2015 - 12:18

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విడుదల ఎప్పుడవుతారా అని టిడిపి నేతలు, ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆయన విడుదల కోసం చర్లపల్లి జైలు ఎదుట భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు. రేవంత్ విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బెయిల్ ఆర్డర్ లో సాంకేతిక లోపాలున్నాయని..న్యాయమూర్తి తీర్పులో...

Wednesday, July 1, 2015 - 11:15

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష మాజీ నేత డి.శ్రీనివాస్ కారు ఎక్కడడానికే సిద్ధమౌతున్నారు. ఆయన బుజ్జగించేందుకు రంగంలోకి దిగాలని అధిష్టానం సూచనలతో టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కలు డీఎస్ నివాసానికి వెళ్లారు. కానీ అప్పటికే డీఎస్ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు....

Wednesday, July 1, 2015 - 06:34

హైదరాబాద్ : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు నేడు తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, ఏఐడిఎస్ ఓ, ఏఐఎఫ్ డీ ఎస్ విద్యార్థి సంఘాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు ఉండటం లేదని.. ప్రైవేటు స్కూల్స్ లో...

Wednesday, July 1, 2015 - 06:22

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర సమితి .. మళ్లీ ఆపరేషన్‌ ఆకర్ష్ కు పదును పెట్టింది. కొన్నాళ్లు విరామం ఇచ్చిన టీఆర్ఎస్‌.. ఇపుడు గ్రేటర్‌ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. భవిష్యత్‌కు ఢోకా లేకుండా అధికార పార్టీ.. ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. కండువా కప్పి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. త్వరలో పీసీసీ మాజీ చీఫ్‌తో సహా...

Wednesday, July 1, 2015 - 06:19

హైదరాబాద్ : 'ఓటుకు నోటు' వ్యవహారంలో అరెస్టయిన టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నేడు చర్లపల్లి జైలు నుండి విడుదల కానున్నారు. ఆయనతో పాటు ఇద్దరి నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్‌ను సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉంది. వీరి బెయిల్ పిటిషన్ వాదనలు వాడివేడిగా సాగాయి. జడ్జి అడిగిన కొన్ని ప్రశ్నలకు ఎసిబి నీళ్లు నమలాల్సి...

Tuesday, June 30, 2015 - 21:50

హైదరాబాద్: తాజా రాజకీయ పరిస్థితులపై టీడీపీ యువనేత లోకేశ్‌ బాబు స్పందించారు. చంద్రబాబుకు భయపడే.. సీఎం కేసీఆర్.. గవర్నర్ విందుకు డుమ్మాకొట్టారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం నోటీసులిస్తే... ఏపీ నెత్తినపాలు పోసినట్లే లోకేశ్ చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ భయం పట్టుకుందన్నారు. అందుకే టీఎస్ హోంశాఖ...

Pages

Don't Miss