TG News

Tuesday, September 25, 2018 - 10:35

నల్లగొండ : మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసు తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం కలిగించింది. ఉత్తరాది నుండి తెలుగు రాష్ట్రాలకు పాకిన ఈ పరువు హత్యల విష సంస్కృతికి ప్రణయ్ బలైపోయాడు. కూతురి ప్రేమ పెళ్లి ఇష్టం లేక ప్రణయ్ ను మారుతిరావే హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. నిందితులు మారుతీరావు, తిరునగరు శ్రవణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు విచారణలో వేగాన్ని...

Tuesday, September 25, 2018 - 09:37

వికారాబాద్ : గత కొంత కాలంగా స్టూడెంట్స్ సూసైట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. కారణాలు ఏమైనాగానీ విద్యార్థుల ఆత్మహత్యలపై మానసిక విశ్లేషకులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో ఓ బైపీసీ మొదటి సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. గౌతమి జూనియర్ కాలేజ్‌లో బైపీసీ మొదటి సంవత్సరం చదవువుతున్న మనీష అనే విద్యార్థిని హాస్టల్...

Tuesday, September 25, 2018 - 08:23

హైదరాబాద్ : ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏ విషయంలోనైనా కుంబ బద్దలు కొట్టినట్లుగా మాట్లేడే బండ్ల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేసీఆర్ సత్తా వున్న నాయకుడే కానీ..పరిపాలనాదక్షుడు కాదంటూ కుండబద్ధలు కొట్టారు. వాగ్ధానాలు నిలబెట్టుకోవడంలో కేసీఆర్...

Monday, September 24, 2018 - 21:08

హైదరాబాద్ : చంచల్‌గూడ జైలు నుంచి కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి విడుదలయ్యారు. మానవ అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగ్గారెడ్డికి సికింద్రాబాద్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడంతో.. కొద్దిసేపటి క్రితం ఆయన విడుదలయ్యారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతుందని.. త్వరలోనే సోనియా, రాహుల్‌గాంధీలతో భారీ సభ ఏర్పాటు చేస్తామన్నారు. తనపై పెట్టిన కేసు నుంచి తాను...

Monday, September 24, 2018 - 20:53

హైదరాబాద్ : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టీ-కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ మరోసారి షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. రాజగోపాల్‌ రెడ్డి పంపిన లేఖపై చర్చించిన క్రమశిక్షణ కమిటీ... నోటీసుకు సమాధానం ఇవ్వకుండా ప్రెస్‌మీట్‌ పెట్టి తీవ్ర ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టింది. ఈరోజు జారీ చేసిన షోకాజు నోటీసుకు 24 గంటల్లో సమాధానమివ్వాలని కమిటీ ఆదేశించింది. 
హైకమాండ్ వేసిన...

Monday, September 24, 2018 - 20:47

హైదరాబాద్ : టీఆర్ఎస్ పై టి.కాంగ్రెస్ విమర్శల దాడి పెంచుతోంది. నేతలు రోజుకో విమర్శలు చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ప్రతిగా టీఆర్ఎస్ కూడా కౌంటర్‌లు ఇస్తోంది. సోమవారం టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్, టి.కాంగ్రెస్ నేత పొన్నంలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 

ఉత్తమ్...
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజల పట్ల...

Monday, September 24, 2018 - 19:25

హైదరాబాద్ : నవంబర్ 24న ఎన్నికలు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ కొట్టిపారిశారు. ఎన్నికలను తేదీలను సీఈసీ ప్రకటిస్తుందని వెల్లడించారు. ఓటరు జాబితాలో అభ్యంతరాలు, సవరణలు తెలుసుకోవచ్చని, ఓటరు నమోదు, సవరణలు, మార్పులు అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. తెలంగాణలో 2.61 కోట్ల మంది ఓటర్లున్నారని, ఓటరు నమోదుపై ఇప్పటి వరకు 23.87...

Monday, September 24, 2018 - 18:06

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అమరుల చావుకు టిడిపి, కాంగ్రెస్ పార్టీయే కారణమని సిరిసిల్ల తాజా, మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీలపై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్‌ది నీచమైన నికృష్టమైన పార్టీ అని అభివర్ణించారు. ఈ సందర్భంగా కోదండరాంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఏ అమరుడు చెప్పాడని పార్టీ పెట్టారని సూటిగా...

Monday, September 24, 2018 - 17:03

గవర్నర్ ఏంటి సైకిల్ ఎక్కడం ఏంటి? అని సందేహం వచ్చిందా? మరేం లేదు.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ సోమవారం హైదరాబాద్‌లో స్మార్ట్‌ బైక్‌పై సందడి చేశారు. అమీర్ పేట్-ఎల్బీనగర్ మార్గంలో మెట్రో రైలుని ప్రారంభించిన ఆయన తిరుగుప్రయాణంలో ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్ద స్మార్ట్ బైక్ ఎక్కారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు స్మార్ట్‌ బైక్‌పై చేరుకున్నారు. 
మెట్రో కారిడార్‌-...

Monday, September 24, 2018 - 15:06

హైదరాబాద్ : 2004లో నకిలీ పత్రాలు, పాస్ పోర్టుతో మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బెయిల్ లభించింది. సికింద్రబాద్ కోర్టు ఆయనకు బెయిల్ ను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ‌జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే పలు ఆరోపణలతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసింది. గుజరాత్ కు చెందిన ముగ్గుర్ని తన...

Monday, September 24, 2018 - 14:54

హైదరాబాద్ : ప్రపంచంలో అత్యుత్తమ మెట్రోలతో పోటీ పడే విధంగా హైదరాబాద్ మెట్రోను తీర్చిదిద్దామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అమీర్ పేట - ఎల్‌బినగర్ మెట్రో రైలు ప్రారంభోత్సవంలో గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్‌లు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ప్రభుత్వం - ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగిందని, ప్రాజెక్టుపై ఎల్ అండ్ టీ రూ. 12 వేల కోట్లకు పైగా ఖర్చు...

Monday, September 24, 2018 - 14:43

హైదరాబాద్ : అమీర్ పేట - ఎల్‌బినగర్ మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సోమవారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ మాట్లాడారు. ప్రజలు మెట్రో సేవలను వినియోగించుకోవాలని, దీనివల్ల నగరంలో కాలుష్యం తగ్గే అవకాశం ఉందన్నారు. దీని వల్ల రోడ్లపై రద్దీని తగ్గించవచ్చని, సాధ్యమైనంత త్వరగా...

Monday, September 24, 2018 - 13:50

భద్రాద్రి : ప్రేమ పేరుతో హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. దీనికి ఇదీ కారణమంటు ఖచ్చితంగా చెప్పలేకపోయినా..ఎదిగీ ఎదగని వయసులో వచ్చిన ఆలోచనలు..స్నేహం ప్రేమ అనుకుంటున్న నేటి యువత క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపుడు శోకం మిగులుస్తున్నారు. ఎన్నో కలతో బిడ్డల్ని కని పెంచుకుని విద్యాబుద్ధులు చెప్పి పిల్లలను గొప్పస్థానంలో చూడాలనుకునే కన్నవారి ఆశలకు గండికొడుతు...

Monday, September 24, 2018 - 11:34

హైదరాబాద్ : అసెంబ్లీని రద్దు చేసిన రాష్ట్ర ఆపద్ధమ్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కేసీఆర్ ముందస్తు ఎన్నికల నోటిఫికేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు వారాల్లో నోటిఫికేషన్ వెలువడనుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ పడుతున్న అభ్యర్థుల ప్రచార సరళిని సమీక్షించిన కేసీఆర్ పెండింగ్ సీట్ల అభ్యర్థులపై ఈ వారంలోనే...

Monday, September 24, 2018 - 11:20

హైదరాబాద్ :  తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రోజురోజుకు సెగ రాజుకుంటోంది. దీంతో నేతలు తమ తమ అభ్యర్థులకు గెలిపించదుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. వ్యూహ ప్రతి వ్యూహాలలో బిజీ బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు భాగస్వాములుగా ఉన్నాయి. తాజాగా ఈ...

Monday, September 24, 2018 - 09:21

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేగం పెంచారు. ఎన్నికల ప్రచారం కొనసాగింపు, భారీ బహిరంగ సభల నిర్వహణ, ఇతర వ్యూహాలపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఇంట్లో సమావేశం కానున్న కేసీఆర్...హుస్నాబాద్ సభ తర్వాత వినాయక చవితి రావడంతో ప్రచారానికి విరామం ఇచ్చారు. ప్రచారం సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలన్న దానిపై ఇవాళ ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చే...

Monday, September 24, 2018 - 08:31

హైదరాబాద్ :  ప్రాజెక్ట్ రెండో మైలురాయిని  చేరుతోంది.. పబ్లిక్- ప్రైవేట్  భాగస్వామ్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో  మరో 16 కిలోమీటర్లు ఇవాళ్టీ నుంచి అందుబాటులోకి వస్తోంది. గవర్నర్ నరసింహాన్ అమీర్ పేట్-ఎల్బీ నగర్ రూట్ ను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. 

పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో దేశంలోనే అతిపెద్దదిగా...

Sunday, September 23, 2018 - 13:41

హైదరాబాద్ : నవరాత్రులు పూజలు అందుకున్నఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మఒడికి చేరాడు. ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం పూర్తి అయింది. క్రేన్ నెంబర్ 6 వద్ద 57 అడుగుల గణేష్‌ను నిమజ్జనం చేశారు. భారీ క్రేన్ సహాయంతో 
జలప్రవేశం చేశారు. ఆరు గంటలో్నే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి అయింది. మహాగణపతికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. ట్యాంక్‌బంద్ వద్ద గల హుస్సేన్‌సాగర్‌లో...

Sunday, September 23, 2018 - 12:39

హైదరాబాద్ : వినాయక నిమజ్జనం నగరంలో ప్రశాంతంగా సందడిగా సాగుతోంది. కానీ నిమజ్జనంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో ఏఎస్ఐగా పని చేస్తున్న నీమా నాయక్ ను నగరంలో జరుగుతున్న నిమజ్జనోత్సవం బందోబస్తు విధులు అప్పగించారు. దీనితో నీమా నాయక్ నగరానికి చేరుకుని విధులు నిర్వహిస్తున్నారు. 
ఆదివారం...

Sunday, September 23, 2018 - 12:15

హైదరాబాద్ : బాలాపూర్ లడ్డూ వేలంపై వివాదం మొదలైంది. లడ్డూ వేలాన్ని త్వరగా ముగించారని, తమకు అవకాశం ఇవ్వకుండా చూశారని పలువురు ఆశావాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామస్తుడికి లడ్డూ దక్కేలా చూడాలని ఉత్సవ కమిటీ ముందుగానే పథకం ప్రకారం వేలం నిర్వహించిందన్నారు. కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ పాటను ముగించేశారని కొందరు ఆరోపించారు....

Sunday, September 23, 2018 - 10:50

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈసీ పలు చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే ఉన్నతాధికారులు సమావేశాలు కొనసాగిస్తున్నారు. ఓటర్ల జాబితా..సవరణలు..ఇతరత్రా కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో పర్యటించి ఎన్నికలపై ఆరా తీసింది. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ముంపు మండలాలపై శనివారం ప్రకటన చేసింది. పోలవరం ముంపు...

Sunday, September 23, 2018 - 10:28

హైదరాబాద్ : నవరాత్రులు పూజలు అందుకున్నమహాగణపతులు నిమజ్జనానికి తరలివస్తున్నాయి. సాంప్రదాయబద్దంగా వినాయక్ సాగర్ తరలిస్తున్నారు. డప్పులు, నృత్యాలతో భక్తులు లంభోదరుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర కొనసాగుతోంది. ఖైరతాబాద్ సప్తముఖ కాలసర్ప వినాయకుడు నిమజ్జనానికి తరలివస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 6వ...

Sunday, September 23, 2018 - 10:19

గణేష్ ఉత్సవాలు ప్రారంభయ్యాయంటే గుర్తుకొచ్చేది ఖైరతాబాద్...బాలాపూర్ లడ్డూ...ఇందులో ఖైరతాబాద్ గణేష్ అతి పెద్ద విగ్రహంగా పేరొందగా బాలాపూర్ లడ్డూకు విశిష్టత ఉంది.. ఇక్కడ ఏర్పాటు చేసిన లడ్డూను దక్కించుకోవడానికి ఎంతో మంది పోటీ పడుతుంటారు. లడ్డూను దక్కించుకున్న వారికి ఎంతో మేలు జరుగుతుందని ప్రజల ప్రగాఢ నమ్మకం..విశ్వాసం. 1994లో రూ. 450తో మొదలైన వేలం...ప్రతి సంవత్సరం ధర పెరుగుతూ...

Sunday, September 23, 2018 - 10:06

హైదరాబాద్ : నవరాత్రులు పూజలు అందుకున్నమహాగణపతులు నిమజ్జనానికి తరలివస్తున్నాయి. సాంప్రదాయబద్దంగా వినాయక్ సాగర్ తరలిస్తున్నారు. డప్పులు, నృత్యాలతో భక్తులు లంభోదరుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. నిన్నరాత్రి నుంచే నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్‌బండ్ దగ్గర గణనాథుల కోలాహలం నెలకొంది. ట్యాంక్‌బండ్ సహా 35 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. 2 వేల 100 మంది...

Sunday, September 23, 2018 - 09:29

హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనం సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా....పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. నిమజ్జనానికి వేలాది వాహనాలు హుసేన్ సాగర్ తరలిరానుండటంతో....పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. గణేశ్‌ శోభాయాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించారు. నిమజ్జనం జరిగే రూట్లలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని...

Sunday, September 23, 2018 - 08:54

హైదరాబాద్ : బాలాపూర్ వినాయకుడికి ఎంత క్రేజ్ ఉంటుందో... ఆ గణేష్ లడ్డూ కి అంతకన్నా ఎక్కువ క్రేజే ఉంది. ఈ బాలాపూర్ లడ్డూ ఎవరు దక్కించుకుంచారనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంటుంది.  కుల, మతాలకు అతీతంగా బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొంటారు. లడ్డూ తీసుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకమే వేలంలో పోటీని పెంచుతోంది. ప్రతియేట లడ్డూ పాత రికార్డులను బద్దలు కొడుతూనే వుంది...

Sunday, September 23, 2018 - 08:25

హైదరాబాద్‌ : నగరంలో గణేష్‌ నిమజ్జన సందడి అప్పుడే షురూ అయ్యింది. అర్థరాత్రి నుంచే గణేష్‌ విగ్రహాల నిమజ్జనం మొదలైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇన్నాళ్లూ భక్తుల విశేష పూజలందుకున్నగణనాథులు నిమజ్జనానికి తరలుతున్నారు. దీంతో ట్యాంక్‌బండ్‌పై కోలాహలం నెలకొంది. డప్పుల మోతలు, బరాత్‌లు, యువతీయువకుల తీన్‌మార్‌ స్టెప్పులతో ట్యాంక్‌బండ్‌పై సందడి నెలకొంది.  ట్యాంక్‌బండ్‌...

Pages

Don't Miss