TG News

Tuesday, May 23, 2017 - 09:13

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి ఆర్టీఏ కార్యాలయంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కంప్యూటర్లు, సర్వర్లతో పాటు.. పలు ఫైళ్లు దగ్దమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పారు.

 

Tuesday, May 23, 2017 - 09:03

హైదరాబాద్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని కంప్యూటరీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని వ్యవసాయ క్షేత్రాలు, రైతుల వివరాలు, సాగు పరిస్థితులన్నింటినీ సమగ్రంగా కంప్యూటరైజేషన్‌ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం మాభూమి యాప్‌ తీసుకొచ్చింది. ఈ యాప్‌ను వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌...

Tuesday, May 23, 2017 - 09:00

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో రెండేళ్ల ముందుగానే ఎన్నికల సందడి మొదలైంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు తీవ్రం అవుతుండడం, విపక్ష పార్టీలు ఏకం అయ్యే ప్రయత్నాలు మొదలు కావడం జాతీయ పార్టీలు తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు తెలంగాణాపై దృష్టి పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఎన్నికల వేడి రగులుకుంటోంది.

3 ...

Tuesday, May 23, 2017 - 08:55

హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ నేతలను గ్యాంగ్‌స్టర్‌ నయీం భయం వెంటాడుతోంది. నయీంతో సంబంధాలున్న నేతల్లో రోజురోజుకు టెన్షన్ పెరుగుతోంది. నయీంగ్యాంగ్‌తో తమ పార్టీ నేతలకు సంబంధాలు లేవని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసినా...పోలీసులపై చర్యలు తీసుకోవడంతో మరోసారి గులాబీ నేతల్లో గుబులు రేగుతోంది.

సోదాల్లో బయటపడ్డ ఆదారాలు...

Tuesday, May 23, 2017 - 08:45

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీని పటిష్టపరిచే బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న అమిత్‌ షా... నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదటి రోజు జిల్లాలోని తేరట్‌పల్లిలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కమలదళాధిపతి..నల్గొండలో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో తెలంగాణ బీజేపీ నేతలకు దిశా, నిర్దేశం చేశారు.

బలపడే...

Monday, May 22, 2017 - 21:47

మేడ్చల్ : మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రతిపక్షాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.. అప్పుడెప్పుడో కాంగ్రెస్‌వాళ్లు దిక్కుమాలిన జీవోలిచ్చారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. కాంగ్రెస్‌ దిక్కుదివానంలేని కార్యక్రమాలే చేస్తారని మండిపడ్డారు.. రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌లోగొర్రెల అభివృద్ధి పథకంపై అవగాహన సదస్సుకు హాజరయ్యారు.

 

Monday, May 22, 2017 - 21:46

నల్లగొండ : మూడు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అటు నుంచి నల్లగొండ జిల్లా వెళ్లిన అమిత్‌షా.. చండూరు మండలం తెరట్‌పల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా తెరట్‌పల్లిలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును అమిత్‌షా అడిగి...

Monday, May 22, 2017 - 20:19

కరీంనగర్ : తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో కరీంనగర్‌ జిల్లాలోని ఆల్పోర్స్ కళాశాల విద్యార్ధులు జయకేతనం ఎగురవేశారు. ఆల్ఫోర్స్‌ విద్యార్ధులు అత్యుత్తమ ఫలితాలు నమోదు చేశారు. 67 మంది విద్యార్ధులు ఉత్తమ ర్యాంక్‌లు సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో సాయిశివారెడ్డి 216 ర్యాంక్‌ సాధించగా... అగ్రికల్చర్‌, ఫార్మా విభాగంలో నితీష్‌ 610 ర్యాంక్‌ను సాధించారు. వీరితోపాటు అత్యుత్తమ...

Monday, May 22, 2017 - 20:18

హైదరాబాద్ : హైదరాబాద్‌ ప్రగతినగర్‌ చెరువు సుందరీకరణ పనులను గ్రామస్తులే చేపట్టారు. గ్రామస్తులంతా ముందుకొచ్చి చెరువులోని గుర్రపుడెక్కను తొలగించారు. ఇందుకు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా ప్రతికుటుంబానికి 500 రూపాయలు చందావేసుకుని 50లక్షలతో గుర్రపుడెక్క తొలగింపు పూర్తి చేశారు. ఈ కార్యక్రమం వెనుక గ్రామ పంచాయతీ పెద్దలు దయాకర్‌రెడ్డి, సర్పంచ్‌, ఎంపీటీసీ విశేషకృషి...

Monday, May 22, 2017 - 20:14

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సింగరేణిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కార్మికులు ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

Monday, May 22, 2017 - 20:07

నల్లగొండ : తెలంగాణలో అధికారంలోకి వస్తామని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు. మూడురోజుల నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన చండూరు మండలం తెరట్‌పల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టుల చేతిలో హతమైన గుండగోని మైసయ్య...

Monday, May 22, 2017 - 20:06

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ నీటిపారుదల శాఖపై సమీక్షించారు. ప్రాజెక్టు పనుల పురోగతి, భూసేకరణ అంశాలపై మంత్రులు, అధికారులతో చర్చించారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు ఉన్న మార్గంలో.. 81 కిలోమీటర్ల మేర సొరంగమార్గం తవ్వాల్సి ఉండగా... ఇప్పటికే 78 కిలోమీటర్లు పూర్తికావడంపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తితో మిగతా పనులు కూడా వేగంగా...

Monday, May 22, 2017 - 19:10

హైదరాబాద్ : ప్రగతినగర్‌ చెరువు సుందరీకరణ పనులను గ్రామస్తులే చేపట్టారు. గ్రామస్తులంతా ముందుకొచ్చి చెరువులోని గుర్రపుడెక్కను తొలగించారు. ఇందుకు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా ప్రతికుటుంబానికి 500 రూపాయలు చందావేసుకుని 50లక్షలతో గుర్రపుడెక్క తొలగింపు పూర్తి చేశారు. ఈ కార్యక్రమం వెనుక గ్రామ పంచాయతీ పెద్దలు దయాకర్‌రెడ్డి, సర్పంచ్‌, ఎంపీటీసీ విశేషకృషి చేశారు....

Monday, May 22, 2017 - 19:09

హైదరాబాద్ : ఎండల్లో విధులు నిర్వహించలేక అల్లాడిపోతున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు కూల్‌ జాకెట్స్ రాబోతున్నాయి.. ముందు పైలట్‌ ప్రాజెక్టుగా రెండువందలమంది కానిస్టేబుళ్లకు ఈ జాకెట్లు ఇచ్చారు.. వీటి పనితీరుబట్టి మిగతా పోలీసులకూ జాకెట్లు అందజేయనున్నారు.. ఏషియన్‌ ఇన్ఫో టెక్నాలజీవారు ఈ జాకెట్స్‌ను స్పాన్సర్‌ చేశారు.. మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

Monday, May 22, 2017 - 19:08

హైదరాబాద్ : తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాల్లో గందరగోళం నెలకొంది. దీంతో విద్యార్ధులు జేఎన్‌టీయూ ఎదుట ఆందోళనకు దిగారు. భారీగా వచ్చిన విద్యార్ధులు జేఎన్‌టీయూ ఆడిటోరియం ఎదుట ధర్నా నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

Monday, May 22, 2017 - 19:07

ఢిల్లీ : బాలికా విద్యపై ఢిల్లీలో జరిగిన సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సబ్‌ కమిటీ రెండో సమావేశం ముగిసింది. బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్టు మంత్రి కడియం శ్రీహరి చెప్పారు . బాలికల భద్రత, ఆరోగ్య పరిస్థితులపై కూడా చర్చించడం జరిగిందన్నారు. బాలికా విద్యపై తీసుకుంటున్న చర్యలు గురించి తెలంగాణా, అస్సాం, ఝార్ఖండ్‌...

Monday, May 22, 2017 - 19:05

నల్లగొండ : తెలంగాణలో అధికారంలోకి వస్తామని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు. మూడురోజుల నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన చండూరు మండలం తెరట్‌పల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టుల చేతిలో హతమైన గుండగోని మైసయ్య...

Monday, May 22, 2017 - 19:04

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా రామానూజవరంలో విషాదం చొటుచేసుకుంది. కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా పెళ్లికూతురు తల్లి సైదానీబేగం వడదెబ్బతో మృతి చెందారు.సోమవారం మధ్యాహ్నం 12.35 పెళ్లి ఉండగా పెళ్లి పనుల్లో సైదానీకి వడదెబ్బ తగలడంతో మృతి చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

 

Monday, May 22, 2017 - 16:51

హైదరాబాద్ : ప్రతి 5 వేల ఎకరాలకు ఒక అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ అధికారి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండి రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయంలో అధికారులతో సమావేశమైన పోచారం.. విస్తరణ అధికారులకు లాప్‌టాప్‌లను అందించారు.

 

Monday, May 22, 2017 - 15:40

రంగారెడ్డి : జిల్లాలో ఓ పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారానికి చెందిన టేకుమట్లు జంగయ్య తన కూతురి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. బంధువుల రాకతో ఇళ్లంతా సందడిగా మారింది. మరికొద్ది సేపట్లో పెళ్లి అనగా జంగయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయాడు. విషయం తెలిస్తే పెళ్లి ఆగిపోతుందని భావించిన కుటుంబ సభ్యులు ఎవరికీ...

Monday, May 22, 2017 - 12:34

హైదరాబాద్: ఎంసెట్ 2017 ఫలితాలు విడుద‌ల‌య్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 12న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. 2,20,251 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఇంజినీరింగ్ విభాగంలో 1,39,100 మంది విద్యార్థులు, వ్యవసాయ, ఫార్మసీ విభాగంలో 73,501 మంది విద్యార్థులు పరీక్షకు...

Monday, May 22, 2017 - 10:13

ఎండకాలం ఎండలతో పాటు ధరలు కూడా మండిపోతున్నాయి. మాంసాహారులకు చికెన్ చుక్కలు చూపెడుతోంది. ఎండదెబ్బకు కోడి ధర అమాంతం పెరిగిపోయింది. పెరిగిపోయిన ధర చూసి చికెన్ అభిమానులు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. ఏకంగా 45-50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనితో కేజీ చికెన్ ధర రూ. 234 నుండి రూ. 240 ఎకబాకడం గమనార్హం. వారం వ్యధిలో రూ. 70...

Monday, May 22, 2017 - 09:26

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంపై కమల నాథులు ఫోకస్ పెట్టారు. పార్టీ బలోపేతంపై కీలక నేతలు చర్చిస్తున్నారు. అందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు షా పర్యటన కొనసాగనుంది. అమిత్ షా పర్యటనతో పార్టీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న అనంతరం షా నేరుగా నల్గొండ జిల్లాకు...

Monday, May 22, 2017 - 06:39

నల్లగొండ : జిల్లాపై కమలనాధులు ఫోకస్‌ పెట్టారు. పార్టీని బలోపేతం చేసేదిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల పాటు నల్లగొండలో మకాం వేయనున్నారు. దళితులతో సహపంక్తి బోజనాలతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొని.. నియోజవర్గంలో బూత్ స్థాయి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. నల్లగొండ, మునుగోడు, నాగార్జునసాగర్, నకిరేకల్...

Sunday, May 21, 2017 - 21:20

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు తోడు వడగాడ్పులు కూడా జనం ప్రాణాలు తీస్తున్నాయి. ప్రతిరోజు రెండు రాష్ట్రాల్లో పలువురు వృద్ధులు వడదెబ్బ తగిలి మృతి చెందుతున్నారు. బెంబేలెత్తిస్తున్న ఎండలతో జనం ఇళ్లలో నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు.

పిట్టల్లా రాలుతున్న జనం.......

Pages

Don't Miss