నవంబర్ 1న టెర్మినేటర్ : డార్క్ ఫేట్

Submitted on 19 September 2019
Terminator: Dark Fate - World Wide Releasing on 1st November 2019

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీస్‌లో టెర్మినేటర్ సిరీస్ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఈ సిరీస్‌లో ఆరవ సినిమాగా ‘టెర్మినేటర్: డార్క్‌ఫేట్‌‌’ వస్తుంది. ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ మరోసారి టెర్మినేటర్‌గా సినీ ప్రేక్షకులను అలరించనున్నాడు. 'డెడ్‌పూల్' ఫేమ్ టిమ్ మిల్లర్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రముఖ దర్శక, నిర్మాత జేమ్స్ కెమరూన్ నిర్మిస్తున్నారు.

'టెర్మినేటర్', 'టెర్మినేటర్ 2 : జడ్జిమెంట్ డే' సినిమాలకు డైరెక్ట్ సీక్వెల్‌గా రూపొందుతున్న ‘టెర్మినేటర్: డార్క్‌ఫేట్‌‌’ ట్రైలర్ ఇటీవల విడుదల చెయ్యగా మంచి స్పందన వచ్చింది. ఇంతకుముందు రెండు భాగాల్లో నటించిన లిండా హామిల్టన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ రెండు పార్ట్స్ తర్వాత ఆ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్, సెంటిమెంట్ ఇంకే సినిమాలోనూ చూడలేదని, సినిమా తప్పకుండా ఆడియన్స్‌ను అలరిస్తుందని మూవీ యూనిట్ తెలిపింది.

ఈ సినిమాకు జేమ్స్‌కామెరూన్‌, ఛార్లెస్‌ ఎగ్లీ, జోష్‌ ఫ్రైడ్‌మ్యాన్‌ కథ అందించారు. నటాలియా రేయెస్, డియెగో బోనెటా తదితరులు నటించిన టెర్మినేటర్ : డార్క్ ఫేట్.. ప్రపంచవ్యాప్తంగా నవంబరు 1న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. 
  
 

Arnold Schwarzenegger
Linda Hamilton
James Cameron
Tim Miller

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు