తెలుగు ప్రేక్షకుల లవర్ బోయ్ "ఉదయ్ కిరణ్"

Submitted on 26 June 2019
Telugu cinema Hero Udaya Kiran Birth day

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి గాడ్ ఫాదర్ లు లేకుండా...వారసత్వం లేకుండా కేవలం తన టాలెంట్ తో విజయాలను అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని చిన్నవయస్సులోనే తనువు చాలించిన హీరో ఉదయ్ కిరణ్. జూన్ 26 ఉదయ్ కిరణ్ జయంతి. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య అప్పట్లో ఒక సంచలనం. అతని మరణం తర్వాత  అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఏది ఏమైనా లవర్ బోయ్ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్ధానం సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ జీవితంలో ఓడిపోయి తనువు చాలించాడు. ఆత్మహత్యకు ముందు ఉదయ్ కిరణ్ మద్యం సేవించాడని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. ఉరి వేసుకోవడంతో ఊపిరి ఆడక అతను ప్రాణాలు వదిలినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఫోరెన్సిక్ రిపోర్టులో శాస్త్రీయ అధ్యయనం వల్ల మరణాని గల భౌతిక కారణాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. అయితే అతన్ని ఆత్మహత్య వైపు పురిగొల్పిన మానసిక కారణాలు మాత్రం ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. ఇండస్ట్రీలో అవకాశాలు రాక, మనో వేదనతోనే ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు  షికారు చేశాయి.  

దర్శకుడు తేజ 2000 సంవత్సరంలో రూపోందించిన "చిత్రం" సినిమాతో తెరంగేట్రం చేసిన ఉదయ్ కిరణ్ ఆతర్వాత నువ్వు-నేను, మనసంతా నువ్వే, లాంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించాడు. ఇక అక్కడి నుంచి అన్నీ ప్రేమ కధా చిత్రాలే చేస్తూ వచ్చాడు. ఈ పరిస్ధితిలో లవర్ బోయ్ ఇమేజ్ తో వచ్చిన కొన్నిసినిమాలు పరాజయం పొందాయి. లవర్ బోయ్ ఇమేజ్ నుంచి బయటపడేందుకు యాక్షన్, మాస్ సినిమాలు చేయటం ప్రారంభించాడు. ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండాలన్నా,  టాప్ రేంజ్ కు ఎదగాలన్నా మాస్ సినిమాలే శరణ్యం అనే ఆలోచనతో చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టటంతో తీవ్ర మనో వేదనకు గురవుతూ వచ్చాడని తెలిసింది. తమిళ రంగంలోకి వెళ్లినా అకక్కడా విజయవంతం కాలేకపోయాడు. వచ్చిన అవకాశాలపై సరైన నిర్ణయం తీసుకోలేక వాటిని చేజేతులా దూరం చేసుకున్నాడనే విమర్శలు వచ్చాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురై 2014 జనవరి 5 న ఆత్మహత్య చేసుకున్నాడు.  

తెలుగు, తమిళ భాషల్లో 21 సినిమాలు చేసిన ఉదయ్ కిరణ్ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డులు అందుకున్నాడు. జూన్ 26, 1980న పుట్టిన ఉదయ్ కిరణ్ 2000వ సంవత్సరంలో కెరీర్ ప్రారంభించాడు. తొలి 3 సంవత్సరాలుఅనంతరం  2003 సంవత్సరం నుంచి అతని కెరీర్ పరంగా డౌన్ ఫాల్ ప్రారంభమైంది. దాని తర్వాత ఎన్నిసినిమాలు చేసినా సక్సెస్ కాలేక పోయాడు. హీరోగా ఒక వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ కెరీర్ లో మళ్లీ హిట్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. వచ్చిన ఏ సినిమా హిట్ కాలేదు. తెలుగులో అతని చివరి సినిమా జై శ్రీరాం.  కెరీర్ విజయవంతంగా సాగుతున్న టైమ్ లోనే 2003 లో చిరంజీవి కూతురుతో వివాహ నిశ్చితార్ధం జరిగింది. అయితే అనుకోని కారణాలతో ఆ వివాహం రద్దయింది. 2012 అక్టోబరులో విషితను వివాహాం చేసుకున్నాడు. జీవితంలో ఒకసారి  ప్రేమ ఫెయిల్, ఒక నిశ్చితార్ధం రద్దు, కెరీర్ లో సరైన హిట్ లేకపోవటం..ఇండ్రస్టీలో  హిట్ కోసం  ప్రయత్నిస్తూనే...పరిస్ధితులు చేజారడంతో తనువు చాలించిన ఉదయ్ కిరణ్ తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో లవర్ బోయ్ గానే ముద్రవేసుకున్నాడు. 

Cinema
udaya kiran
telugu cinema
Chitram
Director Teja
Sucide


మరిన్ని వార్తలు