సీరియల్స్ ఎలా చూడాలి : ఫిబ్రవరి 1 నుంచి తెలుగు ఛానళ్లు బంద్

Submitted on 18 January 2019
Telugu channels may go off air from February 1

తెలుగు టీవీ ఛానళ్ల ప్రేక్షకులకు చేదు వార్త. ఫిబ్రవరి 1 నుంచి తెలుగు ఛానళ్లు నిలిచిపోనున్నాయి. తెలుగు ఛానళ్లను నిలిపివేయాలని లోకల్ కేబుల్ ఆపరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇతర ప్రాంతీయ ఛానెళ్ల కంటే తెలుగు ఛానళ్లను బ్రాడ్ కాస్టర్లు ఎక్కువ ధరకు ఆఫర్ చేస్తుండంతో కేబుల్ ఆపరేటర్లు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కూడా ఛానళ్లు ఎంచుకునే అవకాశం టీవీ ప్రేక్షకులకే వదిలేసింది. ట్రాయ్ సూచనల మేరకు బ్రాడ్ కాస్టర్లు ప్రేక్షకులకు ఛానళ్లను ఎంచుకొని అవకాశం కల్పించనున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇతర ప్రాంతీయ భాషల ఛానెళ్ల కంటే తెలుగు ఛానెళ్ల ధరలను మాత్రం బ్రాడ్ కాస్టర్లు ఎక్కువ ధరతో ఆఫర్ చేస్తున్నారు. బ్రాడ్ కాస్టర్ల తీరును లోకల్ కేబుల్ ఆపరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇతర రీజినల్ ఛానెళ్ల ధరతో పోలిస్తే తెలుగు ఛానళ్లకు రూ.  7 నుంచి రూ. 10 పైగా చెల్లించాల్సి వస్తుందని జాయింట్ యాక్షన్ కమిటీ (జేఎసీ) లోకల్ కేబుల్ ఆపరేటర్స్ (ఎల్ సీఓ), మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్స్ (ఎంఎస్ఓ) సభ్యులు సుభాష్ రెడ్డి చెప్పారు.

బ్రాడ్ కాస్టర్ల తీరుకు నిరసనగా ఫిబ్రవరి 1 నుంచి తెలుగు ఛానళ్ల ప్రసారాన్ని నిలివేయనున్నట్టు స్పష్టం చేశారు. ట్రాయ్ నిబంధనతో కొత్త టారిఫ్ విధానం అమలు చేస్తుండటంపై ఇప్పటికే ఎన్నో సమస్యలు ఉన్నాయని అన్నారు. దీనిపై బ్రాడ్ కాస్టర్లకు కూడా లేఖ రాసినట్టు తెలిపారు. తెలుగు ఛానెళ్లపై ధర ఎక్కువగా ఉంటే.. తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపరు.. ఫలితంగా తెలుగు ఛానళ్లు ప్యాకేజీ తీసుకోమని వారికి చెప్పలేమని సుభాష్ రెడ్డి లేఖలో తెలిపారు. ఒక బ్రాడ్ కాస్టర్ నుంచి కన్నడ ఛానెల్ ప్యాకేజీ రూ. 30 ఉంటే.. తెలుగు ఛానల్ మాత్రం ఒక్కొక్కటి కనీసం రూ. 7 నుంచి రూ. 10కు పైగా ఛార్జ్ చేస్తున్నారు. ఛానళ్ల మార్కెటింగ్ లోకల్ పేయర్లపై ఆధారపడి ఉంటుందనీ, దీన్ని కస్టమర్ల దృష్టికి తీసుకెళ్తామన్నారు. తెలుగు ఛానళ్ల ప్యాకేజీకి జీఎస్టీ కూడా ఉండటంతో మరింత భారంగా మారుతోందని లోకో ఏపీ కే విశేష్ అభిప్రాయపడ్డారు. 

Telugu channels
February 1
Local cable operaters
TV viewers
TRAI
Broadcasters

మరిన్ని వార్తలు