తరుణ్ భాస్కర్‌కు జోడీగా ‌ టీవీ సెన్సేషన్

Submitted on 16 April 2019
Television sensation Vani to make her T’wood debut

పెళ్లిచూపులు చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ వద్ద సంచలనం క్రియేట్ చేస్తున్నాడు. వరుస సక్సెస్‌లతో జోష్‌లో ఉన్న విజయ్ నిర్మాతగా మారారు. తనకు పెళ్లిచూపులు వంటి సినిమాను ఇచ్చిన క్రేజీ డైరెక్టర్‌ తరుణ్ భాస్కర్‌ను హీరోగా ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే టెలివిజన్ సంచలనం వాణి బోజన్‌ను ఈ సినిమాకు హీరోయిన్‌గా తీసుకున్నారట. ఈ విషయాన్ని వాణి బోజన్‌ వెల్లడించింది. తమిళనాట మంచి క్రేజ్ ఉన్న వాణి టీవీ సంచలనంగా పేరు తెచ్చుకుంది.
తరుణ్ భాస్కర్ తొలిసారి హీరోగా మారగా విజయ్ దేవరకొండ ఈ సినిమాను తీస్తున్నారని వాణి చెప్పింది.తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన విజయ్ దేవరకొండకు ధన్యవాదాలు తెలిపిన వాణి, ఈ సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయం కాబోతున్నట్లు చెప్పింది. ఈ సినిమాకి తమిళనాడులోని చెన్నైకి చెందిన షార్ట్ ఫిల్మ్ మేకర్ సమీర్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపింది. వాణి భోజన్ ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలలో నటిస్తుంది. అందులో ఒకటి వైభవ్‌తో కాగా ఆ సినిమాకు ఎన్4 అనే టైటిల్ పెట్టారు.

Television sensation
Vani Bhojan
Vaibhav
N4
Vijay Deverakonda
Tharun Bhascker

మరిన్ని వార్తలు