తెలంగాణలో ఏటా 10వేల మందికి ఉచిత డయాలసిస్ 

Submitted on 25 May 2019
Telangana’s free dialysis boon for the poor peaples

ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు సమగ్రమైన వైద్య సంరక్షణ అందించే విధంగా చర్యలు తీసుకొంది. రాష్ట్రంలో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి 40 వేల మంది రోగులు దీనిని ఉచితంగా వినియోగించుకుంటున్నారు. ఈ సౌకర్యాలను దశల వారీగా 31 జిల్లాల్లోకి ప్రవేశపెట్టారు.

డయాలసిస్ సేవల కోసం కిడ్నీ ఫెయిల్యూర్ బాధితులు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చేది. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవి ఉచితం. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత కిడ్నీ మార్పిడి సేవలను అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో 442 మంది రోగులు వివిధ ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఉచితంగా మూత్రపిండ మార్పిడిలు చేసుకున్నారు.

మరో 730 మంది రోగులకు వ్యాధి నిరోధక మెడిసిన్‌ను సరఫరా చేస్తున్నారు. ఈ మెడిసిన్స్  మూత్రపిండ మార్పిడి చేయించుకున్న రోగులకు చాలా అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రోగులకు మందులు అందజేస్తోంది. తెలంగాణాలో సంవత్సరానికి 5 వేల మంది సేవల్ని వినియోగించుకుంటున్నారు. మరింత నాణ్యమైన సేవల్ని అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఉచిత డయాలసిస్ సౌకర్యం వినియోగించుకునే రోగులు 10 వేల మందికి చేరుకున్నారు. 

హైదరాబాద్ లోని నిజాం ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS), ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH), గాంధీ హాస్పిటల్ (జిహెచ్)వంటి  మూడు ఆస్పత్రులలో ఫ్రీ డయాలసిస్ నెంటర్స్ (TDN) కేంద్రాలున్నాయి. నిమ్స్‌లో  65 డయాలసిస్ యంత్రాలు పని చేస్తున్నాయి. 

జర్మన్ మెడికల్ మెషిన్ సంస్థ D- మెడ్ తో కలిసి 31 జిల్లాలలో ఇన్‌స్టాల్ చేయబడిన 300 డయాలిసిస్ మెషీన్లను అధికారులు కొనుగోలు చేశారు. డయాలసిస్ సింగిల్ సెషన్ కోసం రూ.1375 ఉంటే..ప్రైవేటు ఆసుపత్రులలో ఒక్కో సెషన్ కు రూ.2,000 నుంచి రూ.5,000 చొప్పున ఖర్చు అవుతుంది.

ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స తీసుకునే పేషెంట్లకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా సీనియర్ కిడ్నీ స్పెషలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా పలు చర్యల ద్వారా పేదలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా డయాలసిస్‌ను అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 

Telangana
Hyedrabad
free dialysis
poor peaples

మరిన్ని వార్తలు