జూన్ మొదటివారంలో తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

Submitted on 25 May 2019
Telangana EAMCET results on first week of June 2019

జూన్-2019 మొదటివారంలో తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులు రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్నారు. రీవెరిఫికేషన్ ఫలితాలు వెలువడిన తర్వాతే ఎంసెట్ ఫలితాలు వెల్లడించాలని ఎంసెట్ కమిటీ యోచిస్తోంది. రీవెరిఫికేషన్ ఫలితాల విడుదల తర్వాత ఇంటర్మీడియట్ మార్కులకు ఎంసెట్ ర్యాంకుల ఖరారులో 25 శాతం వెయిటేజీని ఇచ్చి తుది ర్యాంకులను ఖరారు చేయాలని భావిస్తోంది. 

మే నెల ఆఖరులోపు ఇంటర్మీడియట్ బోర్డు రీవెరిఫికేషన్ ఫలితాలను వెల్లడిస్తే జూన్ మొదటివారంలో ఎంసెట్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఒకవేళ ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ ఫలితాల విడుదల ఆలస్యమైనట్లైతే ఎంసెట్ ర్యాంకుల వెల్లడి కూడా ఆలస్యం అవ్వనుంది. 

తెలంగాణలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు అనుంబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. కాలేజీల్లోని లోపాలను గుర్తించి గత నెలలోనే వాటిని సరిదిద్దుకునేలా జెఎన్టీయూ సమయం ఇచ్చింది. అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియను ఇటీవలి కాలంలోనే చేపట్టింది.

ఇప్పటివరకు 100 ఇంజనీరింగ్  కాలేజీలకు, 40 ఫార్మసీ, ఎంబీఏ కాలేజీలకు అనుబంధ గుర్తింపును జారీ చేసినట్లు జేఎన్ టీయూ హెచ్ రిజిస్ట్రార్ ప్రొ.ఎన్.యాదయ్య వెల్లడించారు. మే నెలాఖరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అప్పటివరకు ఎన్ని కాలేజీలకు, ఎన్ని సీట్లకు అనుబంధ గుర్తింపు ఇచ్చామన్నది చివరిలో తెలుస్తుందని ఆయన చెప్పారు.
 

Telangana
EAMCET
results
first week
June 2019

మరిన్ని వార్తలు