టీమ్ కేసీఆర్ : కొత్తవారికే ఛాన్స్ !

Submitted on 17 February 2019
Telangana Cabinet Expansion On Feb 19th | KCR Sets Muhurat For Cabinet Expansion

తెలంగాణ మంత్రివర్గ బెంచ్లో ఎవరు ఇన్..ఎవరు ఔట్ అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే కొత్త వారికే ఛాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో మంత్రి పదవులు చేసిన వారికి నో ఛాన్స్ అనే విషయం తెలుస్తోంది. ఈ దఫా జరుపుతున్న మంత్రివర్గ విస్తరణలో కీలక నేతలైన హరీష్ రావు, కేటీఆర్‌లకు కూడా బెర్త్ లేదని టాక్ నడుస్తోంది. ఈనెల 19న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాజ్‌భవన్‌ వేదికగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంత్రివర్గ విస్తరణ కేవలం 08 మందికే పరిమితం చేస్తారని..పార్లమెంట్ ఎన్నికల అనంతరం మరోసారి విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


>  ఆదిలాబాద్ నుండి ఇంద్రకిరణ్ రెడ్డి ఛాన్స్ లేదని..జోగు రామన్నకు మరో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. 
>  హైదరాబాద్ విషయానికి వస్తే...తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులు పేర్లు పరిశీలిస్తున్నారు. వీరిలో తలసానికి మంత్రి పదవి...పద్మారావుకు డిప్యూటీ స్పీకర్ పదవులు దక్కే అవకాశం ఉంది. 
>  నిజామాబాద్ జిల్లా నుండి గతంలో మంత్రిగా చేసిన పోచారం శ్రీనివాస రెడ్డి స్పీకర్‌గా ఎన్నుకోవడంతో ఆయన స్థానంలో వేముల ప్రశాంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు టాక్. 
>  వ‌రంగ‌ల్‌ జిల్లా నుంచి గత కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహించిన క‌డియం శ్రీ‌హ‌రి...మంత్రిగా పనిచేసిన చందూలాల్‌కు ఈసారి ఆ ఛాన్స్‌ దక్కేటట్లు లేదు. ఈ జిల్లానుంచి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు మంత్రివర్గంలో చోటు దక్కించబోతున్నారు. 
>  ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ అజ‌య్‌కి కేబినెట్ బెర్త్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
>  నల్గొండ జిల్లా నుండి ఎంపీగా ఉన్న గుత్తాసుఖేందర్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కే ఛాన్స్ ఉంది. 
>  మహ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లా నుండి నిరంజన్‌రెడ్డికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. 
>  మహిళా కోటా విషయానికి వస్తే రేఖ్యా నాయక్, పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీతలలో ఒకరికి మాత్రమే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. 
ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ తేదీ ఖరారు కావడంతో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మరి ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో చూడాలి. 

Telangana
Cabinet
Expansion
Delay
KCR
Muhurat
Cabinet Expansion
KCR Sentiment
Sankranthi

మరిన్ని వార్తలు