అభినందనలు : స్పీకర్ చైర్‌లో పోచారం శ్రీనివాస్ రెడ్డి

Submitted on 18 January 2019
Telangana Assembly 2019 | Telangana Speaker Pocharam Srinivas Reddy

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పోచారం శ్రీనివాసరెడ్డిని ఇక అధ్యక్షా అంటూ పిలవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హాయంలో వ్యవసాయ మంత్రిగా సేవలందించిన ఈయన...ప్రజా సమస్యలపై..రాష్ట్ర ప్రయోజనాల కోసం అటు ప్రభుత్వానికి..ఇటు విపక్ష సభ్యులకు పలు దిశానిర్దేశం చేయనున్నారు.  ఎందుకంటే ఆయన స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 

తెలంగాణ స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనవరి 18వ తేదీ శుక్రవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ ఎన్నిక జరిగింది. నామినేషన్ పోచారం ఒక్కరే వేయడంతో ఆయన స్పీకర్ అయ్యారు. అనంతరం ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ఖాన్‌ స్పీకర్‌ ఎన్నికపై ప్రకటన చేశారు. స్పీకర్ చైర్‌లో కూర్చొవాలని ప్రొటెం స్పీకర్..పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోరారు. నూతన స్పీకర్ పోచారంకు ప్రొటెం స్పీకర్ అభినందనలు తెలిపారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ చైర్ వద్దకు సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతరులు తీసుకెళ్లి చైర్‌లో కూర్చోబెట్టారు. స్పీకర్‌గా నియమితులైన సందర్భంగా సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలియచేశారు. 

  • సింగిల్ విండో చైర్మన్‌గా రాజకీయ ప్రస్థానం. 
  • 1976 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 
  • ఏడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ. 
  • 6 సార్లు విజయం 
  • తెలంగాణ తొలి ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు. 
  • ప్రజల మనిషిగా గుర్తింపు. 
  • ఆయన అసలు పేరు పరిగె శ్రీనివాసరెడ్డి. 
  • పుట్టిన ఊరు పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు పోచారం. 
Pocharam Srinivas
Telangana Assembly
Speaker
Chief Minister of Telangana
K Chandrasekhar Rao
MLA Pocharam Srinivas Reddy
Banswada assembly

మరిన్ని వార్తలు