శాసనసభ సమరం : ప్రమాణ స్వీకారోత్సవాలకు ఏర్పాట్లు

Submitted on 15 January 2019
Telangana Assembly 2019 AIMIM Legislature To Be Protem Speaker

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2019, జనవరి 17వ తేదీన సమావేశాల ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రధానఘట్టం ప్రమాణ స్వీకార మహోత్సవం. శాసనసభలో ప్రమాణస్వీకారానికి కొన్ని నిబంధనలున్నాయి. సభలోని సీనియర్ సభ్యులు ఎవరైతే ఉంటారో..వారిచేత గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. ఇతనే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారు. ప్రమాణం అనంతరం శాసనసభాపతికి ఉండే అన్ని సౌకర్యాలు..హోదా వర్తించనున్నాయి. ప్రస్తతం సభలో సీనియర్ నేత అయిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయనున్నారు. మరుసటి రోజు శాసనసభ్యులుగా మిగిలిన 119 మంది సభ్యులతో (నామినేటెడ్ సభ్యుడిని కలిపి) ప్రొటెంస్పీకర్ ప్రమాణం చేయిస్తారు. 

కేసీఆర్ మొదట.. తరువాత మహిళా సభ్యులు...
సభానాయకుడిగా సీఎం కేసీఆర్ మొదటగా ప్రమాణం చేస్తారు. ఆయన తర్వాత మహిళాసభ్యులతో ప్రమాణం చేయిస్తారు. వారి తర్వాత ఎన్నికల సంఘం ఇచ్చిన గెజిట్‌లో ఉన్న పేర్లలో అక్షరమాల ప్రకారం (ఆల్ఫాబెట్ ఆర్డర్‌లో) ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. శాసనసభ్యులు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిషుల్లో ఏ భాషలోనైనా ప్రమాణం చేయవచ్చు. సభ్యులందరూ విధిగా రెండు ప్రమాణాలు స్వీకరించాల్సి ఉంటుంది. దీంట్లో భారత రాజ్యాంగానికి బద్ధులై ఉంటానని ఒకటి, శాసనసభ నియమ నిబంధనలకు బద్ధుడనై ఉంటానని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఇది ముగిసిన అనంతరం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక పూర్తయ్యేవరకు ప్రొటెంస్పీకర్ అన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. స్పీకర్‌గా ఎన్నికైనవారిని ఆ స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత ప్రొటెంస్పీకర్ బాధ్యత తీరిపోతుంది. తర్వాత ఎమ్మెల్యేగా తన స్థానానికి వెళ్తారు.

Telangana
Assembly
AIMIM
Legislature
Protem Speaker
KCR Oath
Speaker
Mumtaz Ahmad

మరిన్ని వార్తలు