తేజతో రానా ‘రాక్షస రాజ్యంలో రావణాసూరుడు’

Submitted on 23 January 2020
Teja has high chances to collaborate with Rana for a film very soon

కెరీర్ తొలినాళ్లలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ చాలా కాలం తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ చేసే అవకాశం వచ్చినా వదులుకున్నాడు. ‘సీత’ పరాజయం తర్వాత కొత్త సినిమా ఏదీ మొదలు పెట్టలేదు. అయితే తేజ తన తర్వాతి సినిమాని రానాతో చేయనున్నాడని ఫిలింనగర్ సమాచారం.

తనకి కమ్ బ్యాక్ ఫిలిం ఇచ్చిన రానా అయితే సెంటిమెంట్‌గా వర్కౌట్ అవుతుందనుకున్నాడేమో కానీ తేజ రానా కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించబోయే ఈ సినిమా కోసం ‘రాక్షస రాజ్యంలో రావణాసూరుడు’ అనే టైటిల్ రిజిష్టర్ చేయించారని తెలుస్తోంది.

Read Also : పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ ఫస్ట్ లుక్

త్వరలో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. రానా ప్రస్తుతం ‘విరాట పర్వం’, ‘హథీ మేరి సాథీ’ సినమాల్లో నటిస్తున్నాడు. మరోవైపు గుణ శేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్య కశ్యప’ చిత్రం కూడా చర్చల దశలో ఉంది.

Rana Daggubati
Rakshasa Rajyamlo Ravanasurudu
Suresh Productions
Teja

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు