పబ్ జీ ఆడుతున్న ధోనీ-చాహల్

Submitted on 22 May 2019
Team India's PUBG love on full show

విమానం ఎక్కేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చి విరామసమయంలో టీమిండియా చేసే పనేంటో తెలుసా.. ఎప్పుడూ ఫోన్లు, ట్యాబ్‌లు పట్టుకుని కూర్చొనే ప్లేయర్లు పబ్ జీ ఆడుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. కొన్నాళ క్రితం ఇలాగే టీమిండియా పబ్ జీ ఆడుతున్న ఫొటో వైరల్‌గా మారింది. 

మంగళవారం ఇంగ్లాండ్ బయల్దేరే క్రమంలో ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న టీమిండియా ట్యాబ్‌లు, ఫోన్‌లలో బిజీ అయిపోయారు. ఇంతకీ వారు చేసేదేంటో తెలుసా.. పబ్ జీ. ప్రతి గాడ్జెట్ స్క్రీన్‌లోనూ పబ్ జీ ఆడుతూ కనిపించారు. 

భువనేశ్వర్ కుమార్-మొహమ్మద్ షమీ ఆడుతుండగా, మరో వైపు మహేంద్ర సింగ్ ధోనీతో యుజ్వేంద్ర చాహల్ ఆడుతూ కనిపించాడు. బీసీసీఐ ఈ ఫొటోలను తన అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్టు చేసింది. ఇంగ్లాండ్ గడ్డపై మే25న తొలి మ్యాచ్‌గా వార్మప్‌ను న్యూజిలాండ్‌తో ఆడనుంది టీమిండియా. ఇక వరల్డ్ కప్ టోర్నీలో అసలైన మ్యాచ్‌ను జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 

Team India
PUBG
MS Dhoni
chahal
shami
bhuvaneshwar kumar
2019 icc world cup
World Cup
2019 Cricket World Cup

మరిన్ని వార్తలు