నరాలు తెగే ఉత్కంఠపోరులో భారత్ ఘన విజయం

Submitted on 18 January 2019
Team india won odi format

ఆస్ట్రేలియాను టీమిండియా మరోసారి శాసించింది. టెస్టు ఫార్మాట్‌లోనే కాకుండా వన్డే సిరీస్‌లోనూ సత్తా చాటి చరిత్ర లిఖించింది. మ్యాచ్ చివరి వరకూ సాగిన ఉత్కంఠభరితమైన పోరులో ఏడు వికెట్ల ఆధిక్యంతో ధోనీ పూర్తి చేసి చూపించాడు. క్రీజులో నిలబడేందుకు బ్యాట్స్‌మెన్ తటపటాయిస్తున్న సమయంలో ధోనీ అనుభవాన్ని ప్రదర్శించాడు. ఆసీస్ బౌలర్లను సహనంతో ఎదుర్కొని భారత్‌కు విజయాన్ని అందించాడు. మరోసారి మంచి మ్యాచ్ ఫినిషర్ అని నిరూపించుకున్నాడు. మిస్టర్ కూల్ గా ఆసీస్ గడ్డపై వన్డే సిరీస్ నెగ్గి మరో చరిత్రకు శ్రీకారం చుట్టాడు. 

 

 

నిర్ణయాత్మక వన్డేలో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ సఫలమైన భారత్ ఎట్టకేలకు ఆస్ట్రేలియా పర్యటనను రెండు ఫార్మాట్ల విజయంతో ముగించింది. టాస్ గెలిచి ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన టీమిండియా కంగారూలను పరుగులు చేసేందుకు అవకాశమివ్వలేదు. తొలి పది ఓవర్లకే రెండు వికెట్లను దక్కించుకున్న టీమిండియా చాహల్ బౌలింగ్‌తో ఆసీస్‌ను కట్టడి చేసింది. తొలి వికెట్‌గా అలెక్స్ క్యారీని 2.5 ఓవర్లకు 8-1పరుగుల వద్ద అవుట్ చేసిన భువీ.. ఆరోన్ ఫించ్ 8.6 ఓవర్లకు 27-2 పరుగుల వద్ద  చిత్తు చేశాడు. ఆ తర్వాత భీబత్సం మొదలు పెట్టిన చాహల్.. 23.1 ఓవర్లకు షాన్ మార్ష్ వికెట్‌ను పడగొట్టి ఉస్మాన్ ఖవాజాను రెండు బంతుల వ్యవధిలోనే పెవలియన్‌కు పంపాడు. 

ఈ క్రమంలో చాహల్ ఆరు వికెట్లు తీయగా భువీ 2, షమీ 2వికెట్ల తీయగలిగారు. దాంతో టీమిండియా 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది. చేధనలో టీమిండియా ఆచితూచి ఆడింది. ఐదు ఓవర్లు ముగిసినా కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్లు బ్యాటింగ్ చేసేందుకు తడబడ్డారు. ఆరో ఓవర్ ముగిసే సమయానికి రోహిత్ 9 పరుగులతో పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ-ధావన్‌తో కలిసి పరవాలేదనిపించినా ధావన్‌ను స్టోనిస్ అవుట్ చేయడంతో 23 పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత ధోనీతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు కెప్టెన్. కానీ, హాఫ్ సెంచరీకి ముందే వికెట్ చేజార్చుకున్నాడు. కోహ్లీ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కేదర్ జాదవ్‌తో కలిసి పరుగుల వరద పారించిన ధోనీ(87;  4 ఫోర్లు), కేదర్ జాదవ్(61; 7 ఫోర్లు)తో జట్టును విజయ తీరాలకు చేర్చారు. 

See also : సీరియల్స్ ఎలా చూడాలి : ఫిబ్రవరి 1 నుంచి తెలుగు ఛానళ్లు బంద్

cricket
MS Dhoni
match win
india
Australia
indvaus

మరిన్ని వార్తలు