టీమిండియా టార్గెట్ 154 రన్స్

Submitted on 7 November 2019
team india target 154 runs

రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న సెకండ్ టీ20లో భారత్ గెలవాలంటే 154 పరుగులు చేయాలి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. బంగ్లా జట్టుకి మంచి ఆరంభం లభించింది. పవర్ ప్లేలో దూకుడుగా ఆడింది. ఓపెనర్లు లిటన్ దాస్ (21 బంతుల్లో 29 పరుగులు), మహ్మద్ నయీమ్ (31 బంతుల్లో 36 పరుగులు) వరుస బౌండరీలతో చెలరేగారు. ఖలీల్ బౌలింగ్ లో నయీమ్ రెచ్చిపోయి ఆడాడు. ఓపెనర్లు ధాటిగా ఆడి తొలి వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యం అందించారు.

మొదట్లో ధారాళంగా పరుగులు ఇచ్చినా.. మధ్య ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకున్నారు. కీలక సమయాల్లో వికెట్లు తీసి డెత్ ఓవర్లలో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. చాహల్ (2/28) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఖలీల్, సుందర్ తలో వికెట్ తీశారు.

బంగ్లా జట్టును 153 రన్స్ కే పరిమితం చేశారు. కాగా, ఫీల్డింగ్ లో టీమిండియా దారుణంగా విఫలమైంది. ప్లేయర్లు పదే పదే పొరపాట్లు చేశారు. ఇది మూడు మ్యాచుల టీ-20 సిరీస్. ఇప్పటికే తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది.

india
bangladesh
rajkot
second t20

మరిన్ని వార్తలు