ఈ Tea తాగండి.. 100 ఏళ్లు బతకండి!

Submitted on 16 January 2020
Tea drinkers live longer new study shows

ఆధునిక జీవితంలో ప్రతిఒక్కరి జీవనశైలిలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. ఆరోగ్య పరంగా ఎన్నో రకాల సమస్యలు ఎదురువుతున్నాయి. 100 ఏళ్లు జీవించాల్సిన మనిషి.. అనారోగ్య కారణాల రీత్యా ఆయువు తీరిపోతోంది. దీనికి ఒకటే కారణం.. జీవనశైలిలో మార్పులు.. ఆహారపు అలవాట్లు.. శరీరానికి కావాల్సినంత శ్రమ ఇలా ఎన్నో కారణాలుగా చెప్పవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఎన్నో రకాల ఔషధాలు అందరికి అందుబాటులోకి వచ్చేశాయి. కానీ, నిర్లక్ష్యంగానో లేదా బద్దకంతోనో లేనిపోని ఆరోగ్య సమస్యలను ఏరికోరి తెచ్చుకుంటున్నారు.

సాధారణంగా కొన్ని ఔషధ గుణాలన్న వాటిని నిత్యం తీసుకుంటే ఉంటే ఆరోగ్య సమస్యలను దరిచేరకుండా జాగ్రత్త పడొచ్చు. అందులో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఔషధం.. తేనీరు.. టీ ఎక్కువగా తాగే వారు ఎక్కువ కాలం జీవిస్తారని ఓ అధ్యయనం చెబుతోంది. అదే.. Green Tea.. గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిది అని అందరికి తెలుసు.. అయినా చాలామంది ఆ టీ జోలికి పోరు. చైనా, ఇండియాలో గ్రీన్ టీ ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది. ఆరోగ్య ప్రయోజనాలకు ఆశించే ఎక్కువ మంది ఈ టీని సేవించేందుకు ఇష్టపడతారు. ఈ అధ్యయనం ప్రకారం.. వారంలో కనీసం మూడు సార్లు గ్రీన్ టీ తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అకాల మరణాన్ని దరిచేరనివ్వకుండా చేయగల శక్తి.. ఈ గ్రీన్ టీకి ఉందని తేల్చి చెబుతున్నారు సైంటిస్టులు.. 100 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవిస్తారని గట్టిగా చెబుతున్నారు. యూరోపియన్ జనరల్ ఆఫ్ ప్రీవెంటీవ్ కార్డియాలజీలో ఈ కొత్త అధ్యయాన్ని ప్రచురించారు. చైనాలో నిర్వహించిన ఈ అధ్యయనంలో లక్ష మందిపై పరిశోధక బృందం పరీక్షించింది. ఇందులో పాల్గొన్నవారికి వారంలో కనీసం మూడు సార్లు గ్రీన్ టీ తాగించారు. దీంతో వీరిలో తర్వాతి  ఏడేళ్లలో కూడా గుండె జబ్బులు (గుండెపోటు) వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. చైనా-PAR ప్రాజెక్టులో భాగంగా ఇందులో పాల్గొన్నవారిని రెండు గ్రూపులుగా విడగొట్టారు.

టీ తాగే అలవాటు ఉన్నవారు వారంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు సేవించేలా చూశారు. అసలు టీ తాగని వారు లేదా టీ తాగడం పెద్దగా అలవాటు లేనివారితో వారంలో కనీసం మూడు కంటే తక్కువగా సేవించేలా పరిశోధకులు సూచించారు. ఈ అధ్యయనంలో పాల్గొనవారిలో ఏడేళ్ల తర్వాత వారి డేటాను సైంటిస్టులు సేకరించి విశ్లేషించారు. ఈ ఏడేళ్లలో ప్రాజెక్టులో పాల్గొన్నవారికి సంబంధించి ఆరోగ్య అంశాలపై ఆరా తీశారు. ఆయా రోగులను సైతం ప్రశ్నించారు. ఆస్పత్రిలో వారి రికార్డులతో పాటు డెత్ సర్టిఫికేట్లను కూడా పరిశోధకులు పరిశీలించారు. 

Green tea
Tea drinkers
drink green tea
Scientists
consuming tea
China-PAR Project
tea drinkers
hospital records  

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు