కడప, కర్నూలులో ఉద్రిక్తత : టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఘర్షణ

Submitted on 11 April 2019
tdp, ysrcp activists clashes in kurnool, kadapa

ఏపీలో ఎన్నికల వేళ రాయలసీమలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల పోలింగ్ కడప, కర్నూలు జిల్లాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ-వైసీపీ కార్యక్తలు కొట్టుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లిలో టీడీపీ-వైసీపీ వర్గీయుల కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరువర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

కడప జిల్లాలోనూ ఘర్షణ వాతావరణం నెలకొంది. జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణ పడ్డారు. పోలింగ్ బూత్ దగ్గర ఓటర్లను వైసీపీ కార్యకర్తలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో మహేశ్వర రెడ్డి అనే వైసీపీ కార్యకర్త తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు అవినాశ్ రెడ్డి, సుధీర్ రెడ్డిలు పోలింగ్ బూత్ దగ్గరకి చేరుకున్నారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో భూమా, గంగుల వర్గీయులు ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలింగ్ జరుగుతోంది. మైదుకూరు మండలం జాన్లవరంలో వైసీపీ ఏజెంట్ ఈవీఎం పగలగొట్టాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బూలింగ్ బూత్ కు తాళం వేశారు. అటు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కొత్తపల్లిలో పోలింగ్ నిలిచిపోయింది. వైసీపీ ఏజెంట్ ను టీడీపీ ఏజెంట్లు బయటకు గెంటేయడంతో పోలింగ్ ఆగిపోయింది.

kadapa
Kurnool
fight
TDP
YSR congress party
Clashes

మరిన్ని వార్తలు