వెనక్కి నడిచిన బాబు..టీడీపీ నేతలు : రివర్స్ టెండరింగ్‌పై టీడీపీ నిరసన

Submitted on 16 December 2019
TDP leaders protest against the reverse tendering

ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను టీడీపీ తప్పుబడుతోంది. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్‌పై టీడీపీ నిరసన తెలిపింది. రివర్స్‌లో నడుస్తూ..చంద్రబాబు..ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రివర్స్ పాలనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టింది.

2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రివర్స్ టెండరింగ్ విధానంపై టీడీపీ నిరసన తెలియచేసింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వెనక్కి నడుచుకుంటూ అసెంబ్లీకి వచ్చారు.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ..ఏపీలో రిజర్వ్ చేసుకుని రివర్స్ టెండరింగ్ అంటున్నారని మండిపడ్డారు. సెక్రటేరియట్ ఎదుట ఆందోళనకు దిగారు. వైసీపీ ఆరు నెలల పాలన తిరోగమనంలో ఉందని విమర్శించారు. 2 లక్షల కోట్ల విలువైన అమరావతిని చంపేశారని, రాష్ట్రం అథోగతి పాలైందని విమర్శించారు. టెండర్లన్నీ రిజర్వ్ చేసుకుని రివర్స్ అంటున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు రాని పరిస్థితి కల్పించారన్నారు. ఉన్న పరిశ్రమలు వెనక్కి పోతున్నాయన్నారు బాబు. 

Read More : ఏపీ అసెంబ్లీ : రూ. 2 వేల 626 కోట్ల దోపిడి..అవినీతిని బయటపెడుతాం

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత...గత ప్రభుత్వం అవినీతి, దోపిడి చేసిందని వెల్లడించింది. ఎన్నో టెండర్లలో మోసం జరిగిందని పేర్కొంటూ..రివర్స్ టెండరింగ్‌కు మొగ్గు చూపింది. దీంతో అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రివర్స్ టెండరింగ్ ద్వారా..ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరిందని ప్రభుత్వం వెల్లడిస్తుంటే..అయిన వారికే టెండర్లు కేటాయిస్తున్నారని ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది. అనుకూలమైన వ్యక్తులకు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ఈ ప్రక్రియ చేపట్టారని వెల్లడిస్తోంది. దీనిని ప్రభుత్వం ఖండిస్తోంది. గత ప్రభుత్వం చేసిన అవినీతి, దోపిడిని బయటపెడుతామంటోంది. 

tdp leaders
Protest
against
reverse tendering

మరిన్ని వార్తలు