24 గంటల ఉత్కంఠ తర్వాత గంటా గెలుపు

Submitted on 24 May 2019
tdp candidate ganta srinivas win in Visakhapatnam North

విశాఖ నార్త్ ఫలితంపై ఉత్కంఠ వీడింది. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ గెలుపొందారు. ఆయన గెలుపొందినట్లు ఎన్నికలు అధికారులు తెలిపారు. 1902 ఓట్ల మెజారిటీతో గంటా శ్రీనివాస్ గెలిచినట్లు ఈసీ ప్రకటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కెకె.రాజుపై గంటా గెలుపొందారు. ఆంధ్రా యూనివర్సిటీలో కౌంటింగ్ జరుగుతున్న కేంద్రానికి గంటా చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో అధికారులు గెలుపొందిన పత్రాన్ని ఆయనకు అందజేయనున్నారు.

అంతకముందు విశాఖ నార్త్ అసెంబ్లీ ఫలితాన్ని తాత్కాలికంగా పెండింగ్‌లో ఉంచారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 2వేల 439 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు బరిలో ఉన్నారు. ఐదు పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు తెరుచుకోకపోవడంతో వాటి వీవీ ప్యాట్‌లను లెక్కించాలని అధికారులు నిర్ణయిచారు. వీటిలో ఒక ఈవీఎంకు సంబంధించి 307 వీవీ ప్యాట్‌ల స్లిప్పులకుగాను 106 మాత్రమే ఉన్నాయి. దీంతో వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందించారు. దీంతో ఈసీ ఫలితాన్ని పెండింగ్‌లో పెట్టింది. 

42వ బూత్ కు సంబంధించి ఒక వీవీప్యాట్ కనిపించకపోవడంతో కెకె.రాజకు అందించారు. దాన్ని తీసుకొచ్చిన అధికారులు దానిలోని ఓట్లను కూడా లెక్కించారు. 42, 68, 162, 259 బూత్ లలోని ఈవీఎంలలో సాంకేతిక సమస్య రావడంతో వాటికి సంబంధించిన వీవీప్యాట్ లను లెక్కించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ ప్రారంభించి గంటా గెలుపొందినట్లు ప్రకటించారు ఎన్నికల అధికారులు.  
 

tdp candidate
Ganta Srinivas
win
Visakhapatnam North

మరిన్ని వార్తలు