తమిళనాడు మాజీ ఎంపీ భార్య హత్య, కొడుకు మాయం

Submitted on 16 April 2019
tamilnadu ex-MP’s wife found dead, son missing

తమిళనాడులో ఆదివారం జరిగిన ఈ సంఘటన యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన మాజీ ఎంపీ భార్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సరిగ్గా అదే సమయం నుంచి కొడుకు కనిపించకుండాపోవడంతో హత్య వెనుక కారణాలు, హంతుకులు ఎవరా అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏఐఏడీఎంకే పార్టీ మాజీ ఎంపీ కొలానితైవేలు భార్య రత్తినం(63) ఆదివారం రాత్రి ఆమె కూతురు సుధాతో ఫోన్‌లో మాట్లాడింది. ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి. ఎవర్ని నమ్మాలో తెలియడం లేదు. కుటుంబ ఆస్తులన్నీ తన పేరుకు బదిలీ చేయాలని కన్న కొడుకే తనపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. చంపేస్తాడేమోననే భయం వేస్తుందని కాపాడమని మొరపెట్టుకుంది. కాల్ మాట్లాడుతుండగానే మధ్యలో ఆగిపోయింది. 
Read Also : హైదరాబాద్ లో దారుణం : మందు పార్టీ ఇచ్చి.. యువతిపై గ్యాంగ్ రేప్

అదే నగరంలో ఉన్న బంధువు విషయం చెప్పమని సలహా ఇచ్చేలోపే ఫోన్ కట్ అయిపోయింది. మరోసారి ప్రయత్నించినా ఫోన్ లైన్ కలవలేదు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుండటంతో సుధా తొరైపక్కంలో ఉంటున్న బంధువుకు కాల్ చేసి చెప్పింది. తన తల్లిని కాపాడాలని వేడుకుంది. మొబైల్ ఫోన్ ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ  కలవడం లేదని చెప్తూ.. తల్లి ఫోన్‌లో చెప్పిన విషయాన్ని తెలియజేసింది.

వెంటనే రత్తినం నివాసం ఉంటున్న బీసెంట్ నగర్‌లోని సిక్స్త్ ఎవెన్యూకు అతను చేరుకున్నాడు. తాళం వేసి ఉన్న తలుపుపై రక్తం మరకలను గమనించాడు. స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని ఇంట్లోకి ప్రవేశించి చూసేసరికి చేతులు, కాళ్లు కట్టేసి ఉండడాన్ని గమనించారు. ఛాతీపై కత్తిపోటు ఉండటంతో తీవ్ర రక్త స్రావమై ప్రాణం పోయినట్లు భావించారు. 

పోస్టు మార్టం నిమిత్తం రోయపెట్టాలోని ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతురాలి కొడుకు ప్రవీణ్ లండన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. గత నెలలోనే తల్లిని కలుసుకునేందుకు చెన్నై వచ్చాడు. రత్తినం భర్త కొలానితైవేలు ఏఐఏడీఎంకే పార్టీ తరపున తిరుచెంగోడె నియోజకవర్గం నుంచి 1977 నుంచి 1980వరకూ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారు. 
Read Also : ఒక్క మ్యాచ్ ఓడితే దారి మూసుకుపోయినట్లు కాదు: చాహల్

tamilnadu
tamilnadu ex mp
Dead
murder


మరిన్ని వార్తలు