సంక్రాంతి ఆఫర్: ఫ్రీ చికెన్ స్కీమ్ ప్రారంభం

Submitted on 11 January 2019
Tamil Nadu govt launches free country chicken scheme for rural women..


ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రప్రభుత్వాలు పేదలకు గొర్రెలు, బర్రెలు, చేపలును సబ్సీడీ ధరలకు అందిస్తుండగా ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఈ బాటలో మేము కూడా అని ముందుకొచ్చింది. అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా తమిళనాడులో ప్రభుత్వ పథకాలు ఉంటాయనే పేరు ఇప్పటికే ఉంది. ఈ సమయంలో దేశంలో మొదటిసారిగా గ్రామీణ మహిళల కోసం ఉచిత దేశీయ చికెన్ స్కీమ్ ని గురువారం( జనవరి9,2019) తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రారంభించారు. ఐదుగురు లబ్ధిదారులకు దేశీయ కోళ్లను సరఫరా చేస్తూ సీఎం ఈ స్కీమ్ ప్రారంభించారు.


లబ్ధిదారులు ఒక్కొక్కరికి 50 దేశీయ చికెన్ బ్రీడ్ లను ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. ఇంటి పెరట్లో ఫౌల్ట్రీ ఫార్మింగ్ ను ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా జూన్ లో  77వేల మంది గ్రామీణ మహిళలకు  నాలుగువారాల వయస్సు ఉన్న కోడి పుంజులను, పెట్టలను, పంజరాలను ప్రభుత్వం ఉచితంగా అందిచనున్నట్లు ప్రకటించింది. ఒక్క చెన్నై నగరంలో తప్ప రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ స్కీమ్ అమలవుతుందని ప్రభుత్వం తెలిపింది. 
 

free
CHICKEN
tamilnadu
RURAL WOMEN

మరిన్ని వార్తలు