పేదలకు మాత్రమే : ఈ హోటల్ లో ఇడ్లీ ఫ్రీ

Submitted on 15 September 2019
Tamil Nadu: A 70-yr-old woman Rani runs an idli shop near Agni Tirtham in Rameswaram&serves idli free of cost to the poor

ఆకలితో ఉన్న పేదవాళ్ల దగ్గర డబ్బులు తీసుకోకుండా వారి కడుపు నింపుతోంది తమిళనాడుకి చెందిన రాణి అనే వృద్ధురాలు. రామేశ్వంలోని అగ్ని తీర్థం సమీపంలో రాణి(70) కొన్నేళ్లుగా టిఫిన్ షాన్ రన్ చేస్తోంది. అయితే  తాము ఉచితంగానే పేదలకు ఇడ్లీ పంపీణీ చేస్తున్నామని రాణి తెలిపింది.

తాము ఒక ప్లేట్ ఇడ్లీకి రూ .30 వసూలు చేస్తున్నామని, కాని మేము డబ్బు కోసం పట్టుబట్టడం లేదని, డబ్బు లేదని వచ్చిన వారికి ఉచితంగానే కడుపునిండా ఇడ్లీలు పెడుతున్నామని రాణి తెలిపింది. ఇప్పటికీ చెక్కను వంట కోసం ఇంధనంగా ఉపయోగిస్తామని ఆమె తెలిపింది.

అయితే తమిళనాడుకి చెందిన 80ఏళ్ల కమలాత్తాళ్ ఏళ్లుగా రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తూ ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ బామ్మ కూడా పేదవాళ్ల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే వారికివ కడుపునిండా ఇడ్లీలు పెడుతోంది.  పేదల ఆకలి తీరుస్తున్న ఇడ్లీ బామ్మకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అండగా నిలిచారు.ఆమె ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్నారు. ఆమె గురించి ఎవరికైనా తెలిస్తే.. నాకు చెప్పండి. ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు, ఆమెకు వంటగ్యాస్ స్టౌవ్ కొనిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా'' అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన మరుసటి రోజే భారత్ గ్యాస్ కోయంబత్తూర్ విభాగం స్పందించింది. కమలాత్తాళ్ కు వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది. బామ్మ ఇంటికి వెళ్లి కొత్త గ్యాస్ స్టౌవ్, సిలిండర్ ఇచ్చారు. ఈ విషయాన్ని మహీంద్రాకు ట్యాగ్ చేస్తూ భారత్ గ్యాస్ ట్వీట్ చేసింది.

ఈ విషయం తెలిసి ఆనంద్ మహీంద్రా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ''ఇది అద్భుతం. కమలాత్తాళ్ కు ఆరోగ్యకరమైన కానుక ఇచ్చినందుకు భారత్ గ్యాస్ కోయంబత్తూర్ విభాగానికి కృతజ్ఞతలు. ఆమెకు ఆర్థికంగా అండగా ఉంటానని ఇదివరకే చెప్పాను.. ఇక మీదట ఆమె వంటగ్యాస్ కు అయ్యే ఖర్చును నేను భరిస్తాను'' అని మహీంద్రా మరో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Tamil Nadu
Woman
Rani
runs
idli shop
Rameswaram
free
poor

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు