మరోసారి హార్రర్ చిత్రంలో మిల్కీబ్యూటీ!

Submitted on 22 March 2019
Tamannaah To Do Horror Film With Adhey Kangal Director

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నటి తమన్నా. మొదట్లో తమన్నకు తెలుగు, తమిళ సినిమాలు ఏవీ పెద్దగా కలిసి రాలేదు. దాంతో లాభం లేదని ఐటమ్ సాంగ్స్ కి ఓకే చెప్పింది. ఓవైపు హీరోయిన్ గానే నటిస్తూ..పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్ లో నటించింది.  

ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ‘బాహుబలి’ మొదటి పార్ట్ లో అవంతిక పాత్రలో నటించింది. మొత్తానికి బాహుబలి ఎఫెక్ట్ తో తమన్నాకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. దాంతో ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటుంది. ఇటీవల వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2’ సినిమాలో వెంకి సరసన నటించింది. తమన్నా ఒక వైపున మోడ్రన్ లేడీగా..మరో వైపున పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తూ తమిళంలో 'దేవి' సినిమా చేసింది. ఈ హారర్ థ్రిల్లర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 
Read Also : హలో ఈసీ : హెల్ప్ లైన్ 1950 స్పెషల్ అదే

తాజాగా తమన్నా మూడోసారి హర్రర్‌ చిత్రం చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం తమన్నా ప్రభుదేవాకు జంటగా నటించిన దేవి–2 చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్‌ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నందితా శ్వేత నటిస్తుండగా కోవై సరళ కీలక పాత్రలో కనిపించనున్నారు.   
Read Also : సెల్ఫీ ప్లీజ్ : వామ్మో.. ఎయిర్ పోర్ట్ లో షార్క్.. ప్రయాణీకులు షాక్

Tamannaah
Horror Film
Director Adhey Kangal
Prabhudeva
2019

మరిన్ని వార్తలు