కె.జి.ఎఫ్.లో అమ్మ- ఈ అమ్మాయే

Submitted on 13 February 2019
This Talented Actress Played The Role Of YASH Mother IN KGF Movie-10TV

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందిన కె.జి.ఎఫ్. చాప్టర్ 1.. కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో  ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసందే.. ఫిబ్రవరి 5నుండి అమెజాన్‌ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఆడియన్స్ ఎక్కువగా చూస్తున్నారు.. కొన్నిచోట్ల మినిమమ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కె.జి.ఎఫ్.లో అమ్మ సెంటిమెంట్ ఏ రేంజ్‌లో వర్కవుటయ్యిందో మనం చూసాం.. అమ్మ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్, చూడ్డానికి పెద్దావిడలా కనిపిస్తుంది.. కానీ, ఆ క్యారెక్టర్ చేసినావిడ ఏజ్ 30 లోపే.. ఇప్పడు ఆ ఆర్టిస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

 

KGF MOTHER

అర్చన అనే అమ్మాయి.. కె.జి.ఎఫ్.లో తల్లి పాత్రలో నటించింది. ఆమె వయసు 30 ఏళ్ళ లోపే.. ఈ మధ్యనే పెళ్ళి అయ్యింది.. జనరల్‌గా అమ్మ క్యారెక్టర్స్‌కి, పెద్ద వయసు ఉన్న ఆర్టిస్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటారు.. కానీ, డైరెక్టర్ ఒక యువ నటిని తీసుకుని, ఆడియన్స్‌కి గుర్తుండి పోయేలా ఆ క్యారెక్టర్‌ని తీర్చిదిద్దడం, ఆమె అంతే అద్భుతంగా నటించి, ఆకట్టుకోవడం విశేషం.. కె.జి.ఎఫ్. చాప్టర్ 2 కోసం.. ప్రేక్షకులు ఇప్పటినుండే ఎదురు చూస్తున్నారు.

వాచ్ మథర్ వీడియో సాంగ్...

Archana
Yash
Srinidhi Shetty
Prashanth Neel
Vijay Kiragandur

మరిన్ని వార్తలు