warning

06:54 - October 11, 2018

శ్రీకాకుళం : తుపాను ఉత్తరాంధ్రను వణికిస్తోంది. తిత్లీ అతి తీవ్ర తుపానుగా మారి తీరాన్ని తాకింది. ఇది మరింత బలపడి పెను తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో తిల్లీ తుఫానుతో అధికారులు అప్పమత్తంగా వుండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ అంశంపై అధికారులతో చంద్రబాబు ఉదయం నాలుగు గంటల నుండి టెలీకాన్ఫనెన్స్ నిర్వహిస్తున్నారు. అధికారులంతా అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ఉత్తరాంధ్రకు తుపాను ముప్పుపై ఒడిశా-ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అనుకున్నట్టుగానే శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు-పల్లిసారథి వద్ద గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తుపాను తీరాన్ని తాకింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తుపాను ప్రయాణిస్తుండగా, గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెను గాలులు ప్రజలను భయపెడుతున్నాయి.

గాలుల తాకిడికి జిల్లాలో పలుచోట్ల విద్యుత్ సరఫరా కుప్పకూలింది. తూర్పు కోస్తా రైల్వే రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, నందిగాం, పలాస, వజ్రపు కొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. సోంపేటలో గత రాత్రి నుంచి వర్షం కుండపోతగా కురుస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి జిల్లా వ్యాప్తంగా హైఅలెర్జ్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 
తుపాను కారణంగా ఖుర్దా రోడ్-విజయనగరం మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. 53 కిలోమీటర్ల మేర తుపాను కేంద్రం విస్తరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల కాల్ సెంటర్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎస్సెమ్మెస్‌ల ద్వారా వరద హెచ్చరిక సందేశాలు పంపిస్తోంది. సహాయం కోసం 1100 నంబరుకు కాల్ చేయాలని అధికారులు కోరారు. విజయనగరంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. 08922 236947, టోల్ ఫ్రీ నంబరు 1077కు ఫోన్ చేసి సాయం కోరవచ్చు. విశాఖ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటరు నంబరు 1800 4250 0002.

11:03 - September 26, 2018

విశాఖపట్నం : ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లో వచ్చామని నేతలు ప్రస్తావిస్తుంటారు. కానీ వారి ఆలోచనలు వేరుగా వున్నాయా? అంటే నిజమనే అనుకోవచ్చా? అవినీతి, పైరవీలు, కోట్లు దోచుకోవటం, కాంట్రాక్ట్ రాబట్టుకోవటం వంటి పలు అవినీతిపనులను అలవాటుపడుతున్న నేతల ప్రాణం మావోల గుప్పెట్లో పెట్టుకుంటాం అంటు హెచ్చరించింది అరకు ఘటన హెచ్చరించిందా? అంటే మావోల సమాచారం అవుననే చెబుతోంది. ఒకపార్టీలో గెలిచి ఆ పార్టీ అధికారంలోకి రాకుంటే అధికారంలోకి వచ్చిన పార్టీలలోకి జంప్ అవుతున్న నేతలను మావోలు టార్గెట్ చేస్తున్నట్లుగా వారి సమాచారం తెలుపుతోంది. మావోల చేతిలో ఘోరంగా చంపబడ్డ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు మావోల హెచ్చరిక ఇదే..

కోట్ల రూపాయలు తీసుకుని పార్టీ మారావు. ఆ డబ్బు చాలలేదా? బాక్సైట్ కోసమే రోడ్లు వేసుకుంటు గిరిజనుల అభివృద్ధి కోసమే వేస్తున్నామనీ మాయమాటలు చెప్పి ఎంతకాలం అడవిబిడ్డలను మోసం చేస్తారు? బాక్సైట్ కోసం భూములు తవ్వితే గిరిజనుల జీవితాలు బుగ్గిపాలవుతాయనీ..ఇప్పటికే నీకు చాలా అవకాశాలు ఇచ్చాం. ఇక చాలు అంటు కిడ్నాప్ చేసిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును కిడ్నాప్ చేసి తీసుకెళ్లి, ప్రజాకోర్టును నిర్వహించిన మావోయిస్టులు ఆయన్ను కాల్చివేసే ముందు చెప్పిన మాటలివి. కాగా ఈ ఘటన చాలా మంది గిరిజనులు ప్రత్యక్షంగా చూశారు. నేతల హత్యల తరువాత గిరిజనులు ఈ వివరాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నారు. 
 

15:31 - September 7, 2018

పాకిస్థాన్ : పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీని స్థాపించి పాక్ లో అధికారంలోకి వచ్చారు. కాగా పాకిస్థాన్ లో అధ్యక్షుడు ఎవరైనా..ముఖ్యమంత్రి ఎవరైనా అధికారం మాత్రం సైన్యానిదే. సైన్యం కనుసన్నల్లోని అన్నీ జరుగుతుంటారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ అధికారంలోకి వచ్చాక పాక్ విధి విధానాలు మారతాయనే అందరు ఊహించారు. కానీ సదా మామూలుగానే పాత పద్ధతిలోనే పాక్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆ దేశ సైన్యం తీరు మాత్రం మారలేదు. ఇండియాను రెచ్చగొట్టేలా పాక్ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో తమ సైనికులను చంపితే... అంతకంత ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న కశ్మీర్ ప్రజలకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. పాకిస్థాన్ లో జరిగిన డిఫెన్స్ డే ఫంక్షన్ లో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ప్రజలకు తాము మద్దతుగా ఉంటామని చెప్పారు. కశ్మీర్ సోదరులు, సోదరీమణులు చేస్తున్న త్యాగాలు చాలా గొప్పవని అన్నారు. 

12:12 - July 27, 2017

నల్లగొండ : జిల్లా కోర్టు దగ్గర లక్ష్మి అనే మహిళ హంగామా సృష్టించింది. సూర్యాపేటకు చెందిన లక్ష్మి కోర్టు దగ్గరున్న ఓ భవనంపైకి ఎక్కింది. అక్కడి నుంచి దూకుతానంటూ బెదిరించింది. ఓ కేసు విషయంలో న్యాయం జరగడం లేదని ఆరోపించింది. గతంలో సూర్యాపేట కలెక్టరేట్‌ దగ్గర కూడా లక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది.

 

13:49 - June 19, 2017

ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ మంచిదే కానీ కొన్నిసార్లు చర్మ సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆయిల్ చర్మానికి వాడడం వల్ల పలు దుష్రభావాలు వచ్చే అవకాశం ఉందంట. అలర్జీలున్న వారు ఆలివ్ ఆయిల్ కు దూరంగా ఉండడం మంచిది. అలర్జీ కలిగి ఉండి చర్మానికి రాయడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక అప్పుడే జన్మించిన శిశువుకు ఆలివ్ ఆయిల్ రాయకూడదంట. చిన్న పిల్లలకు ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేయకూడదని, దీనివల్ల పలు సమస్యలు ఏర్పడుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిడ్డు చర్మం ఉన్నవారు ఆలివ్‌ ఆయిల్‌ ను వాడకూడదు. ఒకవేళ ఈ ఆయిల్‌ వాడినట్లయితే, సీబం ఉత్పత్తి అధికమవుతుంది.
పొడి చర్మం కలిగిన వారు ఆలివ్ ఆయిల్ ఉపయోగించకపోవడం మంచిది. మరి ఎలా ఉపయోగించాలి ? అంటే చర్మ వైద్య నిపుణుడిని కలిస్తే చర్మ రకాన్ని తెలుసుకుని తగిన ఉత్పత్తులు..ఏ ఆయిల్ లను ఉపయోగించాలో పలు జాగ్రత్తలు చెప్పే అవకాశం ఉంది.

10:47 - December 30, 2016

హైదరాబాద్ : అసెంబ్లీలో వామపక్షాలపై సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీపీఎం తీవ్రస్థాయిలో మండిపడింది. సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం శాసనసభాపక్షనేత సున్నం రాజయ్య కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చౌకబారు విమర్శలు మానుకుని...ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని సీపీఎం నేతలు హితవుపలికారు. మరోవైపు సీపీఎం నిరసనకు విపక్షాలు మద్దుతు తెలిపాయి. 
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై వామపక్షాలు ఆందోళన 
సీపీఎంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. 
రాజయ్య నిరసన 
శాసనసభలో సీపీఎంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆపార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య నిరసనకు దిగారు. అసెంబ్లీ ముందున్న గాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మల్లన్న సాగర్‌ భూనిర్వాసితుల తరపున గట్టిగా మాట్లాడినందుకే  కేసీఆర్‌ తమపార్టీపై నోటికి వచ్చినట్టు మాట్లాడరని సున్నం రాజయ్య మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
రాజయ్యకు టీడీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మద్దతు 
అసెంబ్లీ గాంధీవిగ్రహం వద్ద నిరసనకు దిగిన సున్నం రాజయ్యకు టీడీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. స్పీకర్‌ పక్షపాతంగా వ్యవహరిస్తూ విపక్షాల గొంతు నొక్కేస్తున్నారని మండిపడ్డారు.  పేదప్రజల తరపున రాజీలేని  పోరాటాలు చేస్తున్న సీపీఎం పార్టీపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వారు ఖండించారు. 
కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదన్న తమ్మినేని 
కేసీఆర్ వ్యాఖ్యలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదని విమర్శించారు. సీపీఎం పార్టీపై చౌకబారు విమర్శలు మానుకుని.. ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. 2013 భూసేకరణ చట్టం ద్వారా నిర్వాసితులకు లభించిన రక్షణలను కేసీఆర్‌ ప్రభుత్వం హరించి వేస్తోందని ఆయన అన్నారు. కేసీఆర్ దిగజారుడు మాటలు మానుకుని ముఖ్యమంత్రి కుర్చీకి తగిన విధంగా హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని తమ్మినేని తెలిపారు. 
కేసీఆర్‌ బెదరింపులకు అదిరిపోయే పార్టీకాదు : సీపీఎం నేతలు  
కేసీఆర్‌ బెదరింపులకు సీపీఎం అదిరిపోయే పార్టీకాదని సీపీఎం నేతలు ఘాటుగా స్పందించారు. సీఎం  తప్పడు నిర్ణయాలపై భవిష్యత్తులో రాజీలేని పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. కేసీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

19:35 - November 6, 2016

విజయవాడ : ఆకతాయి వేధింపులు తట్టుకోలేక విజయవాడలో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని... ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. విజయవాడ మొఘల్రాజపురంలో నివస్తున్న ఓ వివాహితను అదే ప్రాంతంలో ఉంటున్న కోటేశ్వరరావు అలియాస్‌ చిట్టి అనే వ్యక్తి కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ మహిళ తన భర్తకు చెప్పి.. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

మళ్లీ వేధింపులు...
అయితే.. చిట్టి సమీప బంధువు మాచవరం పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుండటంతో ఆయన ఒత్తిడితో పోలీసులు కేవలం చిట్టిని మందలించి వదిలిపెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న చిట్టి మళ్లీ ఆ వివాహితను వేధించడం మొదలుపెట్టాడు. సెల్‌ఫోన్‌కు అసభ్య మెసేజ్‌లు పెడుతూ బెదిరిస్తున్నాడు. ఇదేమని ప్రశ్నించిన బాధితురాలి భర్తపై కూడా చిట్టి దౌర్జన్యానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి కూడా చిట్టి నుంచి ఫోన్‌లో వేధింపులు రావడంతో... ఇంట్లో ఎవరూలేని సమయంలో వంటగదిలోకి వెళ్లిన బాధితురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాచవరం పోలీసులు.. పరారీలో ఉన్న చిట్టి కోసం గాలిస్తున్నారు. గతంలోనే చిట్టిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడు తమ బిడ్డకు ఈ గతి పట్టేదికాదని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

21:30 - November 16, 2015

హైదరాబాద్ : సిరియాలో వైమానిక దాడుల్లో పాలుపంచుకుంటున్న దేశాలకు ఫ్రాన్స్‌కు పట్టిన గతే పడుతుందని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ హెచ్చరించింది. ఫ్రాన్స్‌ సెంటర్‌ పారిస్‌లో జరిగిన విధంగానే అమెరికా సెంటర్‌ వాషింగ్టన్‌లోనూ దాడులు జరుపుతామని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఓ కొత్త వీడియోను ఐఎస్‌ఐఎస్‌ విడుదల చేసింది. యూరప్‌లో మరిన్ని దాడులు జరుపుతామని కూడా పేర్కొంది. సైలెన్సర్‌ గన్స్, పేలుడు బెల్టులతో రకరకాల పద్ధతుల్లో విరుచుకుపడ్తాం...మమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు...ఇంతకు ముందుకన్నా మేమిపుడు బలవంతులమని ఇస్లామిక్‌ స్టేట్‌ స్పష్టం చేసింది. 

10:35 - August 25, 2015

గుజరాత్ : ఓ స్టూడెంట్‌ పేరు వింటేనే ఇప్పుడు గుజరాత్‌ గవర్నమెంట్‌ హడలిపోతోంది. అతను నిద్రలో కనిపించినా షేక్‌అవుతోంది. అలా అని అతనేం బలమైన రాజకీయ ప్రత్యర్థి కానేకాదు. ఆయుధాలు పట్టుకుని పోరాడుతున్న సాయుధుడు అంతకన్నా కాదు. ఓ సాధారణ స్టూడెంట్‌. ఇప్పుడు తన సామాజిక వర్గానికి లక్షగొంతులై ఊపిరిలూదుతున్నాడు. తన ప్రసంగాలతో బీజేపీ గవర్నమెంట్‌కు చెమటలు పట్టిస్తున్న యువకెరటం అతను.

22 ఏళ్ల యువకుడు..
హార్దిక్‌ పటేల్‌.. 22 ఏళ్ల యువకుడు. రెండు నెలల కిందటిదాకా ఇతనెవరో ఎవరికీ తెలియదు. కానీ.. ఇతని పేరు ఇప్పుడు గుజరాత్‌ అంతటా మార్మోగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే 1998 నుంచి గుజరాత్‌ను అప్రతిహతంగా ఏలుతున్న బీజేపీకి హార్దిక్‌ పటేల్‌ ఓ వార్నింగ్‌బెల్‌. పటేల్‌ సామాజికవర్గాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ ఎలుగెత్తిన యువ సంచలనం. పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్‌ కోటా కోసం సాగుతున్న ఉద్యమానికి రథసారథి. రాష్ట్ర పటేల్‌ వర్గ యువతకు అతడో ఫైర్‌బ్రాండ్‌.

పటేళ్లను నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీ సర్కార్‌..
ఇక అసలు విషయానికొస్తే.. గుజరాత్‌లో బలమైన సామాజిక వర్గం పటేళ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే భావన ఆ సామాజిక వర్గం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. వీరి ద్వారా ఎన్నికల వేళ నాయకులు గద్దెనెక్కి.. ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారనే బాధ, కసి వీరిలో పెరిగిపోయింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్ల కారణంగా అభివృద్ధి పరుగు పందెంలో పటీదార్‌ సమాజం తీవ్రంగా నష్టపోతోందనే ఆవేదన వీరిలో కసిని పెంచింది. ఈ తరుణంలోనే హార్దిక్‌ పటేల్‌ తమ సామాజిక వర్గానికి ఉద్యమ సారథిగా మారాడు. ఇప్పుడు రిజర్వేషన్ల సాధన కోసం అలుపెరగకుండా ప్రభుత్వంపై పోరాడుతున్నాడీ యువకెరటం.

''పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి''కి కన్వీనర్‌..
''పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి''కి కన్వీనర్‌గా వ్యవహారిస్తున్న హార్దిక్‌ పటేల్‌ ఈ నెల 17న సూరత్‌లో బహిరంగ సభ నిర్వహించాడు. ఈ సభకు సుమారు 5 లక్షల మంది పటీదార్లు తరలివచ్చి హార్దిక్‌తో గళం కలిపారు. ఎవరికీ తెలియని ఓ బీకాం పట్టభద్రుడు ఇంతతక్కువ వ్యవధిలో ఇంత మందిని ప్రభావితం చేసే స్థాయికి ఎదగడం.. సర్కార్‌ వెన్నులో ఇప్పుడు నిజంగానే వణుకు పుడుతోంది. హార్దిక్‌ పటేల్‌ ప్రసంగాలకు సర్కార్‌ దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతోంది.

హార్దిక్‌ దెబ్బకు వణుకుతున్న బీజేపీలోని 'పటేల్‌' నేతలు...
తమకు విశ్వసనీయమైన ఓటు బ్యాంకుగా భావించే పటేళ్లతో ప్రభుత్వం కొన్నాళ్లుగా చర్చలు సాగిస్తూనే ఉన్నా తాజా పరిణామాల నేపథ్యంలో నేరుగా హార్దిక్‌ పటేల్‌తో మాట్లాడటానికి సిద్ధమైంది. కానీ, తమ డిమాండ్‌కు అంగీకరిస్తేనే చర్చలకు వస్తానని హార్దిక్‌ తెగేసి చెబుతున్నాడు. హార్దిక్‌ దెబ్బకు.. బీజేపీలోని 'పటేల్‌' నేతలు వణుకుతున్నారు. అతణ్ని సమర్థించకపోతే తమ సామాజిక వర్గమే తమను నమ్మని దుస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళనపడుతున్నారు. ''గుజరాత్‌ సీఎం ఆనందీబెన్‌ కూడా పటేల్‌, మరో ఆరుగురు మంత్రులూ పటేల్‌ సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం.

హార్దిక్‌ తండ్రి భరత్‌భాయ్‌ విరాంగామ్‌ వాసి..
హార్దిక్‌ తండ్రి భరత్‌భాయ్‌ విరాంగామ్‌ వాసి. సబ్‌మెర్సిబుల్‌ పంపుల వ్యాపారి. సాధారణ మధ్యతరగతి కుటుంబం. హార్దిక్‌ 50 శాతంకన్నా తక్కువ మార్కులతోనే బీకాం పూర్తిచేశాడు. కానీ.. ప్రసంగ పటిమతో రాజకీయ యవనికపై తళుక్కున మెరుస్తున్నాడు. మొత్తంగా హార్ధిక్‌ పటేల్‌ బీజేపీ సర్కార్‌ను వణికిస్తున్నాడు. పటేళ్లకు రిజర్వేషన్లు అమలు చేయాలని గట్టిగా పోరాడుతున్నాడు.

Don't Miss

Subscribe to RSS - warning