vishaka

09:22 - November 16, 2018

విశాఖ : గజ తుపాను తీరం దాటింది. నాగప్నటం..వేదారణ్యం మధ్య తీవ్ర తుపాను తీరం దాటింది. తుపాను తీరం దాటిన సమయంలో బలమైన గాలులు వీయడంతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాసాలకు తరలించారు. తమిళనాడులోని ఏడు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు గజ తుపాన్‌‌తో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

 

09:24 - November 15, 2018

విశాఖ : బంగాళాఖాతంలో గజ తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. తమిళనాడు తీరం దిశగా తుఫాన్ దూసుకొస్తోంది. ఇవాళ సాయంత్రం కడలూరు..పంబన్ మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చెన్నైకి 430 కి.మీ, నాగపట్నానికి 510 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ నైరుతిగా పయనించి తొలుత తీవ్ర తుఫాన్‌గా ఆ తర్వాత బలహీనపడి తుఫాన్‌గా మారనుంది. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అలలు ఎగిసిపడుతున్నాయి. 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. 

ఏపీలో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ అప్పుడప్పుడు 65 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని... తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల ఉధృతి పెరుగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీ, తమిళనాడు అధికారులు అప్రమత్తమయ్యారు. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుకు భారీ వర్ష సూచన చేసింది. 

 

11:46 - November 14, 2018

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన గజ తుఫాన్ వణికిస్తోంది. సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారనుంది. రేపు మధ్యాహ్నం పంబన్..కడలూరు మధ్య తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో తుఫాను పెను బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. చెన్నైకి తూర్పున 580 కి.మీ దూరాన, నాగపట్నానికి 680 కి.మీ దూరాన కేంద్రీకృతమైంది. బలంగా గాలులు వీయడంతోపాటు అత్యధికంగా వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రకాశం నంచి కర్నూలు వరకు ఉన్న నాలుగు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాలర్లు  సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో తమిళనాడులో హైఅలర్ట్ ప్రకటించారు. ఆంధ్ర, తమిళనాడుల్లోని తీర ప్రాంత పోర్టులలో 2వ నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. 

 

09:17 - November 13, 2018

విశాఖ : గంజాయి కేసులో ముగ్గురికి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. లక్ష జరిమానా విధించారు. గంజాయి కేసులో నేరం రుజువు కావడంతో ముగ్గురు నిందితులకు పధ్నాలుగేళ్ల చొప్పున జైలు శిక్ష, లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించారు. విశాఖపట్నంలోని అడిషినల్‌ మెట్రోపాలిటిన్‌ సెషన్స్‌ జడ్జి ఎన్‌.నాగార్జున నిన్న తీర్పిచ్చినట్టు నర్సీపట్నం ఎక్సైజ్‌ సీఐ డి.వి.కె.రాజు తెలిపారు. జరిమానా చెల్లించకపోతే మరో ఏడాది అదనంగా శిక్ష అనుభవించాల్సివుంటుందని తీర్పులో పేర్కొన్నారని తెలిపారు. శిక్షకు గురైన వారిలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన కొల్లు నాగరాజు, కొరకండ్ల ఏసు, నెక్కంటి శ్రీనివాసరావు ఎలియాస్‌ బాబా  ఉన్నారని చెప్పారు. 2015 డిసెంబరు 7న నర్సీపట్నం సమీపంలో 750 కిలోల గంజాయితో పట్టుబడిన కేసులో వీరంతా నిందితులని సీఐ తెలిపారు. బాబాపై మరో రెండు గంజాయి కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

 

21:45 - November 11, 2018

విశాఖ : విహారయాత్రలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. గల్లంతైన మరో ఐదుగురు యువకుల కోసం అధికారులు గాలిస్తున్నారు. 

విశాఖ హౌసింగ్ బోర్డు, కేఆర్ఎం కాలనీకి చెందిన 12 మంది యువకులు విహారయాత్రకు యారాడ బీచ్‌కు వెళ్లారు. పుట్టిన రోజు వేడుకులు చేసుకునేందుకు వచ్చారు. కొంతసేపు ఆనందంగా గడిపాక స్నానానికని సముద్రంలోకి దిగారు. వారు అలల ఉధృతికి కొట్టుకుపోతుండగా గమనించిన స్థానిక జాలర్లు పలువురిని రక్షించి, ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. గల్లంతైన ఆరుగురిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే చీకటి పడుతుండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. అవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్ సహాయం తీసుకోవాలని కలెక్టర్‌కు సీఎం సూచించారు.

18:56 - November 11, 2018

విశాఖ : విహారయాత్రలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. విశాఖ హౌసింగ్ బోర్డు, కేఆర్ఎం కాలనీకి చెందిన 12 మంది యువకులు విహారయాత్ర కోసం యారాడ బీచ్‌కు వెళ్లారు. కొంతసేపు ఆనందంగా గడిపాక స్నానానికని సముద్రంలోకి దిగారు. అలల ఉధృతికి అందరూ కొట్టుకుపోతుండగా గమనించిన జాలర్లు కొందరిని ఒడ్డుకు తీసుకొచ్చి.. అధికారులకు సమాచారమిచ్చారు. సముద్రంలోకి దిగిన వారిలో సగం మందే ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన వారిలో వాసు, తిరుపతి, గణేశ్, దుర్గ, రాజేశ్, శ్రీను ఉన్నారు. గల్లంతైనవారు ఇసుకతోట దగ్గర దుర్గానగర్ ఎస్సీ కాలనీకి చెందిన యువకులుగా గుర్తించారు. వీరికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేప్టట్టారు. అయితే చీకటి పడుతుండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు భావిస్తున్నారు.

 

10:33 - November 4, 2018

విశాఖ : ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలపై మావోయిస్టులు వివరణ ఇచ్చారు. 14 పేజీల ఇంటర్వ్యూను విడుదల చేశారు. జగబంధు పేరు మీద లేఖలను విడుదల చేశారు. కిడారి, సోమలు ఆస్తులు కూడబెట్టుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారని జగబంధు పేర్కొంది. కిడారి, సోమలు బాక్సైట్ తవ్వకాలకు మద్దతు ఇచ్చారని తెలిపింది. కిడారి, సోమను శిక్షించడానికి ముందు గంట సేపు ప్రజాకోర్టు నిర్వహించామని పేర్కొంది. కిరాయి కోసం హత్యలు చేయబోమని స్పష్టం చేసింది. ఉనికి కోసమే కాల్పులకు పాల్పడ్డారన్న ఆరోపణల్లో నిజం లేదని జగబంధు తెలిపింది.  

 

09:44 - November 4, 2018

విశాఖ : ఏలేరు రిజర్వాయర్ నుంచి వైజాగ్‌ వెళ్లే కాలువకు గండి పడింది. ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామంలోకి నీళ్లు చేరాయి. ఇళ్లల్లోకి చేరిన నీటితో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు రిజర్వాయర్ వద్ద గేట్లు మూసి నీటిని అదుపు చేశారు. గండి పూడ్చివేత పనులు ప్రారంభించారు.

09:32 - November 2, 2018

విశాఖపట్టణం : వైసీపీ అధ్యక్షుడు జగన్ పై దాడి కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. Image result for Jagan Mohan Reddy Going Vishakaఈ ఘటనతో టీడీపీ - వైసీపీ పార్టీల మధ్య మరింత చిచ్చు రేపింది. ఘటనకు ప్రభుత్వమే బాధ్యత అని, సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఘటన జరిగిన అనంతరం నేరుగా జగన్ హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ కు వచ్చిన ఏపీ పోలీసులకు జగన్ స్టేట్ మెంట్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని..జాతీయ సంస్థలతో విచారణ చేయించాలని జగన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిని కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. 
Image result for Jagan Mohan Reddy Going Vishakaమరోవైపు చికిత్స అనంతరం..విశ్రాంతి తీసుకున్న జగన్ శుక్రవారం విశాఖలో అడుగు పెట్టనున్నారు. పాదయాత్రను తిరిగి ప్రారంభించడానికి ఆయన హైదరాబాద్ నుండి బయలుదేరనున్నారు. దీనితో సిట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ ఎయిర్ పోర్టులో అడుగు పెట్టిన అనంతరం జగన్ స్టేట్ మెంట్ తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ దర్యాఫ్తునకు సహకరించాలని, తమకు స్టేట్ మెంట్ ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. కానీ జగన్ స్టేట్ మెంట్ ఇస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

 

09:57 - October 31, 2018

విశాఖ : వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డిపై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. నిందితుడు శ్రీనివాస్ ఫోన్ నుండి 10 నుంచి 12 సార్లు సైరా బీకి ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ నంబర్ వివరాల ఆధారంగా కనిగిరికి చెందిన సైరా బీతో శ్రీనివాస్ మాట్లాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పిడుగురాళ్లలో ఉంటున్న సైరా బీ సోదరుడు నాగూర్ వలి పేరుతో సిమ్ అడ్రస్ ఉంది. కాల్ లిస్ట్ ఆధారంగా కనిగికి చెందిన మహిళను విచారించేందుకు పిడుగురాళ్లకు అధికారులు రప్పించారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - vishaka