varavara rao

14:36 - September 12, 2018

న్యూఢిల్లీ: వరవరరావు సహా ఇతర నలుగురు మానవ హక్కుల నేతలకు గృహనిర్బంధాన్ని వచ్చే సోమవారం (సెప్టెంబరు 17) వరకు కొనసాగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.  ఐదుగురు మానవ హక్కుల నేతల విడుదల కోసం దాఖలైన పిటీషన్ ను విచారించిన కోర్టు వారి గృహనిర్బంధాన్ని పొడిగించాలని ఆదేశాలు జారీచేసింది.

చరిత్రకారుడు రోమిల థాపర్ హక్కుల నేతలు ఐదుగురిని విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తెలుగ రచయిత వరవరరావు, హక్కుల నేతలు వెర్నాన్, అరుణ్ ఫెర్రీరా, లాయర్ సుధా భరధ్వాజ్, పౌరహక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను మహారాష్ట్ర పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.   

11:33 - December 28, 2017

హైదరాబాద్ : టేకులపల్లి ఎన్‌కౌంటర్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ అని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. చిత్రహింసలు పెట్టి చంపారని.. కనీసం మృతదేహాలను చూడనివ్వలేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీసులను అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులతో 10టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ప్రభుత్వమే న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

21:31 - December 27, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ హైదరాబాద్‌- సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రతిఘటన సభ జరిగింది. వామపక్షపార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. ఎన్‌కౌంటర్లలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఈ సభకు హాజరయ్యారు. తమ వారిని తలచుకుని కన్నీరుమున్నీరయ్యారు.ప్రతిఘటన సభలో పాల్గొన్న టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం.. తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్‌ సర్కార్‌ యధేచ్చగా చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. ఇందుకు సాక్ష్యమే టేకులపల్లి ఎన్‌కౌంటర్‌ అని చెప్పారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎవరినైనా పోలీసులు అరెస్ట్‌ చేసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు, న్యాయమూర్తులకు తెలిసేలా మెసేజ్‌లు పెట్టాలని మాజీ జస్టిస్‌ చంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు.

పోలీసుల అదుపులో ఇంకా ముగ్గురు
టేకులపల్లి ఎన్‌కౌంటర్‌ ప్రభుత్వ హత్యేనని విరసం నేత వరవరరావు ఆరోపించారు. బాధ్యులైన పోలీసులను సస్పెండ్‌ చేసి .. వారిపై హత్యానేరం నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల అదుపులో ఇంకా ముగ్గురు ఉన్నారని.. వారిని వెంటనే కోర్టులో హాజరుపర్చాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామిక గొంతులను నొక్కేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. బూటకపు ఎన్‌కౌంటర్ల మీద జ్యూడీషియరీ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలన్నారు.

హిందూత్వ శక్తులు ఏకంగా రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రచేస్తున్నాయని టీ మాస్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య అన్నారు. ప్రజాస్వామికవాదులంతా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు.

నేరెళ్ల ఘటన జరిగిన ఆరు నెలలు
నేరెళ్ల ఘటన జరిగిన ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నంద్యాల నర్సింహ్మారెడ్డి అన్నారు. ముగ్దూం భవన్‌లో నేరెళ్ల బాధితులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పోలీసులు తమను చావకొట్టినా తమ ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పందింలేదని నేరెళ్ల బాధితుడు బాణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల రక్షణలో నేటికీ ఇసుకమాఫియా ఆగడాలు కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదని, కేసీఆర్‌ సర్కార్‌కు సరైన సమయంలో బుద్దిచెప్తామన్నారు.తెలంగాణలో ప్రజాస్వామిక వాతావారణం కోసం అందరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కళాకారులు పాడిన పాటలు అందరినీ ఆలోచింపజేశాయి.

13:39 - November 8, 2016

విజయవాడ : ఏవోబీ ఎన్‌కౌంటర్‌ తర్వాత రాష్ట్రంలోని ప్రముఖుల భద్రత పెంచినట్టు బీజీపీ సాంబశివరావు చెప్పారు. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ఉండాలని కోరామన్నారు. ఏపీ మవోయిస్టు దళాల్లో గాలికొండ దళ కమిటీ కదలికలను కనిపినట్టు డీజీపీ సాంబశివరావు చెప్పారు. 

12:20 - November 4, 2016

హైదరాబాద్ : ఏవోబీలో కూంబింగ్ నిలిపివేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆర్కే క్షేమంగా ఉన్నాడన్న సమాచారం తమకు ఫోన్ ద్వారా తెలిసిందన్నారు. పోలీసులు ఆరోపిస్తున్నట్లుగా తాము మైండ్ గేమ్ అడట్లేదని చెప్పారు. 40 ఏళ్లుగా పోలీసులే మైండ్ గేమ్ ఆడుతున్నారని పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

07:53 - November 4, 2016

హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే మిస్సింగ్‌పై మిస్టరీ వీడింది. ఆయన క్షేమంగా ఉన్నట్లు విరసనం నేత వరవరరావు ప్రకటించారు. గత నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని వరవరరావు డిమాండ్‌ చేశారు. ఆర్కే క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో దేశ వ్యాప్తంగా మావోయిస్టు సానుభూతిపరులు, ప్రజా సంఘాల నేతలు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. 
ఆర్కే క్షేమం
మావోయిస్టు పార్టీ నేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ క్షేమంగా ఉన్నట్లు విరసం నేత వరవరరావు తెలిపారు. మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు ఫోన్ ద్వారా ఆర్కే క్షేమ సమాచారాన్ని తమకు అందజేసినట్లు వివరించారు. జగబంధు విడుదల చేసిన 14 నిమిషాల ఆడియోలో తాము క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నా... వారిలో ఆర్కే ఉన్నాడా లేదా అన్నదానిపై ఇప్పటివరకూ ఆందోళన నెలకొందన్నారు. జగబంధు తమకు ఫోన్ చేసి ఆర్కే కూడా క్షేమంగా ఉన్నారని తెలిపినట్లు వరవరరావు మీడియాకు వెల్లడించారు.
ఏఓబీలో కూంబింగ్‌ నిలిపివేయాలని డిమాండ్‌
ఏఓబీలో పోలీసు బలగాల గాలింపు వెంటనే నిలిపివేయాలని జగబంధు డిమాండ్‌ చేసినట్లు చెప్పారు. ఈ నెల 5, 6వ తేదీల్లో విశ్వవిద్యాలయాల విద్యార్థులు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాల ప్రతినిధులు ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణ కోసం  మల్కన్ గిరికి రానున్నందున కూంబింగ్‌ను ఉపసంహరించుకోవాలని కోరారన్నారు. పోలీసులు 31 మంది మావోయిస్టులను దారుణంగా హతమార్చారని, అందులో నిరాయుధులైన 9 మంది ఆదివాసీలున్నారని జగబంధు తనకు వివరించినట్లు వరవరరావు తెలిపారు. ఆర్కే ఆచూకీ కోసం తాము హైకోర్టులో వేసిన హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను ఇవాళ ఉపసంహరించుకోనున్నట్లు వరవరరావు చెప్పారు.
ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలి : వరవరరావు 
ఏవోబీ ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రేహౌండ్‌ పోలీసులు సృష్టించిన భయోత్పాతంతో అక్కడి గిరిజనులు విలవిలలాడుతున్నారని వాపోయారు. తొమ్మిది మంది నిరాయుధ ఆదివాసీలను చిత్రహింసలకు గురిచేసి చంపిన వైనంపై న్యాయవిచారణ జరిపించాలని వరవరరావు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఆర్కే పోలీసుల కస్టడీలో లేరని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఘటనా స్థలం ఏపీ పరిధిలో లేదని, ఒరిస్సా రాష్ర్ట పరిధిలో ఉందని తెలిపింది. అక్కడి పోలీసులే కేసు నమోదు చేశారని ఏపీ తరపున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు చెప్పారు. ఆర్కే క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో మావోయిస్టు సానుభూతిపరులు, అభిమానులు, ప్రజా సంఘాల నేతలు ఊపిరి పీల్చుకున్నారు. 

13:22 - October 24, 2016

హైదరాబాద్ : సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లో కొనసాగిన ఎన్ కౌంటర్ లో 23 మంది మావోలు హతమయ్యారు. ఈ ఘటనపై ప్రముఖ విరసం నేత వరవరరావు మాట్లాడుతూ, ఏవోబీలో జరిగింది బూటకపు ఎన్ కౌంటర్ అని ఆరోపించారు. మావోల సమావేశంపై సమాచారం అందుకుని ఎన్ కౌంటర్ జరిపామనే ప్రకటనలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఆరోపించారు. చర్చలకని పిలిచి ఎన్ కౌంటర్ చేశారని వరవరరావు అభిప్రాయపడ్డారు. చర్చలకు వచ్చినటువంటివారిని ఎన్ కౌంటర్ చేయటం దారుణమన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా వున్న సమయంలో కూడా చర్చల నిమిత్తం పిలిచి ఎన్ కౌంటర్ చేశారనీ అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జరిగిందని ఆయన పేర్కొన్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ఎన్ కౌంటర్లో చనిపోయిన వారి మృత దేహాలను భద్రపరచాలని డిమాండ్ చేశారు. వారి బంధువులు వచ్చేంత వరకు పోస్ట్ మార్టం నిర్వహించకూడదని అన్నారు. జాతీయ మానవ హక్కుల సంస్థ నిబంధనల మేరకే పోస్ట్ మార్టం నిర్వహించాలని కోరారు. ఈ ఎన్ కౌంటర్ ను సవాల్ చేస్తూ పౌరహక్కుల నేతలు హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. పిటీషన్ పై హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు దీనిపై విచారణ చేపట్టనుంది.ఈ మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు రానుంది. కాగా ఏవోబీలో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. కొనసాగుతున్నాయి. కాగా ఎన్ కౌంటర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను గుర్తించి వారిని వారి కుటుంబాలకు అప్పగించటానికి సుదీర్ఘ సమయం పడుతున్నట్లుగా సమాచారం. కాగా ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి వాహనాలు వెళ్లే వీలులేనందున చాలా సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
నెత్తురోడిన ఆంధ్రా బోర్డర్
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు కాల్పులతో దద్దరిల్లింది.. పచ్చని అడవిలో నెత్తురుపారింది.. పారిపోయిన మావోయిస్టులకోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.... ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన 23మంది మావోయిస్టుల మృతదేహాలను మల్కన్‌గిరికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు..ఇక చనిపోయిన మావోయిస్టులను గుర్తించేందుకు మాజీ మావోయిస్టుల సహాయం తీసుకుంటున్నారు.. వారిని ఘటనాస్థలంలోకి తీసుకువెళ్లి మృతుల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.. మృతుల్లో మావోయిస్టు కీలకనేతలున్నట్లు తెలుస్తోంది.. విశాఖ ఏరియా కార్యదర్శిగా పనిచేస్తున్న గాజర్ల రవి అలియాస్‌ గణేశ్, చలపతి, దయ, రాజన్న, బెంగాల్‌ సుధీర్, అశోక్‌, మల్లేశ్‌ ఉన్నట్లు తెలుస్తోంది.... ఈ కాల్పుల సమయంలో మరో అగ్రనేత ఆర్కె తప్పించుకున్నట్లు సమాచారం.. కాల్పుల ప్రదేశంనుంచి మూడు ఏకే 47 గన్స్, ఏడు ఎస్ ఎల్ ఆర్ లు, 7 ల్యాండ్‌మైన్లు, 303 రైఫిల్స్, 15 భారీ ఆయుధాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..
ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో మళ్లీ బలంపెంచుకునేందుకు మావోల యత్నం
కొన్ని నెలలుగా సైలంట్‌గాఉన్న మావోయిస్టులు ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో మళ్లీ బలంపెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఇందులోభాగంగా చిత్రకొండ పనసపుట్టు దగ్గర సమావేశమయ్యారు.. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మెరుపుదాడిచేశారు.. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను ఒడిశాకు తరలిస్తామని SP తెలిపారు.. ఎన్‌కౌంటర్‌ ఒడిశాలో జరిగిందని... అందుకే మృతదేహాలను అక్కడికే పంపుతామని చెప్పారు.. గాయపడ్డ జవాన్లకుకూడా మల్కన్‌గిరిలోనే చికిత్స అందిస్తున్నారు.. 

16:49 - May 17, 2016

వరంగల్ : ఆదివాసీలను మట్టుబెట్టెందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన గ్రీన్ హంట్ మారణకాండను వెంటనే నిలిపివేయాలని విరసం నేత వరవరరావు అన్నారు. గోదావరి, ప్రాణాహిత నదుల పరివాహక ప్రాంతాల్లో మోహరించిన పారామిలటరీ బలగాలను వెనకకు రప్పించాలని పేర్కొన్నారు. ఆదివాసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించి దోషులను శిక్షించాలని చెప్పారు. ప్రజాస్వామిక హక్కుల రక్షణకై ఈ నెల 24న వరంగల్ పోచమ్మమైదానంలో బహిరంగసభను నిర్వహించనున్నట్లు తెలిపారు.

15:35 - January 25, 2016

హైదరాబాద్ : బడుగు బలహీన వర్గాల విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాలకు అరికట్టేందుకు రోహిత్‌ యాక్ట్‌ పేరిట సరికొత్త చట్టాన్ని రూపొందించాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు డిమాండ్‌ చేశారు. హెచ్‌సీయూలో జరిగిన ఘటనలపై వర్సిటీ వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

12:47 - September 25, 2015

హైదరాబాద్ : ఎన్‌కౌంటర్ లేని తెలంగాణ కోసం ఈ నెల 30న చలో అసెంబ్లీకి తెలంగాణ ప్రజాస్వామిక వేదిక పిలుపునిచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే అని విరసం, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. మావోయిస్టులు శృతి, విద్యాసాగర్‌ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. శృతి, విద్యాసాగర్‌ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని విరసం నేత వరవరరావు డిమాండ్‌ చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - varavara rao