tremors

11:13 - September 12, 2018

గౌహటి: అస్సాంలోని కొక్రాఝర్ ప్రాంతంలో ఈ ఉదయం భారీగా భూమి కంపించింది. దీని ప్రభావం రెక్టార్ స్కేల్ పై 5.5 గా నమోదయ్యింది. భూకంప ప్రభావం బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోను కనిపించింది. అయితే భూకంపం సృష్టించిన నష్టంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు పేర్కొన్నారు.

09:51 - June 15, 2016

నెల్లూరు : ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భూమి కంపించింది. పలు గ్రామాల్లో కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు గ్రామాల్లో నాలుగు సెకన్లపాటు భూమి కంపించింది. ప్రకాశం జిల్లా పామూరు మండలంలో మోపాడు, కొండారెడ్డిపల్లి, ఇనిమెర్ల, బలిజపాలెం, వర్గంపల్లి, నర్రమారెళ్ల, పీఎస్‌ పురంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్ల నుంచి జనం భయంతో పరుగులు తీశారు. ఈ ప్రాంతాల్లో భూమి కంపించండం 24 గంటల్లో ఇది మూడో సారి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వరుసుగా సంభవిస్తున్న భూ ప్రకంపనలతో ప్రజలు భయంగుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. 

  

 

12:32 - June 4, 2016

నెల్లూరు : జిల్లాలో మళ్లీ  భూప్రకంపనలు ప్రజలను వణికించాయి.  వింజమూరు మండలం చాకలికొండ, జనార్థనపురం, దుత్తలూరు మండలం నందిపాడు, బండికిందపల్లి గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది...దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసి బయటకు వచ్చారు. ఈ సంవత్సరం దాదాపు 25 సార్లు భూమి కంపించింది...ఈ ఏడాది రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 1.8 నుంచి 3.4 లోపు నమోదయ్యింది. 

 

21:32 - April 10, 2016

పాకిస్థాన్ : ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, పాకిస్తాన్‌ సరిహద్దులో భూకంపం జనాల్ని బెంబేలెత్తించింది. ఈ ప్రభావంతో ఉత్తర భారత దేశంలో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించింది. భూకంపం ధాటికి జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లా, హంద్వారాలో ఇళ్లు కూలిపోయాయి. కుప్వారాలో ప్రార్థనామందిరం ధ్వంసమైంది.. భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. పాకిస్థాన్‌లో భూప్రకంపనలతో ఇల్లు కూలి ఇద్దరు మృతి చెందగా పది మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుశ్‌ పర్వత శ్రేణులు, పెషావర్‌కు 248 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు.

ఉత్తర భారతంపై ప్రభావం..
ఈ భూకంపం ఉత్తర భారత దేశంపై ప్రభావం చూపింది. కాశ్మీర్‌, పంజాబ్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లో దాదాపు 50 సెకండ్లపాటు భూమి కంపించింది. భూప్రకంపనలు గమనించిన ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఢిల్లీలో ముందు జాగ్రత్త చర్యగా మెట్రో సర్వీసులను ఆపేశారు. అయితే ఆస్తినష్టం కానీ ప్రాణనష్టం కానీ లేదని అధికారులు తెలిపారు. కాశ్మీర్ లో భూమి ఎక్కువగా కంపించింది. 

16:25 - April 10, 2016

పాకిస్థాన్ : పాక్ వణికిపోయింది. ఈసారి ఉగ్రదాడితో కాదు. భూ ప్రకంపనాలతో దేశం వణికిపోయింది. ఆదివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.8 గా నమోదైంది. హిందూకుష్ పర్వత శ్రేణి ప్రాంతంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. అప్ఘనిస్తాన్ లో కూడా ఈ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చునని తెలుస్తోంది.
ఈ ప్రభావం ఉత్తర భారతంపై కూడా పడింది. కాశ్మీర్, న్యూఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. భూ ప్రకంపనాలకు ఢిల్లీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనాల ధాటికి ఎవరైనా మృతి చెందారా ? ఆస్థి నష్టం జరిగిందా ? అనేది తెలియరావడం లేదు. 

08:25 - April 7, 2016

నెల్లూరు : జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలం బత్తినవారిపల్లి, ఊట్కూరు, వరికుంటపాడులో తెల్లవారుజామున 5 గంగటల ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. రెండు సెకన్లపాటు భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 1.8 నుంచి 2.5 శాతం లోపు భూకంప తీవ్రత నమోదు అయింది. అయితే జిల్లాలో ఐదు నెలల నుంచి భూమి కంపించడం ఇది 12వ సారి. జిల్లాలో కొండ ప్రాంతాలు, మెట్ట ప్రాంతం ఉంది కనుక వాటి మధ్య సర్దుబాటు జరగడంతో భూప్రకంపనలు సంభవిస్తున్నట్లు భావిస్తున్నారు. 

 

09:03 - August 26, 2015

హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల బుధవారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి.. రెండు సెకన్ల నుంచి 10 సెంకన్ల పాటు భూమి కంపించింది. సోంపేట మండలంలోని బారువా, మిమిడిపల్లి, ఎర్రముక్కాం, ఉప్పాల, తాళ్లభద్ర, కంచి తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలువ చ్చినట్లుఉ స్థానికులు తెలిపారు. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. శ్రీకాకుళం జిల్లాలో గతంలో కూడా భూప్రకంపనలు కలకలం సృష్టించాయి.

Don't Miss

Subscribe to RSS - tremors