tour

11:35 - November 17, 2018

హైదరాబాద్ : టీమిండియా టీం కొద్ది రోజుల్లో ఆసీస్ లో పర్యటించనుంది. ఇందుకోసం కోహ్లీ సేన నేతృత్వంలో భారత్ టీం బయలుదేరింది. ఈ సందర్భంగా బీసీసీఐ శుభాకాంక్షలు తెలియచేసింది. ఈనెల 21వ తేదీ నుండి మూడు టీ 20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు జరుగనున్నాయి. 
ముంబై విమానాశ్రయానికి చేరుకున్న టీమిండియా టీం కాసేపు అక్కడున్న ఓ గేమ్ ను సరదా ఆడారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. 
భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్
భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్. 

11:30 - November 5, 2018

తూర్పుగోదావరి : పవన్ రాకను అడ్డుకునేందుకు కొందరు వ్యక్తులు రోడ్డుపై భారీగా మట్టిని పోసి మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై జనసేన అధినేత పవన్ వాహనం దిగి మట్టిని దాటుకుని  కాలినడకన వెళ్లి గిరిజనులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఈ సందర్బంగా మాట్లాడిన పవన్ మాఫియా దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే తన పర్యటనను అడ్డుకునేందుకు రోడ్డును బ్లాక్ చేశారని మండిపడ్డారు. మాఫియా అడ్డుకున్నా తన పర్యటన ఆగదని పవన్ స్పష్టం చేశారు. జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. స్థానిక గిరిజనులకు మంచినీటి సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మైనింగ్ మాఫియా గిరిజనుల భూములను భయపెట్టి లాక్కుందని ఆరోపించారు. ఇప్పటికీ అసలు భూముల పట్టా గిరిజనుల పేరు మీదే ఉందని వెల్లడించారు. జిల్లాలోని ప్రత్తిపాడు మండలం వంతాడ గ్రామంలో పవన్ నిన్న రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డుపై భారీగా మట్టివేయటంతో వాహనం వెళ్లటానికి వీలు లేకపోవటం వాహనం దిగి పనవ్ కళ్యాణ్ నడుచుకుంటు గిరిజనుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

08:44 - November 1, 2018

హైదరాబాద్ : కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంతోపాటు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు వెళ్లనున్నారు. బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవడం లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగనుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, శరద్‌పవార్, ఫరూక్‌అబ్దుల్లా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తేజస్వియాదవ్‌లతో ఆయన భేటీ కనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు శరద్‌పవార్‌ను కలవనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. రాబోయే ఎన్నికలు, దేశ రాజకీయాలపై సీఎం చర్చించనున్నారు. ములాయంసింగ్‌ యాదవ్‌ను కూడా కలవనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీని ఓడించాలని చంద్రబాబు కసర్తత్తు చేస్తున్నారు.

 

12:41 - October 27, 2018

కర్ణాటక : పలు కీలక పరిణామాల మధ్య పోరాటం చేసి సీఎంగా అధికారాన్ని చేపట్టిన కన్నడ కుమారస్వామి మరోసారి కంటతడి పెట్టారు. భావోద్వేగానికిలోనై కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీసి, తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. సంకీర్ణప్రభుత్వం అంటేనే ముళ్లకుంపటి. అటువంటిది కుమారస్వామి సంకీర్ణప్రభుత్వం ద్వారా  సీఎంగా ప్రమాణస్వీకారం అనంతరం పలుమార్లు కంటతడి పెట్టిన ఆయన, తాజాగా మళపళ్లిలో జరిగిన బహిరంగ సభలోనూ మరోసారి కంటతడి పెట్టారు. ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లినప్పుడే తాను చనిపోయివుండాల్సిందని, కానీ దేవుడి దయతోనే బతికానని చెప్పిన కుమారస్వామి, ఇంకా ఎంతకాలం ప్రాణాలతో ఉంటానో చెప్పలేనని ఉద్వేగభరితంగా అన్నారు. ఊపిరి ఉన్నంతకాలం ప్రజాసేవ చేస్తానని, జీవితాంతం పేదలకు అండగా ఉంటానని చెప్పారు. తన హృదయంలో ఎంతో భాధ ఉందని, దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. జిల్లా ప్రజలను తాను ఎన్నటికీ మరువబోనని కుమారస్వామి తెలిపారు. 

 

10:46 - October 24, 2018

విశాఖపట్నం : బుధవారం భారత్-వెస్టిండీస్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డే భారీ స్కోరును చేజ్ చేసిన టీమిండియా....రెండో వన్డేలోనూ విజయం సాధించాలని తహతహలాడుతోంది. మరోవైపు విశాఖలో ఇప్పటి వరకు 8 వన్డే మ్యాచ్‌లు జరిగితే...ఇందులో ఒకే ఒక్క దాంట్లో మాత్రమే ఓడిపోయింది. టీమిండియాకు లక్కీ గ్రౌండ్‌గా పేరున్న విశాఖలో మ్యాచ్ జరగనుండటంతో....అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా భారత్ జట్టు అత్యధిక వన్డేలు ఆడిన జట్టుగా రికార్డు సృష్టించనుంది.
ఇండోర్‌లో జరగాల్సిన భారత్‌-వెస్టిండీస్‌ మధ్య రెండో వన్డే... ఊహించని విధంగా విశాఖపట్నానికి తరలి వచ్చింది. దీంతో విశాఖ సాగర తీరంలో క్రికెట్ సందడి మొదలైంది. బుధవారం మధ్యాహ్నం భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. భారత క్రికెట్‌ జట్టుకు బాగా కలిసొచ్చిన విశాఖ మైదానంలోనూ విజయం సాధించి...సిరీస్‌లో ముందంజ వేయాలని భావిస్తోంది. తొలి వన్డేలో విండీస్ జట్టు 322 పరుగులు చేసినప్పటికీ...టీమిండియా బ్యాట్స్‌మెన్లు సునాయాసంగా టార్గెట్‌ను చేజ్ చేశారు. తొలి వన్డేలో సెంచరీలతో అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు...ఈ మ్యాచ్‌లోనూ విజృంభించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ఇప్పటి వరకు టీమిండియా 8 వన్డేలాడితే...ఇందులో ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమి పాలయింది. అదే విధంగా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ లాంటి స్టార్‌ ఆటగాళ్లకు ఈ మైదానంలో మంచి రికార్డులున్నాయి. 2005లో ఇక్కడే పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోని.. 148 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో తన పేరు మారుమ్రోగేలా చేశాడు. ఇప్పుడు ఇక్కడే వన్డే జరగనుండటంతో అందరి కళ్లు ధోనిపైనే ఉన్నాయి.
ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా మరో రికార్డును సృష్టించనుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియాకిది 950వ వన్డే మ్యాచ్‌. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లాడిన జట్టుగా భారత్‌ అరుదైన రికార్డును తన పేరుతో లిఖించుకోనుంది. ఇప్పటివరకూ వన్డే ఫార్మాట్‌లో 949మ్యాచ్‌లాడిన భారత్‌.. 490మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే...మరో 411మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది. విశాఖ పిచ్‌ ఎప్పట్లాగే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండొచ్చని. నగరంలో నిన్నటి నుంచి మంచు పడటంతో టాస్‌ కూడా కీలకం కానుంది. వర్షం కురిసినా మ్యాచ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా రెండు సూపర్‌ సాఫర్‌ యంత్రాలను మైదాన సిబ్బంది సిద్ధం చేశారు.
వన్డే మ్యాచ్‌కు 2వేల మంది పోలీసులతో అధికారులు  పటిష్ట భద్రత ఎర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మ్యాచ్ ముగింపు వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అభిమానులు తాకిడి ఎక్కువగా ఉండటంతో... స్టేడియం చుట్టు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. టిక్కెట్ పాస్‌పై ఉన్న గేట్లలో మాత్రమే అభిమానులు వెళ్లాలని పోలీసులు సూచించారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా మూడు ప్లేసుల్లో పార్కింగ్ ఎర్పాటు చేశారు.

12:42 - October 17, 2018

శ్రీకాకుళం : జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. తిత్లీ తుపాను బాధితులను పవన్ పరామర్శించనున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి, సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ హత్యలపై పవన్ చేసిన వ్యాఖ్యాలు వివాదాస్పదంగా మారాయి. పవన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే పవన్ ఉత్తరాంధ్ర పర్యటనకు ముందే ప్రకంపనలు రేగాయి. 

 

09:59 - October 15, 2018

గుంటూరు : ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటన రద్దు అయ్యింది. ఈనెల 17, 18, 19 తేదీల్లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ కార్యక్రమంలో లోకేశ్‌ పాల్గొనాల్సి ఉంది. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం 'వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌' కార్యక్రమంలో 'భారతదేశ వ్యవసాయ రంగం-టెక్నాలజీ అనుసంధానంతో దేశ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై' కీనోట్‌ ప్రసంగం ఇవ్వాలని లోకేశ్‌కు ఆహ్వానం అందింది. అయితే.. తిత్లీ తుపాన్‌ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్‌ పర్యటిస్తుండడంతో అమెరికా పర్యటన వాయిదా వేసుకున్నారు. శ్రీకాకుళంలో పరిస్థితులు మెరుగుపడే వరకు లోకేశ్‌ అక్కడే ఉండి పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. 

 

18:31 - October 14, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు రాహుల్‌గాంధీ పర్యటన ఖరారు అయింది. ఈనెల 20న రాష్ట్రంలో రాహుల్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. హైదరాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నిర్వహించనున్న కాంగ్రెస్ బహిరంగ సభలలో రాహుల్‌గాంధీ పాల్గొనన్నారు.

ఈనెల 20న ఉయదం 11 గంటలకు చార్మినార్‌లో, మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఆదిలాబాద్ జిల్లా బైంసాలో, సాయంత్రం 4.45 గంటలకు కామారెడ్డిలలో నిర్వహించే బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొని, ప్రసంగించనున్నారు. రేపు సభా ఏర్పాట్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా పరిశీలించనున్నారు. 

 

21:27 - October 12, 2018

శ్రీకాకుళం : తిత్లీ తుపాన్ ప్రబావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరు పరిసర ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. తుపానుతో నష్టపోయిన రైతులందర్నీ ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంత వాసులకు 50 కిలోల బియ్యాన్ని అందజేస్తామన్నారు. విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. 194 గ్రామాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశామని.. పలాసలోనే ఉండి యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా చూస్తానని పేర్కొన్నారు. 

పలాసను మంచి టౌన్‌గా డెవలప్‌మెంట్ చేస్తామని చెప్పారు. పలాసను టౌన్‌గా మాడలైజ్ చేస్తామని, అధునికమైన టౌన్‌గా తయారు చేస్తామన్నారు. మంచిగా పని చేసిన వారికి అవార్డులు ఇస్తామని పేర్కొన్నారు. 

08:42 - October 10, 2018
హైదరాబాద్ : తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపి పావులు కదుపుతోంది. ఎన్నికల ప్రచార బరిలోకి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిగారు. నేడు కరీంనగర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్న ఆయన.. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ తీరును ఎండగట్టనున్నారు. మరోవైపు అమిత్ షా పర్యటన తరువాత అభ్యర్ధుల జాబితా విడుదల చేసేందుకు బీజేపి కసరత్తు ముమ్మరం చేసింది. 
భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న షా.. ముందుగా బంజారాహిల్స్ లోని అగ్రశ్రేన్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత కాచీగూడలోని శ్యాంబాబా మందిర్ లో సాధువులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకు ఎగ్బిబిషన్ గ్రౌండ్ లో సికింద్రాబాద్, హైదరాబాద్, చేవేళ్ల, మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ కేంద్ర స్థాయి నాయకులను కలుస్తారు. మధ్యాహ్నం భోజన విరామం తరువాత ప్రత్యేక హెలీకాఫ్టర్లో కరీంనగర్ బయల్దేరతారు. బీజేపి తలపెట్టిన సమరభేరీ సభలో పాల్గొంటారు. 
 
అమిత్ షా పర్యటన తరువాత తమ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వెల్లడించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆరే కారణమని విమర్శించారు. ప్రజల తీర్పును వృథా చేయడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్లేనన్నారు.
 
అమిత్‌షా పర్యటనతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు దడపుడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, మోడీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. ముందుస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తామన్న లక్ష్మణ్.. కాంగ్రెస్ నేతలు.. తెలంగాణ ద్రోహులతో జత కట్టి మహాకూటమిగా ఏర్పడ్డారని మండిపడ్డారు.

Pages

Don't Miss

Subscribe to RSS - tour