tollywood

12:36 - September 11, 2018

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్...మాట మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న అరవింద సేమత సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాలో ఎన్టీఆర్ ఆరు పలకలతో కనిపించడం అభిమానులను అలరిస్తోంది. ఎన్టీఆర్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. అక్టోబర్ మాసంలో చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 
తాజాగా చిత్ర యూనిట్ ఆడియో వేడుకపై దృష్టి పెట్టింది. వేడుకకు ముఖ్యఅతిథులు వారేనంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు రానున్నారని ప్రచారం జరిగింది. గతంలో మహేష్ సినిమాకు ఎన్టీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ కూడా హాజరయ్యే అవకాశం ఉందని టాక్. కానీ తాజాగా మరో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి. అరవింద సమేతలో బిగ్ బి కీలక పాత్ర పోషించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

14:46 - March 27, 2018

సినిమా అంటే చాలా మందికి వినోదం. అది చాలా మందికి ఉపాధి కూడా. అవకాశాల కోసం ఇండస్ట్రీకి చాలా మంది వస్తుంటారు. స్టూడియోల దగ్గర పడిగాపులు కాస్తారు. ఇలా ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. అవకాశం వచ్చే వరకు వారి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఇలా అవకాశాల కోసం వచ్చిన మహిళలను కొంతమంది తమ అవసరాల కోసం వేధిస్తున్నారా? ఇప్పుడు ఇవే ఆరోపణలు టాలీవుడ్‌లోని కొంతమంది నటీమణులు వినిపిస్తున్నారు. ఒక్క టాలీవుడే కాదు... మన పక్కనే ఉన్న కోలీవుడ్‌, బాలీవుడ్‌లో కూడా ఇలాంటి ఆరోపణలే చాలా మంది చేశారు. అవకాశాలు చూపిస్తామని మహిళలపై లైంగిక దాడి చేస్తున్నారని వీరు చేస్తున్న కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి. దీనికి పరిష్కారం ఏంటి. పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలేంటి. ఈ అంశాలపై సామాజిక కార్యకర్త దేవి ఎటువంటి విషయాలను వెల్లడించారో చూద్దాం..

11:48 - December 28, 2017

హైదరాబాద్ : షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి-నటి హారిక కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. తప్పు నువ్వు చేశావంటే..నువ్వు చేశావని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. హారిక చేసిన వాట్సాప్ మెసేజ్‌లను డైరెక్టర్‌ యోగి లీక్ చేశాడు. తనపై యోగి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియోతో హారిక కౌంటర్‌ ఇచ్చింది. 
యోగి, నటి హారిక మధ్య ముదురుతోన్న వివాదం  
షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి, నటి హారిక మధ్య వివాదం ముదురుతోంది. పరస్పరం ఆరోపణలు, విమర్శలతో చినికి చినికి గాలివానలా మారుతోంది. ఏ తప్పు చేయలేదంటూ ఇద్దరు ఇస్తున్న లీకులు షార్ట్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.  
హారిక ఆరోపణలపై యోగి ఎదురుదాడి 
తనను లైంగిక వేధింపులకు గురిచేశారన్న హారిక ఆరోపణలపై షార్ట్‌ఫిల్మ్‌డైరెక్టర్‌ ఎదురుదాడికి దిగాడు. గతంలో హారిక తనకు పెట్టిన వాట్సాప్‌ మెసేజ్‌లు బయటపెట్టి ఆమె అమాయకురాలేం కాదని ఆరోపిస్తున్నాడు. అవకాశాల కోసం కాంప్రమైజ్ అవుతానని హారిక తనతో చెప్పిందన్నాడు. తన వ్యక్తిగత జీవితం ఆనందంగా లేదని, ఎవరితోనైనా డేటింగ్‌ చేయాలని, విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలని ఉందని చాట్‌ చేసినట్లు వెల్లడించాడు. సంతోషంగా లేనప్పుడు విలువలు ఎందుకు పాటించాలని ప్రశ్నించిందని, అయితే, అలా ఎందుకు ఆలోచిస్తున్నావని తాను హారికను హెచ్చరించినట్లు యోగి తెలిపాడు. ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ మెసేజ్‌ల మొబైల్ స్క్రీన్ షాట్లను పోలీసులకు అప్పగించాడు యోగి. 
యోగి ఆరోపణలపై హారిక కౌంటర్‌ అటాక్‌ 
మరోవైపు యోగి ఆరోపణలపై నటి హారిక కౌంటర్‌ అటాక్‌ ఇచ్చింది. సెల్ఫ్‌ వాట్సాప్‌ మెసేజ్‌లతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. క్రిమినల్‌ బ్రెయిన్‌తో తప్పుడు స్టోరీలు క్రియేట్‌ చేస్తున్నాడని ఆరోపించింది. తాను తప్పు చేస్తే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తానంది. యోగి తరహా వ్యక్తులు ఏరంగంలో ఉన్నా.. మహిళలు వారి  వేధింపులు భరించాల్సిన అవసరం లేదని చెప్పింది. తనను బూతులు తిట్టడం వల్లే అడిషనల్‌ డీసీపీ గంగారెడ్డి యోగిని తన్నినట్లు తెలిపింది. పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన దృశ్యాలు తాను వీడియో తీయలేదని చెప్పింది. 
హరిక ఫిర్యాదుపై యోగి అరెస్ట్ 
యోగి తనను వేధింపులకు గురిచేస్తున్నారని హారిక చేసిన ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఎవరి ఆరోపణల్లో నిజమెంత అనే విషయాలపై నిగ్గు తేల్చేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

17:59 - December 27, 2017

హైదరాబాద్ : షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగి, మోడల్‌ హారిక పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. యోగి తనను వేధించారని హారిక ఆరోపిస్తోంది. తాను ఎవరినీ వేధించలేదని... తనపై హారిక అసత్య ఆరోపణలు చేస్తోందని... పోలీసులతో తనను కొట్టించిందని యోగి చెప్తున్నారు. ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్‌ సంభాషణను యోగి పోలీసులకు ఇచ్చారు. అయితే యోగి చూపిన ఆధారాలు కేవలం క్రియేషనేనని.. అవి వాస్తవం కాదని హారిక చెబుతోంది. 

17:22 - December 27, 2017

హైదరాబాద్ : కాసేపట్లో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని రిమాండ్ కు తరలించారు. వేధింపులకు గురిచేసినట్టు హారిక అనే వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యోగిని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:01 - December 27, 2017
15:20 - December 27, 2017

హైదరాబాద్ : షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి ఆరోపణలపై హారిక స్పందించింది. ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేసింది.సెల్ఫ్ వాట్సాప్ మెసేజ్ లతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, క్రిమినల్ బ్రెయిన్ తో స్టోరీలు క్రియోట్ చేస్తున్నారని, నేను తప్పు చేస్తే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హారిక అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:04 - December 27, 2017

హైదరాబాద్ : షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌ యోగి, నటి హారిక వివాదంలో మరో ట్విస్ట్‌ వెలుగుచూసింది. గచ్చిబౌలి పోలిస్‌స్టేషన్‌లో షార్ట్‌ ఫిలిమ్‌ డైరెక్టర్‌ యోగిపై అభియోగాలు మోపి కేసు పెట్టిన హారిక డబుల్‌ గేం ఆడినట్లు యోగి చెబుతున్నారు. 'తాను వ్యక్తిగతంగా ఆనందంగా లేనంటూ యోగికి హారిక వాట్సప్‌ మెసేజ్‌ చేసింది. సంతోషంగా లేనప్పుడు విలువలతో ఎందుకు ఉండాలంటూ హారిక చేసిన వాట్సప్‌ మెసేజ్‌లను యోగి మీడియాకు సమర్పించారు. అడిషనల్‌ డీసీపీ గంగిరెడ్డిపై వేటు పడటానికి కారణమైన వీడియో తీసింది హారికయే అని యోగి తెలిపారు. రొటీన్‌ లైఫ్‌ విసుగొస్తుంది, ఎవ్వరితోనైనా విదేశాలకు వెళ్లి ఎంజాయ్‌ చేయాలనిపిస్తుందని నాకు మెసేజ్‌ చేసిందని యోగి అన్నారు. తమ మధ్య వాట్సాప్‌ చాటింగ్‌ వివరాలు యోగి మీడియాకు వెల్లడించారు. పోలీసు స్టేషన్‌ దృశ్యాలను రికార్డ్‌ చేసింది హారికేనని యోగి అన్నారు. పోలీస్‌ స్టేషన్‌ దృశ్యాలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిందీ హారికేనని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

21:45 - December 11, 2017

హైదరాబాద్ : మానసిక వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటే ఎన్ని సమస్యలనైనా తట్టుకోవచ్చు. అయిన వారు దూరమైతే ఆ బాధను వర్ణించలేం. ఒంటరైపోయామన్న ఆలోచన ఏమైనా చేయడానికి పురిగొల్పుతుంది. అతి ఆత్మహత్యైనా కావొచ్చు.. మరేదైనా కావొచ్చు. ఇప్పుడు కమెడియన్‌ విజయ్‌సాయి విషయంలోనూ అదే జరిగింది. తాను ఎదుర్కొన్న వేధింపులు, మానసిక సంఘర్షణ అతడిని కుంగదీశాయి. ఆత్మహత్యకు పురిగొల్పాయి. దీంతో యూసుఫ్‌గూడలోని తన ప్లాట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆర్థిక ఇబ్బందులతో
విజయ్‌ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని అంతా భావించారు. అయితే అతడు చనిపోవడానికి కారణం అదికాదని తెలిసింది. సూసైడ్‌కు ముందు అతడు తీసుకున్న సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య కొత్తమలుపు తిరిగింది. తన ఆత్మహత్యకు తన భార్య వనిత, వరలక్ష్మీ, విన్నీ బృందంతోపాటు పారిశ్రామికవేత్త శశిధర్‌, న్యాయవాది శ్రీనివాస్‌ కారణమని ఆ వీడియోలో ఆరోపించాడు. శశిధర్‌ ప్రోద్బలంతోనే వనిత తనను వేధిస్తున్నట్టు తెలిపాడు. తన భార్య చివరికి తన కూతురిని కూడా చూడనివ్వడం లేదన్నాడు. తన కారు, సామాన్లు తీసుకెళ్లడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టు తెలిపాడు. లాయర్‌ శ్రీనివాస్‌ తనను మూడు కోట్లు డిమాండ్‌ చేసినట్టు వీడియోలో వివరించాడు. విజయ్‌ మృతదేహాన్ని మార్చురీలో చూసి అతడి భార్య వనిత బోరున విలపించారు. విజయ్‌ చావుకు తాను ఏమాత్రం కారణం కాదని తెలిపారు. విజయ్‌కు మరో అమ్మాయితో సంబంధం ఉందని.. ఆ విషయాన్ని తాను కళ్లారా చూశానన్నారు. అప్పటి నుంచే తమ మధ్య గొడవలు మొదలయ్యాయని... రెండేళ్ల నుంచే తాము విడివిడిగా ఉంటున్నామన్నారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించానని.. కేసు కోర్టులో నడుస్తోందన్నారు. మూడు కోట్లు డిమాండ్‌ చేశామన్న ఆరోపణలో వాస్తవం లేదన్న ఆమె.. శశిధర్‌ ఎవరో తనకు తెలియదన్నారు.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడడంతోనే విజయ్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. సూసైడ్‌ వీడియోలో ఆత్మహత్యకు కారణాలు చెప్పాడని... అందులో అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.మరోవైపు విజయ్‌ మృతికి మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నేతలు నివాళులు అర్పించారు. నటుడు శివాజీరాజా, సురేష్‌... విజయ్‌ మృతిపై విచారం వ్యక్తం చేశారు. విజయ్‌ ఆత్మహత్య బాధాకరమని శివాజీరాజా అన్నారు. నటులకు ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని.. ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు.విజయ్‌ హాస్యనటుడిగా ఎన్నో సినిమాల్లో అలరించారు. టాలీవుడ్‌లో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడిప్పుడే సినీ ఫీల్డ్‌లో ఎదుగుతున్న విజయ్‌ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. కుటుంబ సభ్యులతోపాటు సినీరంగంలో విజయ్‌ ఆత్మహత్య విషాదాన్ని నింపింది.

17:59 - December 11, 2017

హైదరాబాద్ : కమెడియన్ సాయి విజయ్ ఆత్మహత్యలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. విజయ్ సెల్ఫీ వీడియోలో తన చావుకు కారణాలను వివరించింది. భార్య వనితతోపాటు మరో ఇద్దరు వ్యక్తుల వేధింపుల వల్లే తను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపాడు. విజయ్ భార్య వనిత వ్యాపారవేత్త శశిధర్ తో సన్నిహితంగా ఉంటోందని విజయ్ తన సెల్ఫీ వీడియో తెలిపారు.అక్రమసంబంధాల గురించి అత్తమామలకు చెప్పిన పట్టించుకోలేదని, కనీసం తన కూతురిని కూడా తన భార్య చూడనివ్వలేదని ఆయన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - tollywood