Thammineni veerabhadram

10:32 - August 1, 2018

హైదరాబాద్ : మేకలమండిని ప్రైవేటు పరం చేయవద్దని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదిర్శ, బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పాతబస్తీలోని మేకలమండిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ...ప్రస్తుతం టీఆర్ఎస్, గతంలో కాంగ్రెస్ అన్నం పెట్టేవి కావని..పెద్ద పెద్ద వారికి ప్లేట్లు వేసేవన్నారు. పేద వారి..అట్టడుగు కులాల గవర్నమెంట్ రావాలంటే

బీఎల్ఎఫ్ కు ఓటేయాలన్నారు. మాయమాటలు చెప్పేందుకు మళ్లీ వస్తారని, కబేలాలో ఉన్న వృత్తిదారులు, కార్మికులు చైతనవంతం కావాలని పిలుపునిచ్చారు.వీరు చేస్తున్న న్యాయ పోరాటానికి సీపీఎం, సీఐటీయూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. 

మేకలమండిని ప్రైవేటు పరం చేయవద్దని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదిర్శ, బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పాతబస్తీలోని మేకలమండిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ...ప్రస్తుతం టీఆర్ఎస్, గతంలో కాంగ్రెస్ అన్నం పెట్టేవి కావని..పెద్ద పెద్ద వారికి ప్లేట్లు వేసేవన్నారు. పేద వారి..అట్టడుగు కులాల గవర్నమెంట్ రావాలంటే

బీఎల్ఎఫ్ కు ఓటేయాలన్నారు. మాయమాటలు చెప్పేందుకు మళ్లీ వస్తారని, కబేలాలో ఉన్న వృత్తిదారులు..కార్మికులు చైతనవంతం కావాలని పిలుపునిచ్చారు.వీరు చేస్తున్న న్యాయ పోరాటానికి సీపీఎం, సీఐటీయూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. 

17:55 - June 28, 2018

నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం ఫాసిస్టు చర్యలకు పాల్పడుతోందని బీఎల్ఎఫ్ నేతలు విమర్శలు గుప్పించారు. కలెక్టరేట్ల ముట్టడిని ప్రభుత్వం అడ్డుకున్నందుకు...నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జూలకంటిని గృహ నిర్భందం..కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు అనుమతినివ్వకపోవడంపై నిరసిస్తూ జూలకంటి చేపట్టిన నిరహారదీక్షను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. అనంతరం మిర్యాలగూడలో బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్శంగా తమ్మినేని వీరభద్రంతో టెన్ టివి మాట్లాడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం అమలు కావడం లేదని..కేసీఆర్ లో భయం ఉందని..అందుకే నిర్భందం..పోలీసు రాజ్యం నడిపిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేస్తామని కేవలం బీఎల్ఎఫ్ మాత్రమే ప్రకటించిందన్నారు. అధికారపక్షం..ప్రతిపక్ష కాంగ్రెస్..ఏవీ మాట్లాడడం లేదన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:46 - June 18, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న లైంగికదాడులను అరికట్టాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టి భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ... దేశంలోనే నేరాలలో రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. అసభ్య, అశ్లీల సినిమాలు, వెబ్‌సైట్లు, ప్రసార మాద్యమాలలో మహిళలను కించపరిచే విధంగా చూపడం వల్లే వేధింపులు పెరుగుతున్నాయని అన్నారు. వాటి నివారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని దోషులను శిక్షించాలని సీపీఎం ప్రభుత్వాన్ని కోరింది. 

13:28 - June 10, 2018

విశాఖపట్టణం : బహుజనుల ఐక్యతతోనే.. బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు.. తెలంగాణ రాష్ర్ట బహుజన ఫ్రంట్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో రెండో రోజు జరిగిన దళిత ఆధివాసీ సమత జాతరలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఒకే కులంలోని తెగల మధ్య గొడవల వల్ల నష్టం జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తమ్మినేని వీరభద్రం. అన్ని తెగల వారు అన్నదమ్ముల్లాగా ఒకరి ఆకాంక్షలు, అవసరాలను మరొకరు గుర్తిస్తేనే గౌరవప్రదంగా ఉంటుందన్నారు తమ్మినేని వీరభద్రం.

12:30 - June 10, 2018

 

విశాఖపట్టణం : జస్టిస్ అనే పదం అంబేద్కర్ వాడారని, ఇందుకు మూడు న్యాయాలు కావాలని చెప్పారని బిఎల్ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆదివాసీ బహుజనుల ఐక్యత, భిన్న ధృక్పథాలపై సమావేశం జరిగింది. సఫాయి కర్మచారి ఆందోళన జాతీయ కన్వీనర్ బెజవాడ విల్సన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న తమ్మినేని మాట్లాడుతూ...రిజర్వేషన్లు కొన్ని హక్కులకు మాత్రమే పరిమితమయ్యాయని తెలిపారు. ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం కావాలని అంబేద్కర్ చెప్పడం జరిగిందన్నారు. కానీ ఇవన్నీ ఏం జరుగలేదన్నారు. రాజకీయ స్వాతంత్రం ఓటు హక్కు ద్వారా వచ్చిందని, ఓటు విలువలో మాత్రం సమానమని..ఆస్తి విలువలో తేడా ఉంటుందని అంబేద్కర్ పేర్కొన్నారని తెలిపారుర. సామాజిక హోదాలో ఆ తేడా ఉందని..ఆర్థిక అంతస్తులో తేడా ఉంటుందని...సామాజిక, ఆర్థిక న్యాయాన్ని సాధించుకోలేకపోతే రాజకీయ హక్కు కూడా పోతుందని అంబేద్కర్ హెచ్చరించారని గుర్తు చేశారు. 

06:42 - May 25, 2018

హైదరాబాద్ : రైతు బంధు పథకంతో నిజమైన సన్న, చిన్నకారు రైతుల కంటే భూస్వాములకే ఎక్కువ మేలు జరుగుతుందన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్‌ అమలు చేయాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. 

08:49 - May 3, 2018

హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌ ఎస్వీకేలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కలిసొచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోతామన్నారు. సమాజ్‌వాదీపార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ కేసీఆర్‌ నేతృత్వంలోని ఫెడరల్‌ ఫ్రంట్‌లో కలవడం సామాజిక న్యాయానికి అర్థం లేదన్నారు. 
 

 

15:42 - May 2, 2018

హైదరాబాద్ : రానున్న రోజుల్లో బిఎల్ఎఫ్ విస్తృతంగా సమావేశాలు..కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి వెళుతుందని కన్వీనర్ తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిఎల్ఎఫ్ జనరల్ బాడీ సమావేశంలో సుదీర్ఘంగా పలు అంశాలపై చర్చించడం జరిగిందని, బిఎల్ఎప్ లో 28 పార్టీలున్నాయని, భావజాలం ఉన్న పార్టీలు కూడా చేరాలని కోరారు. సీపీఐ పార్టీ ఇంకా చేరలేదని వారితో మాట్లాడుతున్నామని, అందులో భాగంగా మంగళవారం సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తుందని కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన కోదండరాం పేర్కొంటున్నారని తెలిపారు. దీనితో బీఎల్ఎఫ్ కు దూరంగా ఉండాల్సినవసరం లేదని..వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. మందకృష్ణ మాదిగ, బీసీ సంఘం నేత కృష్ణయ్య...ఇతర పార్టీల నేతలతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు.

సమాజ్ వాది పార్టీ నేతలతో చర్చలు జరుపుతామని, ఆ పార్టీకి సంబంధించిన జాతీయ నేత అఖిలేష్ యాదవ్ నగరానికి వచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేయదలిచిన ఫెడరల్ ఫ్రంట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని, ఒకవేళ మద్దతు పలికితే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా పనిచేసిన వారవుతారని తెలిపారు.

ఇక బిఎల్ఎఫ్ రాబోయే మూడు నెలల పాటు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ప్రజలతో సమావేశాలు..బహిరంగసభలు..ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు..మండలానికి..గ్రామానికి...బూత్ లకు కమిటీలు వేస్తామన్నారు. 17 పార్లమెంటరీ నియోజకవర్గాలకు కమిటీలు ప్రకటించడం జరిగిందని, రంజాన్ మాసంలో ఇఫ్తార్ పార్టీలు నిర్వహించి ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తామని...వారికి రక్షణ ఇచ్చేది కేవలం బిఎల్ఎఫ్ మాత్రమేనని తెలిపారు.

అన్ని యూనివర్సిటీలతో..కాలేజీలకు చెందిన వారు ప్రతి మండలానికి ప్రతి ఐదుగురు చొప్పున 400 మండలాల్లో బిఎల్ఎఫ్ విధానాలు ప్రచారం చేస్తారని తెలిపారు. తెలంగాణ రచ్చ బండ పేరిట సభలు నిర్వహిస్తామని...జులై ఆఖరి తరువాత అసెంబ్లీ స్థాయిలో పదివేల మందికి తగ్గకుండా బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజలకు తెలియచేయాలంటే మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, ఈ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి చేరువయ్యే విధంగా చేయాలని కోరారు.

పార్టీ నేత జలగం వెంకట్రావు మాట్లాడుతూ...అధికారం ఒక్కటే అడగొద్దు అంటున్నారని..కానీ బిఎల్ఎఫ్ మాత్రం అధికారం కోసం పోరాడుదామని పేర్కొంటోందన్నారు. ఓట్లు మావి..సీట్లు మావే..అని, బహుజన ఓట్లన్నీ పడుతాయనే భావిస్తున్నట్లు, ఓసీల్లో కూడా పేదవారు ఉన్నారని..సామాజిక న్యాయం కావాలని కోరుకొనే వారున్నారని వారందరినీ సమదృష్టితో చూడడం జరుగుతుందన్నారు. 

14:20 - April 24, 2018

హైదరాబాద్ : తమ మహాసభల తీర్మానాలు బీజేపీని కలవర పెట్టాయని...అందుకే ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తాము బీజేపీపై రాజకీయ విమర్శలు చేశామని తెలిపారు. బూజు పట్టిన సీపీఎం గురించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. మహాసభ కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుందని..20 మంది కొత్త కార్యకర్తలను తీసుకుందన్నారు. 95 మంది కేంద్రకమిటీ, 17 మందితో పొలిట్ బ్యూరో ఎన్నుకుందని తెలిపారు. మతోన్మాదాన్ని ఓడించేందుకు అందరూ కలిసిన రావాలని పిలుపునిచ్చారు.

 

14:18 - April 24, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎర్రజెండాలదే భవిష్యత్ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాసభలు అద్భుతంగా జరిగాయని తెలిపారు. సభలు బాగా నిర్వహించారని తమకు పల్లెల నుంచి ఫోన్ లు వస్తున్నాయని చెప్పారు. యువత కమ్యూనిస్టుల వైపు ప్రధానంగా సీపీఎం వైపు చూస్తుందని...అందుకు రెడ్ షెర్ట్ వాలంటీర్ల కవాతులో పాల్గొన్న యువత నిదర్శనం అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మహాసభల విజయవంతానికి ప్రజలతోపాటు ప్రతి పత్రిక, ప్రతి చానెల్ బాగా సహకరించాయని కొనియాడారు. మహాసభల జయప్రదానికి ప్రభుత్వ యంత్రాంగం బాగా సహకరించిందన్నారు. హామీలు అమలులో, పరిపాలనలో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు  వైఫల్యం చెందాయని విమర్శించారు. కేంద్రలోని బీజేపీ చేయరాని పనులు చేస్తోందన్నారు. దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కదిలిరావాలన్నారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో తుచ్చమైన రాజకీయాలు ఉన్నాయన్నారు. స్వచ్ఛ రాజకీయ వ్యవస్థను తీసుకావాలన్నారు. 28న తమ పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గం సమావేశం ఉంటుందని, 29న రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటుందని.. బివి.రాఘవులు పాల్గొంటారని తెలిపారు. బీఎల్ ఎఫ్ బలోపేతానికి మే, జూన్, జులై మాసాల్లో కార్యాచర, ప్రణాళికను రచిస్తామన్నారు. రాబోయే కాలంలో బీఎల్ ఎఫ్ అధ్వర్యంలో కార్యక్రమాలను రూపొందిస్తామని చెప్పారు. ఇప్పటికిప్పుడు బీఎల్ ఎఫ్ బలంగా లేదని...క్రమేణాబలం పుంజుకుంటుందన్నారు. అయితే బీఎల్ ఎఫ్ బలంగా లేకపోవచ్చు కానీ.. ఎజెండా చాలా బలైమందన్నారు. తమ నినాదం ప్రజల్లోకి చేరాలన్నారు. అన్ని పల్లెల్లోకి బీఎల్ ఎఫ్ నినాదం చేరే విధంగా కార్యక్రమాలు చేస్తామని అన్నారు.  

Pages

Don't Miss

Subscribe to RSS - Thammineni veerabhadram