Telangana Breaking News

22:00 - August 14, 2018

రాహుల్ రాకతోని కాంగ్రెస్ రాత మారిందా..?..కేసీఆర్ ముందస్తు ఉత్తముచ్చటనేనా..?, బీసీల మీద టీఎంసీల కొద్ది గావురం గార్చిండు..ఓట్ల కోసం బదునాం బదలాయించిన సీఎం, ఆంధ్ర రాష్ట్రంల మంత్రులు ఆడోళ్ల మొగోళ్ల...అనుమానం వ్యక్తం జేస్తున్న ఆర్కే రోజా, జనసేనా పార్టీ గుర్తు పిడికిలన్న పవన్...మెనిఫెస్టోల ఒక్కొక్కటి ఇడిశిపెడ్తున్నడు, ఎన్నికలు దగ్గరికొస్తుంటే కులసంఘాలు...ఎన్నికలు అయిపోయినంక ఏ కులంలేదు, పామును వెంచుకుంటున్న పనిమంతుడు...విషం దీశిండ్రా లేదా అనేది తెలుస్తలేదు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

19:57 - August 1, 2018

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అధికార, విపక్షాలు విమర్శలకు దిగాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ కుట్రలు చేస్తుందని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. హరీష్‌రావు వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి తిప్పికొట్టారు. ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్‌ పేరుతో 50 వేల కోట్ల రూపాయలను కేసీఆర్‌ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విషయంపై విమర్శలు గుప్పించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆలిండియా కిసాన్ సంఘం ఉపాధ్యక్షులు, సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి, టీజేఏసీ నేత వెంకట్ రెడ్డి, టీఆర్ ఎస్ నేత రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పాల్గొని, మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించారు. ప్రాజెక్టుల నిర్మాణం, రిడిజైనింగ్ పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:01 - August 1, 2018

హైదరాబాద్ : బీజేపీ ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతుందని కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుంటే బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మైనార్టీలపై దాడులు చేస్తే ఊరుకోబోమని వీహెచ్‌ హెచ్చరించారు. భారత్‌ను సెక్యూలర్ దేశంగా కాపాడటానికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. రైతులకు సంకెళ్లు వేసిన రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్తారని వీహెచ్‌ అన్నారు.

 

16:29 - August 1, 2018

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కంటే కాంట్రాక్టర్లకు ఎక్కువ మేలు చేస్తుందని టీజేఎస్‌ అధినేత కోదండరాం అన్నారు. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో అధికారులు దోపిడి చేసి, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై చర్చకు సిద్ధంగా ఉన్నామని కోదండరాం తెలిపారు.  మేము గతంలో లేవనేత్తిన ప్రశ్నలకు  మంత్రి హరీష్‌రావు  సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ పాపాల పుట్ట పగిలే రోజులు దగ్గరపడ్డాయని కోదండరాం అన్నారు.

 

20:10 - July 25, 2018

సూస్తున్నరా ఆంధ్ర రాష్ట్రంల రాజకీయం ఎట్లైతున్నదో.. జగనాలు ప్రెస్ మీటింగు వెట్టి.. పవన్ కళ్యాణ్ను ఎన్నిమాటలన్నడు.. ఏదన్న ఉంటే రాజకీయంగ ఎదుర్కోవాలెగని.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు ఎందుకు జగన్కు..? అంటే ఓ ఆంధ్రా ప్రజలారా..? జగన్ మోహన్ రెడ్డి జేశ్న తిక్కపని ఏం తెల్వక జేశిండేమో అనుకుంటున్నరా..? తప్పు.. దీని ఎన్క అత్యంత పెద్ద కుట్ర దాగున్నది.. నేను జెప్త సూడుండ్రి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణకు గూడ ఇయ్యాలే అని డిమాండ్ జేస్తున్నడు పార్టీ మారి పదవి దక్కిచ్చుకున్న పూజ్యులు శ్రీ గుత్త సుఖేందర్ రెడ్డిగారు.. తెలంగాణల గూడ.. హైద్రావాదు, వరంగల్ తప్ప అంత ఎన్కబడిన ప్రాంతమే మా ప్రాంతానికి గూడ ప్రత్యేక హోదా ఇస్తెనే మంచిది అనుకొచ్చిండు ప్రెస్ మీటింగు వెట్టి..

తెలంగాణ రాష్ట్రంల కేసీఆర్ పరిపాలన అంత దరిద్ర్యమైన పరిపాలన నేను ఏడ జూడలే అంటున్నడు సీపీఎం పెద్ద ముత్తైదువు తమ్మినేని వీరభద్రం సారు.. గుర్రానికి ముంగట గడ్డిగట్టి ఉర్కిచ్చినట్టు ఉంటది కేసీఆర్ పరిపాలన.. ఆ గుర్రానికి గడ్డి అందది అది తినది.. సేమ్ ఈన పథకాలు ఈన ఏశాలు గూడ అట్లనే ఉంటయనుకొచ్చిండు..

పొయ్యిన ఊరుకు మళ్ల వొయ్యేది లేదు.. చెప్పిన మాట మళ్ల జెప్పేది లేదు.. రోజు రొక్కం బలాదూర్.. ఇది తెలంగాణ ప్రభుత్వం యవ్వారం.. మీరు జూడుండ్రి హరీష్ రావుగారు ఎప్పుడు జూడు కొబ్బరు కాయలు గొట్టి రిబ్బన్లు కట్ జేశేకాడనే గనిపిస్తడుగని.. సమస్యలు ఉన్నకాడికి వోడు.. ఎందుకంటె జనం నుంచి రియాక్షన్ ఉంటదని.. ఇగ ఒకతాన మళ్లేందో చెప్తున్నడు అక్కడి పబ్లీకుకు..

ఇప్పుడేగాదు మన నీళ్ల మంత్రి హరీషు రావుగారు ముచ్చట జెప్పింది.. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినంక ఐదువందల రెసిడెన్షియల్ హాస్టళ్లను ప్రారంభం జేశి సన్నబియ్యంతోని బువ్వవెడ్తున్న ప్రభుత్వం మాది అని.. ఇగ జూడుండ్రి ఆయన ముచ్చట ఎంత పచ్చి అవద్దమో ఈ ముచ్చట జూస్తె మీకే అర్థమైతది.. ఏమన్నడు మంత్రి హాస్టళ్ల పిల్లలు ఏమంటున్నరో ఇనుండ్రి..

ఊర్లె మోరీలు సక్కగలేవు ఏంలేవు ఎన్నిమాట్ల జెప్పినా సర్పంజి వట్టిచ్చుకుంటలేడు.. వార్డునెంబర్లు వట్టిచ్చుకుంటలేరు.. సెక్రటెరీ గూడ ఇంటలేడని ఏం జేశిండ్రు ఆ ఊరోళ్లంత.. పెద్దతాళం దీస్కపోయి గ్రామ పంచాది ఆఫీసుకు తాళమేశిండ్రు.. ఎమ్మార్వోను గల్చి వినతిపత్రం ఇచ్చిండ్రు.. తర్వాత ఎమ్మెల్యే కారు ఆడంగొస్తుంటే.. అడ్డం దల్గిండ్రు.. ఇగ జూడుండ్రి కథ ఎట్లున్నదో..

మనం గడ్కోపారి పోలీసోళ్లను అంటాఉంటం వాళ్లు ఎక్స్ ట్రా జేస్తుంటరు అని.. కని పోలీసోళ్ల తప్పుగాదు.. చట్టం తెల్సుకోకపోవడం ప్రజల తప్పు.. ప్రజలకు చట్టం ఏంది... న్యాయం ఏంది.?. పోలీసోళ్లు ఏం జేయాలే.. ఏం జేస్తున్నరు అన్న సోయి తెలిస్తె పోలీసోళ్లు ఓవరాక్షన్ జేయరు.. తోకముడుస్తరు.. ప్రజలకే సెల్యూట్ కొడ్తరు.. అమెరికా పోలీసోళ్లకు మనకు తేడా జూడుండ్రి..

జనం తల్చుకుంటే మంచోన్ని పిచ్చోన్ని జేస్తరు.. పిచ్చోన్ని దేవున్ని జేస్తరు... ఇద్వరకు చాలమాట్ల  జేశిండ్రు.. మనంగూడ ఎన్నోమాట్ల అసొంటియి జూపెట్టుకున్నం మన మల్లన్న ముచ్చట్లగని.. సేమ్ అసొంటిదే ఇంకోటొచ్చింది మనతానికి.. అదేందంటే.. రాత్రికి రాత్రే ఒక తాడిచెట్టును ఎల్లమ్మ తల్లిగ మల్చేశిండ్రు మన భక్తజనం.. నిన్నటిదాక కల్లువోశిన తాడిచెట్టు ఇయ్యాళటి సంది దీవెనార్తిలు వెట్టెస్తుందన్నట్టు..

22:10 - July 19, 2018

హైదరాబాద్ : ఇసుక మాఫియా వెనుక మంత్రి కేటీఆర్‌ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు నేరెళ్ళ బాధితులు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు బాధితులు.  తమకు న్యాయం చేయాలంటూ బాధితులు  వేడుకున్నారు. కేసీఆర్‌ ఆయన కుటుంబం ఇసుక మాఫియా ద్వారా వేల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. జులై చివరి రోజు వరకు నేరెళ్ల బాధితులకు న్యాయం చేయకపోతే దళిత గిరిజన ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతామన్నారు ఉత్తమ్‌. 
 

 

22:02 - July 19, 2018

హైదరాబాద్ : గ్రామ పంచాయతీలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీఎస్‌ను సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కలిశారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని.. వారి వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23 నుంచి కార్మికులు సమ్మెకు పోకుండా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. తెలంగాణల్లో తప్ప మిగితా రాష్ట్రాల్లో కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, జీతాలు ఇస్తున్నారన్నారు. 

 

08:59 - July 17, 2018

హైదరాబాద్ : పార్టీ నేతలకు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా మారడం లేదు. నిన్న ఓ ఎమ్మెల్యే...... నేడు ఓ అమాత్యుడు చేసిన ఫోన్ సంభాషణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం.....గులాబి పార్టీలో చర్చనీయంశంగా మారాయి. నేతల తీరుపై గులాబి దళపతి సీరియస్ అవుతున్నట్లు సమాచారం. ఓ సిఐ పై ఉన్నతాధికారితో తేల్చుకుంటానని ఆ అమాత్యులు చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

వివాదాస్పదంగా గులాబీ నేతల తీరు..
ప్రభుత్వ పరంగా జరుగుతున్న కార్యక్రమాలపై గులాబీ అధిష్ఠానం ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా .. పార్టీ నేతల వైఖరి మాత్రం ఆ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. నేతల వ్యవహారం అధికార పార్టీ పెద్దలను అయోమయానికి గురి చేస్తోంది. అమాత్యులు సహా....కింది స్థాయి నేతల వరకు వవ్యవహరిస్తున్న తీరు గులాబీదళపతికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.

వివాదాస్పదంగా దక్షిణ తెలంగాణ అమాత్యుడి వైఖరి..
దక్షిణ తెలంగాణా జిల్లాలకు చెందిన ఓ అమాత్యుడి వ్యవహార శైలితో సీఎం కేసీఆర్‌ కస్సుబుస్సులాడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి తనయుడిపై వచ్చిన విమర్శలను చక్కదిద్దుకునే లోపే మరో వివాదంలో ఏకంగా మంత్రే చిక్కుకుంటున్నారు. సచివాలయంలో తన ఛాంబర్ లోనే ఓ భూవివాదాన్ని పరిష్కరించే యత్నం చేయడంపై కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో అమాత్యుడితో పాటు అదే జిల్లాకు చెందన ఓ శాసనసభ్యుడి మధ్య సచివాలయంలోనే తీవ్ర వివాదం రేగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఓఎస్డీ తరపున సీఐని బెదిరించిన మంత్రి!..
ఇదిలా ఉంటే తాజాగా తన ఓఏస్డీ తరపున వకాల్తా పుచ్చుకుని ఓ పోలీస్‌ సిఐ ను మంత్రి హెచ్చరించడం మరో సారి హాట్ టాపిక్ గా మారింది. మంత్రికి ఆ పోలీసు అధికారితో నేరుగా సంబంధం లేకపోయినా సిఐ ని దారికి తెచ్చుకునే యత్నం చేయడం....సిఐ కూడా అదే స్థాయిలో అమాత్యుడికి సమాధానం ఇవ్వడంతో మంత్రి వైఖరిపై గులాబి పార్టీలో గుసగుసలు జోరందుకున్నాయి. ఫోన్ సంభాషణపై మంత్రి ఓఎస్డీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజకీయంగా ఈ అంశం మరింతే ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఎంతో సైలెంట్ గా శాఖపరమైన అంశాలను చక్కదిద్దు కుంటారన్న పేరున్న సదరు మంత్రి... తాను నిర్వహిస్తున్న శాఖలో పంచాయతీలు నిర్వహిస్తున్నారన్న ప్రచారానికి ఇలాంటి సంఘటనలు అద్దం పడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. గులాబీబాస్‌ ఈవ్యవహారాన్ని ఎలా చక్కదిద్దుతారనే దానిపై పార్టీనేతల్లో ఆసక్తి నెలకొంది.

13:04 - July 14, 2018

తూర్పుగోదావరి : రాజమండ్రి వద్ద గోదావరి నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. గోదావరి ప్రవాహంతో లంక వాసులకు కష్టాలు మొదలయ్యాయి. ఏటిగట్లు బలహీనంగా ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. గోదావరిలో వరద ప్రవాహంపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

12:13 - July 14, 2018

హైదరాబాద్ : ఎంసెట్ స్కాం నిందితులను సిఐడి కస్టడీలోకి తీసుకున్నారు. శ్రీచైతన్య కళాశాల మాజీ డీన్ వాసుబాబు, వెంకట శివనారాయణను సిఐడి అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. ఎక్కడెక్కడ క్యాంపులు నిర్వహించారు ? ఎంత మంది విద్యార్థులతో డీల్ కుదుర్చుకున్నారు ? అన్న ప్రశ్నలపై నిందితుల నుంచి అధికారులు సమాధానం రాబడుతున్నారు. భువనేశ్వర్, ఢిల్లీ, ముంబై, ఫూణె, బెంగళూరులో క్యాంపులు నిర్వహించినట్టు నిందితులు తెలిపినట్లు సమాచారం. క్యాంపులు నిర్వహించిన ప్రాంతాలకు నిందితులను తరలించే అవకాశం ఉంది. కార్పొరేట్ శక్తుల వెనుక ఉన్న అసలు సూత్రదారులపై సిఐడి ఆరా తీస్తుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Pages

Don't Miss

Subscribe to RSS - Telangana Breaking News