telangana

10:22 - September 21, 2018

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం...మరోసారి తెలంగాణలో పర్యటించనుంది. గత పర్యటనలో అధికారులతో ఎన్నికలపై చర్చించిన ఈసీ...ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సమస్యాత్మక ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటించి క్షేతస్థాయిలో ఎన్నికల నిర్వహణపై పరిస్థితులను తెలుసుకోనున్నారు. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులపై అధ్యాయనం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు....మరోసారి రాష్ట్రానికి రానున్నారు. గత పర్యటనలో ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన ఈసీ సభ్యులు...ఈ పర్యటనలో గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తిరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత తొలిసారి జరిగే ఎన్నికలకు...ఏమైనా ఆటంకాలు ఉన్నాయా అన్న అంశాలను సభ్యులు గ్రౌండ్ లెవల్ లో తెలుసుకోనున్నారు.  ఇప్పటికే తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సిద్దమైన సీఈసి..మధ్యప్రదేశ్, రాజస్ధాన్ రాష్ట్రాల్లోనూ ఇదే సమచారం కోసం తమ పర్యటన పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 

మరోవైపు ఈ నెల 25తో తెలంగాణలో ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం పూర్తవుతుంది. ఓటరు నమోదుపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో  పెట్టుకుని... జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక కార్యక్రమాలతో క్యాంపెయిన్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్... వివిధ జిల్లాల కార్యాలయాలను నేరుగా సందర్శిస్తున్నారు. ఇప్పటికే వీవీ ప్యాట్స్, ఈవీఎంలు రాష్ట్రానికి చేరుకున్నాయి.  వాటిని ఎలా వినియోగించాలనే దానిపై కూడా ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నారు. వచ్చే వారంలో రాష్ట్రానికి రానున్న సీఈసీ బృందానికి...ఈవీఎంలు, వీవీ ప్యాట్లకు సంబంధించిన నివేదికను అందజేయనున్నారు రజత్ కుమార్. గ్రామీణ స్థాయిలో పర్యటన ముగించిన తర్వాత...పరిస్థితులను బట్టి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశాలున్నాయి. 

17:48 - September 20, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల వేడి తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతోంది. ఏపార్టీకి ఆ పార్టీ గెలుపుకోసం నానా పాట్లు పడుతున్నాయి. విజయంపై ధీమాగా వున్న టీఆర్ఎస్ కూడా తమ ప్రయత్నాల్లో నేతలు తలమునకలయైపోయారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తుందనీ..వారిద్దరి పొత్తుతో విజయం సాధిస్తే ఇరు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాలు చేస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో..ఎంఐఎం పార్టీ ఎంపీ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  
టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకొస్తే కనుక ఆ పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకుంటారా?’ అనే ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ పాలిటిక్స్‌పై తనకు అంతగా ఆసక్తి లేదని, టీఆర్ఎస్‌తో కలిసి అధికారం పంచుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కానీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయన విజయానికి దోహదపడతాయని ఎంపీ ఒవైసీ పేర్కొన్నారు.
కర్ణాటకలో కుమారస్వామి సీఎం అయినట్లుగానే తెలంగాణలో కూడా జరగవచ్చని..తాము అధికారంలోకి రావచ్చని మాజీ ఎమ్మెల్యే..ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా ప్రచారం చేసిందని..మీడియా తీరంతా కట్ అండ్ పేస్ట్ అన్న రీతిలో ఉంటుందని పనిలో పనిగా ఒవైసీ మీడియాకు చురకలంటించారు. 

 

22:13 - September 19, 2018

హైదరాబాద్ : రాష్ట్ర సాధన కోసం  తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి..టీఆర్ఎస్ లో విలీనం చేసిన అనంతరం తెరమరుగు అయిపోయిన రాములమ్మ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుస్తు ఎన్నికల్లో రాములమ్మ చక్రం తిప్పనుంది. టీఆర్ఎస్ లో ఎంపీగా పనిచేసిన ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మళ్లీ కీలకపాత్ర పోషించబోతున్నారు. ఆమెను టీకాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా పార్టీ అధిష్ఠానం నియమించింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి 2014 ఎన్నికల్లో మెదక్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 
ఇటీవల హైదరాబాద్ మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన సందర్భంలో... ఆమె మళ్లీ కనిపించారు. రాజకీయాలల్లో ఇకపై క్రియాశీలకంగా ఉంటానని ఆ సందర్భంగా ఆమె తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక పదవిని కట్టబెట్టింది. పార్టీ గెలుపులో ఆమె కీలక పాత్ర పోషిస్తారని పార్టీ భావిస్తోంది. మరోవైపు, టీడీపీతో పొత్తును ఇంతకు ముందే ఆమె వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

 

19:33 - September 19, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సమయం శంఖం పూరించిన వేళ టీ.కాంగ్రెస్ లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న వేళ..పార్టీ అధినేత రాహుల్ గాంధీ పలు మార్పులు చేశారు. టీపీసీసీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 9 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పదోన్నతి లభించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు నియమితులయ్యారు. ప్రచార కమిటీ ఛైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్క, కో-ఛైర్మన్ గా డీకే అరుణ, కన్వీనర్ గా దాసోజు శ్రవణ్ లను నియమించారు. 41 మందితో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. 53 మందితో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు. స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ గా వి.హనుమంతరావు నియమితులయ్యారు.

 

18:58 - September 19, 2018

హైదరాబాద్: మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి ఇటీవలే గులాబీ కండువా కప్పుకొని ఆర్భాటంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ విషయంపై నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు సైతం స్పందించారు. కానీ అది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కానీ.. ఢిల్లీ నాయకులకు కానీ పట్టినట్టులేదు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లట్ ఆధ్వర్యంలో కొంత మంది నేతలను ఎన్నికల బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపిక చేశారు. ఫ్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీలో సభ్యునిగా సురేష్ రెడ్డి పేరును కూడా చేర్చి జాబితాను విడుదల చేశారు. పార్టీని వీడిపోయిన వారికి కూడా ఎన్నికల బాధ్యతలు ఎలా అప్పగిస్తారని కొందరు అసంతృప్తి నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ మారినా మాకు సంబంధం లేదు ‘వదల బొమ్మాళీ వదలా’ అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ తన పరువును తనే తీసుకుంది.

 

16:24 - September 19, 2018

హైదరాబాద్: తెలంగాణ ఆడపడుచు ఐశ్వర్య బొడ్డపాటికి అపధ్దర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభాశ్సీసులు అందజేశారు. కేంద్ర యువజన విభాగం మరియు క్రీడల శాఖ మంత్రిత్వ శాఖ భారత నావికాదళం లెఫ్ట్‌నెంట్ కమాండర్ ఐశ్వర్య బొడ్డపాటి టెన్జింగ్ నార్గే జాతీయ అడ్వంచర్ అవార్డు 2017 కు ఎంపిక చేసిన సందర్భంగా కేసీఆర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.     

ఐశ్వర్యకు ఈ అవార్డు దక్కఃటం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని.. ఇటువంటి అవార్డులు మరిన్ని ఐశ్వర్య సొంతం చేసుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. 2017 సెప్టెంబరు 10 న ప్రారంభమైన ‘టఫ్ ఎక్స్‌పెడిషన్‌’లో ఐశ్వర్య పాల్గొని ‘ఐఎన్ఎస్ తరిణి’ అనే పడవలో ప్రపంచాన్ని చుట్టి వచ్చారు.  తెలంగాణ వాసి అయిన ఐశ్వర్య గతంలో నారీ శక్తి, నవ్‌సేన వంటి అవార్డులను కైవసం చేసుకొన్నారు. ఈ నెల 25న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఒక కార్యాక్రమంలో ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా ఐశ్వర్య అందుకుంటారని కేంద్ర యువజన విభాగం మరియు క్రీడల శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది.

15:45 - September 19, 2018

ఢిల్లీ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్రంలో గడువు కంటే ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల పౌరులకు నష్టమని పేర్కొంటూ సిద్ధిపేటకు చెందిన పోతుగంటి శశాంక్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

తెలంగాణలో సాధారణ ఎన్నికల సమయానికి దాదాపు 20లక్షల మందికి పైగా యువత ఓటుహక్కు పొందేందుకు అవకాశముంటుందని... ముందస్తు ఎన్నికల వల్ల వారంతా ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసే విధంగా ఉందన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న ప్రభుత్వమే అధికారంలో ఉందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. స్వయంగా ముఖ్యమంత్రే.. ఎన్నికల సంఘంతో మాట్లాడిన తర్వాతే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పడం అర్థరహితమన్నారు. ఫలానా సమయంలో ఎన్నికలు జరుగుతాయని, మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి, రాజకీయ సంక్షోభం లేకపోయినా... కేవలం రాజకీయ పరమైన లబ్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైందని పిటిషనర్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలను దృష్టిలోకి తీసుకుని తెలంగాణలో గవర్నర్‌ పాలన విధించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని.. అప్పటివరకు గవర్నర్‌ పాలన అమల్లో ఉండటం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందని పిటిషనర్‌ అభిప్రాయపడ్డారు.

18:45 - September 18, 2018

నల్లగొండ : మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యకు పాల్పడిన నిందితులను నల్గొండ ఎస్పీ రంగానాథ్ మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు నెలల నుంచే అంటే జూన్ నుంచే ప్రణయ్ మర్డర్ కు స్కెచ్ వేశారని చెప్పారు. జూలై మొదటి వారంలోనే ప్లాన్ వేశారని చెప్పారు. 

ప్రణయ్ కు హత్య చేసేందుకు రూ.కోటికి డీల్ కుదుర్చుకుని అమృత తండ్రి మారుతీరావు నుంచి రూ. 18 లక్షలు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అస్గర్ అలీ, అబ్దుల్ బారీ స్కెచ్ వేశారని తెలిపారు. ఈ మొత్తంలో రూ. 8 లక్షలు బారీ, రూ. 6 లక్షలు అస్గర్, లక్ష రూపాయలు కరీం తీసుకున్నారని వెల్లడించారు. మర్డర్ ప్లాన్ అమలుకు మూడు సిమ్ కార్డులు కొన్నారనీ..ఆగస్టు 14న బ్యూటీ పార్లర్ వద్ద మొదటి ప్లాన్ వేశారనీ..సెప్టెంబర్ మొదటివారంలో రెండోసారి వేశారనీ వివాహం అయినప్పటినుండి హత్య చేసేందుకు మారుతిరావు కసితో రగిలిపోతు నిర్ణయం తీసుకున్నట్లుగా దర్యాప్తులో వెల్లడయిందని ఎస్పీ తెలిపారు. అస్గర్ అలీ ఘటనాస్థలికి దూరంలో వుండి హత్యను పర్యవేక్షించాడనీ..పక్కా ప్రణాళిక ప్రకారంగా ప్రణయ్ హత్యకు ప్లాన్ చేశారని తెలిపారు. హత్య చేసింది బీహార్ కు చెందిన సమస్తిపూర్ జిల్లా వాసి అని సుభాశే  అని ఎస్పీ రంగనాథ్ స్పష్టం చేశారు. 

ఈ కేసులో ఏ1గా అమృత తండ్రి మారుతీరావు, ఏ2గా సుభాష్ శర్మను నమోదు చేశామని చెప్పారు. మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. తన కుమార్తెకు బిడ్డ పుడితే అవమానమని మారుతీరావు భావించారని... అబార్షన్ చేయించుకోవాలని ఆమెపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారని చెప్పారు. ప్రణయ్ తల్లిదండ్రులతో మారుతీరావుకు పలుమార్లు గొవడ అయిందని... మారుతీరావు నుంచి ప్రాణహాని ఉండటంతో, వారు ఇంట్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు.  

17:47 - September 18, 2018

ఖమ్మం : ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన స్థలాల్లో హైదరాబాదులో 6 చోట్ల, ఖమ్మంలో 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో ఉదయం 9 గంటలకు సోదాలను ప్రారంభించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాఘవ ఇన్ ఫ్రా కార్యాలయంలో కూడా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ సోదాల వెనుక ఎలాంటి ప్రత్యేక కారణాలు లేవని... ఇవన్నీ సాధారణ సోదాలేనని ఐటీ అధికారులు తెలిపారు. 2014లో వైసీపీ తరపున ఎంపీగా గెలుపొందిన పొంగులేటి... 2016లో టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. 

15:21 - September 18, 2018

మంచిర్యాల : గిరిజనులు అడవి బిడ్డలు..అడవితల్లినే నమ్ముకుని జీవనం సాగించేవారు. అడవిలోని ఉత్పత్తులను వినియోగించుకుంటు..వాటిని విక్రయించుకుంటు జీవనాధారం సాగించేవారు. కానీ ప్రస్తుతం వారి పద్ధతులు, ఆచారాలు..సంప్రదాలయాలు కాలానుగుణంగా మారుతు వస్తున్నాయి. కానీ వారి వంశపారపర్యంగా వచ్చే సంప్రదాయాలను మాత్రం వారు గౌరవిస్తునే..పెద్దలు నడిపించిన పద్ధతులను..వారికిచ్చిన మాటలను గౌరవిస్తు పాటిస్తు వస్తున్నారు. సాధారణంగా గిరిజనులంటే ప్రధానంగా వారి ఆహారం మాంసాహారం అనే అనుకుంటాం. కానీ మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలంలోని ఓ గిరిజనులు మాత్రం పూర్తి శాఖాహారులే నంటే వినటానికి నమ్మశక్యం కాదు. కానీ నమ్మి తీరవసలసిన సత్యం..కోడి కూతకూడా ఈ గ్రామంలో వినిపించదంటే అతిశయోక్తి కాదు. 

దాదాపు 200 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ గిరిజన గూడానికి ఓ ప్రత్యేకత వుంది. లింగధరి తెగకు చెందిన కొలాం గిరిజనులు చౌటపల్లి గ్రామపంచాయతీ పరిధిలోనిది. వీరి ఆహారశైలి పూర్తిగా భిన్నమైనది. ఈ గూడెంలో ఎవరూ మాంసం, మద్యం  ముట్టరు. మేకలు, కోళ్లను పెంచటం కూడా చేయరు. ఇలా చేయమని వారినెవరు నిర్భంధించలేదు. రెండు శతాబ్దాలుగా గ్రామంలో మాంసం, మద్యంపై స్వయంగా ప్రకటించుకుని అమలు చేస్తున్నారు. గర్భిణులు, శిశువుల కోసం పంపిణీ చేసేందుకు అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన కోడిగుడ్లను కూడా తిప్పి పంపించారంటే మాంసాహారానికి ఈ గ్రామస్థులు ఎంతగా కట్టుబడి నిజాయితీగా అమలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
 
లింగధరి కొలాంగూడెంలో లింగధరి తెగకు చెందిన కొలాం గిరిజనులు మొత్తం 210 మంది ఉంటారు. వీరిలో 150 మంది ఓటర్లున్నారు. వ్యవసాయమే వీరి జీవనాధారం. వారసత్వంగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తు..పిండివంటలు, అన్నం, కూరగాయలే వారి భోజనంగా కొనసాగిస్తున్నారు. వీరి శాఖాహార అలవాట్ల కారణంగా ఆయు ప్రమాణమూ ఎక్కువగానే ఉంటున్నట్లుగా తెలుస్తోంది. గిరిజన తెగల్లో మాంసం, మద్యం ముట్టని వారుండరని, తాము మాత్రం వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ దరి చేరనివ్వబోమని వీరు స్పష్టం చేస్తున్నారు. గ్రామంలో పెళ్లిళ్లు, ఇతర పూజలకు పురోహితులు కూడా కొలాంలే ఉంటారు. కాగా గిరిజనులైన వీరికి ప్రభుత్వం ఇంతకాలం ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేస్తుండేది. అయితే ఇప్పుడు ఆహారపు అలవాట్లు, జీవన విధానాన్ని చూసి.. బ్రాహ్మణులుగా భావిస్తున్నారని, ఇటీవల ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - telangana