team

13:31 - October 18, 2018

ఆస్ట్రేలియా : క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని ఓ చరిత్ర ఆవిషృతమయ్యింది. ఇప్పటి వరకూ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది జరగలేదు. అంతటి సంచలన ఘన విజయానికి నాంది పలికారు నారీ మణులు. ఓ క్రికెట్ మ్యాచ్ లో 571 పరుగుల తేడాతో విజయం సాధించిందో జట్టు. ఇది వినటానికి వింతగా..నమ్మలేనంతగా వున్న వాస్తవం. పచ్చినిజం. ఈ సంచలనానికి వేదికగా నిలిచారు మహిళా క్రికెటర్స్. 
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ స్థానిక టోర్నీలో నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌‌, పోర్ట్‌ అడిలైడ్‌ మహిళల జట్లు ఎస్‌ఏసీఏ పీసీ స్టేట్‌ వైడ్‌ క్రికెట్ టోర్నీలో పాల్గొన్న వేళ తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ జట్టు 3 వికెట్ల నష్టానికి 596 పరుగులు చేయగా, తదుపరి బ్యాటింగ్ చేసిన  పోర్ట్‌ అడిలైడ్‌ జట్టు కేవలం 25 పరుగులకే కుప్పకూలింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన పోర్ట్‌ అడిలైడ్‌ జట్టు 10.5 ఓవర్లలో 25 పరుగులే చేయగా, నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ జట్టు 571 పరుగుల తేడాతో గెలిచింది. నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ జట్టులో నలుగురు సెంచరీలు సాధించడం మరో రికార్డు. టెగాన్‌ మెక్‌ ఫార్లిన్‌ 136, టాబీ సవిలీ 120, శామ్‌ బెట్స్‌ 124, డార్సీ బ్రౌన్‌ 117 పరుగులు చేశారు. గుర్తింపు పొందిన క్రికెట్ ఫార్మాట్లలో ఇదే అత్యధిక స్కోరు, భారీ విజయం.

 

08:28 - October 10, 2018

హైదరాబాద్ : ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు కొని ఫలితాల వరకు అంతా సవ్యంగా సాగేలా.. తమ సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. అలాగే ఓటర్ల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. మృతి చెందిన వారి ఓట్లను వారి కుటంబ సభ్యులకు తాఖీదులిచ్చి తొలగించేందుకు రెడీ అయింది.తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియలో ప్రదానమైన నామినేషన్ల స్వీకరణ.. వాటి పరిశీలన.. తరువాత అభ్యర్ధులతో వ్యవహరించాల్సిన విధానంపై అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని రిటర్నింగ్ అధికారులు.. వారి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ దాన కిషోర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని కమిషనర్ దానకిషోర్ తెలిపారు. సీఈసీ వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొందిన 18 టీమ్‌లు హైదరాబాద్ ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తున్నాయని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. గ్రేటర్ పరిధిలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగింపు చేపట్టారు. ఆర్టీసీ బస్సులపై రాజకీయ నేతల ఫోటోలు తొలగించాలని రవాణాశాఖకు ఇప్పటిపై ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల జాబాతా కసరత్తు దాదాపు పూర్తైందన్న జీహెచ్ఎంసీ కమిషనర్.. మృతి చెందిన వారి ఓట్లను వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి తొలగిస్తామని చెప్పారు.ఇప్పటి వరకు ఎన్నికల జాబితాపై ఫోకస్ పెట్టిన అధికారులు.. ఇప్పుడు ఎన్నికల నిర్వహణపై దృష్టిసారించారు. ఎలాంటి తప్పలు జరగకుండా పటిష్టమైన వ్యవస్థతో పాటు.. సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు.
 

22:40 - September 12, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల సన్నద్థతపై క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల బృందం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. డిప్యూటీ చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌ ఉమేష్ కుమార్  సిన్హా నేతృత్వంలో వచ్చిన కమిటీ.. ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించింది. పార్టీల వారిగా అభ్యంతరాలను, ఫిర్యాదులు, సలహాలు సూచనలు ఈసీ బృందం తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల పరిస్థితి, ఓట్ల గల్లంతు, వినాయక చవితి, మోహర్రం పండుగల సందర్భంగా ఓటరు నమోదు కార్యక్రమ వ్యవధిని పెంచాలని పార్టీలు సూచించాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని ఉమేష్‌ కుమార్ సిన్హా అన్నారు. 

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అధికారుల సన్నద్ధతపైనా 31 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో దాదాపు 6 గంటల పాటు ఈసీ బృందం సమావేశమయ్యింది. జిల్లాల వారిగా క్షేత్ర స్థాయి పరిస్థితులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితా, సమస్యాత్మక ప్రాంతాలు, శాంతిభద్రతలపైనా చర్చించారు. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌పై సిబ్బంది శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈవీఎంల భద్రత, స్టోరేజీ, రవాణాకు అవసరమైన ఏర్పాట్లపైనా ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లను ఎవరూ ప్రలోభపెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇక  ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ కోసం  రూపొందించిన కొత్త ఈఆర్ఒ నెట్ పై జిల్లా కలెక్టర్లకు  అవ‌గాహ‌న  కల్పించారు.

అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి తో పాటు ఇతర ముఖ్య కార్యదర్శులతో సచివాలయంలో 20 నిముషాల పాటు ఉమేశ్‌ బృందం సమావేశం అయ్యింది. రాష్ట్రంలోని శాంతి భద్రతలు, సమస్యత్మాక ప్రాంతాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది , ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే నిధుల కేటాయింపు, రవాణ తదిరత అంశాల పై చర్చించారు. భౌగోళికంగా తెలంగాణకు చూట్టు ఉన్న సరిహాద్దు రాష్ట్రాల ప్రభావం ఎలా ఉంటుందో కూడా అడిగితెలుసుకున్నారు.

16:06 - October 8, 2016

కీ.శే.శ్రీమతి చిటుకుల అరుణ సమర్పణలో సందీప్ క్రియేషన్స్ బ్యానర్ పై సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి తారాగణంగా రూపొందుతోన్న చిత్రం 'నేను సీతాదేవి'. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో చిటుకుల సందీప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చైతన్య రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. చిత్రీకరణ నుండి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న 'నేను సీతాదేవి' సినిమా ఈనెల 14న రిలీజ్ కానుంది..ఈ నేపథ్యంలో చిత్ర హీరో హీరోయిన్లు సందీప్, కోమలిలతో టెన్ టీవీ లైవ్ షో నిర్వహించింది. ఈ సందర్బంగా హీరో సందీప్ మాట్లాడుతూ..లవ్ లో పడితే త్రివిక్రమన్ లా మాటలు రాయ్యొచ్చు..వేటూరిలా పాటలు రాయ్యొచ్చు అనే డైలాగ్ వదిలారు.కాగా హీరో హీరోయిన్లు ఇద్దరికీ ఇదే తొలిసినిమా కావటం విశేషం. నేను సీతాదేవి సినిమా హీరో హీరోయిన్లు చెప్పే విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

17:35 - May 15, 2016

మెగా కుటుంబం నుండి వచ్చిన సాయిధరమ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన 'సుప్రీమ్'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాల్లోని పాటలు 'సాయి ధరమ్ తేజ' చిత్రాల్లో రీమెక్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కూడా 'అందం..హిందోలం' అనే పాటను రీమెక్స్ చేశారు. కానీ భవిష్యత్ లో తాను నటించే చిత్రాల్లో చిరంజీవి పాటలు ఉండవని తేల్చిచెప్పారు. టెన్ టివితో 'సుప్రీమ్' చిత్ర యూనిట్ ముచ్చటించింది. హీరో సాయి ధరమ్ తేజ, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను సినీ విశేషాలను వెల్లడించారు. రీమెక్స్ పాటలు చేస్తూ పోతుంటే గలీజుగా ఉంటుందని సాయి ధరమ్ తేజ వ్యాఖ్యానించారు. 

17:20 - May 15, 2016

మెగా కుటుంబం నుండి వచ్చిన హీరో 'సాయి ధరమ్ తేజ'. ఆయన నటించిన 'సుప్రీమ్' మంచి విజయం నమోదు చేసుకుంది. పటాస్ తరువాత మరో సక్సెస్ ఫుల్ చిత్రాన్ని అనీల్ రాపూడి తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను టెన్ టివికి 'సుప్రీమ్' చిత్ర యూనిట్ తెలియచేసింది. హీరో సాయి ధరమ్ తేజ, ప్రభాస్ శ్రీను, శ్రీనివాస్ రెడ్డి విశేషాలను తెలియచేశారు. వారు ఎలాంటి విశేషాలు..ఎలా సందడి చేశారో వీడియో క్లిక్ చేయండి. 

17:18 - May 15, 2016

'మెగా' కుటుంబం నుండి వచ్చిన వారికి ఎలాంటి గర్వం ఉండదని నటుడు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. టెన్ టివితో 'సుప్రీమ్' టీంతో ముచ్చటించింది. హీరో సాయి ధరమ్ తేజ, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను విశేషాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..కొంతమంది హీరోలతో డిస్టెన్స్ మెంటెన్ చేయాల్సి వస్తుందని తెలిపారు. సాయి ధరమ్ తేజ్ మొదటి రోజు నుండే ఫ్రెండ్లీగా మెలుగుతాడని, నేర్చుకుంటాననే ఫీలింగ్ లో ఉంటాడని పృధ్వీ పేర్కొన్నారు. తాను సెట్ లో ఉండే సమయంలో ఫ్లెండ్లీగా ఉండటానికే మొగ్గు చూపుతానని, సీరియస్ గా ఉండటానికి ఇష్టపడనని హీరో సాయి ధరమ్ తేజ పేర్కొన్నారు. 

17:10 - May 15, 2016

మెగా కుటుంబం నుండి వచ్చిన 'సాయి ధరమ్ తేజ' నటించిన తాజా చిత్రం 'సుప్రీమ్'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా టెన్ టివితో 'సుప్రీమ్' యూనిట్ తో ముచ్చటించింది. 'సుప్రీమ్' టైటిల్ పెడుతున్నట్లు చెప్పగానే తొలుత తాను చాలా కంగారు పడ్డానన్నారు. చిరంజీవితో మాట్లాడడం జరిగిందని, ఆయన చాలా సపోర్టు ఇచ్చారని పేర్కొన్నారు. మరిన్ని విశేషాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:23 - October 29, 2015

హైదరాబాద్‌ : నగరంలోని సీపీఎం పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌ను వియత్నాం ప్రతినిధులు సందర్శించారు. వీరికి ఘన స్వాగతం లభించింది. వియత్నాంకు వామపక్ష పార్టీల మద్దతు ఎప్పుడూ ఉందని వియత్నాం - భారత్‌ల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ప్రతినిధి బృందం ప్రెసిడెంట్‌ ఎంపీ వూజువాన్‌ హంగ్‌ అన్నారు. 

10:43 - August 14, 2015

మహబూబ్‌ నగర్‌ : జిల్లా పాతపల్లిలో దళితులపై జరుగుతున్న దాడులు అమానవీయమని, ఆరు దశాబ్దాల స్వంతంత్ర భారతంలో ఇలాంటి ఘటనలు ఇంకా చోటు చేసుకోవడం హేయమని ఆఫీసర్స్‌ ఫోరం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతపల్లి గ్రామాన్ని సందర్శించిన ఫోరం ప్రతినిధులు.. దీనివెనకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు...
రాజ్యమేలుతున్న కుల రక్కసి.....
మహబూబ్‌ నగర్‌ జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో రెండు కులాల మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. సుమారు వంద మంది ఆఫీసర్స్‌ ఫోరం ప్రతినిధులు పాతపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ వివాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న ప్రతినిధులు.. ఇప్పటికీ ఈ గ్రామంలో కుల వివక్ష రాజ్యమేలుతోందని అన్నారు.
ఓట్ల కోసం వెంపర్లాడుతున్న రాజకీయ పార్టీలు..
పాతపల్లిలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా ఓట్ల కోసం వెంపర్లాడుతున్న రాజకీయ పార్టీలు.. కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో కుల వివక్ష ఈ స్థాయిలో పెరిగిపోవడానికి ఇక్కడి పోలీసు, రెవెన్యూ సిబ్బందే కారణమని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫోరం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.
స్థానిక పూజారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి...
అదేవిధంగా దళితులను ఆలయంలోకి రానివ్వకుండా.. కుల వివక్షకు పాల్పడుతున్న స్థానిక పూజారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దళితుల నుంచి లాక్కోవాలని చూస్తున్న అసైన్డ్‌ భూములను తిరిగి వారికి ఇవ్వాలని.. వారిపై దాడిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి దళితులకు న్యాయం చేయాలని, లేకపోతే.. పరిస్థితి మరింత విషమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Don't Miss

Subscribe to RSS - team