TDP MPs Protest

12:57 - August 10, 2018

ఢిల్లీ : కేంద్రానికి వ్యతిరేకంగా పార్లమెంటులో గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన చట్టం అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. చిత్తూరు ఎంపీ డాక్టర్‌ శివప్రసాద్‌.. హిజ్రా వేషధారణలో శివప్రసాద్‌ నిరసన వ్యక్తం చేశారు. మోదీబాబా ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం అంటూ.. హాస్య గీతం ఆలపించారు. మాటలెన్నో చెప్పావో.. చేతల్లో ఏమీ చూపలేదంటూ ఛలోక్తులు విసిరారు. 
 

14:09 - August 9, 2018

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం, టీడీపీ ఎంపీలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలు నాటాకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 'పచ్చి అబాద్ధాలు ఆడుతున్న మిమ్మల్ని దోషులుగా నిలబెడతాము' అని టీడీపీ ఎంపీలను ఉద్ధేశించి మాట్లాడారు. ఆర్థికమంత్రితో సహా అందరూ అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. వేల కోట్లను పీడీ ఖాతాల్లోకి మార్చారని తెలిపారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఒక పెద్ద ఫ్రాడ్ చేసిందన్నారు. 'మీ ఫ్రాడ్ ను ప్రజల సమక్షంలో, ప్రభుత్వ సమక్షంలో పెడతాం' అని చెప్పారు. రాజ్యసభలో ఎన్ డీఏకు ఉన్న బలం కంటే ఎక్కువ ఓట్లు హరివంశ్ కు వచ్చాయని అన్నారు. 2019లో ఇంతక కన్నా మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

08:18 - August 8, 2018

ఢిల్లీ : రైల్వే జోన్ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో టీడీపీ ఉత్తరాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. కేంద్ర మంత్రి స్పందించాల్సిన అంశాలపై జీవీఎల్‌ మాట్లాడటంతో, టీడీపీ నేతలు ఫైర్‌ అయ్యారు. టీడీపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని జీవీఎల్‌  చెప్పడంతో వివాదం ఏర్పడింది. దీంతో టీడీపీ నేతలు కేంద్రమంత్రిని సైతం కడిగిపారేశారు. 4 ఏళ్లైనా రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదని కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ను ప్రశ్నించారు. రైల్వే జోన్ ఎప్పుడుస్తారో నిర్దిష్ట గడువు చెప్పాలంటూ ఆయన ఛాంబర్‌ ముందు ఆందోళనకు దిగారు. 
రైల్వే మంత్రితో ఉత్తరాంధ్ర నేతల భేటీ
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో టీడీపీ నేతల సమావేశం రసాభాసగా మారింది. కేంద్ర మంత్రి స్పందించాల్సిన అంశాలపై జీవీఎల్‌ మాట్లాడటం, టీడీపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని చెప్పడంతో వివాదం ఏర్పడింది. మంగళవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతృత్వంలో ఎంపీలు, ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఉత్తరాంధ్ర జిల్లాల కు చెందిన 25 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు ఢిల్లీ రైల్‌ భవన్‌లో పీయూష్‌ గోయల్‌తో సమావేశమయ్యారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను ప్రకటించాలని వినతి పత్రం అందించారు. 
జీవీఎల్‌ వర్సెస్ టీడీపీ ఎంపీలు
పీయూష్‌ ఆర్థిక శాఖను కూడా చూస్తున్న నేపథ్యంలో.. వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు ఇచ్చి వెనక్కి తీసుకున్న అంశాన్ని ప్రస్తావించారు టీడీపీ నేతలు. ఈ సందర్భంలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ జోక్యం చేసుకొని టీడీపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించడంతో..టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆగ్రహించారు. సీట్లలో నుంచి లేచి జీవీఎల్‌పై మండిపడ్డారు. ''ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడడానికి మీరెవరు? అసలు ఏపీ గురించి ఏం తెలుసునని మాట్లాడుతున్నారు? మేం కేంద్రమంత్రిని అడుగుతుంటే మీరెందుకు స్పందిస్తున్నారు? అసలు మీరెందుకు వచ్చారు?'' అని జీవీఎల్‌ను నిలదీశారు. దీంతో సమావేశంలో ఎవరు పాల్గొనాలో మీరెలా నిర్ణయిస్తారని జీవీఎల్‌ ఎదురుదాడికి దిగారు.
జీవీఎల్‌ ఎదురుదాడి
అనంతరం సుజనా చౌదరి కల్పించుకుని.. ''మేం కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఆయనే మాకు దీనిపై వివరణ ఇవ్వాలి. మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు. ఏ హోదాతో మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడే అర్హత లేదు'' అంటూ జీవీఎల్‌కు సూటిగా సమాధానం చెప్పారు అయితే ''ఆంధ్రకు ద్రోహం చేయాలని చూస్తే మిమ్మల్ని రాష్ట్రంలో తిరగనివ్వం '' అంటూ అని కళా వెంకట్రావు పేర్కొనగా... 'నువ్వేం చేస్తావ్‌' అని జీవీఎల్‌ ఎదురుదాడికి దిగారు. తాను మాట్లాడి తీరతానని తేల్చిచెప్పారు. దీంతో టీడీపీ నేతలు మరింత మండిపడ్డారు. 'యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీకు... ఏపీతో  ఏం సంబంధం?' అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. మాటామాటా పెరగడంతో సమావేశ మందిరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, సుజనా చౌదరి, బీజేపీ ఎంపీ హరిబాబు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అర్ధాంతరంగా ముగిసిన సమావేశం 
చివరికి జీవీఎల్‌, హరిబాబు, పీయూష్‌ తన కార్యాలయంలోకి వెళ్లిపోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. గోయల్‌, జీవీఎల్‌ వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైల్‌ భవన్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. టీడీపీ నేతలకు సమయం కేటాయించేందుకు పీయూష్‌ రోజంతా మొరాయించారు. చివరికి సమయం కేటాయించినా... రెండుగంటలు నిరీక్షించేలా చేశారు.

 

15:56 - August 7, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ నేతలందరూ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చాలని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు డిమాండ్‌ చేస్తున్నారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన డబ్బులను అకౌంట్‌లో వేసి తిరిగి తీసుకోవడంపై ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.ఈ నేపథ్యంలో ఈరోజు కేంద్ర రైల్వే మంత్రిని టీడీపీ ఎంపీలు కలవనున్నారు. విశాఖ రైల్వే జోన్‌ కోరుతూ కేంద్ర మంత్రి పియూశ్‌ గోయల్‌కు విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై ఆర్థిక శాఖ కార్యదర్శిని కలవనున్నామని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. 

12:10 - August 6, 2018

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నాయి. అప్పటి నుండి టిడిపి ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. విభజన హామీలు..ప్రత్యేక హోదా తదితర వాటిపై ఆందోళన..నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద వర్షంలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. రోజుకో వినూత్న వేషధారణలో పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవుతున్న ఎంపీ శివప్రసాద్‌ ఈరోజు... శ్రీరాముడి వేషధారణలో వచ్చారు. శ్రీరాముడు ఒకే మాట, ఒకే బాణం అన్న ధర్మాన్ని పాటించగా... శ్రీరాముడే దేవుడిగా భావించే బీజేపీ మాత్రం ఆడిన మాట తప్పుతుందని శివప్రసాద్‌ ఆరోపించారు. 

20:15 - August 3, 2018

ఢిల్లీ : బీజేపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు చేసుకుంటుండగా... తాజాగా టీడీపీ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్‌కు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు  ఫిర్యాదు చేశారు. టీడీపీ డ్రామాలతో పార్లమెంట్‌ స్థాయి దిగజారుతుందని ఆరోపించారు. టీడీపీ ఎంపీలు డ్రామాలు ఆపే విధంగా చూడాలని స్పీకర్‌కు జీవీఎల్‌ ఫిర్యాదు చేశారు. 

 

15:36 - August 3, 2018

ఢిల్లీ : హస్తినలో టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం దగ్గర ఎంపీలు ధర్నా చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి పార్లమెంట్ లోపల, వెలుపల టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. 

11:08 - August 2, 2018

ఢిల్లీ : విభజన హామీలు..ప్రత్యేక హోదా..రైల్వే జోన్..ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం నిర్లక్ష్యం వహింస్తుండడంపై పార్లమెంట్ లో టిడిపి ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుండి వారు పలు విధాలుగా ఆందోళన చేపడుతున్నారు. టిడిపి ఎంపీ శివప్రసాద్ రోజుకో వేషధారణ ధరిస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం 'మాయల ఫకీరు' వేషంలో వచ్చిన శివప్రసాద్ కేంద్రంపై పలు విమర్శలు గుప్పించారు. 'తన కన్నా పెద్ద మాయల ఫకీరు పార్లమెంట్ లో ఉన్నారు' అంటూ ప్రధాన మంత్రి మోడీపై సెటైర్లు వేశారు.

ఇదిలా ఉంటే టిడిపి ఎంపీలు..కడప జిల్లా ప్రతినిధులు బుధవారం రాష్ట్రపతితో భేటీ అయిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో భేటీ అయ్యారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకొనేలా చొరవ తీసుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కోరారు. కడప స్టీల్ ప్లాంట్ పై ఉప రాష్ట్రపతికి వినతిపత్రం అందచేశారు. 

11:06 - August 1, 2018

ఢిల్లీ : టిడిపి ఎంపీల ఆందోళనలు..నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. విభజన హామీలు..ప్రత్యేక హోదా..తదితర అంశాలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ లోక్ సభలో ఎంపీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. బుధవారం రాష్ట్రపతితో టిడిపి ఎంపీలు, కడప జిల్లా టిడిపి ప్రజాప్రతినిధులు భేటీ కానున్నారు. విభజన చట్టం అమలు.. కడప జిలాలలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు..తదితర అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. టిడిపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నేతృత్వంలో రాష్ట్రపతిని బృందం కలువనుంది. ఈ భేటీ అనంతరం మధ్యాహ్నం ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తో టిడిపి ప్రతినిధి బృందం భేటీ కానుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:50 - July 31, 2018

మా పిల్లలకు మీ పిల్లలకు ఒక్కటే తీరు బువ్వ..మంత్రి కల్వకుంట్ల తారీఫ్ రామయ్య అవద్దాలు, కులవృత్తులకు మళ్ల జీవం బోస్తరంట..అంటే మళ్ల గవ్వే జేశి బత్కుమంటరా..?, మళ్ల భూమ్మీదికొచ్చిన పుట్టపర్తి సాయిబాబ..ఢిల్లీల కనువిందుజేస్తుంటే కెమెరాల జిక్కిండు, గబ్బు గబ్బు అయిన జగిత్యాల మున్సిపాలిటీ.. సొంతంగ చెత్తేరిపోస్తున్న కౌన్సిలర్ మేడం, కేసీఆర్ తాతా మా అమ్మకు జీతం పెంచవా?.. తన మన్మని మాట తప్ప ఎవ్వలిదింటడు.?, ఈగెల భయానికి ఎత్తిపోతున్న పెండ్లీలు..కోళ్ల ఫారంతోని ఆగమైన ఆ ఊరి బత్కులు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Pages

Don't Miss

Subscribe to RSS - TDP MPs Protest