TDP and YCP MPs

09:13 - March 28, 2018

ఢిల్లీ : గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లో కొనసాగుతున్న సీన్ రిపీట్ కానుందా? నేడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అకాశం వుందా అనే విషయంలో సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశమే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఎంపీలపైనే అందరి దృష్టి వుంది. కావేరీ బోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో గత వారం రోజుల నుండి సభను ఆర్డర్ లో లేకుండా చేస్తున్న అన్నాడీఎంకే ఎంపీల గందరగోళాన్ని సాకుగా చూపిస్తు స్పీకర్ సుమిత్రా మహాజన్ , ఇటు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు అదే తీరును అవలంభిస్తున్న తీరు సంగతి తెలిసిందే.ఈ నేపత్యంలో వాయిదాలతోనే సభను ముగించేలా ఎన్డీయే ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత వారంరోజులుగా ఇదే తీరు కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజుకూడా పలు పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు సిద్ధంగా వున్నాయి. ఒకపక్క అవిశ్వాస తీర్మానంపై చర్చకు మేము సిద్ధమే అంటు మరోపక్క సభలో ఆర్డర్ లేదనే సాకుతో తీర్మానాలపై నిర్లక్ష్యం వహిస్తున్న ఎన్డీయే ప్రభుత్వం తీరు ఈరోజుకూడా అదే కొనసాగే వాతావరణం కనిపిస్తోంది. కాగా మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాలలో ఏం జరుగనుందో వేచి చూడాలి.

08:52 - March 28, 2018

ఢిల్లీ : లోక్‌సభలో అవిశ్వాసం చర్చపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు 8 పార్టీలు..13 అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. సభలో గందరగోళం ఉన్నందున స్పీకర్‌ సభను వాయిదా వేస్తున్నారు. అయితే నేడు అవిశ్వాసం చర్చకు వస్తుందని అందరు భావిస్తున్నారు. మరో వైపు ఢిల్లీలో తెలుగు ఏంపీల నిరసనలు కొనసాగుతున్నాయి. అవిశ్వాసపై చర్చ జరిగితే సహకరించాలని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. కానీ అన్నాడీఎంకే ఏంపీలు మాత్రం స్పీకర్‌ విజ్ఞప్తిని వ్యతిరేకిస్తున్నారు. కావేరి బోర్డును ఏర్పాటు చేయాలని నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

21:31 - March 27, 2018

ఢిల్లీ : ఏడవ రోజూ పార్లమెంట్‌లో మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. అవిశ్వాసంపై చర్చ జరగకుండానే ఉభయసభలు వాయిదా పడ్డాయి. అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనతో లోక్‌సభను స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ బుధవారానికి వాయిదావేశారు. మరోవైపు టీడీపీ, వైసీపీ ఎంపీల విమర్శలు.. ప్రతివిమర్శలతో పొలిటికల్‌ హీట్‌ నెలకొంది.

ఉభయ సభలు వాయిదా..
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ.. ఎన్డీఏ సర్కార్‌పై వివిధ పార్టీలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండానే.. ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే..కావేరీ జలాలపై అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్‌ సుమిత్రా మేహజన్‌ వాయిదా వేశారు. వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన లోక్‌సభలో అన్నాడీఎంకే ఎంపీలు నిరసన కొనసాగించారు. సభ ఆర్డర్‌లో లేకుండా అవిశ్వాసం నోటీసులను ప్రవేశపెట్టబోనని స్పీకర్‌ అన్నారు. దీంతో విపక్షాలన్నీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇంకా ఎన్నిరోజులు ఇలా వాయిదా వేస్తారని విపక్షాలు ప్రశ్నించాయి. అవిశ్వాసానికి మద్దతుగా ఇంత మంది నిలబడ్డా కనిపించడంలేదా? అంటూ నినాదాలు చేశారు. అధికార విపక్ష నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో.. సభలో గందరగోళం నెలకొంది.

ఉభయ సభల్లో వాయిదాల పర్వం..
సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని.. అప్పుడే అవిశ్వాసం నోటీసు సభ ముందుకు తెస్తానని స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ స్పష్టం చేశారు. సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేసినా.. వినిపించుకోకపోవడంతో లోక్‌సభను బుధవారానికి వాయిదావేశారు. రాజ్యసభలోను ఇదే తీరు కొనసాగింది. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేయడంతో సభలో ఆందోళన నెలకొంది. సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను తొలుత 15 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇలా అయితే సభను నడపడం కష్టమంటూ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. సభను బుధవారానికి వాయిదా వేశారు.

శివప్రసాద్‌ వినూత్న రీతిలో నిరసన
మరోవైపు పార్లమెంట్‌ వెలుపల వైసీపీ, టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చేనేత కార్మికుడి రూపంలో ఆయన నిరసనను వ్యక్తం చేశారు. మోదీ ప్రధాని అయిన తర్వాత చేనేత రంగంపై జీఎస్టీ విధించడంతో వారి బతుకులు భారంగా మారాయన్నారు.

విజయసాయి తీరుపై మండి పడ్డ సీఎం రమేశ్
అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందన్న భయంతోనే బీజేపీ చర్చను అడ్డుకుంటోందని టీడీపీ ఎంపీలు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల విషయంలో టీడీపీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని అన్నారు. వైసీపీ ఓ పక్క కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ.. మరోవైపు రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోదీ కాళ్లకు మొక్కడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని సీఎం రమేష్‌ ప్రశ్నించారు.

టీడీపీ నాయకుల తీరుపై వైసీపీ నేతలు మండిపాటు
మరోవైపు టీడీపీ నాయకుల తీరుపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ప్రధానికి నమస్కారం మాత్రమే చేశానని అందుకు ఆయన ప్రతినమస్కారం చేశారని విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ ఆరోపణలపై చర్చకు సిద్ధమన్నారు. టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సుజనాచౌదరి, సీఎం రమేష్‌ ఆర్థిక నేరగాళ్లని విమర్శించారు. సీఎం చంద్రబాబును చార్లెస్‌ శోభరాజ్‌తో పోల్చవచ్చని విజయసాయి అన్నారు. రాజ్యసభలో జరిగిన కార్యకలాపాలపై పుటేజ్‌ ఇవ్వాలని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు విజయసాయి లేఖ రాశారు. వీడియో ఫుటేజ్‌ వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. అవిశ్వాస పరీక్షకు సిద్ధమంటూనే కేంద్రం వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తోంది. మరోవైపు ఏపీలోని అధికార ప్రధాన ప్రతిపక్షం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హోదా విషయాన్ని పక్కనపెడుతున్నారని జనం అంటున్నారు. 

10:50 - March 27, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అడ్మిట్ అవుతుందా ? లేదా ? అనేది ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం నాడు ప్రారంభమయ్యే సమావేశంలో స్పీకర్ తీర్మానానికి అనుమతినిస్తారా ? లేదా ? అనేది తెలియరాలేదు. ఈ సందర్భంగా టిడిపి లోక్ సభా పక్ష నేత తోట నర్సింహంతో టెన్ టివి మాట్లాడింది. ఏపీకి ఎలా అన్యాయం చేశారనే దానిపై పూర్తి వివరాలతో సన్నద్ధంగా ఉన్నామన్నారు. కేవలం వాగ్ధానాలు ఇవ్వడమే తప్ప ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదని, పైగా ఇబ్బంది కలిగించే విధంగా చేశారని విమర్శించారు. ఇలాంటి విషయాల్లో బిజెపి భయపడి ఉండవచ్చునని, అందుకే తీర్మానం విషయంలో అలాంటి వైఖరి కనబరుస్తోందన్నారు. హక్కులు సాధించే దాక తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. 

10:14 - March 27, 2018

ఢిల్లీ : ఏపీ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వైసీపీ, కాంగ్రెస్ విభజన ఆయుధ తీర్మానం అందచేసిశారు. గత కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో తీర్మానం తీసుకోవడం లేదంటూ స్పీకర్ పేర్కొంటున్నారు. సీపీఎం..ఆర్ఎస్పీ పార్టీలు నోటీసులను పంపారు. మొత్తంగా 80 మందికిపైగానే ఎంపీల మద్దతు లభించినట్లు సమాచారం.

ఎన్డీయే ప్రభుత్వం నుండి తాము ఎందుకు బయటకు వచ్చామో అర్థం చేసుకోవాలని ఎంపీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ఏపీని పట్టించుకోకపోవడం..ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే బయటకు వచ్చామన్నారు.

 

09:44 - March 27, 2018
08:28 - March 27, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానం..కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వ్యూహాని అనుసరించబోతోంది ? ఇప్పటి వరకు సభ ఆర్డర్ లో లేదని చెబుతూ వాయిదాలు వేస్తూ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానానికి మద్దతు పెరుగుతుండడంతో కేంద్ర నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా...విభజన హామలు అమలు చేయాలంటూ టిడిపి..వైసిపి..కాంగ్రెస్..పార్టీలు అవిశ్వాస తీర్మానాలు ఇవ్వగా సీపీఎం..ఆర్ఎస్పీ పార్టీలు నోటీసులు ఇచ్చాయి. దీనితో అవిశ్వాస తీర్మానం పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విపక్షాలన్నీ ఒక్కటి కావడంతో కేంద్రం తప్పించుకోలేని స్థితి నెలకొందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రిజర్వేషన్ల అంశంపై వెల్ లోకి వెళ్లి ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు వ్యూహాన్ని మార్చారు. వెల్ లోకి వెళ్లకుండా నిరసన తెలుపాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రంతో కలిసి పోరాటం చేద్దామని టీఆర్ఎస్ ఎంపీలు సూచించారు.

మొత్తానికి ఏడు అవిశ్వాస తీర్మానాలు సభ ముందుకు రానున్నాయి. దీనితో తీర్మానాన్ని పరిగణలోకి తీసుకుని వచ్చే వారం చర్చ...ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానానికి మొత్తం 80 మందికి పైగా ఎంపీల మద్దతు ఉందని సమాచారం. కాంగ్రెస్ 48, టిడిపి 15, సీపీఎం 9, వైసీపీ 8, ఆర్ఎస్పీ 1 బలంగా ఉంది. 

Don't Miss

Subscribe to RSS - TDP and YCP MPs