tdp

13:14 - September 9, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్, టీటీడీపీ మధ్య పొత్తుకు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ పార్టీతో టీటీడీపీ పొత్తుకు ఏపీ సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే చంద్రబాబు కొన్ని షరతులు విధించారు. ఈమేరకు టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పొత్తు విషయంలో టీటీడీపీ నేతలకే స్వేచ్ఛ ఇచ్చారు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవద్దంటూ ఆదేశించారు. అంతిమంగా పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలని సూచించారు. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆదేశించారు. బీజేపీనే టార్గెట్ చేసుకోవాలంటూ నేతలకు సూచించారు. పొత్తుల విషయంలో తాను తెరపైకి రానంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. 
   

20:05 - September 8, 2018

హైదరాబాద్ : టీడీపీ అధినేత..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ కు విచ్చేసారు. ముందస్తు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పార్టీ వ్యూహాలు, పొత్తులు వంటి విషయాలపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ముప్పై ఆరేళ్లుగా పార్టీని కాపాడుతున్న టీడీపీ కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పిలుపుతో తరలివచ్చిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. 

ఈరోజున తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఎదిగిందంటే దానికి కారణం నాడు టీడీపీ చేసిన కృషేనని, హైదరాబాద్ అభివృద్ధి కోసం నాడు ప్రపంచం మొత్తం తిరిగానని అన్నారు. హైదరాబాద్ లో చాలా ప్రాజెక్టులు నాడు తాను ప్రారంభించినవేనని, రాష్ట్ర విభజన తర్వాత తనపై గురుతర బాధ్యత పడిందని అన్నారు. తెలుగుజాతి మధ్య విభేదాలు ఉండకూడదని చెప్పానని, ఇద్దరికీ నష్టం కలగకుండా, ఒప్పించి మాత్రమే విభజన చేయాలని సూచించానని అన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన తరహాలోనే అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు.

15:56 - September 8, 2018

హైదరాబాద్‌ : ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో పలు సమస్యలను ఫేస్ చేస్తోంది. విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఐదు సంవత్సరాలు నిండకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించింది. దీంతో విపక్షాలు కూడా ఎన్నికలలో అవలంభించాల్సిన వ్యూహాలపై..పొత్తులపైనా కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీ.టీడీపీపై యోచించేందుకు హైదరాబాద్ కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుత రాజకీయ..పార్టీల విధి విధానాలపై నేతలతో ఆరా తీసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఆటుపోట్లు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదన్నారు. కమ్యూనిస్టు పార్టీలు, కో దండరాం పార్టీ వైఖరిపై నేతలను ఆరా తీశారు. తెలంగాణలో తెదేపా పట్ల ఆదరణ తగ్గలేదని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో 20 సీట్లలో 35 శాతం ఓటింగ్‌ పదిలంగా ఉందని.. తెదేపా బలం చెక్కు చెదరలేదని..ప్రజల్లో తెరాసపై తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

36 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు చూశామని అన్నారు. తెలుగు ప్రజల ఆదరాభిమానాలతో తెదేపాకు వన్నె తగ్గలేదన్నారు. వారి అభిమానమే పార్టీకి తరగని ఆస్తి అనీ..కార్యకర్తలే తెదేపా సంపదని వివరించారు. దేశంలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండాలన్నదే తన ఎప్పటికీ తన ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు తెలిపారు. 

08:20 - September 8, 2018

హైదరాబాద్ : అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకున్న వైరీ పక్షాలు ఏకమవుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న సామెత నిజం అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ఉప్పు నిప్పులా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఒక్కటవుతున్నాయ్. అధికార పార్టీని దెబ్బకొట్టేందుకు ఏకమవుతున్నాయి. దాదాపు 35 ఏళ్ల పాటు కత్తులు నూరుకున్ను పార్టీలు... తొలిసారి కలిసి పోటీ చేయబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రసమితిని ఓడించడమే లక్ష్యంగా ఏకమై ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి. కాంగ్రెస్ తో పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ స్థాపన 
తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నినాదంతో...కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1983 నుంచి 2014 వరకు కాంగ్రెస్ తో తలపడింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత....తెలుగుదేశం పార్టీ బలహీన పడింది. అటు కాంగ్రెస్‌ పార్టీ సైతం కేసీఆర్ ప్రభంజనం ముందు నిలవలేకపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పొత్తులకు సిద్ధమవుతున్నాయ్. 
టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు 
టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు ఉంటుందంటూ చాలా కాలంగా జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.  వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని తెలిపారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో టీడీపీతో పాటు అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తుపై అటు టీడీపీ కూడా సానుకూలంగానే ఉంది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు నాయుడితో టీటీడీపీ నేతలు చర్చలు జరిపారు. భావస్వారూప్యం ఉన్న పార్టీలతో కలిసి బరిలోకి దిగుతామంటూ టీడీపీ నేత పెద్దిరెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... శనివారం టీటీడీపీ నేతలతో భేటీ కానున్నారు. ఇందులో కాంగ్రెస్‌తో పొత్తుపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరి టీడీపీ, కాంగ్రెస్‌ మైత్రీ సవ్యంగా కొనసాగుతుందో ? లేదో ? చూడాలి. 

 

 

21:06 - September 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ పలు కీలక రాజకీయ పరిణామాలకు దారితీసే పరిస్థితులు నెలకొన్నాయి. కనీవినీ ఎరుగనటువంటి పొత్తులకు దారితీస్తోంది. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ బద్ధ శతృవైన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో టీడీపీతో పొత్తుకు సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి చర్చలు జరిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రేపు హైదరాబాద్ వస్తున్నారు. చంద్రబాబుతో ఉత్తమ్ సమావేశం కానున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై రేపు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పొత్తులపై చర్చించేందుకు కలుద్దామని ఉత్తమ్‌కు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ చేసి చెప్పారు. ఉత్తమ్ ప్రతిపాదనపై రేపటి టీటీడీపీ సమావేశంలో చర్చ జరగనుంది.

09:16 - September 6, 2018

 హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దుపై ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడిని పెంచాయి. ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు అంశాలకు టీఆర్ ఎస్ తెరతీయగా ఒకవైపు ప్రతిపక్షాలు విమర్శిస్తూనే...మరోవైపు ముందస్తుకు సన్నదం అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ ఎస్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. అధికారపక్షాన్ని ఎదుర్కొనేందుకు శత్రువులు మిత్రులు అవుతున్నారు. ఈక్రమంలోనే టీడీపీ, కాంగ్రెస్ అగ్రనేతల మధ్య మంతనాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పరస్పర విమర్శలు, ఆరోపణలు, పత్యారోపణలు చేసుకున్న వైరి పక్షాలు ఇప్పుడు దగ్గరవుతున్నాయి. గోల్కొండ హోటల్ వేదికగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియాతో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ భేటీ అయ్యారు. ఈనెల 8న ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతలు భేటీ కానున్నారు. బాబుతో భేటీకి ముందు కుంతియాతో రమణ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలావుంటే కుంతియాతో భేటీ యాదృచ్ఛికమేనని రమణ అంటున్నారు. హోటల్ లో అనుకోకుండా కుంతియాను కలిశానని తెలిపారు.

 

12:13 - July 23, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేకహోదా కల్పించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. టీడీపీ ఇప్పటికైనా ప్రత్యేకహోదా కోసం పోరాడాలని సూచించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఎక్కడికిపోయిందని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదా రావాలంటే హైకోర్టులో వ్యాజ్యం వేయాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు ఏపీకి అన్యాయం చేశాయని విమర్శించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై రాజ్యసభలో ప్రస్తావిస్తామని చెప్పారు.

21:03 - July 22, 2018

విజయవాడ : ఈనెల 24 వైసీపీ తెలపెట్టిన రాష్ట్ర బంద్‌పై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమల్లో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బంద్‌కు పిలుపు ఇచ్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు వైసీపీ బంద్‌ పిలుపు బూటకమని రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర సమస్యలు పార్లమెంటులో ప్రస్తావించకుండా ఎంపీలతో రాజీనామాలు చేయించిన వైసీపీ అధినేత జగన్‌... బంద్‌ నాటకాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా.. మోసం చేసిన బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 24న రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ బంద్‌కు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు ఈ బంద్‌ కొనసాగింపని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. జగన్‌ బంద్‌ పిలుపు నాటకమని రాజమండ్రిలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, విశాఖలో హెచ్‌ఆర్డీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండ్డిపడ్డారు. వైసీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇవ్వడాన్ని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తప్పుపట్టారు. పార్లమెంటులో మాట్లాడకుండా, అసెంబ్లీకి హాజరుకాకుండా బంద్‌కు పిలుపు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తిరుపతిలో సవాల్‌ విసిరారు. మరోవైపు 2019 ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు బీజేపీపై దుష్రచారంచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. విజయవాడలో జరిగిన బీజేపీ మైనారిటీ మోర్చ సమావేశానికి హాజరైన కన్నా.. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి ఊబిలోకూరుకుపోయిందని ఆరోపించారు.

వెనుకబడిన ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగే నైతిక హక్కు ఎక్కడిదని వామపక్షాలు ప్రశ్నించాయి. ప్రకాశం జిల్లా వెనుకబాటుతనంపై రాజకీయ ప్రత్యామ్నాయం అన్న అంశంపై ఒంగోలులో జరిగిన సదస్సుకు హాజరైన కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.. చంద్రబాబు ప్రభుత్వంపై విరుకుపడ్డారు. మొత్తంమీద వైసీపీ రాష్ట్ర బంద్‌ పిలుపుపై టీడీపీ నాయకులు మండిపడుతుండగా.. విభజన హామీల సాధనలో విఫలమైన చంద్రబాబుపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 

13:47 - July 22, 2018

హైదరాబాద్ : మోసానికి పర్యాయపదం చంద్రబాబు అని వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్ కు అందరూ మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా పోరాటానికి ఈ బంద్ కొనసాగింపు మాత్రమేనని అన్నారు. 

 

18:33 - June 19, 2018

అమరావతి : ఏపీలో నాలుగు నెలల పాటు నిర్వహించిన తెలుగుదేశం దళితతేజం కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30న నెల్లూరులో లక్ష మంది దళితులతో ముగింపు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఎన్నడూలేని విధంగా దళితులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టీడీపీ ప్రభుత్వమేని ఏపీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, జవహర్‌, నారాయణ చెప్పారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - tdp