sonia gandhi

17:01 - November 12, 2018

ఛత్తీస్ ఘడ్ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఇవాళ జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో బీజేపీ ఎలా నిలువరించాలో కాంగ్రెస్‌కు అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వంశాన్ని కాపాడుకునేందుకు, కులాలపైనే  దృష్టి పెడుతోందని’’ ప్రధాని నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ‘‘తల్లీ కొడుకులు బెయిల్ మీద బయట తిరుగుతూ నోట్లరద్దుపై నన్ను ప్రశ్నిస్తున్నారనీ..కానీ నోట్లరద్దు కారణంగానే వాళ్లు బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చిందని మర్చిపోయారు..’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్థానం ‘‘వంశం కోసమే ప్రారంభమై.. వంశంతోనే ముగుస్తుంది..’’ అని ప్రధాని నరేంద్రమోదీ రాహుల్ సొనియాలపై విరుచుకుపడ్డారు.  
నక్సలైట్ల హింసకు అడ్డుకట్ట వేసేలా ఛత్తీస్‌గఢ్ ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ‘‘మీ ఇళ్లలో నుంచి బయటికి రండి... తుపాకులు గురిపెడుతున్న వారిని ఓడించేలా ఓట్లు వేయండి...’’ అని ఆయన పిలుపునిచ్చారు. ‘‘గిరిజన చిన్నారుల జీవితాలను నాశనం చేస్తున్న అర్బన్ మావోయిస్టులకు’’ కాంగ్రెస్ పార్టీ కొమ్ముకాస్తోందంటూ ఇటీవల ప్రధాని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
 

17:38 - November 7, 2018

ఢిల్లీ: తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక  దాదాపు ఖరారు అయ్యింది. గత రెండు రోజులుగా ఢిల్లీ లోని కాంగ్రెస్ వార్ రూమ్ లో  రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ భక్త చరణ్ దాస్ నేతృత్వంలో 2 రోజుల పాటు కమిటీ సభ్యులు అభ్యర్ధుల ఎంపికపై చర్చించారు.  గతంలో ఎంపీలు గా పోటీ చేసిన వారు కూడా ఈసారి  శాసన సభ బరిలో ఉండేందుకు సిధ్దమవటంతో వారి విజయవకాశాలపై కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కూడా చర్చల్లో పాల్గొన్నారు. ఆమె పోటీ చేసే స్ధానంతో పాటు మెదక్ జిల్లాలోని మిగతా స్దానాలపై  పైనా కమిటీ సభ్యులు చర్చించారు. దాదాపు 20 స్ధానాల్లో ఉన్న ఆశావహులను బుజ్జగించాలని కమిటీ నిర్ణయించింది. రేపు ఉదయం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయి మళ్లీ తుది రూపు ఇస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు .యూపీఏ ఛైర్ పర్సన్  సోనియాగాంధీ నేతృత్వంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయి అభ్యర్ధులను ఖరారు చేస్తుంది. ఎల్లుండి అభ్యర్ధులను ప్రకటిస్తారు.

11:30 - October 23, 2018

రాయబరేలీ (ఉత్తరప్రదేశ్): "ప్రియాంక గాంధీ మిస్సింగ్" అంటూ సోనియా గాంధీ పార్లమెంటు నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీలో వెలసిన వాల్ పోస్టర్లపై కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాయబరేలీలో ఈ పోస్టర్లు సంచలనం సృష్టించాయి. ఈ పోస్టర్లలో ప్రియాంకా గాంధీ కనుబడుట లేదు.. నియోజకవర్గానికి రావడానికి కూడా ఆమెకు తీరిక దొరకటం లేదు. తన తల్లి తరుపున ప్రచారం చేయడానికి వచ్చారు.. మళ్లీ కనబలేదు. హర్‌చందాపూర్‌లో రైలు ప్రమాదం జరిగినా..ఎన్టీపీసీ పేలుళ్లు జరిగినా ఆమె కనీసం బాధితులను పలకరించడానికి కూడా రాలేదు..అంటూ పోస్టర్లలో ఓటర్లు ప్రశ్నించారు. 
ఈ పోస్టర్ల వ్యవహారం బీజేపీ పనే అంటూ కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తుంటే..బీజేపీ నేతలు ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. ఇది మళ్లీ ప్రియాంకాను రాయబరేలీలో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. రాయబరేలీని కూడా "కాంగ్రెస్ ముక్త్ నియోజకవర్గం"గా చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. 

 

 

11:29 - September 19, 2018

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన రాఫెల్ డీల్‌లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆరోపణల మీద ఆరోపణలు చేస్తుంటే.. ఎన్డీఏ హయాంలో చోటుచేసుకున్న అగస్టా వెస్ట్‌లాండ్ చాపర్ డీల్ మళ్లీ తెరపైకి వచ్చింది.

అగస్టా వెస్ట్‌లాండ్ హెలీకాప్టర్‌ల లావాదేవీలో బ్రిటన్‌కు చెందిన ఏజంట్ క్రిస్టియన్ మైఖల్‌ను భారతదేశానికి అప్పగించేందుకు దుబాయ్ కోర్టు అంగీకరించింది. గతంలో మైఖల్‌ను అరబ్ ఎమిరేట్స్‌లో అదుపులోకి తీసుకోగా.. అతనిని భారత్‌కు అప్పగించే అంశంపై అక్కడి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. వీవీఐపీ హెలికాప్టర్‌ల కొనుగోలులో మైఖల్ ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయాలు లంచాల రూపంలో చేతులు మారాయని  అతని మీద అభియోగాలు నమోదు చేశారు.

అగస్టా వెస్ట్‌లాండ్ కేసు 2007లో తెరపైకి వచ్చింది. అప్పటి యూపీఏ ప్రభుత్వం 12 అత్యంత అధునాతన హెలికాప్టర్లను రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వీవీఐపీల కోసం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఆరోపణలు రావడంతో 2014లో ఈ ఒప్పందాన్ని రద్దుచేసింది. అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీకి అనుబంధంగా ఉన్న ఫిన్‌మెక్కానికా కంపెనీ భారత్‌లో లంచాలు చెల్లించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఎయిర్‌ఫోర్స్ అధికారి ఎస్పీ త్యాగిని 2016లో అరెస్టు చేశారు.  

ఈ కుంభకోణంలో లంచాల విషయం బయటపడగానే డీల్‌ను రద్దు చేశామని, సదరు కంపెనీని బ్లాక్‌లిస్టులో ఉంచడంతోపాటు భారత్‌లో ఉన్న కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు.

అయితే.. ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. భారత్‌లోని కొందరు ఈ కేసులో సోనియా గాంధీ పాత్ర ఉండేవిధంగా కేసును మలచాలని తనపై వత్తిడి తెచ్చినట్టు  మైఖల్‌కు చెందిన లాయర్ దుబాయ్ కోర్టులో పేర్కొనడం విశేషం. సీబీఐ అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు.  

మైఖల్ భారత్‌కు వచ్చిన అనంతరం ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ చేయించే అవకాశం లేకపోలేదు. రాఫెల్ హెలికాప్టర్ల లావాదేవీలో పెద్దఎత్తున సొమ్ములు చేతు మారిందని.. ఇది ప్రధాని నేతృత్వంలోనే జరిగిందని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ అగస్టా వెస్ట్‌లాండ్ కేసులో మైఖల్ భారత్‌కు రావడం బీజేపీకి కలిసివచ్చే అంశమే. కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టేందుకు మైఖల్‌ను పావుగా వాడుకొనే అవకాశం లేకపోలేదు.

21:39 - July 9, 2018

విజయవాడ : ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఉమన్‌ చాందీ తెలిపారు. అక్టోబర్‌ 2 నుంచి ప్రతి ఇంటికి వెళ్లి... కాంగ్రెస్‌ పార్టీ విధివిధానాలను తెలియజేస్తామన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి రోజైనా అక్టోబర్‌ 31 నుంచి.. నవంబర్‌ 19 వరకు ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్‌ నాటికి.. బూత్‌ స్థాయి నుంచి నియోజకర్గం స్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు ఉమెన్‌ చాందీ. 

09:19 - July 5, 2018

ఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్‌లో నేత‌ల కుమ్ములాట‌ల‌పై హైక‌మాండ్ అల‌ర్ట్ అయ్యింది. నాయకులను గాడిలో పెట్టక పోతే .. వచ్చే ఎన్నికల్లో పార్టీ పుట్టి మునుగుతుంద‌ని భావిస్తున్న డిల్లీ పెద్దలు నేరుగా రంగంలోకి దిగారు. అసంతృప్తి నేత‌ల‌తో విడివిడిగా మంత‌నాలు జ‌రుపుతున్నారు. కస్సుబుస్సు నేతలకు స‌మ‌న్వయ మంత్రాన్ని ఉప‌దేశిస్తూ రాహుల్‌దూతలు బిజీగా ఉన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య కస్సుబుస్సుల పంచాయతీలు హైకమాండ్‌ను కలవరపెడుతున్నాయి.  ఓ వైపు ముంద‌స్తు ఎన్నికల  ఘంటిక‌లు మ్రోగుతుండ‌టంతో అసంతృప్త సెగలను చల్లబరిచేందుకు ఢిల్లీనాయకత్వం రంగంలోకి దిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో  అధికారం సాధించాలని పట్టుదలగా ఉన్న హస్తం పెద్దలు దూకుడు నేతలకు కళ్లెంవేసే వ్యూహాన్ని  అమల్లో పెట్టారు. 

ఇటివ‌ల టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు వ్వతిరేకంగా కొంద‌రు నేత‌ల సీక్రెట్ గా మీటింగ్‌ పెట్టడంపై డిల్లీ పెద్దలు సిరియ‌స్ అవుతున్నారు. వ‌రుస‌గా జ‌రుగుతున్న ఈ భేటిల‌పై ఆరా తీసిన రాహుల్ కార్యాల‌యం.. నేత‌ల అభిప్రాయాల‌ను వినాల‌ని నిర్ణయించింది. ఇప్పటికే ర‌హ‌స్య భేటిలు పెట్టుకున్న నేత‌లు రాహుల్ అపాయింట్ మెంట్ కోరిన నేప‌థ్యంలో .. ఆ భేటికంటే ముందే అసంతృప్త నేత‌ల మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు ఢిల్లీ దూతలు.  

అసంతృప్తి నేత‌ల‌తో వ‌రుస‌గా మూడు రోజులుగా సంప్రదింపులు సాగిస్తున్న అధిష్టానం దూతలు స‌లిం అహ్మద్, బోస్ రాజు,శ్రినివాస‌న్ లు.  అసంతృప్త నేతల అభిప్రాయాల‌ను క్రోడీక‌రించి ఓ నివేదిక‌ను రాహుల్ గాంధీ కి అందించనున్నారు. అయితే ఎన్నిక‌ల సీజ‌న్ మొద‌లైయ్యిన వేళ... పీసీసీ మార్పు అంశం స‌రికాద‌ని చెబుతున్న హైక‌మాండ్ దూత‌లు .. నేత‌ల ప‌ద‌వుల పంప‌కాల్లో అంద‌రినీ సంతృప్తిప‌రిచేలా నిర్ణయాలు ఉంటాయంటున్నారు.  టికెట్ల కేటాయింపులో ఎవ‌రి డిమాండ్స్ ఏంటీ ..? ఎవ‌రికి ఏ ప్రాంతంలో బ‌ల‌ముంది .. ?ఎవ‌రికి ఎక్కడ ప్రాధాన్యత క‌ల్పించాల‌నే అంశంలో డిల్లీ దూత‌లు క్లీన్ గా అబ్జ‌ర్వు చేస్తున్నట్లు స‌మాచారం.

నాయ‌కుల మ‌ద్య స‌మ‌న్వయం కుద‌ర్చడ‌మే ప్రధాన ఎజెండాగా సాగుతున్న ఏఐసీసీ కార్యద‌ర్శుల మంత్రాంగం .. రాహుల్ సందేశాన్ని నేత‌ల‌కు ఇంజెస్ట్ చేసే ప్రయ‌త్నం చేస్తున్నారు . ఏఐసీసీ దూత‌ల‌తో భేటి అయ్యిన వారిలో రేవంత్ రెడ్డి .. డీకే అరుణ .. కోమ‌టి రెడ్డి .. శ్రీ‌ధ‌ర్ బాబు .. భ‌ట్టి విక్రమార్కల‌తో పాటు మ‌రికొంద‌రు ఇత‌ర నేత‌లు ఉన్నారు . అయితే .. రాష్ట్ర స్థాయిలో అసంతృప్తి నేత‌ల అభిప్రాయాల‌ను తెల‌సుకుంటూనే .. క్షేత్రస్థాయిలో ద్వితీయ‌శ్రేణి నేత‌ల అభిప్రాయాల‌ను కూడా తెలుసుకునేందుకు రెడీ అవుతోంది  రాహుల్ టీమ్‌. 

మొత్తానికి నేత‌ల అసంతృప్తి జ్వాల‌లు భ‌విష్యత్తు కు ప్రమాధ ఘ‌టిక‌లు మోగిస్తుండ‌టంతో అల‌ర్టయిన హైక‌మాండ్ ఆప‌రేష‌న్ షురూ చేసింది. అయితే  ఈ డిల్లీ ఆప‌రేష‌న్ మంత్రాంగానికి అసంతృప్త నేత‌లు ఏమేర‌కు మొత్తబ‌డ‌తారో అనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది. 

13:41 - May 21, 2018

ఢిల్లీ : భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ 27వ వర్థంతి సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీలు రాజీవ్‌ గాంధీ స్మారకస్థూపం వద్ద నివాళులు అర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించారు. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ రాహుల్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. రాహుల్‌ గాంధీ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. ద్వేషాన్ని నమ్ముకున్నవారు జైల్లో ఉన్నట్లేనని మా నాన్న చెప్పారు. అందర్నీ ప్రేమించాలని, ప్రతి ఒక్కరిని గౌరవించాలని నాన్న నాకు నేర్పినందుకు ఆయనకు ధన్యవాదాలంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 1991, మే 21న తమిళనాడులోని పెరంబూరులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్‌గాంధీని ఎల్‌టీటీఈ హత్య చేసింది. రాజీవ్‌ గాంధీ వర్థంతి నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ అధినేత కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారానికి వాయిదా పడ్డ విషయం తెలిసిందే.

08:31 - May 9, 2018

ఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం ఊపందుకుంది. విజయపురి ఎన్నికల సభలో ప్రసంగించిన యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ- మోదీ పాలనపై ధ్వజమెత్తారు. మోదీకి 'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌' భూతం పట్టుకుందని విమర్శించారు. మోదినీ మంచి వక్తగా పేర్కొన్న సోనియా...ఉపన్యాసాలు కడుపు నింపవన్నారు. ఉపన్యాసాలతో కడుపులు నిండుతాయనుకుంటే మోది మరిన్ని ఉపన్యాసాలివ్వవచ్చని సూచించారు. మోది హయాంలో ధరలు ఆకాశాన్నంటాయని పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగిపోతుండడంపై సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేసిందని చెప్పారు. సోనియాగాంధీ రెండేళ్ల తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

 

20:58 - April 29, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ నిర్వహించిన జన ఆక్రోష్‌ ర్యాలీ ప్రజలదని, దేశ సమస్యల మీద ప్రజలు పోరాటం చేయడానికి చేపట్టిన ర్యాలీ అని కాంగ్రెస్ నాయకురాలు నేరేళ్ల శారద అన్నారు. మహిళల రక్షణ కోసం పనిచేస్తున్నామన్న మోదీ ప్రభుత్వం.. గత నెల రోజుల నుండి దేశంలో జరుగుతున్న సంఘటనలపై స్పదించడం లేదన్నారు. దేశంలో బ్యాంకులను మోసం చేసి దేశం దాటి వెళ్లపోతున్న వ్యాపారులను తీసుకురాకుండా ప్రభుత్వం వారికి సహకరిస్తోందంటున్న శారదతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 
 

 

17:44 - April 29, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ జనాకోశ్‌ ర్యాలీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. దేశం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో కాంగ్రెస్‌ నాయకత్వంలో కూడా నూతనోత్సాహం కనిపిస్తోంది. ర్యాలీలో ప్రసంగించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియా,మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌... ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 


 

Pages

Don't Miss

Subscribe to RSS - sonia gandhi