shopping malls

11:06 - November 6, 2018

ఢి్ల్లీ : దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలైపోయింది. ఇళ్లన్నీ దీపాల వెలుగుల్లో కళకళలాడుతున్నాయి. దీపావళి అందరి ఇళ్లలోను వెలుగులను పంచుతోందా? సంపన్నులకేనా దీపావళి. సామాన్యులకు కాదా? అవునే అనిపిస్తోంది నేటి ఆధునిక సమాజం. ఆధునికత మెరుపులకే కాగీ..మేలుకొలుపులకు కాదంటోంది. వెలుగు జిలుగులు దీపాల కొనుగోలులో మట్టి దీపాలు వెల వెలబోతున్నాయి. అవి తయారుచేసేవారి పాలిట శాపంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా హెచ్‌పీ ఇండియా సంస్థ ఓ వీడియోను రూపొందించింది. దీపాలు వెలిగించే ప్రమిదలను ఖరీదైన షాపింగ్‌ మాల్స్‌, దుకాణాల్లో కాకుండా వీధుల్లో అమ్మే వారి వద్ద నుంచి కొనుగోలు చేయాలని ప్రజలకు చెప్పడం కోసం హెచ్‌పీ ఈ ప్రకటనను రూపొందించింది. ఈ వీడియోను ‘ఉమ్మీద్‌ కా దియా’ పేరిట హెచ్‌పీ ఇండియా తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

‘మనం వేసే ఒక్క అడుగు ఎందరో జీవితాల్లో మార్పును తెస్తుంది. పండుగకు కావాల్సిన వస్తువులను వీధుల్లో అమ్మేవారి నుంచి కొనుగోలు చేయండి. వాటితో మన ఇంట్లో వెలిగించే దీపాలు వారి నివాసాల్లోనూ వెలుగునిస్తాయి.’ అని హెచ్‌పీ ఇండియా ట్వీట్‌లో పేర్కొంది. వీడియోలో ఓ బాలుడు తన తల్లితో కలిసి దీపావళి షాపింగ్‌ చేయడానికి ఓ మాల్‌కు వెళతాడు. అక్కడ ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మాల్‌ నుంచి బయటికి వస్తుండగా ఆ బాలుడికి రోడ్డు పక్కన ప్రమిదలను అమ్ముతున్న ఓ మహిళ కనబడుతుంది. ఆమె ఫొటో తీస్తాడు. ‘అమ్మా ఇవి కొనుక్కుందాం..’ అని తన తల్లిని అడుగుతాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోదు. పైగా ఆ మహిళను చులకనగా చూస్తుంది. అప్పుడు ఆ మహిళకు బాలుడు ఏ విధంగా సాయం చేశాడు? అన్న విషయమే ఇప్పుడు ఎందరినో మేలుకొలిపింది. సంప్రదాయమే కాదు సహాయానికి ముందడుగు వేయించింది. 
రెండు రోజుల్లో ఈ వీడియోను 20 లక్షల మందికిపైగా వీక్షించారు. ‘ఈ వీడియో నిజంగానే కన్నీరుపెట్టించింది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నెటిజన్ల హృదయాల్ని ద్రవింపజేసిన ఆ వీడియోను మీరూ చూడండి..!
 

11:32 - July 13, 2018

హైదరాబాద్ : ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై కొరడా ఝులిపించిన బల్దియా.. ఇప్పుడు సెల్లార్లపై గురిపెట్టింది. పెద్ద పెద్ద భ‌వ‌నాలు, షాపింగ్‌ మాల్స్‌లో పార్కింగ్ నిర్వహించాల్సిన సెల్లార్లను వ్యాపారాల‌కు అద్దెకిస్తున్నారు. భవన యజమానుల అత్యాశ పలు ప్రమాదాలకు దారి తీస్తోంది. ఇందులో అవినీతి అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. బల్దియా సెల్లార్లను టార్గెట్‌ చేసింది.

సెల్లార్లలో బిజినెస్‌ చేస్తున్న అక్రమార్కులు
ఫుట్‌పాత్‌ ఆక్రణలపై ఉక్కుపాదం మోపిన బల్దియా.. సెల్లార్ల అక్రమాలపై దృష్టి పెట్టింది. పార్కింగ్‌ నిర్వహించాల్సిన స్థలాలను దుకాణాలకు కేటాయిస్తున్న అక్రమార్కుల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.గ్రేట‌ర్ ప‌రిధిలో ప్రతి మెయిన్‌ రోడ్డులోనూ.. రోడ్‌సైడ్‌ వ్యాపారాలు మొదలు షాపింగ్‌ మాల్స్‌ వరకూ మంచి టర్నోవర్‌ ఉండడంతో.. ఒక్క అడుగు జాగాను కూడా ఖాలీగా ఉంచ‌కుండా అద్దెకిస్తున్నారు భ‌వ‌న యాజ‌మానులు. ప్రతి నెలా ల‌క్షలాది రూపాయలు అద్దె వ‌స్తుండ‌టంతో... చిన్నపాటి స్థలం ఉన్నా ఏదో ఒక వ్యాపారానికి లీజుకు ఇస్తున్నారు. భ‌వ‌న నిర్మాణానికి అనుమ‌తులు పొందిన‌ప్పుడు పాటిస్తామ‌న్న నిబంధన‌లు గాలికి వ‌దిలేసి.. అక్రమార్జనే ధ్యేయంగా... పార్కింగ్ ప్రాంతాల‌ను సైతం దుకాణాలుగా మలుస్తున్నారు. క‌నీస జాగ్రత్తలు కూడా తీసుకుకోకుండా హోట‌ల్స్, కిచెన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు వంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో నిత్యం ప్రమాదాలు జ‌రుగ‌తూనే ఉన్నాయి.

సెల్లార్లలో వ్యాపారాలు... రోడ్డుపై వాహ‌నాల‌ పార్కింగ్
ఇక ప్రతి వాణిజ్య, నివాస భ‌నానికి త‌ప్పని స‌రిగా పార్కింగ్ ఉండాలి. క‌మ‌ర్షియ‌ల్ నిర్మాణాల్లో పార్కింగ్‌ను సెల్లార్లలో ఏర్పాటు చేస్తారు. భ‌వ‌న నిర్మాణ ఎత్తును, విస్తీర్ణాన్ని బ‌ట్టి పార్కింగ్ స్థలాన్ని బల్దియా నిర్ణయిస్తుంది. కానీ సెల్లార్లలో వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో.. వాహ‌నాల‌ను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఏ రోడ్డులో చూసినా ట్రాఫిక్ ఇబ్బందులు త‌ప్పడం లేదు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న బల్దియా నిబంధనలను అతిక్రమించిన వారికి నోటిసులు జారీ చేస్తోంది. స్వచ్ఛందంగా తొలగించకుంటే.. తామే వాటిని తొలగిస్తాం అంటున్నారు. అవ‌స‌ర‌మైతే భ‌వ‌నాన్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. సెల్లార్ల అక్రమాలను టార్గెట్‌ చేసిన బల్దియా చివరి దాకా నిలబడి కఠిన చర్యలు తీసుకుంటుందా.. మధ్యలోనే ఒత్తిళ్ళకు తలొగ్గుతుందా అన్నది తేలాలంటే వేచి చూడాల్సిందే.

20:17 - December 14, 2017

ఆల్రెడీ రేషన్ షాపులు అంతంత మాత్రంగా మారాయి? వాటిని గాలికొదిలి మాల్స్ పేరుతో కొత్త దోపిడీకి తెరలేపుతున్నారా? ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ప్రభుత్వం సైడవ్వాలని చూస్తోందా? తక్కువ ధరలకే ఇస్తామంటూ మొదటికే మోసం తీసుకురానుందా? రిలయన్స్ లాంటి బడా సంస్థలు సామాన్యులకు తక్కువ ధరలకు ఎందుకిస్తాయి? రూపాయి పెట్టుబడి లేకుండా.. కోట్లు దండుకునే ఎత్తుగడా ఇది? చంద్రన్న మాల్స్ గుట్టేంటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. చంద్రన్నా ఎవరికోసమన్నా?రేషన్ షాపులను మరింత బలోపేతం చేసి సామాన్యుడి కడుపు నింపాల్సింది వదిలేసి.... మాల్స్ ఎందుకన్నా? గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు కాదన్నా..బియ్యం,కందిపప్పు, నూనె, కావాలన్నా..!! రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ లను..కాదు..మా బాగోగులు పట్టించుకో అన్నా..చంద్రన్నా .. అంటున్నాడు సామాన్యుడు..

మాల్స్ భాగస్వాములుగా రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపునెలా ఎంపిక చేస్తారు?ప్రజలకవసరమైన సరుకులు సరఫరా చేయలేనంత చేతకానిదా ఏపీ సర్కారు?ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి... దాని ద్వారా కార్పొరేట్లకు ఆదాయాన్ని పంచుతున్నారా? ఎవరికోసం ఈ మాల్స్? ఎవరికి లాభం? చంద్రన్నమాల్స్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దేశమంతా జీఎస్టీ ఉంటే ఏపీలో సీఎస్టీ ఉందని, హెరిటేజ్ రిలయన్స్ లకు మేలు చేసేందుకే ఈ నిర్ణయమని వైసీపీమండిపడుతోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ నడ్డి విరిచి సామాన్యుడిని దోపిడీ చేసి కార్పొరేట్లకు దోడిపెట్టే ప్రయత్నం ఇదని సీపీఎం విమర్శిస్తోంది..

చంద్రన్న మాల్స్‌ ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు, గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు తక్కువ ధరలకు వస్తాయా? అలా వస్తాయంటూ చెప్తున్న సీఎం మాటల్లో నిజమెంత? చంద్రన్న మాల్స్‌తో ప్రజలకు జరిగే మేలు కన్నా, కార్పొరేట్లకు చేకూరే లబ్ధి ఎక్కువా? రిలయన్స్ లాంటి సంస్థలు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా పెట్టకుండా గ్రామీణ ప్రాంతాల్లో దందాకు దిగుతున్నాయా? దానికి ఏపీ సర్కారు వత్తాసు పలుకుతోందా? ప్రజలకోసం చేస్తున్నామని చెప్పే పనుల అసలు గుట్టు తేల్చాలి.. కాకులను కొట్టి గద్దలకు వేసే కుట్రలను వ్యతిరేకించాలి..సామాన్యుడిని వినిమయ సంస్కృతికి తరలించి సొమ్ము చేసుకునే కుట్రలను తిప్పి కొట్టాలి.. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తూ, చౌక దుకాణాలను నాశనం చేసే మాల్స్ ను వ్యతిరేకించాలనే వాదనలు పెరుగుతున్నాయి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.


 

10:28 - February 21, 2017
09:55 - February 13, 2017

శ్రీకాకుళం : లక్షల రూపాయలు వెచ్చించారు. భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. కాని..ప్రారంభోత్సవాన్ని మాత్రం మరిచిపోయారు. పుష్కరంన్నర కాలం గడిచినా.. దుకాణసముదాయం అందుబాటులోకి రాలేదు. లక్షల రూపాయల ప్రజాధనం సిమెంట్‌ గోడల్లో కరిగిపోగా.. బిల్డింగ్‌ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో పాలకుల నిర్లక్ష్యాన్ని నిలువెత్తున వెక్కిరిస్తోంది.. ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ .. పాలకుల నిర్లక్ష్యం.. ఇలా జనం ముక్కుపుటాలు అదరగొడుతోంది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఊరి నడిబొడ్డున దిష్టిబొమ్మలా నిలిచిందీ దుకాణసముదాయం.

2001లో రూ. 40లక్షల ఖర్చుతో బిల్డింగ్‌ నిర్మాణం.....

2001 లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ... నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు... 16ఏళ్ల క్రితమే 40 లక్షల రూపాయలు వెచ్చించి.. ఘనమైన లక్ష్యంకోసం నిర్మించిన ఈ బిల్డింగ్‌.. అధికారులు, ప్రజాప్రతినిధుల తోలుమందం తీరుకు ఆనవాలుగా ప్రజలను వెక్కిరిస్తోంది. దాదాపు 50 షాపులు ఏర్పాటు చేసుకునే విధంగా రెండు అంతస్తుల్లో గదులను నిర్మించారు. ఒకే ప్రాంగణంలో మార్కెట్ ఉండాలన్న ధ్యేయంతో ఆర్ అండ్ బి శాఖ ఈ షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించింది. కాని నిర్మాణం పూర్తి అయ్యి దశాబ్దంన్నర గడిచినా .. ఇంతవరకు ఒక్క షాపు కూడా ఓపెన్‌కాలేదు.

16ఏళ్లుగా ఖాళీగా ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ ....

దశాబ్దన్నర కాలంగా ఖాళీగా వదిలేయడంతో భవనం శిథిలావస్థకు చేరుకుంది. పొత్తులోసొమ్ము.. ఇష్టార్యాజ్యంగా వాడుకోవచ్చనుకున్నారో ఏమో.. బిల్డింగ్‌ను కొందరు స్థానికులు ఇలా .. మరుగుదొడ్లలా మార్చేశారు. ఇక రాత్రయిందంటే.. ఈ ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందని.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదహారు ఏళ్లుగా నిరుపయోగంగా పడిఉన్న ఈ బిల్డింగ్‌కు ఇప్పటికైనా మరమ్మత్తులు చేసి.. ఉపయోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

 

10:11 - December 26, 2016

హైదరాబాద్ : బేగంబజార్‌లోని అజీజ్ ప్లాజాలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున ఎగిసిపడ్డ మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేసింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సకాలంలో ఫైర్‌ సిబ్బంది స్పందించడంతో.. సమీప భవనాలకు మంటలు వ్యాపించలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

06:52 - November 24, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల ర‌ద్దుతో గ్రేట‌ర్ హైదరాబాద్‌ ప‌రిధిలో వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. బిజినెస్‌ సరిగ్గా నడవక వ్యాపారాలు బోసిపోతున్నాయి. పాత నోట్లు చెలామణిలో ఉన్నప్పుడు కస్టమర్ల రద్దీతో కళకళలాడిన షాపులు.. ఇప్పుడు బోసిపోతున్నాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం మోటర్ వాహ‌నాల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ప్రభుత్వ ఖాజనాకు భారీ గండిపడుతోంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇబ్బందులు రోజు రోజుకు పెరిగిపోతునే ఉన్నాయి. నోట్ల ర‌ద్దు.. కొత్త నోట్ల సర్క్యూలేషన్‌ ఎక్కువ‌గా లేక‌పోవ‌డంతో వాహ‌నాల అమ్మకాలు భారీగా ప‌డిపోయాయి. వేలాదిగా సిటీకి వచ్చిన కొత్త వాహనాలు గోడౌన్ల‌కే ప‌రిమితం అయ్యాయి.

నిలిచిపోయిన కొనుగోళ్లు..
గ్రేట‌ర్ హైదరాబాద్‌లో ప్రతిరోజు వేలాది కొత్త వాహ‌నాలు రోడ్డు మీద‌కు వ‌స్తాయి. అయితే.. పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల మ‌నీ అందుబాటులో లేక వాహ‌నాల కోనుగోళ్లు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. గ‌త నెల‌తో పోలిస్తే 80 నుండి 90శాతం అమ్మకాలు ప‌డిపోయాయంటున్నారు వ్యాపారులు. అయితే కొందరు వ్యాపారులు పాత నోట్లు తీసుకుంటున్నా.. చాలామంది స‌సేమిరా అంటున్నారు. వ్యాపారాలు పూర్తిగా మంద‌గించ‌డంతో వ్యాపారాన్ని పెంచుకోవ‌డానికి డిడిలు అనుమ‌తించ‌డంతో పాటు స్వైఫింగ్ మిష‌న్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికంటూ చేప‌ట్టిన సంస్కర‌ణ‌లు.. వాహ‌నాల డీలర్లకు మాత్రం పెద్ద చిక్కులే తెచ్చిపెట్టాయి. అంతేకాదు.. నూత‌న వాహ‌నాల రిజిస్ట్రేష‌న్.. టాక్స్ ల ద్వారా ప్రభుత్వానికి వ‌చ్చే ఆదాయం కూడా భారీగా త‌గ్గిపోయింది. మరోవైపు చిరువ్యాపారులు బిజినెస్‌లేక ఉసూరుమంటున్నారు. ఇంకా ఎంతకాలం ఇలా ఖాళీ చేతుల్తో ఉండాలోనని ఆందోళన చెందుతున్నారు. 

19:24 - November 23, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దుతో వస్త్ర వ్యాపారం కుదేలయ్యింది. కోట్లలో జరగాల్సిన వ్యాపారం వేలకు పడిపోయింది. విజయవాడ వస్త్రలత కాంప్లెక్స్‌లో బిజినెస్‌ పడిపోవడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వస్త్ర వ్యాపారంపైనే ఆధారపడి జీవిస్తున్న కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:35 - November 19, 2016

విజయవాడ : పెద్దనోట్ల రద్దు వ్యాపార రంగాన్ని కుదిపేసింది. వ్యాపారం లేకపోవడంతో యజమానులు లబోదిబోమంటున్నారు. విజయవాడలో రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. అందులో పనిచేసే సిబ్బంది ఖాళీగా కూర్చొంటున్నారు. కేవలం వివాహానికి సంబంధించిన షాపింగ్ మాత్రమే జరుగుతోందని పలువురు పేర్కొంటున్నారు. రైతులు, కూలీలు, చిరు వ్యాపారులపై ఈ నోట్ల రద్దు ప్రభావం చూపిస్తోంది. సామాన్యుడు షాపింగ్ చేయలేని పరిస్థితి నెలకొంటోందని, చిల్లర మొదట అందుబాటులో ఉంచాలని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వీడియో క్లిక్ చేయండి.

 

08:28 - May 23, 2016

విజయవాడ : ఏపీలో రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడలో కాస్మొపాలిటన్‌ కల్చర్‌ పెరిగిపోతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మహానగరాలను తలదన్నేలా ఫుడ్‌ కోర్టులు వెలుస్తున్నాయి. వీకెండ్స్‌లో జనం మస్తుగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

రాష్ట్ర విభజనతో పెరిగిన ప్రాధాన్యత....
రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ ప్రాధాన్యత పెగిరింది. ఏడాది క్రితం వరకు వాణిజ్య కేంద్రంగా ఉన్న బెజవాడ ఇప్పుడు పరిపాలనా కేంద్రంగా కూడా మారింది. దీనికి తగ్గట్టుగానే నగరం విస్తరిస్తోంది. దీనికి కొత్త హంగులు తోడవుతున్నాయి. ఒకప్పుడు రాత్రి పది గంటలు దాటితే విజయవాడలో ఫుడ్‌ దొరకడం కష్టమయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. రైల్వేలు, రోడ్‌ మార్గాలపరంగా విజయవాడ పెద్ద కూడలి. వివిధ పనులపై నగరానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడుగా ఫుడ్‌కోర్టులు కూడా విస్తరిస్తున్నాయి. షాపింగ్‌ మాల్స్‌, ఐస్‌క్రీమ్‌ పార్లర్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో రాత్రివేళల్లో కూడా జనం మస్త్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఒకప్పుడు రాత్రి 10 గంటలు దాటితే నగరం నిర్మానుష్యంగా కనిపించేది. ఇప్పుడు అర్ధరాత్రి కూడా రోడ్లపై జనం బిజీబిజీగా కనిపిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫుడ్‌ కోర్టులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ లభించే వివిధ రకాల వంటకాలను రచి చూస్తూ ఆనందించే వారి సంఖ్య పెరుగుతోంది.

ఫుడ్‌ కోర్టులతో ఎంజాయ్‌ ప్రజలు....
నగరం విస్తరించే కొద్దీ ఇలాంటి ఫుడ్‌ కోర్టులు మరిన్ని వెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. పగలంతా బిజీ బిజీగా గడిపేవారు రాత్రి వేళల్లో ఫ్యామిలీతో కలిసి ఫుడ్‌ కోర్టులకు వస్తూ సేదతీరుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - shopping malls