Revanth Reddy

13:16 - September 12, 2018

హైదరాబాద్ : టి.టిడిపి నేత రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది.  తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఫీవర్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. రాజకీయ కుట్రలో భాగంగా అరెస్టులు చేశారని టీ.పీసీసీ ఆరోపించింది. మరో నేత గండ్ర వెంకటయ్య వీరయ్యకు పోలీసులు ఓ కేసు నిమిత్తం నోటీసులు జారీ చేశారు. తాజాగా టి.టిడిపి నుండి కాంగ్రెస్ లో జంప్ అయిన రేవంత్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

బుధవారం జూబ్లీహి ల్స్ హౌజింగ్ సొసైటీ కేసులో రేవంత్ కు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. తప్పుడు డ్యాక్యుమెంట్లతో సొసైటీ సొసైటీలో అక్రమంగా లబ్ది పొందారనే ఆరోపణలతో నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు 13 మంది సభ్యులకు కూడా నోటీసులు జారీ చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో తాను బిజీగా ఉన్నట్లు ప్రస్తుతం రాలేనని రేవంత్ స్పష్టం చేశారు. 

20:06 - August 22, 2018

హైదరాబాద్ : అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుయుక్తులు పన్నుతున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌తో, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో మైనారీటులు, మజ్లిస్‌ అప్రమత్తంగా ఉండాలని రేవంత్‌రెడ్డి సూచించారు. 

19:10 - May 16, 2018

హైదరాబాద్ : నరేంద్రమోదీ, అమిత్‌షాపై కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. నైతిక విలువలను పాతాళానికి తొక్కుతున్నారని విమర్శించారు. అఖండ భారతావనిని రక్షించే సైనికులమని చెప్పుకునే కమలనాథులు.. కర్నాటకలో ఎమ్మెల్యేలను కొనే నీఛ సంస్కృతికి ఎందుకు ఒడిగట్టారని మండిపడ్డారు. కాగా కన్నడ రాజకీయాలలో తలెత్తుతున్న ఉత్కంఠభరిత రాజకీయ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, అధ్యక్షులు అమిత్ షాలపై విరుచుకుపడ్డారు.

07:56 - May 8, 2018

2015లో తెలుగు రాష్ట్రాల్లో సంచనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నిన్న సమీక్షించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి ఈ కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో మల్లయ్య యాదవ్ (టిడిపి), లక్ష్మీ పార్వతి (వైసిపి), రాజమోహన్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:30 - May 8, 2018

హైదరాబాద్ : 2015లో తెలుగు రాష్ట్రాల్లో సంచనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నిన్న సమీక్షించారు. ఇవాళ కూడా మరోసారి సమీక్షించాలని నిర్ణయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి ఈ కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్నారు. ఆడియో టేపుల్లోని సంభాషణలపై ఫోరెన్సిక్‌ విభాగం ఇచ్చిన నివేదికపై కేసీఆర్‌ సమీక్షించారు. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ పూర్ణచంద్రరావు, ఈ కేసు జరిగిన సమయంలో ఏసీబీ డీజీగా పనిచేసిన ఏకే ఖాన్‌, పోలీసు ఉన్నతాధికారులు, న్యాయనిపుణులు సమీక్షలో పాల్గొన్నారు.

2015లో ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచనం సృష్టించింది. రాజకీయ దుమారం రేపింది.ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణలో నామినేటెడ్‌ ఎమ్మెల్యేను కొనుగోలు చేయబోయినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ఓటు కోసం రేవంత్‌రెడ్డి 50 లక్షల రూపాయలు ఎరచూపి, అడ్డంగా బుక్‌ అయ్యారు. అరెస్టై జైలుకు వెళ్లి, బెయిల్‌పై విడుదలయ్యారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో టేపులను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించారు. ఫోరెన్సిక్‌ నిపుణులు ఇచ్చిన నివేదికను ఏసీబీ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు.

2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు కేసీఆర్‌ ఓటుకు నోటు కేసును దర్యాప్తును మరింత వేగవంతం చేయాలి కేసీఆర్‌ నిర్ణయించారు. దీనిపై న్యాయ నిపుణలు అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి తీసుకున్నారు. ఈ కేసులో ఏయే కోర్టుల్లో ఎన్ని కేసులు ఉన్నాయి.. ఎవరెరు పిటిషన్లు వేశారు... వీటి పురోగతి ఏంటి.. అన్న అంశాలపై కేసీఆర్‌ సమీక్షించారు. ఇవాళ మరోసారి క్షణ్ణంగా సమీక్షించాలని నిర్ణయించారు. దీంతో ఈ కేసులో నిందితుల గుండెల్లో గుబులు మొదలైంది.

15:51 - April 12, 2018

హైదరాబాద్ : నగరం నడిబొడ్డున కాప్రాలో వెయ్యి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ కనుసన్నల్లో మెదిలే పెద్దలే ఈ భూమిని కబ్జా చేశారని రేవంత్‌ చెప్పారు. దీని వెనుక పాలకులు హస్తముందని, ఈ మొత్తం వ్యవహారంపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. 

12:46 - March 29, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. 12 వందల కోట్ల రూపాయలు విలువ చేసే రియల్ ఎస్టేట్ భూములు కేసీఆర్ బినామీ కంపెనీలకు దోచిపెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో నిర్మాణ స్థలాలు బినామీలుగా మారిపోయినవని రేవంత్ రెడ్డి విమర్శించారు. 12 వందల కోట్ల ఆస్థిని బినామీ కంపెనీలకు కేసీఆర్ ప్రభుత్వం దోచిపెట్టిందని విమర్శించారు. హైటెక్స్ లో ఎకరం భూమి ఎంత వుంటుందో అందరు ఆలోచించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ కంపెనీకి లీజ్ కిచ్చే ఆ కంపెనీ మరో కంపెనీకి లీజ్ కిస్తే అది రాష్ట్రానికి నష్టం కాదా. అని రేవంత్ ప్రశ్నించారు. మెట్రో రైల్ నిర్మాణంలో కేసీఆర్ కుటంబం భారీగా లబ్ది పొందుతోందని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. కేసీఆర్‌ బంధువుల భూముల విలువ పెంచేందుకే మెట్రో రైలు పొడిగిస్తున్నారని ఆరోపించారు. 2003లో ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఎయిర్‌పోర్ట్‌కు రవాణా వ్యవస్థను జీఎమ్మార్ సంస్థనే ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ..ఎల్ అండ్ టీతో కేసీఆర్‌ బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారని రేవంత్‌ ఆరోపించారు. 

18:38 - March 26, 2018

హైదరాబాద్ : ప్రజా సౌకర్యార్థం గత ప్రభుత్వాలు తలపెట్టిన మెట్రో రైల్‌ నిర్మాణంలో.... కేసీఆర్‌ తన రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చూసుకొని నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి. లాభ సాటి వ్యాపారాలు చేసుకునేందుకు మెట్రో రైల్‌ నిర్మాణాలను కేసీఆర్‌ అనేక సార్లు వాయిదాలు వేశారన్నారు. ఈ వాయిదాల వల్ల మెట్రోనిర్మాణ వ్యయం 4వేల 6వందల కోట్లకు పెరిగిందని ఆరోపించారు రేవంత్‌ రెడ్డి.  

10:50 - March 9, 2018

హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలంటే.. గ్రేటర్‌ ప్రజల మనస్సు చూరగొనాలి... గ్రేటర్‌లో ఉన్న నలభై శాతం సెటిలర్స్‌ను ప్రసన్నం చేసుకోకుండా అధికార పీఠం ఎక్కడం ఎలా సాధ్యం.. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న విశ్లేషణ.అందుకే హైదరాబాద్‌లోని సెటిలర్స్‌పై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది హస్తం పార్టీ.. ఇందులో భాగంగా సెటిలర్స్‌కు చేరువయ్యేందుకు స్పీడ్‌ పెంచారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్.

2019 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. అందుకోసం పటిష్టమైన ప్రణాళికతో అడుగులేస్తోంది. ఇప్పటికే బస్సుయాత్రతో సీఎం కేసీఆర్‌ హామీలను ఎండగడుతున్న కాంగ్రెస్‌ నేతలు.. ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్‌ ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎత్తిచూపుతూనే.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది సూటిగా చెబుతున్నారు.ఉత్తర తెలంగాణలో కారు జోరుకు బ్రేకులు వేసేందుకు యాక్షన్ ప్లాన్‌ సిద్ధం చేసుకుని... క్షేత్రస్థాయిలో దూసుకుపోతోంది కాంగ్రెస్‌ పార్టీ. కానీ.. సౌత్‌ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సీట్లు సాధించడం ఖాయమని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.. ఉత్తర తెలంగాణలో కూడా ప్రతి జిల్లాకు కనీసం మూడు నుంచి నాలుగు సీట్లు దక్కించుకుంటామనే ధీమాతో వారున్నారు. కానీ... దక్షిణ, ఉత్తర తెలంగాణ జిల్లాలనుంచి వచ్చే సీట్లతోనే అధికార పీఠం ఎక్కగలమా అన్న సందేహంలో ఉన్నారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేతలు. -

కాంగ్రెస్‌ పార్టీ దక్షిణ తకెలంగాణలో మెజార్టీ సీట్లు దక్కించుకున్నా.. అధికార పీఠం ఎక్కాలంటే గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అసెంబ్లీ స్థానాల సంఖ్య కీలకంగా మారనుంది. గ్రేటర్‌లో సీట్లు సాధించకుండా అధికారం సాధ్యం కాదనే భావన కాంగ్రెస్‌లో నేతల్లో అంతర్లీనంగా ఉంది.. అధికారం దక్కాలంటే... గ్రేటర్‌లో దాదాపు నలభైశాతం వరకూ ఉన్న సెటిలర్స్ కీలకంగా మారనున్నారు. సెటిలర్ల్స్ ఎటువైపు మొగ్గు చూపుతారో.. ఆ పార్టీదే అధికారమనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

ఇప్పుడు కాంగ్రెస్ కూడా సరిగ్గా ఇదే విషయంపై దృష్టి పెట్టింది.. సెటిలర్స్ మనసు చూరగొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాష్ర్ట విభజన తర్వాత కాంగ్రెస్‌ను దూరం పెట్టిన సెటిలర్స్‌కు చేరువయ్యేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతోంది పీసీసీ. అధికార పార్టీకి ధీటుగా తమ వ్యూహాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు హస్తం నేతలు. ఇతరపార్టీల్లో ముఖ్య నేతలుగా ఉన్న ఆంధ్ర సెటిలర్స్‌లోని కమ్మ, కాపు సామాజిక వర్గాల వారికి కాంగ్రెస్‌ కండువా కప్పేందుకు ముమ్మరంగా లాబీయింగ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.

సెటిలర్స్ టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్‌... ఆ పార్టీలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీడీపీ ఓటు బ్యాంకు తమ వైపు మళ్ళాలంటే.. ఇదే సరైన మార్గంగా భావిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. అందుకోసం ప్రత్యేకంగా ఆపరేషన్ ఆకర్ష్‌ అస్ర్తాన్ని ప్రయోగిస్తోంది. టీడీపీ ఓటుబ్యాంకును కొల్లగొట్టేందుకు టీఆర్ఎస్‌ దూకుడుగా వెళుతుంటే... కాంగ్రెస్‌ కూడా అదే స్పీడ్‌లో వెళుతోంది.
సెటిలర్స్ ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో.. అదే వర్గానికి చెందిన ముఖ్యనేతలను బరిలోకి దింపేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది కాంగ్రెస్. మొత్తానికి సెటిలర్స్‌లో ఆకర్షణగల వారిని ముందుపెట్టి... ఆయా వర్గాల ఓట్లు కొల్లగొట్టేందుకు చూస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. గ్రేటర్‌ పరిధిలో కనీసం సగం అసెంబ్లీ సీట్లైనా దక్కించుకోకుంటే.. తమ కలలు కల్లలయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు కాంగ్రెస్‌ పెద్దలు. అందుకే ఆదిశలో వేగంగా అడుగులేస్తున్నారు. సెటిలర్స్ మనసు గెలుచుకునేందుకు ఎన్ని ప్రయత్నాలుచేసినా.. గ్రేటర్‌లో పార్టీ కమిటీ సరిగ్గా లేకుంటే లక్ష్యం చేరుకోవడం అసాధ్యం. గ్రేటర్ కమిటీ పూర్తిగా చతికలబడిపోయిన నేపథ్యంలో ముందుగా కమిటీకి జవసత్వాలు నింపేందుకు చర్యలు తీసుకోవాలని పార్టీలోని సీనియర్ నేతలు సూచిస్తున్నారు.  

08:03 - March 8, 2018

సిరిసిల్ల : తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని.. అందులో టీఆర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు కొట్టుకుపోకతప్పదని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. తనపై ప్రజావ్యతిరేకతను తప్పించుకునేందుకే.. థర్డ్ ఫ్రంట్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర.. సిరిసిల్లకు చేరుకుంది. తెలంగాణ ఇచ్చింది.. ఇక్కడి వారి బాధలు అర్థం చేసుకునేది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ అధికారంలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - Revanth Reddy