reservations

14:31 - October 1, 2018

ఢిల్లీ : దేశంలో రిజర్వేషన్స్ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. అర్హత, ప్రతిభను బట్టే రిజర్వేషన్స్ వుండాలని కొందరు వాదిస్తుంటే..వెనుకబడిన వర్గాలను అభివృద్ది కోసం రిజర్వేషన్స్ కొనసాగించాలని మరికొందరి వాదన. ఈ నేపథ్యంలో రిజర్వేషన్స్ పై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  దళితులు, ఇతర వెనుకపడిన వర్గాలకు అందజేస్తున్న రిజర్వేషన్లపై జార్ఖండ్ లో జరిగిన ‘లోక్ మానథాన్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్న నేపథ్యంలో సామాజిక సామరస్యం సాధించేందుకు వీలుగానే అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు. కానీ రిజర్వేషన్ల కారణంగా ఆయా రంగాల్లో తీవ్రమైన శూన్యత ఏర్పడిందని వ్యాఖ్యానించారు. తొలుత పదేళ్లకు మాత్రమే అనుకున్న రిజర్వేషన్లను పెంచుకుంటూ పోవడం వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదని అభిప్రాయపడ్డారు. సామాజిక ప్రగతి సాధించాలంటే రిజర్వేషన్లు అవసరం లేదనీ..ఆలోచనలను, చేతలను మార్చుకోవాలని మహాజన్ తెలిపారు. అలా చేసినప్పుడే అంబేడ్కర్ కన్న కలలు సాకారం అవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

13:04 - September 26, 2018

ఢిల్లీ : ఇప్పటి వరకూ ప్రతిభ ఆధారంగా కాకుండా వర్గాల రిజర్వేషన్స్ పై ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇచ్చే పద్ధతికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. దీంతో ఆయా వర్గాల వారికి దేశ అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. వర్గాల వారీగా పదోన్నతులు ఆశించేవారికి ఇది ఇబ్బందికరమైన అంశంగా పరిగణించవచ్చు. ప్రమోషన్లలో ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్లు అసవరం లేదని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందేందుకు రిజర్వేషన్లు కల్పించడంపై 2006లో నాగరాజు కేసులో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసును ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ,ఎస్టీలు రిజర్వేషన్ ఫలాలు అనుభవించేందుకు కొన్ని షరతులు విధిస్తూ.. నాగరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై 2006లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కొన్నిరోజుల క్రితం సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని  ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం.. నాగరాజు కేసులో ఎలాంటి సమీక్షలు చేపట్టాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

 

18:24 - July 29, 2018

తూ.గో : కాపు రిజర్వేషన్లు సాధ్యం కావన్న జగన్‌పై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఫైర్‌ అయ్యారు. కాపు జాతి రిజర్వేషన్లపైన వ్యతిరేకతా ? లేక రిజర్వేషన్లపైనే వ్యతిరేకతా ? స్పష్టం చేయాలని ముద్రగడ డిమాండ్‌ చేశారు. తమ కులానికి రిజర్వేషన్‌ కల్పించే వారికే తమ ఓట్లు పడతాయని ముద్రగడ పద్మనాభం అన్నారు. తమను వంచించే వారిని గుర్తించి వారందరినీ వచ్చే ఎన్నికల్లో దూరం పెడతామని, దీనికోసం వ్యూహాలు రచించుకుంటున్నామని చెప్పారు. కాపు ఉద్యమం పుట్టిన జిల్లాలో.. ఉద్యమ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా.. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి.. తమ జాతిని అవమానించారని ముద్రగడ పద్మనాభం విమర్శించారు. పదవీకాంక్షతోనే జగన్‌ తమ జాతిని అవమానిస్తున్నారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి.. తమ కులానికి చెందిన నేతలతో విపరీతంగా ఖర్చు చేయిస్తూ.. వారి కుటుంబాలను ఆర్పేస్తున్నారని ముద్రగడ పద్మనాభం విమర్శించారు. జగన్‌ పాదయాత్ర ఖర్చులతో అప్పులపాలవుతున్న కుటుంబాలు.. ఆత్మహత్యలు చేసుకోవాలా అని ప్రశ్నించారు. 

 

16:13 - July 25, 2018

మహారాష్ట్ర : మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మరాఠా క్రాంతి మోర్చా చేపట్టిన మహారాష్ట్ర బంద్ కొనసాగుతోంది. బంద్‌ కారణంగా ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రజారవాణా స్తంభించింది. ఆందోళనకారులు బస్సులపై రాళ్లు రువ్వడంతో అధికారులు బస్సులు నిలిపివేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు టాక్సీలను ఆశ్రయిస్తున్నారు. థానేలో ఆందోళనకారులు బస్సులను ధ్వంసం చేశారు. లోకల్‌ రైళ్లను అడ్డుకున్నారు. రోడ్లపై టైర్లను తగులబెట్టడంతో వాహనాలు నిలిచిపోయాయి. ముంబై, ఔరంగాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలపై బంద్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఔరంగాబాద్‌లో అగ్నిమాపక వాహనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మంగళవారం నాటి రాళ్లు రువ్విన ఘటనలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ... ఔరంగాబాద్‌లో ఓ యువకుడు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో మరాఠాలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. 

21:22 - April 8, 2018

మహబూబాబాద్ : గిరిజనులకు రిజర్వేషన్లను పెంచడంలో విఫలమైన టీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి తరిమికొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. టీపీసీసీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా మహబూబాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఉత్తమ్‌ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గిరిజన రిజర్వేషన్లు పెంచడం సహా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. 

18:35 - March 26, 2018

హైదరాబాద్ : రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తూనే... అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే పాల్గొంటామన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నామన్న ఏపీ నాయకుల ఆరోపణలు సరికాదన్నారు. రిజర్వేషన్లపై మా పోరాటం కొనసాగుతుందని.. కానీ వెల్‌లోకి మాత్రం వెళ్లకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే... విభజన చట్టం ప్రకారం కేంద్రం చేసిన మోసాన్ని ఎండగడుతామన్నారు. కేంద్రంపై పోరాటం చేయాలంటే ఇరు రాష్ట్రాలు ఆరోపణలు చేసుకోవడం కాకుండా... కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు. 

16:39 - March 26, 2018

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కుల్ని కాలరాస్తోందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కేంద్ర పభుత్వాన్ని విమర్శించారు. ఎంపీలతో కేసీఆర్ భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్ మాట్లాడుతు..కేంద్రప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగినంతకాలం తాము రిజర్వేషన్స్ పై పోరాటాన్ని కొనసాగిస్తునే వుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత జనాభా పెరుగుతోందన్నారు. దీనికి అనుగుణంగా రిజర్వేషన్స్ ను అమలు చేయాల్సిన అవసరముందన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభయిన 5 తేదీ మార్చి నుండి రిజర్వేషన్స్ కోసం టీఆర్ఎస్ నిర్విరామంగా పోరాడతున్నామని ఎంపీ వినోద్ తెలిపారు. అలాగే కావేరీ బోర్టును ఏర్పాటు చేయాలని కర్నాటవాసులు కూడా పోరాడాతున్నారనీ..ఈ క్రమంలో మమ్మల్ని బూచిగా చూపించి ఏపీకి సమస్యలపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చింటంలేదన్నారు. ఒకే దేశం ఒకే చట్టం వుండాలని అందుకనే రిజర్వేషన్స్ కోసం పోరాడుతున్నామన్నారు. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని వినోద్ ఎద్దేవా చేశారు. రిజర్వేషన్స్ అంశం గురించి పలు పార్టీ నేతల మద్దతును కోరామన్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఈర్ తో టీఆర్‌ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. రిజర్వేషన్ల అధికారాలు రాష్ర్టాలకే అప్పగించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీలకు సీఎం దిశానిర్ధేశం చేస్తున్నారు. ఈ భేటీలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, కవిత, ప్రభాకర్‌రెడ్డి, సుమన్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావులు పాల్గొన్నారు. 

15:55 - October 22, 2017

మార్క్సిజం అవసరమని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ పేర్కొన్నారు. రంగనాయకమ్మ..తెలుగు సాహిత్యానికి...తెలుగు సమాజానికి పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో కథలు..నపలలు..వ్యాసాలు..సామాజిక..రాజకీయ అంశాలతో తెలుగు సాహిత్యంలో అంతులేని చర్చను రేకేత్తించారు. సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీ వాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన 'రామాయణ విషవృక్షం' ఒకటి. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. రచయిత్రిగా ఎదిగిన క్రమం..మార్క్సిజంపై ఆకర్షితులు కావడం..ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలపై రంగనాయకమ్మతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాలను తెలియచేశారు. ఆమె నిర్మోహమాటంగా..స్పష్టంగా చెప్పిన అభిప్రాయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

18:55 - July 14, 2017

గుంటూరు : రాష్ట్రం విడిపోయాక ఏపీ సచివాలయ ఉద్యోగులంతా అమరావతికి తరలించాకా వారికి అన్ని డిపార్ట్‌మెంట్లలో ప్రమోషన్లు ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఆర్ధికశాఖలో మాత్రం..దళిత, దళితేతర ఉద్యోగులలో వచ్చిన విభేదాల కారణంగా 9 నెలలుగా ప్రమోషన్లు ఆగిపోయాయి. ప్రమోషన్లలో తమ కోటా 15 శాతం భర్తీ చేయాలని దళిత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 2 ప్రకారం ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఎస్సీ ఉద్యోగులకు 15 శాతం, ఎస్టీ ఉద్యోగులకు 6 శాతం చొప్పున ఇవ్వాలి. అయితే రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఇచ్చిన ప్రమోషన్లలో దళిత ఉద్యోగులకు 15శాతం ప్రమోషన్లు ఇచ్చారని వారంతా తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్నారని ఓసీ, బీసీ ఉద్యోగులు చెప్తున్నారు. రాష్ట్రం విడిపోయాక ఇచ్చే ప్రమోషన్లలో మళ్లీ రూల్స్‌ అంటూ రిజర్వేషన్లు ఇస్తే తాము నష్టపోతామని జూనియర్లు ముందుకు వెళ్తారని ఓసీ, బీసీ ఉద్యోగులు వాదిస్తున్నారు.

ఆర్ధికమంత్రితో చర్చలు
దీంతో విభేదాలు తవ్రతరం కావడంతో అచివాలయంలో ఎవరివారు సమావేశాలు పెట్టుకోవడం, నిరసనలకు దిగడం జరుగుతోంది. ప్రమోషన్లలో రిజర్వేషన్‌ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని దళితేదర ఉద్యోగుల నాయకులు మండిపడుతున్నారు. ప్రమోషన్లలో రిజర్వషన్లు తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడితో కూడా చర్చలు జరిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. పైగా సమస్య మొత్తం సచివాలయానికి పాకింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. 

07:04 - April 21, 2017

హైదరాబాద్ : ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్లు పెంపు తర్వాత.. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ కొనసాగుతోంది. ఐదారు నెలల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. దీని కోసం సర్వే చేయాలని బీసీ కమిషన్‌ను కోరారు. దీంతో బీసీ కమిషన్‌ కసరత్తు మొదలు పెట్టింది. మరోవైపు రిజర్వేషన్ల పెంపు అంశంపై బీసీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుందనే దానిపై కేసీఆర్‌ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురు బీసీ నేతలను అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వంపై బీసీలకు ఎలాంటి అభిప్రాయం ఉందనే అంశాన్ని ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ ద్వారా కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రభుత్వ తాజా నిర్ణయం ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచినప్పుడు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
బీసీలకు రిజర్వేషన్లు పెంపు
అయితే.. బీసీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు పెంచి తీరుతామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. బీసీలకు ఉన్న 25 శాతం రిజర్వేషన్లను.. మరో ఏడెనిమిది శాతం పెంచే ఆలోచనను ప్రభుత్వం చేస్తోంది. ఇదే అంశాన్ని ఈరోజు జరిగే టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే 27న జరిగే బహిరంగ సభలో మరోసారి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే రిజర్వేషన్ల అంశంపై పొలిటికల్‌ జేఏసీతో పాటు ప్రజాసంఘాలు, పార్టీలు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేయలేదని.. దీంతో మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.

 

Pages

Don't Miss

Subscribe to RSS - reservations