rajyasabha

10:45 - September 12, 2018

ఢిల్లీ : నోటా...ఎందుకు తీసేశారు..అయ్యో వచ్చే ఎన్నికల్లో ఆప్షన్ లేకపోతే ఎలా ? అంటూ కంగారు పడకండి. పూర్తిగా చదవండి. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ను ఏర్పాటు చేశారు.

కానీ ఈ నోటా ఆప్షన్ ఆ ఎన్నికల్లో ఉండదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్లలో నోటా గుర్తును తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌కు సవరణలు సూచిస్తూ సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల బెంచ్‌ తీర్పు చెప్పింది. కేవలం రాజ్యసభ ఎన్నికలకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. లోక్ సభ, శాసనభ వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే నోటా ఉంటందని వెల్లడించింది. 

 

21:47 - August 1, 2017

ఢిల్లీ : వచ్చే ఏడాది నుంచి వంటగ్యాస్‌ ఎల్‌పిజిపై సబ్సిడీ ఎత్తివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాజ్యసభ దద్దరిల్లింది. కాంగ్రెస్‌, ఎస్పీ, వామపక్షాలు, బిఎస్పీ, టిఎంసి ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. సబ్సిడీని వదులుకోవడానికి ప్రజలే ముందుకు వస్తున్నారని, పేదలకు మాత్రం సబ్సిడీ కొనసాగించాల్సిందేనని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. ప్రపంచంలో ఓ వైపు చమురు ధరలు తగ్గుతున్నా పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచడంపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. జులై 1 నుంచి ప్రతినెల 4 రూపాయలు పెంచుతూ 2018 మార్చి నాటికి ఎల్‌పిజిపై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం లోక్‌సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.

 

13:36 - February 2, 2017

ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం మీడియాపై పడిందన్న అంశపై రాజ్యసభలో చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌ ఈ అంశాన్ని లేవనెత్తారు. పత్రికల సర్క్యులేషన్‌ పడిపోయిందని, పూర్వకాలం నుంచి అమల్లో ఉన్న ప్రభుత్వ ప్రకటనల జారీ విధానాన్ని మార్చాలని రాపోలు సూచించారు. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం మీడియా రంగంపై పండిందన్న వాదాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని సభ దృష్టికి తెచ్చారు.

13:34 - February 2, 2017

ఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్ష మందికిపైగా ఉన్నమెడికల్‌ సేల్స్‌ రిప్రజంటేటీవ్స్‌ రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నారు. వీరి సర్వీసు స్థితిగుతులు గురించి ప్రభుత్వం పట్టించుకోవడంతో సమ్మె చేయాల్సి వస్తోందని సీపీఎం సభ్యుడు తపన్‌ సేన్‌ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్‌ రిప్‌ల సర్వీసులు మెరుపరిచేందుకు చట్టం చేసినా నియమ, నిబంధనలు రూపొందించని అంశాన్ని సభ దృష్టికి తెచ్చారు. కార్మిక మంత్రిత్వ శాఖ నిర్వాహకంతో వీరి పరిస్థితి ఘోరంగా మారిందన్నారు.

21:57 - June 11, 2016

ఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లోని 27 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో  పలువురు ప్రముఖులు విజయం సాధించారు. మొత్తం 57 సీట్లకు గాను 30 సీట్లకు పోటీ లేకుండానే అభ్యర్థులు ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లోని నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఉత్తరాఖండ్‌లో ఒక స్థానానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్‌ నేత ప్రదీప్‌ టంటా గెలుపొందారు. మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలకు గానూ.. రెండింటిలో బీజేపీ గెలుపొందింది. బీజేపీ నుంచి ఎంజే అక్బర్‌, అనిల్‌ మాధవ్‌ దావే విజయం సాధించారు. మరో స్థానంలో కాంగ్రెస్‌ మద్దతుతో వివేక్‌ టంకా గెలుపొందారు. ఝార్ఖండ్‌లో రెండు స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, మహేశ్‌ పొద్దార్‌ రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏడు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించగా.. బీఎస్‌పీ రెండు స్థానాల్లో,  ఒక స్థానంలో కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ గెలుపొందారు. కర్నాటక నుంచి జైరాం రమేష్‌, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, నిర్మలా సీతారామన్‌ రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకున్నారు. 

 

12:41 - August 11, 2015

ఢిల్లీ : రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి జెడీశీలం ప్రత్యేకహోదాపై గళం విప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జెడీశీలం తిరుపతి మునికోటి ఆత్మహత్యను ప్రస్తావించారు. విభజన చట్టాన్ని సరిగా అమలు చేయాలని.. ప్రధాని, ఆర్ధికమంత్రి స్పష్టమైన విధాన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్‌, వీహెచ్‌లు కూడా జెడీశీలానికి మద్దతు పలికారు.

Don't Miss

Subscribe to RSS - rajyasabha