rahul gandhi

13:09 - November 19, 2018

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌ను ఉద్దేశించి సోమవారం (నవంబర్ 19) కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ప్రస్తుతం మీడియాలో హల్‌చల్ సృష్టిస్తోంది. ఈ ఉదయం ఆర్బీఐ బోర్డు సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయు.
‘‘ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ వెన్నుపూస గట్టిగా ఉన్నవాడని.... ప్రధాని నరేంద్ర మోదీకి తన స్థానం ఏంటో చూపిస్తాడని అనుకుంటున్నా’’ అంటూ ఆర్బీఐ బోర్టు సమావేశం ప్రారంభమైన కాసేపటికే రాహుల్ ట్వీఃట్ చేశాడు. 
కేంద్రానికి, ఆర్బీఐకి మధ్య అధికారాల పరిథి అంశంగా కోల్డ్‌వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అతి జోక్యాన్ని ఆర్బీఐ గవర్నర్ సుతిమెత్తగా వ్యాఖ్యానించడం ఈ రెండు వ్యవస్థల మధ్య ఆగాధాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ బోర్టు కొన్ని కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి మింగుడు పడకపోవచ్చని భావిస్తున్నారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ ట్వీట్‌ను ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎలా తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఆర్బీఐ స్వతంత్ర ఆదిపత్యాన్ని దెబ్బతీసేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందిని కాంగ్రెస్ నేతలు మోదీపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ వద్దనున్న రూ. 9 లక్షల కోట్ల నిధులను అభివృద్ధికి ఉపయోగించాలని కేంద్రం చూస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి విదితమే. 

17:51 - November 16, 2018

హైదరాబాద్ : జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైకిల్ ఎక్కనున్నారు. సైకిల్ అంటే టీడీపీ పార్టీ ఎన్నికల గుర్తు అనే విషయం తెలిసిందే. అంటే మహాకూటమితో ఒక్కటైన కాంగ్రెస్ - టీడీపీలు తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా విజయం సాధించి.. రానున్న ఎన్నికల్లో కూటమి బలాన్ని చూపించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు కలిసి తెలంగాణలో  ‘రోడ్ షో’లు చేయనున్నట్లుగా సమాచారం. అంతేకాదు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ కూడా వస్తారనే వార్తలు వస్తున్నాయి. 

Image result for rahul gandhi and chandrababuతెలంగాణలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ నెలాఖరులో ఈ రోడ్ షోలు నిర్వహించాలనేది మహా కూటమి భావిస్తోంది.  2019లో జరిగే ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలన్నీ ‘మహాకూటమి’గా ఏర్పడేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణలో జరిగే ఈ ఎన్నికలను రాహుల్, బాబులు ఓ  ప్రయోగంగా భావిస్తున్నారు. కాగా ఈ ప్రచారానికి ముందుగానే చంద్రబాబు, రాహుల్ గాంధీలు ఈ నెల 22న ఢిల్లీలో జరిగే బీజేపీయేతర పార్టీల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఈ వేదిక కీలకం కానుంది. 
ఇప్పటికే ఒక విడత రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారాన్ని పూర్తి చేశారు. మరోపక్క తెలంగాణలో మహాకూటమి తరఫున ప్రచారం చేస్తానని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ క్రమంలో 17వ తేదీ శనివారం నాడు కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాను కూడా ప్రకటించి వారికి  బీ-ఫారాలు అందించనున్నారు. నామినేషన్ల పర్వం ముగియగానే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం మొదలుకానుంది. 
 

14:52 - November 16, 2018

ఢిల్లీ: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంతో రాహుల్ గాంధీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. కోదండరాం జనగాం నుంచి పోటీ నుంచి తప్పుకునేందుకు ఒప్పుకున్నారు. దీంతో పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు లైన్ క్లియర్  అయ్యింది. ఇక తెలంగాణా అసెంబ్లీకి పోటీ చేసే కాంగ్రెస్పార్టీ అభ్యర్ధుల 3వ జాబితాను రేపు విడుదల చేస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ఆర్సీ కుంతియా చెప్పారు. మిగిలిన 19 నియోజకవర్గాల అభ్యర్ధుల పేర్లు రేపు ప్రకటించనున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు సీట్ల సర్దుబాటు విషయంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం జనగామలో పోటీ నుంచి తప్పుకున్నారు. టీజెఎస్కు ఒక ఎమ్మెల్సీ, రాజ్యసభ సీటు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లోని  సనత్నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి పేరు ఖరారు అయ్యింది. ఇంతకు ముందు విడుదల  చేసిన రెండు లిస్టులలో సనత్ నగర్ పేరు ప్రకటించలేదు, ఆనియోజక వర్గం నుంచి టీడీపీ పోటీ చేస్తుందనే వార్తలు వినిపించాయి. కానీ  ఆ సీటు చివరకి కాంగ్రెస్ చేజిక్కించుకుంది. సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రావడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలు దేరారు. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులకు బీఫారంలు పంపిణీ చేస్తుంది.

13:39 - November 16, 2018

ఢిల్లీ : మూడో జాబితాపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మూడో జాబితాలో ప్రకటించాల్సిన అభ్యర్థులను ఖరారు చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. రేపు 19 మంది అభ్యర్థులతో మూడో జాబితా విడుదల చేయనుంది. 
రాహుల్ గాంధీని కలిసిన ఆశావహులు  
రాహుల్ గాంధీని నాలుగు నియోజకవర్గాల ఆశావహులు కలిశారు. ఒక్క స్థానానికి ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. రాహుల్ వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. ఆశావహుల గెలుపు సామర్థ్యాలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. ఆశావహులను తన నివాసానికి పిలుపించుకుని, వారితో మాట్లాడుతున్నారు.
ఆశావహుల గెలుపు సామర్థ్యాలను అడిగి తెలుసుకున్న రాహుల్   
నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన నేతలు రాహుల్ గాంధీని కలిశారు. తుంగతుర్తిని ఆశిస్తున్న అద్దంకి దయాకర్, వడ్డేపల్లి రవిలతో రాహుల్ సమావేశం అయ్యారు. వీరితో వన్ టూ వన్ నిర్వహించారు. మిర్యాలగూడ సీటు ఆశిస్తున్న రఘువీర్‌తో, ఇల్లందు స్థానాన్ని కోరుతున్న హరిప్రియ, వెంకటేష్‌లతో, అదే విధంగా హుజూరాబాద్ టికెట్ కోరుతున్న కౌశికరెడ్డిలతో రాహల్ గాంధీ భేటీ అయ్యారు. ఆశావహుల గెలుపు సామర్థ్యాలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. రేపు 19 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేయనున్నారు.
ఇప్పటికే రెండు జాబితాల ప్రకటన
ఇప్పటికే రెండు జాబితాలను కాంగ్రెస్ ప్రకటించింది. మొదటి జాబితాలో 65 మందిని, రెండో జాబితాలో 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 75 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. రేపు 19 మందితో మరో జాబితాను ప్రకటించనుంది. ఇదే తుది జాబితా అని పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా తెలిపారు. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయనున్నారు. రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.

 

11:11 - November 16, 2018

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలకు ఆశా భంగం కల్గింది. పొన్నాల, పొంగులేటికి కాంగ్రెస్ అధిష్టానం మొండిచెయ్యి చూపింది. ఇద్దరికీ టికెట్లు ఇవ్వలేమని స్పష్టం చేసింది. జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య, ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డి పోటీ చేయాలని భావించారు. అయితే కూటమి పొత్తుల్లో భాగంగా జనగామ, ఖమ్మం స్థానాలను మిత్రులకు కేటాయించామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తేల్చి చెప్పారు. జనగామ, ఖమ్మం సీట్లపై పొన్నాల, పొంగులేటికి రాహుల్‌ గాంధీ స్పష్టీకరించారు. దీంతో పొన్నాల లక్ష్మయ్య, పొంగులేటి సుధాకర్ రెడ్డిల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. 
జనగాం, ఖమ్మం  సీట్లను మిత్రులకు కేటాయించాం : రాహుల్ 
‘‘మనం కూటమిగా ముందుకు వెళుతున్నాం మీ స్థానాలు (జనగాం, ఖమ్మం) పొత్తుల్లో భాగంగా మిత్రులకు కేటాయించాం’’అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలకు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో రాహుల్‌ను పొన్నాల, పొంగులేటి కలిసి ఆయనతో భేటీకి అపాయింట్‌మెంట్‌ కావాలని కోరారు. వెంటనే రాహుల్‌ ‘మీ సమస్యేంటో ఇక్కడే చెప్పండి’ అని సూచించారు. పొంగులేటి, పొన్నాల నుంచి మాట రాక ముందే జనగాం సీటు టీజేఎస్‌కు కేటాయించామని తెలిపారు. మూడున్నర దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నానని, ఈ సమయంలో టికెట్‌ రాలేదంటే ఇబ్బందిగా ఉంటుందని పొన్నాల ఆయనకు వివరించారు. ఇందుకు రాహుల్‌ స్పందిస్తూ దీనిపై మీరే కోదండరాంతో మాట్లాడితే బాగుంటుందని వారిద్దరికీ సూచించారు.
న్యాయం చేస్తామని పొంగులేటికి రాహుల్‌ హామీ
’ఖమ్మం స్థానాన్ని టీడీపీకి కేటాయించామని, మీకు తగిన విధంగా న్యాయం చేస్తాము’ అని పొంగులేటికి రాహుల్‌ హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో తాను లోక్‌సభకు పోటీ చేయాలనుకుంటే పొత్తులో సీపీఐకి కేటాయించారని, ఇప్పుడు టీడీపీకి ఇచ్చారని పొంగులేటి వాపోయారు.
కోదండరామ్‌తో పొంగులేటి మంతనాలు
జనగామ టికెట్‌ విషయంపై పొంగులేటి సుధాకర్ రెడ్డి వెంటనే కోదండరాంతో ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పటికే బీసీల్లో వ్యతిరేకత ఉందని, పీసీసీ అధ్యక్షునిగా చేసిన వ్యక్తికి టికెట్‌ ఇవ్వలేదంటే బాగుండదని, అందువల్ల పొన్నాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అందుకు స్పందించిన కోదండరాం ఇది తానుగా తీసుకున్న నిర్ణయం కాదని, రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందమని తెలిపారు. అయినప్పటికీ ఈ అంశంపై మరోసారి పునరాలోచించాలని పొంగులేటి కోరగా.. పరస్పరం మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందని కోదండరాం అన్నారు. తాను ఢిల్లీ వస్తున్నానని, రాహుల్‌తో భేటీ తర్వాత సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని కోదండరాం చెప్పారు.

 

10:48 - November 14, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల టికెట్ల కేటాయింపు కాకా పుట్టిస్తోంది. అన్ని పార్టీల్లో నెలకొంది. ప్రధానంగా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ లో ఈ సమస్య అధికంగా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు విషయంలో అధిష్టానం..టీ. కాంగ్రెస్ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఢిల్లీ వేదికగా తయారు చేసిన మొదటి జాబితా వేడి రగిలిస్తోంది. తమకు టికెట్ రాలేదని నేతలు గుర్రుగా ఉన్నారు.Image result for Telangana Congress leaders protest Gandhi Bhavan తాము తక్కువేం తినలేదని..తమకు కార్యకర్తలు..ప్రజల అండదండలున్నాయని...బరిలో దిగుతామని తేల్చిచెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే తమ నాయకుడికి టికెట్ ఎందుకు కేటాయించలేదంటూ ఆందోళనలు..నిరసనలకు దిగుతున్నారు. దీనితో కాంగ్రెస్ పెద్దలకు వీరికి ఎలా నచ్చచెప్పాలో తల గొక్కుంటున్నారు. 
తాజాగా రెండో జాబితా ప్రకటించేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు సిద్ధం చేసేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తును కర్నాటక భవన్ కు మార్చారు. ఎందుకంటే ఏఐసీసీ కార్యాలయం, వార్ రూమ్ ల వద్దకు ఆశావాహులు..నేతల తాకిడి ఎక్కువైంది. దీనితో ఏఐసీసీ నేతలు ఆ భవనాన్ని ఎంచుకున్నారు. రెండో విడత జాబితా నవంబర్ 14 (బుధవారం) లేదా నవంబర్ 15 (గురువారం) విడుదల చేయాలని కుంతియా ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి రెండో జాబితా విడుదలైతే ఎలాంటి పరిణామాలు నెలకొంటాయో వేచి చూడాలి. 
> యాకత్ పురా, బహదూర్ పురా, సికింద్రాబాద్, బోథ్ (ఎస్టీ) నిజామాబాద్ (అర్బన్), దేవరకొండ, ఇల్లందు, నారాయణపేట, ఖైరతాబాద్ స్థానాలపై కసరత్తు. 
> సామాజిక న్యాయం పాటించామన్న కుంతియా.
> అసంతృప్తులతో రాహుల్ గాంధీ మాట్లాడే ఛాన్స్.


 

18:22 - November 13, 2018

హైదరాబాద్: 65మంది అభ్యర్థులతో విడుదల చేసిన తొలి జాబితా తెలంగాణ కాంగ్రెస్‌లో కాక రేపిన సంగతి తెలిసిందే. టికెట్ల కేటాయింపుపై పలువురు సీనియర్లు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం జరిగిందని వాపోయారు. ఇలా అయితే కాంగ్రెస్‌కు నష్టం తప్పదని హెచ్చరించారు. టికెట్ల కేటాయింపులపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా స్పందించారు. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేసేలా తొలి జాబితా ఉందన్నారాయన. టికెట్లు రాని వారు అసంతృప్తికి లోను కావొద్దన్నారు. అందరికీ పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. అసంతృప్త నేతలతో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు బీసీలకు కేటాయించినట్టు వివరించారు. ఈ నెల 14 లేదా 15న రెండో జాబితా విడుదల చేస్తామని కుంతియా వెల్లడించారు.

16:28 - November 13, 2018

ఛత్తీస్ గఢ్ : జాతీయ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వివాహంపై వార్తలు ఎప్పటికప్పుడు వస్తునే వుంటాయి. ఆయన్ని వివాహం చేసుకుంటానంటు కొందరు యువతులు గతంలో ప్రకటించారుకూడా. రాహుల్ ప్రచారాలలో ఆయనకు ప్రపోజ్ చేసిన యువతులు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానంటూ మరో మహిళ వార్తల్లోకి వచ్చింది. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఆ మహిళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి ‘కాంగ్రెస్’ లో చేరింది. ‘కాంగ్రెస్’లో చేరడానికి గల కారణమేంటి? ఆ  మహిళను విలేకరులు అడిగారు. దీంతో రాహుల్ గాంధీ అంటే ఇష్టమని, ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని సమాధానం చెప్పింది. దీంతో మీడియా మిత్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. 

కాగా, గతంలో కూడా ఇదే తరహా సంఘటన ఒకటి యూపీలో జరిగింది. రాహుల్ ను పెళ్లి చేసుకోవాలని ఉందని ఓ దళిత యువతి పేర్కొంది. దళితులకు రాహుల్ ఎంతో సాయం చేస్తారని, అందుకే, ఆయన్ని పెళ్లాడాలనుకుంటున్నానని ఆ యువతి చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఛత్తీస్ గఢ్ లో తొలి విడత ఎన్నికలు జరిగిన నేపథ్యంలో సదరు యువతి రాహుల్ గాంధీని వివాహం చేసుకోవటానికే కాంగ్రెైస్ పార్టీలో చేరానని తెలిపింది. కాగా ఛత్తీస్ గఢ్ రెండో విడత ఎన్నికలు నవంబర్ 20 నుంచి జరగనున్న తరుణంలో ప్రచార కార్యక్రమాల్లో రాహుల్ బిజీగా ఉన్నారు.
 

15:01 - November 13, 2018

ఛత్తీస్‌గఢ్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌‌గాంధీని పెళ్లి చేసుకోవడానికి ఓ యువతి ఆ పార్టీలో చేరింది. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌‌గాంధీ ఛత్తీస్‌గఢ్‌లో ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన యువతికి రాహుల్‌ అంటే ఇష్టమట. అతను ఒప్పుకొంటే పెళ్లి కూడా చేసుకుంటానంటోంది.

ఇప్పుడు రాహుల్‌ కోసం ఆ యువతి కాంగ్రెస్‌లో చేరింది. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళ్లింది. అక్కడి మీడియా వర్గాలు ‘మీరెందుకు కాంగ్రెస్‌లో చేరారు?’ అని ప్రశ్నించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ...‘రాహుల్‌ని పెళ్లి చేసుకోవాలనే చేరాను’ అని చెప్పడంతో వారు షాక్ అయ్యారు. గతంలోనూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ దళిత యువతి రాహుల్‌ను పెళ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చింది. ఆయన దళితులకు ఎంతో సాయం చేస్తారని అందుకే పెళ్లాడాలనుకుంటున్నానని తెలిపింది.

 

20:33 - November 12, 2018

ఢిల్లీ : జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహల్ గాంధీతో  స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా తదితరులు సమావేశమయ్యారు. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాహుల్ పలు సూచనలు చేసినట్టు సమాచారం. ఈ జాబితాకు తుదిరూపు ఇచ్చేలా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో సొంత పార్టీకి చెందిన అభ్యర్థులు ఎంత మంది ఉన్నారు? ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన వారు ఎంతమంది ఉన్నారనే విషయమై రాహుల్ ఆరా తీసినట్టు సమాచారం.
 

 

Pages

Don't Miss

Subscribe to RSS - rahul gandhi