prof kodandaram

14:39 - August 26, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను సాధించేందుకే తాను టీజేఎస్ లో చేరానని మర్రి ఆదిత్య రెడ్డి పేర్కొన్నారు. ఈయన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడనే సంగతి తెలిసిందే. పార్టీ కార్యాలయంలో కోదండరామ్‌ ఆదిత్యరెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన సందర్భంగా ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. కోదండరాం జరుపుతున్న పోరాటంలో భాగస్వామ్యం కావాలనే ఉద్ధేశ్యంతో పార్టీలో చేరాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:35 - August 22, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటే.. వాటిని పరిష్కరించకుండా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరికాదన్నారు జనసమితి చైర్మన్‌ కోదండరామ్‌. మెదక్‌ జిల్లా చేగుంట, రుక్మాపూర్‌లలో పర్యటించిన కోదండరామ్‌... తెలంగాణ జనసమితి జెండాను ఆవిష్కరించారు. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలని.. మహిళలు, పిల్లలపై దాడులు జరగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఐదేళ్లు పరిపాలన చేయమని ఓట్లు వేస్తే.. ఎందుకు ముందస్తుకు వెళ్తున్నారో చెప్పకుండా ప్రజలను అపహాస్యం చేస్తున్నారన్నారు కోదండరామ్‌. 

06:50 - August 18, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, రైతు బీమా పథకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణలో ఒకమాట... ఢిల్లీలో ఒకమాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమంటున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో టెన్ టివి ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:57 - August 6, 2018

నిజామాబాద్ : టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా అరెస్ట్ అయిన రైతు సంఘాల నాయకులను పరామర్శించేందుకు వెళుతున్న కోదండరాంను బిక్ నూర్ టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ అయినవారిని పరామర్శించేదుకు వెళుతున్న మమ్మల్ని అరెస్ట్ చేయటం సరికాదనీ...అరెస్ట్ లతో తమకు ఆపలేరని కోదండరాం పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన రైతు సంఘం నేతల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ కాల్వ ద్వారా వుండే రైతులకు నీటిని విడుదల చేయాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులతో కలిసి అందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో రైతు కూలి సంఘం నాయకుడు ప్రభాకర్ ను నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా ప్రభాకర్ ను కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ ను పరామర్శించేదుకు వెళుతున్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ను పోలీసులు అరెస్ట్ చేసి తిరిగి హైదరాబాద్ కు తరలించారు.

15:14 - July 22, 2018

హైదరాబాద్ : రైతు బంధు పథకంలో అవకతవకలు జరిగాయని తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు కోదండరాం పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తామని, సోమవారం కలెక్టరేట్ల ఎదుట రైతు దీక్షలు చేపడుతున్నామన్నారు. 40 శాతం పాస్ పుస్తకాలు అందలేదని తప్పుల వల్ల రైతులు భూములు కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. తాము మూడు వేల మంది రైతులును కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నామని..సుమారు 40 శాతం మంది రైతులకు పాస్ పుస్తకాలు..చెక్ లు రాలేదన్నారు. 

17:00 - July 7, 2018

నిజామాబాద్‌ : తెలంగాణలో భస్మాసుర పాలన కొనసాగుతుందని జనసమితి అధినేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ప్రజలు ఓటు ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రాజెక్టుల పేరుతో జేబులు నింపుకుంటున్నారని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ, ధర్పల్లి, ప్రాజెక్టు రామడుగులో తెలంగాణ జన సమితి పార్టీ జెండాను కోదండరామ్‌ ఆవిష్కరించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసి అధికారం సాధిస్తుందని కోదండరామ్‌ అన్నారు.
 

21:32 - June 30, 2018
17:09 - June 30, 2018

హైదరాబాద్ : పాలించడం చేతకాకనే ముందస్తు ఎన్నికలు అంటూ మాట్లాడుతున్నారని టీజేఎస్ వ్యవస్థాకుడు కోదండరాం పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే సంకేతాలపై టీజేఎస్ అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా కోదండరాంతో మాట్లాడింది. పాలించడం చేతకాక సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు టీజేఎస్ ఎప్పుడూ సిద్ధమేనని ప్రకటించారు. రైతు బంధు పథకంతో నిజమైన లబ్దిదారుడికి న్యాయం జరగడం లేదని, టీజేఎస్ క్షేత్ర స్థాయిలో నిజాలు బహిర్గతమయ్యాయని తెలిపారు. 

11:44 - June 25, 2018

హైదరాబాద్ : 2019 ఎన్నికల కోసం గ్రామం నుండి రాష్ట్రం వరకు పార్టీని పటిష్ట పరచాలని టీజేఎస్ నిర్ణయించింది. అందులో భాగంగా మల్లాపూర్ లో ఉప్పల్ నియోజకవర్గం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు కోదండరాం కమిటీల ఏర్పాటు..అవశ్యకతపై కార్యకర్తలకు దిశా..నిర్ధేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఎన్నికలకు పార్టీ నేతలు, కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేయాలన్నారు. 

11:11 - June 19, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఏర్పాటైన టీజేఎస్‌ నేతలపై... టీ కాంగ్రెస్‌ కన్ను పడిందా...? కోదండరామ్‌ నేతృత్వంలోని టీజేఎస్‌ నేతలను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందా...? టీజేఎస్‌లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే... అవుననే సమాధానం వస్తోంది. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల భూసేకరణపై కేసులువేసి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన టీజేఎస్‌ నాయకురాలు, మహిళా న్యాయవాదిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ పావులుకదపడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

2019 ఎన్నికల్లో అటు అధికార టీఆర్‌ఎస్‌, ఇటు ప్రతిపక్షాలకు దీటైన జవాబు ఇవ్వాలనుకొంటున్న తెలంగాణ జనసమితికి టీ కాంగ్రెస్‌ నుంచి కొత్త సవాల్‌ ఎదురువుతోంది. టీజేఎస్‌లోని బలమైన నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రయత్నాలు కోదండరామ్‌ను కలవారానికి గురిచేస్తోంది. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై కేసులు వేసి... తెలంగాణ సర్కారును ముప్పతిప్పులు పెట్టిన న్యాయవాది రచనారెడ్డి  టీజేఎస్‌ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ జనసమితి ఆవిర్భావ వేదిక నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రచనారెడ్డిని తమవైపు తిప్పుకొనేందుకు టీ కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. మంచి వాద్దాటి  కలిగివున్న రచనారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టొచ్చనే ఉద్దేశంతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు...ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... రచనారెడ్డిని కలిసి చర్చించినట్టు  అటు టీజేఎస్‌, ఇటు కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. 

ఇటీవల టీజేఎస్‌ తమ అధికార ప్రతినిధులతోపాటు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే ప్యానెల్‌కు రచనారెడ్డిని ఎంపిక చేసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న రచనారెడ్డి... కామారెడ్డి జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డిలో పలుసార్లు పర్యటించి టీజేఎస్‌ తరుపున ప్రచారం కూడా చేశారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆమె టీజేఎస్‌కు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు.. టీజేఎస్‌ అధికార ప్రతినిధి, టీవీ చర్చా కార్యక్రమాల ప్యానెల్‌ నుంచి తన పేరు తొలగించాలని పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌కు లేఖ రాయడంపై ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి. 

టీజేఎస్‌లోని బలమైన నేతలను తమ పార్టీ వైపు తిప్పుకొనేందుకు టీ కాంగ్రెస్‌ నేతలు తెరతీసిన ఆపరేషన్‌ ఆకర్ష్‌... ఇంతటితోనే ఆగుతుందా... లేక ఇంకా ఎవరిపైనా లక్ష్యాన్ని గురిపెడతారా.. అన్న అంశం తెలంగాణ జనసమితి నాయకులను కలవరానికి గురిచేస్తున్నట్టు కనిపిస్తోంది. భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.  
-----------------------------------------------

Pages

Don't Miss

Subscribe to RSS - prof kodandaram