pregnant women

22:04 - October 13, 2018

హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కోపం వచ్చింది. నెటిజన్లు అందునా మగాళ్లపై ఆమె ఓ రేంజ్ లో ఫైర్ అయింది. ఉచిత సలహాలు ఇవ్వకండి అంటూ సీరియస్ అయింది. మ్యాటర్ ఏంటంటే.. ప్రస్తుతం గర్భంతో ఉన్న సానియాకు నెటిజన్లు, అందులోనూ పురుషులు ఎక్కువగా సలహాలు ఇవ్వడాన్ని సానియా జీర్ణించుకోలేకపోయింది. గర్భంతో ఉన్నప్పుడు మేం శవం మాదిరిగా ఓ చోట పడి ఉండాలా? అని తనకు ఉచిత సలహాలిచ్చే వారిని ఆమె ప్రశ్నించింది. 

సానియా తన తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. మరికొన్ని రోజుల్లో బిడ్డకు జన్మనివ్వనున్న సానియా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. కడుపుతో ఉన్నావ్.. నువ్వు ఒక్కచోట కుదురుగా ఉండు అంటూ కామెంట్లు చేశారు. దీంతో తట్టుకోలేకపోయిన సానియా సీరియస్ అయింది. ‘నాకు సలహాలిచ్చే వారిలో అధికంగా మగవారే ఉన్నారు. గర్భంతో ఉన్న 9 నెలలపాటు సుప్తావస్థలో ఉండాలని చెబుతున్నారు. కడుపుతో ఉండటమంటే అది వ్యాధి సోకినట్లు కాదు. అంటరానివారుగా గర్భిణులను ట్రీట్ చేస్తున్నారు. అందరూ సాధారణ మనుషులమే. గర్భిణులు కూడా ఇతరుల్లాగ స్వేచ్ఛా జీవనాన్ని ఇష్టపడతారు. చులకనగా చూసే ఆలోచనల్ని మీ మెదడు నుంచి తీసేయాలి. మీరూ ఓ తల్లి గర్భం నుంచి వచ్చినవారే కదా’ అంటూ సానియా వరుస ట్వీట్లలో తన అభిప్రాయాల్ని షేర్ చేసుకుంది.

20:26 - July 10, 2018

టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కార్యకర్తలు చింపిన ఇస్తరాకే అయితున్నదిగదా..? మొన్న బెల్లంపల్లి కాడ అవిశ్వాస తీర్మానం.. నిన్న రామగుండం కాడ... ఇయ్యాళ వేములవాడ కాడ.. వాళ్లదాంట్లె వాళ్లే విశ్వాసాలు లేకుంట బత్కుతున్నరు.. ఇంకో నాల్గురోజులు ఇదే స్పీడుతోని అంబాసిడర్ ముంగటికి వొయ్యెనాంటే.. కాంగ్రెసోళ్లు పెద్దగ కష్టపడవల్సిన పనేం ఉండదేమో..

నక్కవుట్టి నాల్గు రోజులు గాలే నా ఎక్సుపీరియన్సు ఎవ్వలికున్నదని ఎక్కిరిచ్చిందట అగో అట్లనే ఉన్నది.. చంద్రాలు కొడ్కు లోకేశం ముచ్చట గూడ.. నేను వుట్టెటప్పటికే మా తాత ముఖ్యమంత్రిగుండే.. నేను శెడ్డి ఏస్కోని బడికి వొయ్యెతప్పుడే మా నాయిన ముఖ్యమంత్రిగుండే.. అయినా నా మీద గింత అవినీతి మచ్చవడ్డదా అంటున్నడు..

నాల్గురు బీసీ పోరగాళ్లు ఒక్కతాన గూడి.. టూ బై ఫోర్ చాయజెప్పి.. పైసలు నువ్వుగట్టుమంటే నువ్వుగట్టుమని.. అద్దగంట ముచ్చట వెట్టుకోని రేపు పొద్దుగాళ్ల వర్కళ్ల రాజ్యాధికారం ఎట్లొస్తదని ఆలోచన జేశి ప్రెస్ మీటింగు వెట్టి ఎవ్వలికి వాళ్లు ఎల్లిపోవుడు.. తర్వాత ఇదే నాల్గురు మళ్లొక నెల రోజులకు గూడి మళ్ల చాయి మళ్ల ప్రెస్ మీటు.. మళ్ల ఎవ్వలింటికి వాళ్లు.. గిదా రాజ్యాధికారం సాధించే కథ..?

మాటలు జెప్పుమంటే ఏమన్న మాటలా అవ్వి.. గా మూడేండ్ల కింద నారాయణ ఖేడ్ ఉప ఎన్నికైందిగదా.?. ఆ ఉపఎన్నికలకోసం ప్రచారానికి వొయ్యిండు కేసీఆర్ అల్లుడు హరీష్ రావు.. పొయ్యి ఆ నియోజకవర్గాన్ని సూశి వైసు కన్నీళ్లు గార్చిండు.. ఇగ ఒక ఊరికి వొయ్యి ఈ ఊరిని నేను దత్తత దీస్కుంటున్నాని చెప్పిండు.. ఓట్లువడంగనే ఊరులేదు గీరు లేదు.. దత్తత గాదు సారే పత్తకు లేడు.. పాపం ఆఊరిగోస జూడుండ్రి..

చట్టాలను ఉల్లంఘించెటోళ్లు మీద కేసులు వెట్టి జైలుకు తోలిస్తున్నప్పుడు.. మరి విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించి విద్యార్థులను సద్వుకు దూరం జేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీద.. విద్యామంత్రి కడియం శ్రీహరి మీద గూడ కేసులు వెట్టి జైలుకు వంపాలేగదా... నెల రోజులాయే బడులు సుర్వై.. ఇప్పటికి ఒక్కసారి వచ్చింది లేదు పాఠం జెప్పింది లేదు.. ఇగ మరి ఇది చట్టం ఉల్లంఘన కిందికి రాదా..?

అంగట్ల పశులను కొన్నట్టే ఉన్నది ఎంపీటీసీల కొనుగోలు తెలంగాణల.. ఎవ్వని బర్రైతేంది మన దొడ్లె పెండవెట్టిందా లేదా అన్నట్టే సూస్కుంటున్నరు.. ఒక్కొక్క ఎంపీటీసీకి నాల్గు లక్షల రూపాలు ఖరీదు వెట్టి కొనుక్కున్నడంటే ఆ ఎంపీపీ ఎంత సంపాయించాలే.. మళ్ల మందిని ముంచాల్సిందేగదా.?. అమ్ముడువొయ్యే ఎంపీటీసీలకు శిగ్గులేదు.. కొనుక్కునెటోనికి గూడ లేదు.. జగిత్యాల జిల్లాల ఒక కథ బైటవడ్డది సూడుండ్రి..

తెలంగాణ రైతులకు ఆన్ లైన్ అంటె హార్ట్ ఫెయిల్ అయినంత భయమైతున్నది.. భూ ప్రక్షాళణ పేరు మీద వేల మంది రైతుల బత్కు ఆగానికొచ్చింది.. ఒకలి భూమి ఒకలికి వడి.. కొంతమందికి సంగం భూమే ఎక్కింది.. కొంతమందికి మొత్తం భూములే లేకుంట వొయ్యినయ్... ఆగమాగం చెందన చెందన అయ్యింది. నాకు తెల్చి ఒక్క కేసీఆర్ ఇంటోళ్ల భూములు తప్ప అందరియి ఆగమే ఉన్నట్టున్నయ్ కాదా మరి.. ఇగజూడుండ్రి..

ఎంకి పెండ్లి సుబ్బిసావుకొచ్చిట్టుగాదు.. సుబ్బి సావే ఎంకిపెండ్లికొచ్చినట్టుంది ఈ వానలు జూస్తుంటే.. పాపం ఆ మహారాష్ట్రల అడ్డగోల్గవానలు వడి.. అక్కడి జనం తక్లైవైతుంటే.. వానలు ఎప్పుడువడ్తయా అని ఎదురు సూస్తున్న తెలంగాణలకు మహారాష్ట్ర వర్దొస్తున్నది.. గోదావరి నది.. గట్టిగనే వారుతున్నది.. ఇగ మన కళల ప్రాజెక్టుల కట్కాలు ఏడికాడ ఆగిపోయినయట.. 

20:24 - July 9, 2018

రామగుండం రాజకీయం రంజుకొచ్చింది గదా..? ఇప్పటికే ఉత్తర తెలంగాణల పట్టుగోల్పోతున్న టీఆర్ఎస్ పార్టీకి రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ షాకిచ్చిండు.. రాజకీయాలళ్ల కెళ్లి తప్పుకుంటున్న అని ప్రకటించిండు.. రామగుండం మేయర్ అవిశ్వాస తీర్మానం పంచాది చిల్కి చిల్కి టీఆర్ఎస్ దుమారం లేశింది.. అసలు ఏం జర్గింది ఒక్కపారి జూద్దాం పాండ్రి.. సతీష్.. అడ్గు..

తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు పెద్ద ఎత్తునొస్తున్నయట.. ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అంటున్నడు.. పెద్ద ఎత్తునొస్తున్నాయి..? యాడనో సూపెడ్తవా కేటీఆర్ గారు ఆ పరిశ్రమలు ఏడికొచ్చినయ్ ఇప్పుడు ఏడున్నయ్.. అండ్ల నౌకర్లు ఎన్నొచ్చినయ్ మా పోరగాళ్లకు అనేది ఎందుకు సారు ఈ ఉద్దెర ముచ్చట్లు జెప్తవ్..?

అయ్యో గద్వాల జేజమ్మ అలియాస్ అరుణారెడ్డి అడ్డగోల్గ తిట్టిందిగదా కల్వకుంట్ల తారక రామారావును భీమా నెట్టెపాండు ప్రాజెక్టులు గట్టి నీళ్లిచ్చింది కాంగ్రెస్ పార్టీరా సన్నాశి అని నోటికొచ్చిన మాటలన్నది.. నీళ్లు ఇచ్చింది మేమే అని చెప్పింది అరుణమ్మగని..? అర్వై ఏండ్ల సంది తెలంగాణ ఉద్యమం అయితే ఆల్చంగ రాష్ట్రమిచ్చింది గూడ మేమే అని చెప్తలేదు పాపం..

పార్టీల డ్రామాలు జూడుండ్రి ఎట్లుంటయో.. ఏడనన్న గింత మంచి జర్గంతనే అది మాదంటే మాదని ఎగవడి వాళ్ల ఖాతల ఏస్కుంటరు.. చెడు జర్గితె మాత్రం మాదిగాదు గతపాలకుల నిర్ణయాలు అని మంది మీద నూకేస్తుంటరు.. నిన్నమొన్న రెండు గట్టి శిన్కులు వడంగనే తెల్గుదేశం పార్టోళ్లు జూడుండ్రి ఆంధ్ర రాష్ట్రంల హంగామా ఎట్ల జేస్తున్నరో..

ఉన్నదే ఎక్రం పొలం.. ఆ పొలాన్ని ఉన్నకాడికి కాళేశ్వరం కాల్వకోసం గుంజుకున్నరు.. ఇగ ఏం జేయాల్నో తెల్వక అదే పొలంకాడ గూసోని పొద్దంత ఏడ్సింది ఒక మహిళా రైతు.. ఏడ్సి ఏడ్సి ఆడనే జీవిడ్సింది.. కళేశ్వరం అద్భుతాలళ్ల ఇది గూడ ఒక్కటన్నట్టు.. ఉన్నోని పొలాలు వోవు... పాపం ఎక్రం అద్దెక్రం ఉన్నోని భూములు వోతె వాళ్లు ఎట్లబత్కుతరు చెప్పుండ్రి.. ముఖ్యమంత్రిగారు మీ ఖాతల జామజేయవల్సిన సావు ఇదే..

తెలంగాణ రాష్ట్రం నిరాహార దీక్షలు రాస్తరొకోలు.. నిరసనలు ఆందోళనలతోనే తెల్లార్తున్నది.. అవ్విటితోనే పొద్దుగూట్లె వడ్తున్నది.. ఆశాలు అంగన్ వాడీలు, ఏఎన్ఎంలు వాళ్లు ఉద్యోగాలు తక్వ జేశిండ్రు ఆందోళనలు ఎక్వ జేశిండ్రు చేశిండ్రంటే సర్కారు జేపిచ్చింది వాళ్లతోని.. వీళ్లకు తోడుగ ఇగ మెప్మా రిసోర్స్ పర్సన్లు రంగంలకు దిగిండ్రు మా బత్కు సంగతేంది ఈ బంగారు తెలంగాణల అంటున్నరు..

నిజామాబాద్ జిల్లా బోధన్ కాడ ఒక వైన్సుల దొంగలు వడ్డరట నిన్నరాత్రి.. వైన్సు దుకాండ్ల దొంగలు వడ్తె పొయ్యేదేమున్నది.. అదేమన్న మెడికల్ షాపు అని మీరు అనుకుంటుండొచ్చుగని.. ఏదైనా దొంగతనం దొంగతనమేగదా..? మరి దొంగలు వడి రెండు లక్షల రూపాలు ఎత్కపోయిండ్రట.. వైన్సులున్న మాలు గూడ జర్రంత లేపిండ్రట..

జూన్ ఇర్వై మూడు తారీఖు నాడు అంటే అటీటు పదిహేను రోజులైంది ఇయ్యాళటికి పన్నెండు మంది పోరగాళ్లు థాయ్ లాండ్ దేశంలున్న ఒక గుహలకు వొయ్యిండ్రట సూస్తందుకు బాగ వానలొచ్చి గుహంత నీళ్లతోని నిండిపోయిందట.. అండ్లనే ఒక గడ్డ మీద గూసున్నరట వాళ్లను బైటికి తీస్తందుకు చిన్న కష్టమైతలేదు కొంతమందిని దీశిండ్రు ఇంక కొంతమంది అండ్లనే ఉన్నరు పదిహేను రోజుల సంది నీళ్లు తాగి బత్కిండ్రంటే మామూలు ముచ్చట గాదు..

 

14:53 - May 20, 2018

పశ్చిమగోదావరి : జిల్లా తాడేపల్లి గూడెం శ్రీ రామ నర్సింగ్‌ హోం ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. కూనపాముల సౌజన్య అనే బాలింత చికిత్స పొందుతూ మృతి చెందడంతో డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సౌజన్య గర్భవతి కావడంతో శ్రీరామ నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో చేరి...మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున సౌజన్యకు అధికంగా ఆయాసం రావడంతో, పరిస్థితి విషమంగా ఉందని తణుకు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యురాలు రమాదేవి సూచించారు. తణుకు తీసుకొని వెళ్లి ఆక్సిజన్‌ పెట్టె లోగా సౌజన్య మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో సౌజన్య మృతికి రమాదేవే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. రమాదేవి పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

07:47 - March 19, 2018

కొమరం భీం ఆసిఫాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అంటేనే భయపడుతున్న ఈ రోజుల్లో... మారుమూలన ఉన్న ఓ పీహెచ్‌సీ ఎంతో మెరుగైన సేవలందిస్తోంది. నార్మల్‌ డెలివరీలకు కాలం చెల్లిందని అందరూ భావిస్తున్న తరుణంలో... గర్భీణీలందరికీ ప్రసవాలన్నీ నార్మల్‌గానే చేసేందుకు సిబ్బంది ఎంతో ప్రయత్నిస్తున్నారు. గర్భిణీలకు వైద్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు... సరైన సమయంలో సరైన వైద్యం అందించేలా నిత్యం ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ పీహెచ్‌సీకి నీతి అయోగ్‌ గుర్తింపు కూడా లభించింది. దీంతో మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు... ప్రధాని మోదీ కూడా ఈ పీహెచ్‌సీని సందర్శించే అవకాశాలున్నాయి.

కుమురం భీం అసిఫాబాద్‌ జిల్లా..కౌటాల మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాష్ట్రంలోని ఇతర వైద్యశాలలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది. సర్కారు వైద్యంపై నమ్మకం లేకుండాపోయిన ఈ రోజుల్లో ఈ ఆరోగ్య కేంద్రం చరిత్ర తిరగరాస్తుంది. గడిచిన రెండేళ్లలో వెయ్యి నార్మల్‌ ప్రసవాలు చేసి శబాష్ అనిపించుకుంటుంది. కౌటాల లాంటి మారుమూల ప్రాంతంలోని ఈ పీహెచ్‌సీ డాక్టర్లు గర్బిణిల కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందుకే సిజేరియన్లు కాకుండా నార్మల్‌ డెలివరీలు చేస్తూ, డబ్చుతో పాటు బాలింతల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు.

ప్రయివేటు ఆసుపత్రిలకు దీటుగా ఈ పీహెచ్‌సీలో సకల సౌకర్యాలున్నాయి. గర్భిణిలలో అవగాహన కల్పిస్తూ.. నార్మల్‌ డెలివరీలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికితోడు 102 వాహనాలు... ఐటీడీఏ అంబులెన్స్‌లు బాలింతలను ఇంటినుండి ఆస్పత్రికి,... ఆస్పత్రి నుండి ఇంటికి చేరుస్తూ గ్రామీణుల ఆదరణ పొందుతోంది. తెలంగాణ ప్రభుత్వం గర్బణిలకు అందిస్తున్న పలు సౌకర్యాలు.. కేసీఆర్‌ కిట్‌తో పాటు స్థానిక సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చారిటబుల్‌ ట్రస్ట్ ద్వారా పౌష్టికాహారం, కిట్లు కూడా ప్రభుత్వం వైద్యంపైన ప్రజలు మొగ్గు చూపేలా చేస్తున్నాయి.

గ్రామాలలో ఆశావర్కర్స్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు గర్బిణిలకు ఆరోగ్యం పట్ల, సర్కారు వైద్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నెల 9వ తేదీన ఇక్కడి పీహెచ్‌సీలో ప్రత్యేక పరీక్షలు చేసి, వారి ఆరోగ్యానికి కృషి చేయడం వల్ల ఈ ఘనత సాధించినట్టు కౌటాల ఆరోగ్య కేంద్రం వైద్యులు అంటున్నారు.

కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవలను నీతి అయోగ్‌ సంస్థ గుర్తించింది. కౌటాల పీహెచ్‌సీకి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నీతి అయోగ్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వెనుకబడిన ప్రాంతాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ పీహెచ్‌సీలో అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని సందర్శిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంతైనా మారుమూల ప్రాంతంలోని చిన్న ప్రాథమిక కేంద్రంలో ప్రజలకు సేవలు అందిస్తున్న సిబ్బందికి హాట్సాప్‌ చెప్పాల్సిందే

15:42 - December 26, 2017

కల్తీ ఆహారంతో అప్రమత్తతంతా ఉండాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై మానవి నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో న్యూట్రిషియనిస్ట్ సుజాతా స్టీఫెన్, గైనకాలజిస్టు నర్మద పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వారు పలు ఆర్యోగ సలహాలు, సూచనలు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

20:07 - October 13, 2017

కర్నూలు : జిల్లాలోని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది.  వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి కన్నుమూసింది. అయితే బిడ్డ ప్రాణాలతో బయటపడింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లి చనిపోయిందని మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. 

19:45 - August 19, 2017

విజయనగరం : జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఘాతుకానికి పాల్పడ్డాడు.  నిండుగర్భిణి అని చూడకుండా తన భార్య కడుపుపై తన్నాడు. పెద్ద మనుషుల ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  విజయనగరంలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న వెంకటేష్‌, సునీత భార్యాభర్తలు. వెంకటేష్‌కు కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. సునీతకు ప్రెగ్నెన్సీ రావడంతో దాన్ని తీయించుకోవాలని ఒత్తిడి చేశాడు. రోజూ ఆమెను మానసికంగా వేధిస్తుండడంతో పుట్టింటికి వెళ్లింది. దీంతో కోపోద్రిక్తుడైన వెంకటేష్‌... కాపురానికి రావాలంటూ పెద్దమనుషులతో పంచాయతీ పెట్టాడు.  అందరిముందే అబార్షన్‌ చేయించుకోవాలంటూ భార్య కడుపుపై తన్నాడు. దీంతో సున్నీత అక్కడికక్కడే కుప్పకూలిపోగా... ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 

07:13 - August 3, 2017

హైదరాబాద్ : కింగ్‌కోఠిలోని ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాలను బలితీసుకుంది. యాదాద్రి జిల్లాకు చెందిన సంధ్య అనే గర్భిణి చనిపోయింది. సంధ్యకు గతనెల 26న డాక్టర్లు ప్రసవం చేశారు. ఆపరేషన్‌ విఫలం కావడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. పరిస్థితి విషమంకావడంతో హుటాహుటిన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే సంధ్య ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యంతో తన భార్య చనిపోయిందని సంధ్య భర్త ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న యూత్‌ కాంగ్రెస్‌ నేత అనిల్‌కుమార్‌ వైద్యుల నిర్లక్ష్యంతోనే సంధ్య చనిపోయిందని... బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సీనియర్‌ వైద్యులు తెలిపారు. మరోవైపు సంధ్య భర్త శ్యామ్‌ వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

16:18 - August 1, 2017

కృష్ణా : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సిబ్బంది కాసుల కక్కుర్తి ఓ బాలింతరాలిని తీవ్రగాయాల పాలుచేసింది. జూలై 11న తాడిగడపకు చెందిన ప్రియాంక ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. ఆపరేషన్ సమయంలో కుట్లుసరిగా పడకపోవడంతో...అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  బాలింత ప్రియాంకకు ఎనీమా చేసే సమయంలో..అడిగినంత డబ్బుఇవ్వలేదన్న కోపంతో షరీఫా అనే ఆయా యాసిడ్‌ లాంటి ద్రావకం ఇవ్వడం వల్లే కాళ్ళ మీద బొబ్బలు వచ్చాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Pages

Don't Miss

Subscribe to RSS - pregnant women