pimples

17:05 - March 27, 2017

డ్రై ఫూట్స్ తో ఆరోగ్యానికి ఎంతో మేలు అనే సంగతి తెలిసిందే. డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్ష కూడా ఒకటి. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎండు ద్రాక్షలను తీసుకోవడం ద్వారా రక్త హీనతను దూరం చేసుకోవచ్చు. తద్వారా శరీరంలో రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఎండుద్రాక్షల్లో విటమిన్ బి, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు. విటమిన్స్, అమినో యాసిడ్స్, మెగ్నీషియం, పోటాషియం అధికంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా ఆ సమస్య దూరమయ్యే అవకాశం ఉంది. క్యాల్షియం పిల్లల్లో ఎముకల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లల పెరుగుదలకు, గర్భిణీలకు ఎండుద్రాక్షలు ఎంతగానో మేలు చేస్తాయి.

11:01 - March 27, 2017

శరీరంపై పలువురు మచ్చలు వస్తుండడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇందుకు పలు మందులు..ఆరోగ్య సాధనాలను వాడుతుంటూ సమస్యలను మరిన్ని ఎదుర్కొంటున్నారు. మరి మచ్చలు పోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కరివెపాకులను తీసుకుని చిటికెడు పసుపు వేయాలి. వీటిని మిక్సీ పట్టి మచ్చల పై ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల అనంతరం కడిగేసుక్కోవాలి. ఎండిన తులసి..వేప..పుదీన ఆకులను తీసుకోవాలి. ఇవి ఒక్కోటి వంద గ్రాములుండాలి. అందులో చిటికెడు పసుపు వేసుకుని పొడిగా మిక్సీ చేసుకోవాలి. వాడే సమయంలో రెండు స్పూన్ల పొడికి తగినంత పన్నీరు వేసుకుని కలుపుకుని ముఖానికి పట్టించుకోవాలి. అనంతరం కడిగేసుకోవాలి. కొబ్బరి నూనెకు గోరింటాకు పొడి కలిపి పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అర టీ స్పూన్‌ నిమ్మరసంలో నాలుగు చుక్కల గ్లిజరిన్‌ కలిపి మచ్చల మీద రాస్తుంటే మచ్చలు పోతాయి. తులసి ఆకు ఎంతో శ్రేయస్కరం అనే సంగతి తెలిసిందే. తులసీ ఆకుల్లో కొద్దిగా పసుపు వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల మచ్చలు తొలగిపోయే అవకాశం ఉంది.

07:58 - August 22, 2016

యుక్త వయస్సు వచ్చే వారికి మొటిమల సమస్య బాధ పెడుతుంటుంది. మొటిమల నుండి తప్పించుకోవడానికి బ్యూటీ పార్లర్లు..ఇతరత్రా సౌందర్య సాధనాలు వాడుతూ పలు సమస్యలు తెచ్చుకుంటుంటారు. మొటిమలు అధికంగా ఉన్న వారు బయటకు వెళ్లడానికి మొహమాటం పడుతుంటారు. అంతేగాకుండా మానసికంగా కృంగిపోతుంటారు. మరి మొటిమల బాధ తీరాలంటే కొన్ని చిట్కాలు...
రెండు చెంచాల తేనె, ఒక చెంచా దాల్చిన చెక్కపొడి కలుపుకోవాలి. ఈ పేస్టు ముఖానికి పూతలా పూయాలి. ఓ పావుగంట అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి.
ఒక చెంచా వెనిగరల్ లో మూడు చెంచాల నీళ్లు కలపాలి. అందులో దూదిని ముంచి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల అనంతరం నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
పండిన బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి.
నారింజ తొక్కల పొడిని రెండు చెంచాల మోతాదులో తీసుకుని దీనికి కొన్ని నీళ్లు చేర్చాలి. అలా వచ్చిన పేస్టును ముఖానికి రాసి ఇరవై నిమిషాల పాటు ఉంచి తరువాత కడిగేయాలి.
పచ్చి బంగాళాదుంపను ముక్కలుగా కోసుకోవాలి. ఆ ముక్కలతో ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు రుద్దుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. 

10:45 - May 10, 2016

అందమైన అమ్మాయి మోముపై.. ఓ చిన్ని మొటిమ ముత్యంలా మెరిసిపోతుంది. అదే ముఖమంతా వ్యాపిస్తే.. మచ్చలు, యాక్ని (తొలిదశలో ఉండే మొటిమలు, వైట్‌, బ్లాక్‌ హెడ్స్‌ కలిపి)తో నిండి పోతే అమ్మో.. కౌమారంలో అడుగు పెడుతున్న అమ్మాయిలకు ఇదో పెద్ద కలవరపాటు ఆ మాటకొస్తే 80 శాతం పెద్దవారిలోనూ ఇటువంటి సమస్యలున్నాయని నిపుణులు అంటున్నారు.
యుక్త వయసులో మొదలైన ఈ సమస్య మూడు పదుల వరకు ఉంటుందట. విద్యార్థినులు, ఉద్యోగినుల్లో కొన్నిసార్లు మానసిక ఒత్తిడి కారణంగా ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాలేయం, మూత్రపిండాలపై అధిక భారం పడటం, ఆహారంలో లోపం, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా వస్తుంటాయని చెబుతున్నారు. ఏవో పైపై పూతలు.. చికిత్సలు మొటిమలు, యాక్నేలని అరికట్టలేవు. చక్కని ఆహారపు అలవాట్లతో పాటు ఒత్తిడి నిరోధించే మార్గాలు, చికిత్సలు తోడవ్వాలి. అప్పుడే మేని నిగారింపు సాధ్యమని ఈ అధ్యయనంలో తేలింది.

ఇలా చేస్తే మొటిమలు మాయం...
మంచి నీరు సమృద్ధిగా తాగడం వల్ల చర్మంలోని వ్యర్థాలు బయటకుపోతాయి. రోజులో ఎనిమిది గ్లాసుల నీరు తాగితే యాక్ని నివారణలో మనం తొలి అడుగు వేసినట్టే. చర్మంపై పేరుకున్న వ్యర్థాలు తొలగిపోవాలంటే ఆహారంలో విటమిన్‌ ఎ ఎక్కువగా తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్, బి కాంప్లెక్స్ ఒత్తిళ్లు తగ్గించి మెరిసే మేనుని మీ సొంతం చేస్తుంది. తాజా కాయగూరలు, పండ్లలో ఇవి పుష్కలంగా ఉంటాయి.
ముఖ్యంగా యాపిల్‌, బొప్పాయి, అనాస, సలాడ్లు, ముదురాకు పచ్చని ఆకుకూరల్లో తగినంత పీచు పదార్థం కూడా ఉంటుంది. విటమిన్‌ సి, ఇ లకు చర్మాన్ని శుభ్రపరిచి కొత్త కాంతి, నిగారింపుని ఇచ్చే శక్తి ఉంటుంది. తాజా కాయగూరలు, తృణధాన్యాలు, గింజలని తీసుకొనే వారికి ఈ విటమిన్లు అందుతాయి. అలాగే జింక్‌ అధికంగా ఉండే పుట్టగొడుగులు, గింజలు కూడా మేలు చేస్తాయి.

09:10 - February 12, 2016

చర్మ రక్షణకు కేవలం ఫేస్‌ ప్యాకులు, రకరకాల క్రీములు మాత్రమే వాడితే మాత్రం సరిపోదు. వాటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. వీటిని తినడం వల్ల మొటిమలు రాకుండా నివారించవచ్చు.
చర్మం లోపల పేరుకుపోయిన బ్యాక్టీరియా, ఇతర క్రీములు బయటకు విడుదల కావడం వల్ల మొటిమలు వస్తాయి. బచ్చలి కూరలో విటమిన్‌-ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది మొటిమలకు యాంటీ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
పసుపు చర్మంలోని మంటను తగ్గిస్తుంది. అలాగే చర్మం కాంతివంతంగా మెరవడానికి ఉపయోగపడుతుంది. సహజసిద్దమైన యాంటీబయోటిక్‌ అయిన పసుపును ఏదో ఒక రూపంలో రోజుకు పావు చెంచా చొప్పున తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో రక్తంలోని హానికరమైన బ్యాక్టీరియా నాశనమవుతుంది.
క్యారెట్‌లో బీటా కెరోటిన్‌ రూపంలో విటమిన్‌-ఎ అధికంగా ఉంటుంది. ఇది మొటిమలకు కారణమయ్యే క్రిములను నాశనం చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కనీసం ఒక క్యారెట్‌ అయినా తినడం ద్వారా మొటిమలు రావు. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లం అధికంగా లభిస్తుంది. ఇది గుండె, చర్మం వంటి అవయవాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. 

13:47 - December 5, 2015

ప్రస్తుత జనరేషన్లో యువత ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య మొటిమలు. ఈ మొటిమలు వచ్చినప్పుడు భరించలేని నొప్పితో బాధపడటమే కాకుండా ముఖసౌందర్మం అందవిహీనంగా తయారవుతుంది. ముఖ్యంగా అమ్మాయిల పరిస్థితి మరింత దారుణంగా వుంటుంది. ఆ మొటిమలు వచ్చినప్పుడు ఇంట్లోనుంచి బయటకు ఎక్కువ రాకుండా, వాటి నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల తంటాలు పడుతుంటారు. అంతేకాదు.. ఈ మొటిమలు తగ్గిన చోట వాటి మచ్చలు అలాగే వుండిపోతాయి. అలాంటప్పుడు వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఆ చిట్కాలు ఏమిటంటే..

  • ఒక పాత్రలో కొద్దిగా శనగపిండి తీసుకుని, అందులో కాస్త పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పేస్ట్‌లా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలపాటు అలాగే వుంచుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తే.. మొటిమలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
  • ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఉల్లిరసం వేసి, అనంతరం దాంట్లో కొంచెం తేనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు, వాటి మచ్చలపై రాసి.. కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. గంటసేపు అలాగే వుంచుకోవాలి. ఆ తర్వాత సున్నిపిండితో కడిగితే మంచి ఫలితం లభిస్తుంది. ఇవేకాకుండా, గులాబీ రేకులు, బచ్చలి ఆకులు నూరి ముఖానికి రాసుకుని అర్థ గంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమల బాధ నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని బ్యూటీషియన్లు అభిప్రాయపడుతున్నారు.
  • ఒక స్పూన్‌ మెంతులపొడి, ఒక స్పూన్‌ పసుపుపొడి, దోసకాయగుజ్జు, ఒక స్పూన్‌ టమాట రసం, కొబ్బరినీళ్లు... ఒక పాత్రలో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
  • మెంతికూర, వేపాకు చిగుళ్లు, పసుపు కలిపి నూరాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టి ఐదు నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేక మూడు సార్లు చేస్తే మొటిమలు, మచ్చలు మాయమవుతాయని వారు చెబుతున్నారు. 
18:28 - October 22, 2015

మొటిమలు..యువతీ యువకులు ప్రధాన సమస్య ఎదుర్కొంటుంటారు. ఇందుకు రకరకాల క్రీములు వాడుతూ ముఖాన్ని..ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటారు. ఇందుకు కొన్ని టిప్స్ అనుసరిస్తే సరిపోతుందని వైద్యులు పేర్కొంటుంటారు. మీ కోసం కొన్ని టిప్స్...

  • బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.
  • వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
  • ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. చర్మం పొడిగా, సున్నితంగా ఉంటే ఈ ప్యాక్ వేసుకోకూడదు.
  • సొంటి, లవంగాలు నీటితో నూరి లేపనం తయారు చేసి ముఖంపై తరుచూ రాస్తూ ఉంటే మొటిమలు తక్షణమే తగ్గుముఖం పడతాయి.
  • మొటిమ గనక చితికినట్లయితే దానిమీద ఐస్ క్యూబ్ ఉంచి సుతిమెత్తగా రుద్దినట్లయితే అందులో ఉన రాసి అంతా వచ్చేస్తుంది.
  • చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు.

Don't Miss

Subscribe to RSS - pimples