petrol

09:18 - November 21, 2018

ఢిల్లీ : ఏ వస్తువు కొనాలన్నా పెట్రోల్ ధరలపైనే ఆధారపడి వుంటుంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, ట్రాన్స్ పోర్ట్ కు, కొనుగోలుదారుడికి మధ్య అవినావభావ సంబంధంలా ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఆధారపడి వుంటాయి. దీనిని బట్టే మనం కొనే వస్తువుల ధరలు ముడిపడి వుంటాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో గత నెల రోజుల నుండి ధరల తగ్గుదలకు సామాన్యుడు ఆనందపడుతున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ప్రభావంతో.. దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో మంగళవారం అంటే నవంబరు 20 నాటి ధరలే నవంబరు 21 కూడా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.76.38 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.71.27 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోలు ధర రూ.81.90 కి చేరగా.. డీజిల్ ధర రూ. 74.66 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌ ధర 63.40 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 54.18 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 
తెలుగు రాష్ట్రాలలో ధరలు..
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ.80.98 ఉండగా.. డీజిల్ ధర రూ.77.54 గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.80.26 ఉండగా.. డీజిల్‌ ధర రూ.76.39 వద్ద కొనసాగుతోంది. 
 

10:35 - November 17, 2018
హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా చమురు ధరలు తగ్గుతుండడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండడమే ఇందుకు ప్రధాన కారణమని ఇండియన్ ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నారు. శనివారం కూడా మరోసారి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 76.91 ఉండగా డీజిల్ ధర రూ.71.74 కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోలు ధర రూ.82.43..డీజిల్ ధర రూ. 75.36 కి చేరింది
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర రూ.81.55 గా ఉండగా.. డీజిల్ ధర రూ.78.05 గా ఉంది. 
 
నగరం  పెట్రోల్ (లీటర్) ధర డీజిల్ (లీటర్) ధర
ఢిల్లీ   రూ. 76.91  రూ. 71.74
ముంబయి  రూ. 82.43 రూ. 75.16
కోల్‌కతా  రూ. 78.85 రూ. 73.60
చెన్నై రూ. 79.87 రూ. 75.82
బెంగళూరు రూ. 77.52 రూ. 72.12
పాట్నా రూ. 81.01  రూ. రూ. 74.82
హైదరాబాద్ రూ.81.55 రూ. 78.05
15:08 - November 12, 2018

హైదరాబాద్  : పెట్రోలు ధరలకు రెక్కలు రావటంతో బెంబేలెత్తిన సామాన్యుడు గత నెల రోజుల నుండి ఊరిపి తీసుకుంటున్నాడు. కారణం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టటమే కారణం. పెట్రోలుపై పెంచిన సుంకాలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని కొందరు, రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ కేంద్రం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సుముఖంగా లేవు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ  అభ్యర్థికి ఓటేస్తే పెట్రోలు లీటరు 30 రూపాయలకే దొరుకుతుంది! అంతేకాదు.. పుట్టిన ప్రతి బిడ్డకూ ఉచితంగా 50 గజాల స్థలం కూడా లభిస్తుంది. ఆ అభ్యర్థి ఏ పార్టీయో కనుక్కుని అర్జంటుగా ఓటేసేద్దాం అనుకుంటున్నారా? ఆయన ఏ పార్టీ అభ్యర్థీ కాదు... ఇండిపెండెంట్‌ అభ్యర్థి! పెట్రోలు ధరలు తగ్గించడం మహా మహా బీజేపీ, టీఆర్‌ఎస్‌ వంటి ప్రధాన పార్టీలకే కష్టంగా ఉంటే ఇక ఇండిపెండెంట్లు ఇంతలా ఎలా తగ్గించగలరని ఆశ్చర్యపోకండి. కొందరు అభ్యర్థులే స్వయంగా ఇలాంటి హామీలిస్తున్నారు మరి!
అంతగా గుర్తింపు లేని పార్టీల నుంచి కొందరు, స్వతంత్ర అభ్యర్థులుగా ఇంకొందరు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికల్లో జయాపజయాలపై వీరి ప్రభావం ఎంత ఉంటుందో తెలియదు కానీ, వీరు గుప్పిస్తున్న హామీలు మాత్రం స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. జాతీయ ప్రాంతీయ పార్టీలు కూడా ఇవ్వని హామీలను సైతం ఈ అభ్యర్ధులు ఇచ్చేస్తున్నారు. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్న ఒక అభ్యర్థి, తనను గెలిపిస్తే 2023 నాటికి లీటరు పెట్రోలు రూ.30లకే అందిస్తానంటూ హామీ ఇస్తున్నారు. అంతేకాదు... తెలంగాణలో పొలాలన్నింటినీ ఉచితంగా దున్నిస్తానని, చిల్లిగవ్వ చెల్లించకుండా లక్ష హెల్మెట్లు పంపిణీ చేస్తానని, రెండు వేల రూపాయలకే సైకిళ్లు అందజేస్తానని, పుట్టిన ప్రతీబిడ్డకు 50 గజాల స్థలం ఇస్తానంటూ సరికొత్త హామీలతో సంచలనం సృష్టిస్తున్నారు. అయితే ఇక్కడో ట్విస్ట్‌ ఉంది. ప్రతి హామీకీ ‘కండిషన్స్‌ అప్లయ్’ అంటూ ఆయనో ట్యాగ్‌లైన్‌ పెట్టారు.

08:59 - November 12, 2018

ఢిల్లీ : పెట్రో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఈసారి చాలా స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోలుపై 17 పైసలు తగ్గింది. ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర రూ.77.56కు చేరుకుంది. డీజిల్‌పై లీటరుకు 15 పైసలు తగ్గి రూ.72.31కి చేరుకుంది. ముంబైలో లీటరు పెట్రోలుపై 17 పైసలు, డీజిల్‌పై 16 పైసలు తగ్గింది. ఫలితంగా లీటరు పెట్రోలు ధర రూ. 83.07, లీటరు డీజిల్ ధర రూ.75.76కు చేరుకుంది.

ఇటీవల దేశంలో ఎన్నడూ లేనంత విధంగా పెట్రోలు ధరలు పెరగడంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడ్డాయి. అంతేకాకుండా పెట్రోలు ధరల పెంపు ప్రభావంతో నిత్యవసరాల ధరలు పెరగంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్రో ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. 

 

11:40 - November 10, 2018

ఢిల్లీ: దేశవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా పెట్రో ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా పెట్రోల్,డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో లీటర్ పెట్రల్ పై 17 పైసలు, డీజిల్ పై 16 పైసలు తగ్గింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.77.89,  డీజిల్  72.58.కు చేరింది. అక్టోబరు 30 నాడు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.79.55కు, డీజిల్ రూ.73.78కి గా ఉంది, గత 10 రోజుల్లో  సుమారు రూ.1.66 తగ్గుతూ వచ్చింది.  ముంబైలో నేడు పెట్రోల్,డీజిల్ పై 17 పైసలు తగ్గింది. ముంబైలో పెట్రోల్  83.40 పైసలు కాగా డీజిల్  76.05 గా ఉఁది.

10:40 - November 8, 2018

ఢిల్లీ : దీపావళి పండుగ వేడుకల సందర్భంగా వాహనదారులకు శుభవార్త అందినట్లే. ఇప్పటివరకూ పెట్రోల్,డీజిల్ పెరుగతుపోయి సామాన్యుడికి చుక్కలు చూపిన పెట్రోల్ ధరలు గత 20 రోజుల నుండి తగ్గుముఖంపట్టాయి. దీనికి కారణం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతూ ఉండటమే. దీంతో  దేశంలోనూ పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదల కొనసాగుతోంది. నేడు లీటరు పెట్రోలుపై 21 పైసలు, డీజిల్ పై 18 పైసలు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 78.21కి, డీజిల్ ధర రూ. 72.89కి తగ్గింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 83.72, డీజిల్ ధర రూ. 76.38కి చేరుకోగా మిగతా ప్రాంతాల్లోనూ ధరలు ఆ మేరకు తగ్గాయి.
 

15:35 - November 3, 2018

ఢిల్లీ : ఇప్పటి వరకూ పెట్రోల్ ధరలకు భయపడి వాహనాలను మూలన పెట్టేసిన వాహన ప్రియులకు మంచి రోజులొస్తున్నట్లుగా కనిపిస్తోంది పెట్రోల్ రేట్లు రోజు రోజుకు తగ్గుతుండటం చూస్తుంటే.రయ్ మంటు బైక్ పై దూసుకెళ్లిపోవచ్చు..జామ్ అంటు కారులో చక్కర్లు కొట్టొచ్చు. గత 20 రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. సామాన్యుడి మొములో మళ్లీ చిరునవ్వు కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల రేట్లు ఆకాశాన్ని అంటుకునే పెరగుతు పోతుండంతో సామాన్యుడు విలవిలలాడిపోయాడు. కానీ 20 రోజుల నుండి ధరలు రోజు రోజుకు తగ్గుతుండంతో హాయి కొంతవరకూ ఊపిరి తీసుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. 
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు శనివారం కూడా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా దేశీయంగా కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశ రాజధాని దిల్లీ నగరంలో ఈరోజు లీటరు పెట్రోల్‌ 19 పైసలు తగ్గి రూ.78.99కి చేరింది. నిన్న రూ.79.18గా ఉంది. నేడు లీటరు డీజిల్‌ ధర 11 పైసలు తగ్గి రూ.73.53కు చేరింది. నిన్న డీజిల్‌ ధర రూ.73.64గా ఉంది. గత పదిహేను రోజుల్లో దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.3.28గా తగ్గగా, డీజిల్‌పై రూ.1.84 తగ్గింది.
ముంబయి లో 19 పైసలు తగ్గి రూ.84.49కి చేరింది. డీజిల్‌ ధర 12 పైసలు తగ్గి రూ.77.06గా ఉంది. చెన్నై, కోల్‌కతా నగరాల్లో పెట్రోల్‌ ధరలు రూ.82.06, రూ.80.89గా ఉండగా, డీజిల్‌ ధరలు రూ.77.73గా, రూ.75.39గా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ. 83.75గా ఉండగా.. డీజిల్‌ రూ.80కి చేరుకుంది. కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. బ్యారెల్‌ ధర 86 డాలర్ల నుంచి 72.57డాలర్లకు పడిపోయింది. దీంతో దేశీయంగా కూడా రెండు నెలల పాటు విపరీతంగా పెరిగిపోయిన చమురు ధరలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి.
 

11:11 - November 1, 2018

ఢిల్లీ : మరోసారి పెట్రోల్ ధరలు తగ్గాయి. వరుసగా 13 రోజుల నుండి చమురు ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గురువారం మరోసారి తగ్గాయి. అంతర్జతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఇంధన ధరలు తగ్గుతున్నాయని పలు కంపెనీలు పేర్కొంటున్నాయి. ధరలు తగ్గుతుండడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సిటీ  డీజిల్ లీటర్ పెట్రోల్ లీటర్
హైదరాబాద్‌ రూ.84.14. రూ.80.25 
విజయవాడ రూ.83.29 78.97
బెంగళూరు రూ .79.99 రూ.74.16
ఢిల్లీ రూ.79.39 రూ.73.78
ముంబై రూ.84.86 రూ.77.32
కోల్‌కతా  రూ. 81.25 రూ. 75.63
చెన్నై రూ. 82.65 రూ. 78.00
09:15 - October 27, 2018

ఢిల్లీ : గత కొంతకాలం నుండి రోజుకో విధంగా పెరిగి సామాన్యుడికి చుక్కలు చూపిన పెట్రోల్ ధరలు గత 10 రోజుల నుండి తగ్గుతు వస్తున్నాయి. దీంతో సామాన్యుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. సెంచరీకి చేరువవుతోందేమోనని సామాన్యడు బెంగపడుతున్న సమయంలో ధరలు తగ్గిన కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోతున్న నేపథ్యంలో డాలర్ మారకపు విలువలో రూపాయి బలపడుతూ ఉండటంతో పెట్రోలు, డీజిల్ ధరలు దిగివస్తున్నాయి. వరుసగా పదో రోజూ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. శనివారం నాడు లీటరు పెట్రోలుపై 40 పైసలు, డీజిల్ పై 35 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.
దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 80.45, డీజిల్ ధర రూ. 74.38కు చేరుకున్నాయి. ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు ధర రూ. 85.93, డీజిల్ ధర రూ. 77.96కు తగ్గాయి. విజయవాడలో పెట్రోలు రేటు రూ. 84.60, డీజిల్ రూ. 79.80కు చేరుకుంది. గుంటూరులో పెట్రోలు ధర రూ. 84.80కి, డీజిల్ రూ. 80కి తగ్గింది.
 

21:33 - October 21, 2018

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి 2రోజుల పాటు పెట్రోల్ బంకులు బంద్ నిర్వహిస్తున్నారు. కేంద్ర  ప్రభుత్వం అక్టోబరు 4న చమురుపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ, వినియోగదారుల కోసం  వ్యాట్ తగ్గించమని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కేంద్రం విజ్ఞప్తి మేరకు దేశంలోని పలు రాష్ట్రప్రభుత్వాలు వ్యాట్ తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కలిగించాయి. కానీ ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించలేదు. ఢిల్లీతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి సరిహద్దు రాష్ట్రాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. వ్యాట్ తగ్గించటానికి ఢిల్లీ  ప్రభుత్వం ఒప్పుకోనందున సమ్మె చేపట్టాలని ఢిల్లీ పెట్రో డీలర్ల అసోసియేషన్ నిర్ణయించింది. బంద్ వలన ఢిల్లీలోని సుమారు 400 పెట్రోల్ బంక్లలో సోమవారం ఉదయం 6 గంటలనుంచి మంగళవారం వరకు పెట్రోల్,డీజిల్,సీఎన్జీ అమ్మకాలు నిలిపివేయనున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - petrol