Pawan Kalyan

11:17 - December 16, 2018

డల్లాస్(అమెరికా): జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటి నుంచి మరోసారి సీఎం అనే పదం వినిపించింది. 2019లోనే తాను సీఎం కావొచ్చని పవన్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న జనసేనాని పవన్.. డల్లాస్‌లో ''జనసేన ప్రవాస గర్జన''లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలు, వ్యవస్థ గురించి ప్రస్తావించారు. తన లక్ష్యం గురించి వివరించారు. అన్నింటికి సిద్ధమై రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. భారత రాజకీయాల్లో జవాబుదారితనం తీసుకురావాలన్నారు. మనం అనుకుంటే మార్పు సాధ్యం అన్నారు. మార్పు కోసం తన ప్రాణం పణంగా పెట్టడానికి కూడా సిద్ధమే అని చెప్పారు. తనకు సీఎం పదవి కంటే దేశాన్ని, వ్యవస్థను మార్చాలన్నదే ముఖ్యం అన్నారు. ప్రపంచాన్ని మార్చాలి అంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలన్నారు. దేశం కోసం 25ఏళ్లు పని చేయడానికి సిద్ధమన్నారు. మార్పు అధికారంలో ఉన్నప్పడే వస్తుందన్నారు. వ్యవస్థ దారి తప్పడానికి పాలకులు నీతి తప్పడమే కారణం అని పవన్ ఆరోపించారు. రాజకీయ నాయకులు వేల కోట్లు సంపాదించి ఏం చేస్తారని ప్రశ్నించారు. చివరకు 6 అడుగుల గొయ్యి తప్ప మరేమీ మిగలదన్నారు.
నా దగ్గర పేపర్లు, ఛానెల్స్ లేవన్నారు. రాజకీయాలకు గొప్ప తెలివితేటలు అక్కర్లేదని చెప్పారు. తాను పార్టీ ఫండ్ కోసం అమెరికాకి రాలేదని చెప్పారు. తాను ఆత్మగౌరవంతో బతికేవాడిని అని, డబ్బు వదులుకున్న వాడిని అని, కోట్లు వస్తే కోట్లు ఇచ్చేసిన వాడిని అని చెప్పారు. ఈరోజుకి సినిమా చేస్తే ఊహించినంత డబ్బు వస్తుందన్నారు.
భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఇప్పుడే ప్రణాళికలు రచిస్తున్నామని పవన్ చెప్పారు. రాజకీయాలు అవినీతిమయం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ వాటిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న సక్సెస్ కోసం తాను 12 ఏళ్లు వెయిట్ చేశానని తెలిపిన పవన్.. అలాంటిది సమాజంలో మార్పు కోసం 25ఏళ్లు వేచి చూడటానికి సిద్ధమన్నారు. తాను ఆశావాదిని అని తెలిపారు.

14:54 - December 12, 2018

అమెరికా : జనసేనాని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో భాగంగా పలు పర్యటలు  జరుపుతున్నారు. దీంట్లో భాగంగా పవన్ అమెరికాలోని వాషిగ్ టన్ లో పర్యటనకు వెళ్లారు. వాషింగ్టన్ లోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ సెక్రటరీ బెన్ కార్సన్ తదితరులతో ఆయన భేటీ అయ్యారు. భేటీ అనంతరం పవన్ మాట్లాడుతూ, వెనుకబడ్డ ప్రాంతాల్లో పెట్టుబడులు రాబట్టేందుకు గల సాధ్యాసాధ్యాలపై బెన్ కార్సన్ తో చర్చించానని తెలిపారు. ఈ పర్యటనలో పవన్ తో పాటు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. కాగా రాష్ట్ర విభజన అనంతరం అజ్నాతంలోకి వెళ్లిపోయిన నాందెండ్ల భాస్కర్ రావు ఇటీవల జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాగా రానున్న 2019 ఎన్నికల్లో పవన్ పోటీలోకి దిగనున్న నేపథ్యంలో వెనుకబడిన ప్రాంతాలో పర్యటించి వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్న విషయం తెలిసిందే.దీంతో రానున్న ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే తీసుకొవాల్సిన జాగ్రత్తలు..దానికి కావాల్సిన పెట్టుబడుల విషయంలో ఇప్పటి నుండే పవన్ ముందస్తుగా అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్ టన్ లోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ సెక్రటరీ బెన్ కార్సన్ తదితరులతో ఆయన భేటీ అయినట్లుగా భావించవచ్చు.  

20:50 - December 9, 2018

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి నటసింహం బాలకృష్ణ ఎవరో తనకు తెలిదయని అన్నారు. నాగబాబు ఇలా అనడం చర్చనీయాంశంగా మారింది. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణ తెలియ‌ని వారు ఉండరు. మరి నాగబాబు ఎందుకలా అన్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది. మొన్న‌టికి మొన్న కేఏ పాల్ త‌న‌కు బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని కామెడీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగ‌బాబు సైతం అదే కామెడీ చేశారు.
బాలయ్య ఎవరో నాకు తెలీదండీ బాబూ:
ఓ ఇంటర్వ్యూలో బాలయ్య గురించి చెప్పమని నాగబాబుని యాంకర్ అడిగారు. అందుకు నాగబాబు.. ఆయనెవరో నాకు తెలియదు, ఐయామ్ వెరీ సారీ అని వెంటనే సమాధానం ఇచ్చారు. తర్వాత ఆయనే కల్పించుకుని ‘బాలయ్య గురించి తెలియదు అని అన్నానేంటి? బాలయ్యగా.. చాలా పెద్ద ఆర్టిస్ట్. సీనియర్ మోస్ట్.. ‘నేరము శిక్ష’ సినిమాలో కృష్ణగారితో కలిసి నటించారు’ అని చెప్పారు. అయితే నేను అడిగింది పాత యాక్టర్, అమృతా ఫిలింస్ అధినేత, ప్రముఖ దర్శక నిర్మాత బాలయ్య గురించి కాదని.. నందమూరి బాలయ్య గురించి అని యాంకర్ వివరించారు. దీనికి సమాధానంగా నేనెప్పుడు ఆయన పేరు వినలేదు అని నాగబాబు మళ్లీ చాలా సింపుల్‌గా సమాధానం చెప్పారు. ఆర్టిస్టులు అయిన మీ అందరిది ఒకే కుటుంబం. రాజకీయంగా విభేదాలు వుండి ఇలా మాట్లాడుతున్నారా అని మళ్లీ యాంకర్ అడిగారు. అందుకు నాగబాబు ఆయనెవరో నాకు తెలీదండీ బాబూ.. నేనెప్పుడూ ఆ పేరు వినలేదని మళ్లీ అదే సమాధానం ఇచ్చారు. దీంతో యాంకర్ బిగ్గరగా నవ్వుకుని ఊరుకున్నారు. మీ అభిప్రాయం అదే అయినప్పుడు దాన్ని కంటిన్యూ చెయ్యటం ఎందుకని ఆ టాపిక్‌ని అక్కడితో వదిలేశారు. కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీకి.. జ‌న‌సేన‌కు మ‌ధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దాంతో నాగబాబు కావాలనే ఇలాంటి స‌మాధానం ఇచ్చి ఉంటారని అంతా అనుకుంటున్నారు.

12:00 - December 8, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గొంతు నొప్పి..తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్లు సమాచారం. పవన్‌ను పరిక్షీంచిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చికిత్స అందంచినట్లు సమాచారం. 
ఇదిలా ఉంటే డిసెంబర్ 14వ తేదీన అమెరికాకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఈ పర్యటన వాయిదా పడుతుందా ? అనేది తెలియరాలేదు. మూడు రోజుల పాటు అక్కడే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. డిసెంబర్ 13వ తేదీన ఎన్ఆర్ఐ జనసేన నేతలతో సమావేశం..డిసెంబర్ 15వ తేదీన డల్లాస్‌లో ప్రవాస గర్జన్...అదే రోజు బహిరంగసభ ఉండే విధంగా షెడ్యూల్ చేశారు. మరి పవన్ అమెరికా పర్యటన ఉంటుందా ? లేదా ? అనేది తెలియరాలేదు. 

11:25 - December 8, 2018

విజయవాడ : జనసేనానీ అమెరికాకు వెళ్లనున్నారు. గత కొన్ని రోజులుగా ప్రజా పోరాట యాత్ర పేరిట ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటించిన పవన్..డిసెంబర్ 14వ తేదీన అమెరికాకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గతంలో కూడా పవన్..అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. 
డిసెంబర్ 13వ తేదీన ఎన్ఆర్ఐ జనసేన నేతలతో సమావేశం కానున్న జనసేనానీ...డిసెంబర్ 15వ తేదీన డల్లాస్‌లో ప్రవాస గర్జన్ పేరిట నిర్వహించే కవాతులో పాల్గొననున్నారు. అదే రోజు నిర్వహించే బహిరంగసభలో పవన్ ప్రసగించనున్నారు. పార్టీ ఆశయాలు..సిద్ధాంతాలు..పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలపై సుదీర్ఘంగా పవన్ ప్రసంగించనున్నారని తెలుస్తోంది. 

07:25 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పవన్ సపోర్టు ఎవరికి ఇస్తారు ? ఏపీలో ప్రభుత్వం..నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేనానీ తెలంగాణలో ఎవరికి మద్దతిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 5వ తేదీన తన మనస్సులోని మాటలను తెలియచేస్తానన్న పవన్..అందుకనుగుణంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి మద్దతు అనేది స్పష్టం చేయలేదు. 
ధనం దాచగలరేమో గానీ..తేజస్సును దాచగలరా ? అంటూ దాశరథి చెప్పిన మాటలతో ప్రారంభించారు. తెలంగాణ సమరయోధులు..స్వాతంత్ర యోధుల స్పూర్తితో యువకులు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని..అందుకే తెలంగాణ అంటే తనకు గౌరవం ఉందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో..తక్కువ సమయం ఉండడం..ఎక్కువ సమయం కేటాయించకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో జనసేన పోటీ చేయలేకపోతోందని తెలిపారు. తెలంగాణ ఇచ్చా మని ఒకరు, తెచ్చామని ఇంకొకరు..అభివృద్ధి చేశామని మరొకరు...ఇలా పేర్కొంటుండడంతో అయోమయ పరిస్థితులున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అత్యంత ఎక్కువ పారదర్శకత...తక్కువ అవినీతితో మంచి పరిపాలన అందించగలరో..లోతుగా ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఓటేయాలని పవన్ అభ్యర్థించారు..చివరగా జై..తెలంగాణ.., జై హింద్ అంటూ ముగించారు. 

21:32 - December 3, 2018

హైదరాబాద్:  తెలంగాణ లో జరుగుతున్నముందస్తు ఎన్నికల్లో  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన మద్దతు ఎవరికివ్వనున్నారనే దానిపై  బుధవారం డిసెంబరు 5న ఒక  క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో జనసేన తెలంగాణ లో  పోటీలోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తామని గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు.
" తెలంగాణా ముందస్తు ఎన్నికల నేపధ్యంలో మిత్రులు, జనసైనికులు,ప్రజలతోపాటు పోటీ చేస్తున్న అభ్యర్ధులు కూడా  పార్టీఅభిప్రాయాన్ని తెలియ చెయ్యమని కోరుతున్నారు. జనసేన పార్టీ అభిప్రాయాన్ని 5 వ తారీఖున తెలియ పరుస్తాము" అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. 

08:50 - December 3, 2018

అనంతపురం : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన నిరసన కవాతులో తీవ్ర విషాదం నెలకొంది. అీనంతపురం జిల్లాలో డిసెంబర్ 2వ తేదీ ఆదివారం పవన్ నిరసన కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కవాతులో పాల్గొని వెళుతున్న నలుగురు జనసేన కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దీనితో వారి కుటంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 
జనసేన కార్యకర్తలు ప్రయాణిస్తున్న కారును కర్నూలు జిల్లా డోన్ వద్ద ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. నలుగురు కార్యకర్తలు అక్కడికక్కడనే మృతి చెందగా కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో మధు, గో్వింద్‌లు డోన్ మండలంలోని ధర్మవరానికి చెందిన వారు కాగా...హనుమంతు వెల్దుర్థి మండలం గోవర్ధనగిరికి చెందిన వాడు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. ప్రమాద వార్తను తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో కార్యకర్తలు మృతి చెందడంపై పవన్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. జనసేన నేతలతో మాట్లాడి ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. 

08:39 - December 3, 2018

> టీడీపీ నేతలు దోపిడి చేస్తున్నారు...
మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చా...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పవన్ ఫైర్...
యువత మార్పు కోసం ముందుకు రావాలి...

అనంతపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జనసేనానీ మరోసారి ఫైర్ అయ్యారు. తనకు ప్రధాన మంత్రి మోడీ అంటే భయం లేదన్న పవన్...జేసీ దివాకర్ రెడ్డిది రౌడీయిజం అంటూ ఆరోపించారు. అనంతలో పర్యటిస్తున్న పవన్..తనకు పదవులతో పని లేదన్నారు. రాజకీయాల్లో మార్పు తీసుకరావాల్సిన అవసరం ఉందని..ఇందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ నుండి ఏమీ ఆశించకుండా తాను మద్దతు ఇవ్వడం జరిగిందని..అమరావతిలో బలవంతపు భూ సేకరణ చేయనని బాబు హామీనిచ్చి మాట తప్పారని విమర్శించారు. బాబు పాలన అంతా అవినీతిమయం..ఒక్కో నియోజకవర్గంలో రూ. 1000 - 3500 కోట్ల వరకు దోపిడీ ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని..ప్రజలకు సేవ చసేందుకు ముందుకు వచ్చానని...యువత మార్పు కోరుకొంటోందన్నారు. సరికొత్త రాజకీయాల కోసం జనసేన పార్టీని స్థాపించడం జరిగిందని..కమ్యూనిజం...క్యాపిటలిజం లేని కొత్తతరం రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. రక్తం పంచుకుని పుట్టిన వారికంటే ప్రజలే తనకు ముఖ్యమని తెలిపారు. 

11:11 - December 2, 2018

అనంతపురం : జిల్లాలో జనసేనానీ కవాతుకు సర్వం సిద్ధమౌతోంది. మధ్యాహ్నం 3గంటలకు గుత్తి రోడ్డులోని మార్కెట్ యార్డు నుండి క్లాక్ టవర్ వరకు కవాతు నిర్వహించనున్నట్లు జనసేనానీ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పార్టీ నేతలు విడుదల చేశారు. 
గత కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్రంలో పోరాట యాత్ర పేరిట విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న జనసేనానీ ఏపీ ప్రభుత్వం..నేతలను తూర్పారబడుతున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్...బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. జనసేన లక్ష్యాల్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కవాతు నిర్వహిస్తూ ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ..విశాఖపట్టణం..రాజమండ్రిలలో కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా అనంతలో నిర్వహిస్తున్న కవాతుకు వామపక్షాలు మద్దు ప్రకటించాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - Pawan Kalyan