Parliament Monsoon Sessions

12:34 - July 30, 2018

విజయవాడ : కేవీపీఎస్ ఆధ్వర్యంలో దళితుల దీక్షలు కొనసాగాయి. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలకు సీపీఎం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టెన్ టివి పలువురితో మాట్లాడింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టం చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక చర్యలకు పూనుకుంటున్నట్లు అర్థమౌతోందని, హిందూ మతోన్మాదం మత సిద్ధాంతాల ఆధార పడి కుల వ్యవస్థ కొనసాగించాలని అనుకుంటుందని తెలిపారు. చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం చేస్తానమి కేవీపీఎస్ స్పష్టం చేసింది. 

11:09 - July 27, 2018

విజయవాడ : బీజేపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని...బీజేపీనే యూ టర్న్ తీసుకుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీలు చేస్తున్న పోరాటానికి ప్రశంసలు వస్తున్నాయని,

ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టారని తెలిపారు. పదేళ్లు హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు కుదరదని చెప్పడం..మెనిఫెస్టోలో చెప్పింది చేయకపోవడం రూ. 350 కోట్లు వెనక్కి తీసుకోవడం..ఇవన్నీ యూ టర్న్ కాదా అని ప్రశ్నించారు. ఢిల్లీ - ముంబ కారిడార్ పై శ్రద్ధ చూపిస్తున్న కేంద్రం విశాఖ - చెన్నై కారిడార్ ను గాలికొదిలేస్తోందని..గుజరాత్ లోని థొలెరా నగరానికి నిధులిచ్చి అమరావతికి అన్యాయం చేయడం వంటివి యూ టర్న్ కాదా అని ప్రశ్నించారు.

మూడు రోజుల పాటు పార్లమెంట్ కు సెలవులు కారణంగా ఎంపీలందరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని బాబు సూచించారు. ఒంగోలులో జరిగే ధర్మపోరాట దీక్షకు ఎంపీలందరూ హాజరు కావాలని..ధర్మపోరాటానికి ధీటుగా ఇతర పార్టీలతో బీజేపీ నిరసనలు చేపిస్తోందని..ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లేదని బాబు పేర్కొన్నారు. టిడిపిని దెబ్బతీయడానికి బిజెపి - వైసిపి - జనసేన పార్టీలు కుట్రలు చేస్తున్నాయని..దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. 

21:19 - July 23, 2018

కాకినాడ : రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో వైసీపీ బంద్‌కు పిలుపు ఇవ్వడం సరికాదన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు . జగన్‌కు ధైర్యం ఉంటే ఢిల్లీలో బంద్‌ చేయాలన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ చిత్తశుద్ధితో పోరాడుతుంటే... వైసీపీ బంద్‌కు పిలుపు ఇవ్వడాన్ని కొండబాబు తప్పు పట్టారు. 

21:15 - July 23, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో.. మోదీ ప్రభుత్వం మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ.. వామపక్షాలు ఏపీలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఏపీకి బిజెపి చేసిన మోసాన్ని నిరసిస్తూ విజయవాడలో సిపియం, సిపిఐ పార్టీల నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. లెనిన్ సెంటర్ లో బైఠాయించి మోడి, టిడిపి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిడిపి, బిజెపి రెండు పార్టీలు కలసే ఎపి అభివధ్ధిని అడ్డుకున్నాయని, ఈరెండు పార్టీలకు బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ విశాఖలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సరస్వతి పార్కు నుండి జివిఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు..విభజన హమీలు,ప్రత్యేక హోదా రైల్వేజోన్ కేటాయించాలని లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాలు విజయనగరంలో ఆందోళనకు దిగాయి. విశాఖ రైల్వే జోన్, గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలంటూ విజయనగరం rtc కాంప్లెక్స్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తా రోకో చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలో కోసం తిరుపతిలోనూ వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కర్నూలులో వామపక్షాల పార్టీలు ర్యాలీ నిర్వహించారు. పదేళ్లపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానంటూ మాటిచ్చిన మోడీ కనీసం ఈ నాలుగేళ్లలో రాష్ట్రం గురించి పట్టించుకోలేదంటూ వామపక్ష పార్టీలు సిపిఎం,సిపిఐ,జనసేన నాయకులు కర్నూల్ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని వామపక్షాలు ఆరోపించాయి. దీనికి నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.

ప్రధాని మోదీ ఆంధ్ర ప్రజలను కించ పరిచే విధంగా పార్లమెంట్ లో వ్యవహరించారంటూ అనంతపురంలో సీపీఐ, సీపీఎం నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. వామపక్ష పార్టీ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నగరంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోనూ వామపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు నేతలు. 

21:11 - July 23, 2018

విశాఖపట్టణం : వైసీసీ చేపట్టిన బంద్‌కు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరుతూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళలు నల్ల చీరలతో ధర్నా నిర్వహించారు. సీఎం చంద్రబాబు చేసిన మోసం ప్రజలందరికీ తెలియజేసేందుకే రేపు బంద్‌ చేపట్టామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారని మహిళలు తెలిపారు. 

21:04 - July 23, 2018

అనంతపురం : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌ చాందీ చెప్పారు. రాహుల్‌ ప్రధాని అయిన వెంటనే హోదా ఫైలు పైనే తొలి సంతకం చేస్తారని చెప్పారు. అనంతపురంలో కాంగ్రెస్‌ అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశం నిర్వహించిన చాందీ... హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ చేసిన ఈ తీర్మానంపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. 

19:58 - July 23, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదని టీడీపీ ఎంపీలు మరోసారి స్పష్టం చేశారు. విభజన హామీల అమల్లో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. మోదీకి వ్యతిరేకంగా అన్ని స్థాయిల్లో ఉద్యమిస్తామని టీడీపీ ఎంపీలు ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌తో టీడీపీ ఎంపీలు పార్లమెంటు వెలుపల, లోపల ఆందోళన చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అన్నమయ్య వేషధారణలో ఆకట్టుకున్నారు. శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ.. ఏ ఒక్క అంశంపైనా స్పష్టత ఇవ్వలేదని టీడీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. విభజన హామీలైన విశాఖ రైల్వే జోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌, రెవెన్యూ లోటు భర్తీ వంటి అంశాలకు ప్రధాని సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారని టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదాను విస్మరించిన మోదీ వైఖరిని నిరసించారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

పార్లమెంటు ఒకటవ నంబర్‌ ద్వారం వద్ద జరిగిన టీడీపీ ఎంపీల నిరసన కార్యక్రమంలో చిత్తూరు లోక్‌సభ సభ్యుడు శివప్రసాద్‌ అన్నమయ్య వేషధారణలో ఆకట్టుకున్నారు. పార్లమెంటు ఆవరణలో ఆందోళన కొనసాగించిన టీడీపీ ఎంపీలు లోక్‌సభలో కూడా ప్లకార్డులు పట్టుకుని తమ స్థానాల్లో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలంటూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్లకార్డు పట్టుకుని పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హామీలు అమలు చేస్తుందన్నారు. నాలుగేళ్ల పాటు కేంద్ర మంత్రివర్గంలో కానసాగిన టీడీపీ ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని ఇప్పుడు హోదా కావాలని డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. విభజన హామీల అమలుపై టీడీపీ, వైసీపీ ఎంపీలు రాజ్యసభలో కూడా ఆందోళన కొనసాగించారు.

సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ ఎంపీ సుజనాచౌదరి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విభజన హామీలపై స్వల్పవ్యవధి చర్చకు నోటీసు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. దీనిని చర్చకు చేపట్టాలని పట్టుపట్టారు. మంగళవారం నాటి సభా కార్యక్రమాల అజెండాలో ఏపీ విభజన హామీలపై స్వల్పవ్యవధి చర్చను చేర్చామని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు టీడీపీ, వైసీపీ సభ్యుల దృష్టికి తెచ్చారు. వెంకయ్యనాయుడు సమాధానంతో సంతృప్తి చెందని టీడీపీ, వైసీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి చర్చ కోసం పట్టుపట్టడంతో సభా కార్యక్రమాలు కొద్దిసేపు స్తంభించాయి. దీంతో టీడీపీ, వైసీపీ ఎంపీల ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు.. రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయించారు.

మరోవైపు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా.. టీడీపీ అసత్య ఆరోపణలను తిప్పికొట్టిన విధంగానే విభజన హామీలపై రాజ్యసభలో జరిగే చర్చకు కూడా దీటుగా సమాధానం ఇస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు చెప్పారు. విభజన హామీలపై మంగళవారం రాజ్యసభలో జరిగే చర్చ ద్వారా మోదీ ప్రభుత్వ వైఖరి మరోసారి ఎండగట్టాలని టీడీపీ నిర్ణయించింది. 

12:18 - July 21, 2018

ఢిల్లీ : ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్ధేశ్యం బిజెపికి..తెచ్చే ఉద్ధేశ్యం టిడిపికి లేదని బైరెడ్డి రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. రాహుల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరినట్లు, పలు విషయాలపై చర్చించినట్లు తెలిపారు. హోదా విషయంలో టిడిపి, బిజెపిలు డ్రామాలు ఆడుతున్నారని, 2019 సంవత్సరంలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తుందని జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే ఏపీకి 'హోదా' ప్రకటిస్తుందన్నారు. 

21:58 - July 19, 2018

హైదరాబాద్ : లోక్‌సభలో టీడీపీ అవిశ్వాస తీర్మానం చర్చకు రావడం గులాబీ పార్టీని అయోమయంలోని నెట్టివేసింది. పార్టీ పరంగా ఏ  నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై నేతలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. దీంతో అవిశ్వాసంపై అధికార టీఆర్‌ఎస్‌ నిర్ణయం ఎలా ఉంటున్న అంశం ఉత్కంఠత రేపుతోంది.

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం టీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పడేంది. అవిశ్వాసానికి అనుకూలమా, వ్యతిరేకమా.. అన్న అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. విభజన హామీలపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటన చేసిన టీఆర్‌ఎస్‌కి పార్టీకి అవిశ్వాసం ముందుగా అడ్డొచ్చింది. టీడీపీ  ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు  వస్తుందా...రాదా..  అన్న అంశంపై  టీఆర్‌ఎస్‌ నేతలు అనుమానం  వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు  లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అనుమతి ఇవ్వడంతో...ఇప్పుడు గులాబీ పార్టీ నిర్ణయం ఏమిటన్నది ఆసక్తి రేపుతోంది.  పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే టీడీపీ ఎంపీలు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలను కలిసి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని టీడీపీ ఎంపీలకు చెప్పారు.  కానీ తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను  కూడా కేంద్రం నెరవేర్చలేదన్న వాదాన్ని  వినిపిస్తున్నారు. 

టీడీపీ అవిశ్వాసానికి కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా... మరికొన్ని తిరస్కరించాయి. టీడీపీ వైఖరిపై టీఆర్‌ఎస్‌ ఓ వైపు  అసంతృప్తి వ్యక్తం చేస్తూనే....మరో వైపు జాతీయ స్థాయిలో  చర్చకు వచ్చే అంశం కావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో  తేల్చుకోలేక తర్జన భర్జన పడుతోంది.  తమను అడిగి తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టిందా...  అంటూ  ఓ ఎంపీ  ప్రశ్నించడంతో టీఆర్‌ఎస్‌ ఎంపీల్లో సమన్వయం లోపించదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  అవిశ్వాస తీర్మాపంపై చర్చలో పాల్గొంటూ రాష్ట్ర సమస్యలను ప్రస్తావించాలన్న యోచనలో గులాబీ పార్టీ ఉంది.  

జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ అంటున్న కేసిఆర్  ఏ వైపు మొగ్గు చూపినా....ఆ ప్రభావం ఫ్రంట్ పై ఉంటుందన్న అనుమానాలు నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంతోనైనా టీఆర్‌ఎస్‌  తటస్థ వైఖరి అవలంభించే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. 

21:54 - July 19, 2018

అనంతపురం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అలకవీడారు. పార్లమెంటు  వర్షాకాల సమావేశాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గారు. శుక్రవారం లోక్‌సభకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయనున్నట్టు ప్రకటించారు. ఓటింగ్‌ ముగిసిన తర్వాత ఎంపీ పదవికి జేసీ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుండగా... రేపు సాయంత్రం అన్ని విషయాలు చెబుతానంటున్నారు.  

టీడీపీ ఎంపీల్లో ఫైర్‌ బ్రాండ్‌గా ముద్రపడ్డ జేసీ దివాకర్‌రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు వెళ్లకూడదని తీసుకున్న నిర్ణయంపై వెనక్కితగ్గారు.  కొన్ని కారణాలతో పార్టీ నాయకత్వంపై అలకపూని లోక్‌సభ సమావేశాలకు దూరంగా ఉండాలని భీష్మించుకుని కూర్చోవడంపై పార్టీలో చర్చోపచర్చలు, తర్జనభర్జనలు, బుజ్జగింపుల తర్వాత జేసీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.  

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసంపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరుగనుంది. పార్టీ ఎంపీలందరూ విధిగా సమావేశానికి హాజరుకావాలని టీడీపీ విప్‌ జారీ చేసింది. లోక్‌సభకు గైర్హా జరవ్వాని నిర్ణయించిన జేసీ... విప్‌ను సైతం ధిక్కరించడానికి సిద్ధమయ్యారు. జేసీ దివాకర్‌రెడ్డి అసంతృప్తికి చాలా కారణాలున్నాయిని పార్టీలో చర్చ జరుగుతోంది. అవిశ్వాసానికి ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు పార్టీ నాయకత్వం టీడీపీ ఎంపీలతో బృందాలను ఏర్పాటు చేసింది. సుజనాచౌదరి, అవంతి శ్రీనివాస్‌, జేసీ దివాకర్‌రెడ్డిని ఒక బృందంగా చేశారు. అయితే ఈ విషయాన్ని తనకు చెప్పకుండానే సుజనాచౌదరి  ఇతర పార్టీల నాయకులను కలవడంపై జేసీ దివాకర్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అనంతపురం తిలక్‌ రోడ్డులను విస్తరించాలని జేసీ దీవాకర్‌రెడ్డి ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ అనంతపురం నగరం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి దీనికి అడ్డుపడటం, పార్టీ నాయకత్వం ప్రభాకర్‌చౌదరికే మద్దతు ఇవ్వడంపై జేసీ దివాకర్‌రెడ్డి ఎప్పటి నుంచో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

మరోవైపు అనంతపురంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధికి దివాకర్‌రెడ్డితో సహకరించేందుకు సిద్ధమేని ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి చెప్పారు. దివాకర్‌రెడ్డి అలకపై అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ముఖ్యమంత్రి  చంద్రబాబుతో సమావేశమైన అన్ని విషయాలు చర్చించారు. నగరాభివృద్ధిపై దివాకర్‌రెడ్డితో సహకరించాలని చంద్రబాబు ఆదేశించగా.. ఇందుకు ప్రభాకర్‌చౌదరి సుముఖత వ్యక్తం చేశారు. 

ఇంకోవైపు లోక్‌సభలో  అవిశ్వాసం వీగిపోయేదేనని, విభజన హామీలు నెరవేరేవి కావన్నది దివాకర్‌రెడ్డి వాదన. టీడీపీ నాయకులు బుజ్జగింపులతో మనసు మార్చుకుని లోక్‌సభకు హాజరై.. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయాలని జేసీ దివాకర్‌రెడ్డి నిర్ణయించుకోవడంతో పార్టీ నాయకత్వానికి తలనొప్పి తగ్గింది.   
 

Pages

Don't Miss

Subscribe to RSS - Parliament Monsoon Sessions